కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

9, డిసెంబర్ 2014, మంగళవారం

కళింగ రాజ్య ఉజ్వల చరిత్ర


                                                     వాలి వధ-రాముడి వివరణ

( ఈ చిత్రంలోరాముడిని  ప్రశ్నిస్తున్న మరణోన్ముఖుడైన వాలినీ, అతని ప్రశ్నలకి అర్ధం -పర్ధం లేని సమాధానాలిస్తున్న రాముడినీ చూడవచ్చు)



త్రేతా యుగం నాటిదైన రామాయణ కథ కల్పితమా ..? చారిత్రాత్మకమా..? అనే విషయం చాలా కాలం నుంచీ విమర్శలోనే ఉంది.
రాముడి మీద,రామాయణం మీద,వాల్మీకి మీద,భక్తి,గౌరవం లోపించి నేనీ అంశాలు రాయడం లేదు.చిరకాలం నుండీ అమోఘమైన కళింగ చరిత్ర మరుగు పరచబడడానికి వున్న కారణాలను తెలుసుకోవాలన్న అలోచన ను బాధిస్తున్న ఈ సందేహాలనుఈ బ్లాగు ద్వారా పంచుకోవాలనే తాపత్రయమే ఈ త్రేతాయుగ కాలం నాటి కళింగ చరిత్రను మననం చేసుకోవటానికి కారణం.
రామాయణం లో రాముడు వాలిని వధించటం న్యాయ సమ్మతమా ..? అనే సందేహాన్ని పోగొట్టుకోవాలంటే రాముడితో వాల్మీకి,వాలికి చెప్పించిన సమాధానమే ఆధారం అనుకుని విచారిస్తే,

తనకు మనుధర్మ శాస్త్రం లోని సూక్తులే ప్రమాణాలని,తాను ధర్మశాస్త్రబద్దుడిని కావటం వల్ల తనకు స్వతంత్రం లేదనీ,శాస్త్రం లో చెప్పినట్టు తాను
ప్రవర్తించాలనీ రాముడు వాలితో చెప్పినట్టు వాల్మీకి కిష్కింధా కాండలో రాసేడు. రాముడు లేదా రచయిత వాల్మీకి మనుస్మ్రతినే ప్రమాణం తీసుకున్నట్టైతే  దాని ఆదారం గా మనం కూడా వాలి నేరాన్ని గణించినట్టైతే,ప్రధానంగా అది తన తమ్ముడి భార్యని అపహరించటం.అందుకే వాలి వధకు పాత్రుడు.ఇలాంటి నేరానికి దండన చంపటమే అని మనుధర్మ శాస్త్రం లో వుందని రాముడు వాలితో చెప్పేడు.ఈ శిక్షమనుధర్మ శాస్త్రం లో వుందని అనుకొన్నా ( వాస్తవానికి లేదు.) రాముడికి అందుకు అధికారమెక్కడిది?.రాజుకి తన దేశం లోని పౌరులని దండించేందుకే అధికారం గానీ, ఇతరదేశాల్లోని ప్రజలను దండించేందుకు అధికారమెక్కడుంటుంది.?. రాముడు ఉత్తర దేశంలోని అయోధ్య కి రాజు.వాలి దక్షిణంలో వున్న కిష్కింధకి ప్రభువు.రావణుడిలాంటి మహావీరులెందరినో మట్టికరిపించిన మహాబలశాలి.అలాంటి కిష్కింధాధీశుడిని చంపే అధికారం రాముడికి ఎక్కడిదో తెలీదు.ఈ ప్రశ్నకీ వాల్మీకి రాముడితో సమాధానం చెప్పించేడు. అదేమిటంటే,

శ్లో. ఇక్ష్వాకూనాం ఇయం భూమి:
సశైల వర కాననా
మ్రగ పక్షి మనుష్యానాం
నిగ్రహ ప్రగ్రహనసి. (కిష్కింధా కాండ)

అంటే వాలి పరిపాలిస్తున్న భూమి ఇక్ష్వాకులదట.అసలు రాముడికి పూర్వమున్న ఇక్ష్వాకులెవ్వరూ దక్షిణాపధానికి వచ్చినట్టు గాని రాజ్యాలను జయించినట్టు గానీ ఏ పురాణాలలోనూ,ఏ శాస్త్రాలలోనూ ఎవ్వరూ చెప్పనే లేదు.రాముడికి ప్రమాణకర్త అయిన మనువు బ్రహ్మావర్తము, కురుక్షేత్రం,మత్స్యదేశం,పాంచాలం,శూరసేనం,మధ్యదేశం,ఆర్యావర్తం మాత్రమే ద్విజులకి వసింపదగిన కర్మభూమి అనీ,మిగిలిన దక్షిణాపధం దేశాలన్నీ మ్లేచ్ఛ దేశాలనీ రాసి వున్నాడు.ఇలా నిషేధింపబడిన దేశాలన్నిటినీ,కిష్కింధనీ,రాముడి పూర్వీకులెప్పుడు పాలించారో తెలీదు.తన పూర్వీకులెవ్వరూ పాలించని కిష్కింధ తమదని రాముడితో వాల్మీకి ఎందుకు చెప్పించినట్టో తెలీదు.బహుశా అది వాలి మెడకి అధర్మాన్ని చుట్టెయ్యడానికి వాల్మీకి రచయితగా తలపెట్టిన  యుక్తి కావొచ్చు.రాముడికి నిజంగా కిష్కింధ మీద అధికారం వుంటే,సుగ్రీవుణ్ణి కానీ వాలినికానీ రావణ సంహారానికి సహాయాన్ని అధికార పూర్వకంగానే కోరి వుండేవాడు కానీ,సుగ్రీవుడితో స్నేహం చేసి,అతనికోసం వాలిని చంపి,దానికి ప్రతిఫలంగా సీతను వెతకటంలో సహాయం చెయ్యమని కోరుకోడు. పోనీ వాదం కోసం కిష్కింధ ఇక్ష్వాకులదని వొప్పుకున్నా రాముడు నేరస్తుడిని శిక్షించే దండనాధికారం వున్న రాజు అవుతాడా? తండ్రి చనిపోయేక రాముడికి రాజుగా పట్టాభిషేకం చేసేరా? రాముడు అరణ్యవాసం లో వుండగానే దశరధుడు కాలధర్మం చెందేడు. రాజ్యాన్ని భరతుడు ఏలుతున్నాడు. రాముడికింకా పట్టాభిషేకం కానప్పుడు అయితే భరతుడు రాజవుతాడు గానీ, రాముడు కానేకాడు కదా...! తను రాజును కాదనీ ,భరతుడె రాజనీ రాముడు వొప్పుకున్నట్టు ,అంతేకాకుండా భరతుడి ఆజ్న మేరకే తానూ, మరికొంతమంది రాజులూ,ధర్మహాని చేసే పురుషులని దండించటానికి బయల్దేరేమనీ రాముడితో వాల్మీకి చెప్పించేడు.అయితే అయోధ్యా కాండలో ఎక్కడా రామ,భరత సంభాషణల్లో భరతుడు రాముడికా అధికారం ఇచ్చినట్లు కనిపించదు.
నిజంగా రాముడు ధర్మ రక్షణ చేయడానికే అడవికి బయల్దేరేడా?.
రాముణ్ణి అడవికి పంపడంలో కైక వుద్దేశ్యం తన కొడుకు రాజ్యపాలన  సాగిస్తున్నప్పుడు రాముడి వునికి అయోధ్య లో వుండకూడదనీ,రాముడు అన్ని రాజచిహ్నాలనీ విడిచిపెట్టాలనీ కదా?.పధ్నాలుగేళ్ళు రాముడు అడవిలో కాలం గడిపి,భరతుడు రాజ్యపాలన చేస్తే,ప్రజలు రాముడ్ని మరచిపోయి,భరతుడి పాలనే ఇష్టపడతారనీ కూడా..!ఆడవిలో వున్నా రాముడు రాజులా అధికారం చెలాయించాలని మాత్రం కాదు..కాదు...కానే కాదు.ఇంకా తనతో పాటు మరికొందరు రాజులు కూడా ధర్మసంరక్షణార్థం బయల్దేరేరని రాముడు చెప్పినా వాళ్ళెవరో వాళ్ళు ఏం చేసేరో వాల్మీకి రామాయణం లో ఎక్కడా చెప్పనే లేదు.
రాముడి ధర్మవిచారణ మనుధర్మ శాస్త్రచట్టప్రకారం జరిగిందా?.మనుస్మ్రుతి , తప్పు చేసిన మనిషి కి శిక్ష విధించాలనుకొన్నాప్పుడు రాజు (రాముడు రాజే అనుకొంటే) దేశం,కాలం,సామర్ధ్యం,విద్య అన్నిటినీ పరిగణన లోకి తీసుకుని,దీర్ఘంగా ఆలోచన చేసి మరీ శిక్షించాలని చెపుతుంది.రాముడు అవేవీ పరిగణన లోకి తీసుకోనేలేదు. అసలు దండనాధికారం ,పట్టాభిషేకం జరిగిన రాజుకి,సత్యాన్నే పలికేవాడికీ, సత్యాన్నీ,అసత్యాన్నీ తెలుసుకుని తీర్పు నిర్ణయించ గలిగే దక్షత వున్న వ్యక్తికీ,నీతిశాస్త్రం బాగా తెలిసిన వ్యక్తి కీ,ధర్మార్ధ కామాలను గుర్తించగలిగే దక్షుడికీ మాత్రమే వుంటుందని మనుధర్మశాస్త్రం చెపుతుంది.రాముడు  పట్టాభిషిక్తుడూ కాదు. ఇద్దరు విరోధులనూ దగ్గర పెట్టి సత్యాసత్య విచారణ కూడా చేయలేదు.ధర్మశాస్త్ర సమ్మతమైన సాక్ష్యం కూడా తీసుకోలేదు.వాలిని నువ్వు నేరస్తుడవు అవునా..? కాదా? అని అయినా ప్రశ్నించలేదు. సుగ్రీవుడు చెప్పిన మాటనే ప్రమాణం గా తీసుకుని వాలిని చంపాలని నిర్నయించుకున్నాడు.
          ఇక్కడ రాముడు చేసిన వాలివధ ధర్మశాస్త్ర సమ్మతం కానే కాదని తేలిపోతోంది. పోనీ ధర్మయుధ్ధం చేసి చంపాడా ఆంటే,మనువు చెప్పిన  యుధ్ధ ధర్మాల ను చూస్తే,నిద్ర పొయిన వాళ్ళని,వుత్సాహం లేనివాళ్ళని,దిగంబరులని,ఆయుధం లేనివాళ్ళని,యుధ్ధభూమి లో ఎదిరించని వాళ్ళని,యుధ్ధాన్ని చూడటానికి వచ్చిన వాళ్ళని చంపకూడదు.రాముడు ఎలాంటి వాలిని కొట్టాడంటే,సుగ్రీవుడితో పోరాడుతున్న వాలినిచెట్టుచాటునుంచికొట్టేడు.ఇదిఎంతటిధర్మసమ్మతమో..బోధపడదు.ఇంకా..అలాపొంచి,కొట్టడానికివాల్మీకిరాముడితోభలేసమాధానం
చెప్పించేడు.వాలికోతట.జంతువులను మాంసాన్ని తినే రాజులు ఎలాగైనా చంపవచ్చట.ధర్మ శాస్త్ర పారంగతులు అలాగే చేస్తారట. ఇక్కడొక పెద్దతప్పు కనబడుతుంది. అంతవరకూ వాలిని తనతమ్ముడి భార్యని అపహరించినందుకు మనుధర్మ శాస్త్రం ప్రకారం శిక్షార్హుడని అతన్ని తాను చంపబూనడం శాస్త్ర సమ్మతమని చెప్పిన వాదన అంతా గాలికి కొట్టుకు పోయింది. వాలిని జంతువు అన్నట్టయితే,మనుధర్మశాస్త్రం ,మనుషులకోసం రాయబడింది గానీ , జంతువులకోసం కాదు కదా..! జంతువులకు వావి,వరుసలే వుండవు కదా..! ఆవు మీద దాని దూడ పడితే,రాజు దాన్ని దండిస్తాడా..?
 ఇంకా పరిశీలించి చూస్తే,ఏ మాంసతినే వాళ్ళయినా కోతి మాంసం తినరు.కోతి చర్మం దేనికీ పనికిరాదు.కోతి వెంట్రుకలు గానీ,ఎముకలు గానీ వుపయోగ పడనే పడవు.తెలివైన వాలి రాముడిని అదే ప్రశ్నఅడిగి ఇరుకునపెట్టేడు కూడా..!
ఇంకా చెప్పాలంటే,వాలి భార్య తారను రాముడు వాలి మరణించేక సుగ్రీవుడికి కట్టబెట్టేదు.మరి అదేమి ధర్మమో

పై నున్న చిత్రం లో రాముడు తన తప్పుఒప్పుకుంటూ,వాలికి అభయమిస్తున్నాదు.(.ఏమనీ..) ఇప్పుడు నిన్ను తప్పుగా చంపేను కదా..! దానికి ప్రతిగా నువ్వు ద్వాపరయుగంలో ఒక బోయవాడుగా జర గా జన్మించి, శ్రీక్రిష్ణుడిగా జన్మించిన నన్నుపడుకున్నప్పుడు అరికాల్లో బాణం వెయ్యి.. (వహ్వా..వహ్వా..) ఏమి దాక్షిణ్యం..రామా...!.అమేయ ధీశాలీ.!!! .అవక్రపరాక్రముడైన మావాలి బాణం వెయ్యడం నేర్చుకొంటున్న  బోయవాడుగా..నిన్ను.జింక అనుకుని బాణం..వెయ్యడం..సమన్యాయమా..? ఇది మా రాజు కి నువ్విచ్చిన వరమా..? దీనికి మేం నీకు ప్రణతిల్లి భజనచెయ్యాలా...? అని కళింగులు ఎవ్వరూ ఏనాడూ  అనలేదు..మిగిలిన దక్షిణా పథం వాళ్ళెవ్వరూ కూడా అనలేదు కదా..!అన్నమాట రావొచ్చు.అది వాళ్ళ ఇష్టా ఇష్టాల  సంగతి..కళింగ కేకకి ఎంతమాత్రం సంబంధం లేనిది. అసలు కిష్కింధ కర్నాటక రాష్ట్రం లోనిదేమో.!.అన్న ఆలోచనకూడా కలగవచ్చు..! 
దానికి వాల్మీకి రామాయణం లో చెప్పిన సరిహద్దులను గుర్తించగలిగితే చాలు. .
.ఈ రాష్త్రవిభజనలో కూడా మన కళింగులకి బాగా పదును తేరిన సుగ్రీవుని తెలివితేటలున్న సంగతి రాష్త్రం అంతా తెలిసిపోయింది.
ఇక్కడే మరోవిషయం కూడా చెప్పాలి.


వరాహగిరి వెంకటగిరి 1960 దశకం లో భారత దేశానికి నాల్గవ రాష్త్రపతిగా ఎన్నికయినప్పుడు, ఒరియా ప్రజలు ఎట్టకేలకు తమరాష్త్రం మనిషి రాష్త్రపతి భవన్ లో అడుగుపెట్టేడని ఆనందించేరు.అయితే వాళ్ళకి గిరి బరంపురం మనిషి అని తెలిసేక బరంపురం ఇప్పుడు ఒరిస్సా రాష్త్రం లోనిదే అని తెలిసినా కూడా..అతను తెలుగువాడని తెలిసి పట్టించుకోవడం మానేసేరు.నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాత్రం తమవాడని తమ కటక్ లో పుట్టినవాడనీ (అప్పుడు,బరంపురం మద్రాస్ ప్రెసిడెన్సీ లో ఉంటే,కటక్ బెంగాల్ప్రెసిడెన్సీ లో ఉండేది ) జబ్బలు చరుస్తున్నారు.
            తెలుగు వాళ్ళయితే అతను మనవాడు కాదని ఎప్పుడొ వొదిలేసేరు. మీలో ఎవరు కోటీశ్వరుడు పోటీలో పాల్గొన్న యువతీ /యువకులు కూడా ఆయన మీద ఏదైనా ప్రశ్న వస్తే ఆప్షన్ కోరుకుంటారు.ఇప్పటి కళింగులకి అతని ఊసే పట్టదు.తాము సీమాంధ్రులమూ,తెలంగాణా ప్రజలమూ కానేకాదని..కళింగ దేశంవాళ్ళమని గుర్తుపట్టగలిగితేకదా..ఇవన్నీ వచ్చేది. పిడుగు లాంటి గిడుగు కూడా పర్లాఖిమిడి ప్రాంతాన్ని ఆరాజు తను ఎంత చెప్పినా వినకుండా ఒడిషా లో కలిపేందుకు సిధ్ధపడితే,కోపం తో  పర్లాఖిమిడి విడిచిపెట్టి శేష జీవితాన్ని రాజమండ్రిలో గడపటం జరిగిన సంగతే కదా..!


(Contd..)

7, డిసెంబర్ 2014, ఆదివారం

కళింగ చరిత్ర

కళింగ కేక

ఇప్పుడు. చక్రవర్తులు
చెరిగిపోయేరు.రాజులుగాజుముక్కలైపోయేరు. రాజ్యాలులేవు చరిత్రఅధ్యయనం చెట్టెక్కిపోయింది.శాసనాలు
పాషాణాలయ్యేయి.చరిత్రపుస్తకాలుచెదలుతిన్నవైపోయేయి.నేలపెరగలేదు.ఆకాశం
మారలేదు.సముద్రాలుఇంకిపోలేదు.పర్వతాలకింకాప్రమాదంరాలేదు.(కొండలుపిండికొట్టగలుగుతున్నాం..అరణ్యాలు ఎడారులుచెయ్యగలుగుతున్నాం .కానీ) జనపదాలు
జిల్లాలైపోయేయి.పరగణాలు రాష్ట్రాలైపోయేయి.దేశంకుంచిం
చుకుపోయింది.భారతీయతమొత్తంగాలేనేలేదు.ముక్కలుచెక్కలైప్రాంతీయతగా,కులాభిమానంగా,భాషాభిమానంగా(..?)మలిగిపోయింది.పదవీలాలసఆర్థికంగాస్వీయాభివ్రధ్ధి,ఎక్కువైపోయి,ప్రాంతాలుప్రాంతాలతోకలబడేస్థాయికిదేశాభివ్రధ్ధిసాగిపోతోంది.ఇప్పుడు ప్రాంతీయత పెనుప్రశ్న అయి కూర్చుంది.
అరవైఏళ్ళపాటుమాభూములుదోచేరనీ,మాఆస్తంతాఅంధ్రోళ్లుపడేసుకున్నారనీవొకమనిషినానాఅల్లరీపెట్టేస్తే,హాస్పిటల్లోచేరిపోయి,ఆగమాగంచేస్తే,అన్యాయమైపోయేమంటూ,అరిచి,కేకలేసీ,దోపిడీకిగురయ్యేమంటే,పల్చబడిపోయిపెద్దమనుషులు,కంగారైపోయి,కిందిమనుషులు,  తెలంగాణారాష్ట్రం చేతిలోపెట్టి  వాళ్ళ ఆకలి తీర్చేరు.
       చేతిలోవున్న కోడిపుంజును దువ్వుతూ ఇదిగో మీకునేనున్నాను..ఇంటికి పూటకి వొందగుడ్లు దీనివి  పట్టుకొచ్చి,అట్లేసిమరీనోట్లోపెట్టేస్తానని,,కోడిమేతకిడబ్బులివ్వమనీవొకఓటుపులిఅడుగుతుంటే,,మేమూఅన్యాయమైపోయేంఇప్పుడుమాన్యాయంమాకిమ్మంటూ,రాయలసీమ వాళ్ళంటూ ఉంటే,ఆంధ్రులకీ న్యాయం జరగాలంటూ క్రిష్ణా,గోదావరీ నదులమధ్యనున్నవాళ్ళంటూవుంటే ఎవర్నడగాలో,ఎవరడగాలో,ఎలా అడగాలో,ఏమని అడగాలో తెలీక,బిక్కచచ్చిపోయున్న కళింగ రాష్ట్ర వాసులకి ఏ దిక్కూ లేక దిక్కుమాలిపోయున్న ఈ సమయంలో,కళింగ కేక పుట్టకపోతే పుట్టగతులు లేకుండాపోతామన్న దిగులు ,భయం నన్నీరాతకి పురికొల్పింది.
ఏఆరాటంఅలుముకుందో,ఏవెటకారంఎక్కడగుచ్చుకుందోమనకెప్పటికీతెలీదుకానీ,గిడుగురామ్మూర్తిపంతులూ,గురజాడఅప్పారావుకళింగచరిత్రరచనతలపెట్టేరుగానీఅదికాగితాలమీదకితేవటంవాళ్ళుచెయ్యలేకపోయేరు.ఏరాడకొండంతచాత్రిబాబుగానీ,కోరమీసమున్న,కత్తిలాంటిరచయితపతంజలిగానీతలకెత్తుకుంటేమనలెక్కతెలిసుండేది.కానీ వాళ్ళెక్కిన ఎత్తులు, వాళ్ళకీ పల్లాలు,గోతులూఉన్నసంగతి తెలియనివ్వలేదు. మీ గురజాడ కేం తెలుసు..మా తెలంగాణా రచయితలే గొప్ప..మీదిసాంస్క్రతిక దోపిడీ అంటే నవ్వి,తెలంగాణా వాళ్ళనే పిలిచి మరీ బహుమతులిచ్చిన లక్షణం కళింగ రాష్ట్ర వాసులకి లక్షణమే కదా. మనగోచీచిరిగి.చిరిగిపోయి ఉందని తెలిసినా పక్కింటి వాడికి పట్టుపంచె పెట్టేరకం మనదని వేనవేల ఏళ్ళ మనచరిత్ర మనగురించి చెపుతూనేవుందికదా..!!
  
 ఇంక ఇప్పుడు కళింగ
రాజ్య చరిత్ర ఖచ్చితమైనచారిత్రక ఆధారాలున్నది మీ ముందు పెడతాను.




1, డిసెంబర్ 2014, సోమవారం

కళింగ రాజ్య ఉజ్వల చరిత్ర


(ఇది కాంభోజ రాజ్యం.(నేటి కాంబోడియా దేశం.) లో ఏనాడో శిలఫై చెక్కబడి లభించిన వాలి వధ శిల్పం.కుడివైపున ఉన్నది.రాముడు.మధ్య నున్నది ..రాముడి ప్రొత్సాహంతో,యుధ్ధానికి వొచ్చిన సుగ్రీవుడి తో పోరాడుతున్న వాలి..ఎడమ చివర ఒక వానరుడి చేతుల్లో..చనిపోతున్న వాలి..)
ఎంతో ప్రయత్నం చేస్తేనే,కానీ,ఎందరో సహాయం చేస్తేనో కానీ,ఒక తప్పు చేసిన రావణుణ్ణి ,రాముడు సంహరించే అవకాశం దొరకకపోయింది..కానీ అదే రావణుడిని అవలీలగా కాలికింద తొక్కిపెట్టగలిగిన మహా యోధుడు. అపరిమిత పరాక్రమశాలి ..అందుకే రాముణ్ణి నిలదీసి అడగగలిగేడు. "నేనే నేరం చేసేనని నన్ను నువ్వు దొంగచాటు గా దెబ్బ తీసేవు రామా...? ఒక వేళ నా తమ్ముడి పట్ల నేనేదైనా తప్పు చేసిన వాడినైతే,నన్ను చంపే హక్కు నీకెక్కడిది..? నేను మరొకడితో యుధ్ధం చేస్తున్నపుడు వెనుకనుంచి నువ్వు బాణం వేస్తున్నట్టు నేను తెలుసుకోలేకపోవటమే నా పెద్ద తప్పయ్యిందా..?"
.అలా అడగగలిగింది..రామాయణం మొత్తం మీద మనవాడే..మన కళింగ రాజే..ఇంకా ఖ చ్చితంగా చెప్పాలంటే
మన కిష్కింధ రాజే.. ఆవాలిరాజు తమ్ముడు సుగ్రీవుడు అన్నకి చేసినద్రోహం రామాయణం తోనే   మనలోదుర్లక్షణంగా ఎదుగుతూనే వస్తోంది. 

అన్న మరణించేక అందరితో పాటు దుఃఖాన్ని (లోపల రాజ్యాధికారం సాధించిన ఆనందాన్ని దాచుకుని)  ప్రదర్శిస్తున్న సుగ్రీవుడు కూడా మనకి ఈ శిల్పంలో కనిపిస్తుంది.
రాముడుకి రామ మందిరాలూ,గుళ్ళూ, కట్టని ఊళ్ళూ,సీతమ్మకి స్నానం చెయ్యడానికి ఇవ్వని చెరువులూ (ఆమె స్నానం చేసి ఉండవచ్చు..చేసి ఉండకపోవచ్చు.అదివేరే సంగతి..ఆవాదాల మీదకి పోయే దిగ్దంత పండితులు,ప్రవచన పరమహంసలూ,
శాస్త్రవేత్తలూ,విజ్నాన వేదిక నిష్ణాతులు లెక్కకి మించి ఉన్నారు. ) ఈకళింగరాజ్యంలోమచ్చుకు వెతికినా కనబడవు.అలాగే అద్భుత పరాక్రమశాలి,అగణిత తేజోవిరాజితుడూ అయిన వాలి కి ఉత్కళసీమ (ఒరిస్సా/ఒడిషా)ఈ  కళింగసీమ,సీమాంధ్ర,తెలంగాణా,రాయలసీమ ఏ పల్లెలోనూ,ఒక్క గుడి కాదు..కాదు.కనీసం మందిరమైనా కనబడదెందు చేత..?అదీఎందువల్ల..?
ఇక్కడ,ఇతరుల సంస్క్రుతిని మనందోచుకున్నట్టవు తుందా..? మనకిసంస్క్రుతి అన్నదే లేదని తీర్మానించాలని మిగిలిన అందరి అంతర్గత కుట్రవల్లనే అని..అనుకోవాల్సివస్తుందా..?..,ఈ రోజు కాకపోతే. ఇకపై ఏరోజన్నా..ఇప్పుడు నేను కాకపోతే..తర్వాత కాలంలొ మరెవ్వరైనా..అడిగితే…!.ప్రాచీన కాలంలో ఇక్కడ కొండజాతులే తప్ప మరే జాతులూ లేవని కూసిన విభాత వేళళ రోమను చరిత్రకారులూ....వాళ్ళ పాదధూళే అమ్రుతం అనుకునే థాపర్లూ,ఈ సీమాంధ్రరాజ్యం..తెలంగాణా రాష్త్రం,..మీడియాలలో చిందులేసే పతంజలి యోగ నిష్ణాతులమని చెప్పుకొనేవాళ్ళూ,మనప్రాచీన ఆహార విధానాన్ని తన పరికల్పన అని ఊదర గొట్టేవాళ్ళూ, వ్యాస,ఉపనిషత్వి దాంసులూ,నిత్య ప్రవచనకారులూ,చరిత్రోపాధ్యాయులూ,మేధావులూ,అప్పటి కాంతార,మహాకాంతార సీమా(ఇప్పటి ఒడిషా) వాసులూఏం చెపుతారు..ఏమని చెప్పగలరు..
 వాలిని రాక్షసుడనగలరా..? ఎప్పుడో రాసిన రామాయణంలో అలా వాల్మీకి ఎందుకు రాయలేకపోయాడు..?.ఆకాలం నాటి సమాజ పరిస్తితులు అందుకు అంగీకరించవనా..?రచయితగా స్ఫురణ కలిగినవాడవ్వటం వల్లనా..? సమకాలీన పరిస్తితులకు దర్పణంగా ఉండాలన్న భావన వల్లనా?
(Contd..)