కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

14, జూన్ 2015, ఆదివారం

"ఇంటినిండా కోళ్ళు ఉన్నాయి గానీ..కూసేందుకు ఒక్కటీ లేదు"




గంజాంజిల్లా1936కుముందు'కళింగసీమ'లోనిది.1929లోఈసీమలో4,5తరగతులుచదువుకున్నవిద్యార్ధులకుమద్రాసుప్రెశిడెన్సీప్రభుత్వం,అందచేసినకొత్త'*సాంఘికశాస్త్రంపుస్తకం'ఈమాటకి,నిలువెత్తుఆధారంగానిలబడుతుంది.

అయితే,'ఇంటినిండాకోళ్ళుఉన్నాయిగానీ,కూసేందుకుఒక్కటీలేదు'అన్నట్టుగా,ఉన్నమనరాజకీయనాయకులందరినీ,ఒక్కొక్కరినీ"నువ్వేంచేస్తున్నావుకళింగులకోసం..అవినీతిదుర్గంధంలో,పీకలలోతుగామునిగిపోయిఉన్న,నక్కలలాంటి,తోడేళ్ళలాంటి..రాజకీయనాయకులకోసం.."ఏరుఏడామడదూరంఉండగానే,చీరవిప్పి,చంకనపెట్టుకుని ఒకామె పోయినట్టు,అమరావతికోసంపరుగెడుతున్నవాళ్ళకోసం,పట్టిసీమకోసం,ఇక్కడిచమురుఎక్కడికోపంపే,చమురు,గేస్లదోపిడీకోసం,గనులతవ్వకం,కోసం,వనరులదోపిడీకోసం....నువ్వెందుకు,నీకుమేమిచ్చిన,రాజకీయజీవితాన్నిపణంగాపెడుతున్నావని"కళింగసీమనుండిఒక'కళింగసైన్యం'ప్రభవించి,అడగాలన్నదే,ఈరాతలవెనుక,నిండుగానిలబడిపోయిఉన్నఆశ....అదిఎప్పటికైనాఫలిస్తే,సంతోషమే..లేకపోయినా,కొత్తగావచ్చేబాధేంవుండదు.ఎందుకంటేఇన్నివేలయేళ్ళలోనూ,"కాకిగూట్లోనికోకిలబతుకు"లాంటిబానిసబతుకులో,అంతులేని,మాధుర్యాన్ని(!) చవిచూసిన జాతి కదా మనది.


* అప్పటి'సాంఘికశాస్త్రంపుస్తకం' లో కొన్ని పేజీలు









----------------------------------------------------------------------------------------------------------------------------                
       
 ఇంక కిందటి పోష్టుకు అనుబంధంగా ప్రస్తుత పోష్టు లోకి వస్తే...

1789/1792లోవచ్చిపడిన'ఎల్నినో'తుఫానులవల్ల,గంజాంజిల్లాలోవచ్చిన,క్షామాన్ని"పుఱ్ఱెలకరువు'అనేవారు.1789లోమొదలైనకరువువరసగా..నాలుగేళ్ళు,వెంటతగిలి,జిల్లానుఇంచుమించు,నిర్మానుష్యంచేసిపారేసింది.విశాఖపట్టణంపరిసరప్రాంతాల్లో1792ఏప్రిలునెలలో1200మందిఆకలిచావుకుగురయ్యేరు.భారతదేశంలోఈస్టిండియాకంపెనీకరువునివారణచర్యలకుపూనుకోవటంఅదేప్రధమం. గంజాంజిల్లాకలెక్టరుగా ఆసమయంలోపనిచేసిన'స్నాడుగ్రాసు'లాంటిఅవినీతిపరులకి,అదేపెద్దపండుగలకాలం.1788/1794మధ్యకాలంలోదేశంలోలక్షాపదివేలమందిపైనేఆకలిచావులకిగురయ్యేరు.దహనంచేసేవాళ్ళులేకఅస్థిపంజరాల,ఎముకలతోనిండిపోయిరోడ్లన్నీ,తెల్లగావెలుగులీనేయని,నాటి బ్రిటిష్ ప్రభుత్వనివేదిక చెపుతుంది.  



గంజాంజిల్లాలో "పుఱ్ఱెల కరువు" చిత్రం


....."స్నాడ్గ్రాస్"ఈస్టిండియాకంపెనీఉద్యోగిగా,గంజాంజిల్లాకలెక్టరుగా,27ఏళ్ళపాటుభారతదేశంలోఉద్యోగం,చేసినవాడయ్యేడు.జీతంతక్కువేఅయినాకల్పవ్రుక్షంలాటికళింగసీమలోఅతనుకలెక్టరుగా,ఓరెండేళ్ళపాటుసంపాదించినది10లక్షల పౌన్లు (ఈనాటిద్రవ్యమానంప్రకారంఅది9కోట్ల78లక్షలపైనేఉంటుంది).అతనిఅనుచరగణం,అతనిఉంపుడుగత్తె,ఇంకాగంజాంజిల్లాలో,అతనిపేరుచెప్పుకునిజమీందార్లుతిన్నదీ,ఎవ్వరిలెక్కలకీదొరకనేలేదు.'స్నాడ్గ్రాస్'సంపదనైతే,ఆర్జించగలిగేడు.తీసుకుపోగలిగేడుగానీ,'పరువుప్రతిష్టలు'అన్నవాటినిమాత్రం,అక్కడికితనతో తీసుకువెళ్ళలేకపోయేడు.అతనిమీద,ఆకంపెనీన్యాయవాదులుఆరోపించిన,ఏఒక్కనేరమూఅతని'చదరంగపుటెత్తుల'లాంటియుక్తులవల్ల,తనకిందివాళ్ళమీదకితోసి,తప్పించుకోగలిగినఅద్భుతచాకచక్యంవల్ల,రుజువుకాలెదు.అతన్నిఏరకంగానూలొంగదియ్యలేని,ఈస్టిండియాకంపెనీడైరక్టర్లు,వాళ్ళచేతులోఉన్నచివరిబాణాన్నిసంధించేరు.ఉద్యోగవిరమణచేసినవాళ్ళకి,వాళ్ళుఇచ్చేపెన్షను అతనికి నిరాకరించేరు.


   ఇక్కడ'స్నాడ్గ్రాస్' వేసినఎత్తు...అంతవరకూఎవ్వరికీతెలీనిదీ,ఆతర్వాతకూడాఇంతవరకూఎవ్వరూఎక్కడాఉపయోగించనిదీ,ఇప్పుడుఅవినీతిఆరోపణల్లోజైళ్ళపాలయిపోతున్నమనరాజకీయనాయకులూ,ప్రభుత్వోద్యోగులూ,కూడాచేయగలిగేదీ,అయినమాస్టరుప్లానది..'తనహక్కులకుభంగంకలిగిస్తే,తనకున్యాయంగారావలసిన,పింఛనుఇవ్వకపోతే,మీకూకష్టంకలిగిస్తానని'తనపథకంలో,భాగంగాఅతను,ముందుగాకంపెనీడైరక్టర్లనిహెచ్చరించేడు. వాళ్ళుఅతనిహెచ్చరికని,చీపురుపుల్లనితీసి,అవతలపారేసినట్టుపారేసేరు.కొంతసమయం,అలావాళ్ళకిఇచ్చేక'స్నాడ్గ్రాస్'తనకార్యాచరణలోకి,తిన్నగాదిగిపోయేడు.రెండువందలఏభై ఏళ్ళతరవాతకూడా(అతనుమనమధ్యలేకుండాఏనాడోపోయినాఇన్నిసాంకేతికసౌకర్యాలలోఏఒకటీ,ఆనాడులేకపోయినా)అతన్నిమనఅవినీతిరాబందులు,ఎందుకుగుర్తుపెట్టుకోవాలంటే,తన'సిగ్గు..లజ్జ'అన్నవాటినిఅతడుపక్కనపెట్టిఅవతలవాళ్ళ'సిగ్గులజ్జ,పరువు,ప్రతిష్టల'మీదకొరడాతోకొట్టినంతపనిచేసేడు..




సామాన్యుడికి,ఏఇజంలోఉన్నామోఅర్థంకాని'నిజం'లోకి,భారతీయులందరినీనెట్టేసిన,రాజకీయనాయకులు'గజానికొక్కడు'గాంధారికొడుకు'లా,చెలరేగిపోతున్నపుడు,ఒక'సి.ఎం.'కి400మందిపోలీసులు.రక్షకకవచంగా,ఉండాల్సివచ్చినదౌర్భాగ్యరాష్ట్రంలో,బాగాలోతుగాఅణగదొక్కేసిన,జాతివారసులుగామనమున్నపుడు,మనకేభాదాలేకపోవచ్చుగాక...కానీ,మనం..మననిఘంటువుల్లోంచి,సిగ్గు,లజ్జ,పరువు,ప్రతిష్ట,పదాలని,తీసేసినవాళ్ళంమాత్రంఅవుతున్నాం.నీతివున్నంతకాలందానికి,వ్యతిరేకపదంవుంటుందన్నది..నేడుతప్పవుతోంది.అవినీతే,ఇందుగలదుఅందులేదనలేకుండా,ఎక్కడైనావుంటుంది..ఏదైనానేరారోపణలోఎవరైనాదొంగదొరికితే,మొహానికిగుడ్డకప్పుకునిమనకిమీడియాలోదర్శనమిస్తారు...అదే,మనరాజకీయనాయకులూసెలిబ్రిటీలుఅయితేమాత్రం,మహదానందంతోనవ్వుతూ,దేశోధ్ధారకుల్లా,చిద్విలాసంగాకనిపిస్తారు.ఉపన్యాసాలలోఅవినీతిని,చించిమరీపోగులుపెడతారు.స్త్రీలమీదఅత్యాచారాలుజరిగితే,దేశమంతటాఆందోళనలుఉవ్వెత్తునలేస్తాయి(ఇదిసరైనచర్యే.. తప్పుఎంతమాత్రంకాదు).అవినీతిపరులుగా,రాజకీయనాయకులూసెలిబ్రిటీలుఅడ్డంగాదొరికితే,మాత్రంఅదికుట్రఅని  అతనివర్గం,కులం,రాజకీయపార్టీలవాళ్ళు,ఆందోళనలుచేస్తారు.ఆఆందోళనలుచేసేవారినిచెప్పుతోకొట్టేవాళ్ళు,ఎవ్వరూకనబడరు.ఇదిఏమిదేశం?ఇప్పుడు కూడా గొప్పదేశమేనా..?ఒకప్పుడు,ప్రపంచానికిధర్మశాస్త్రాలు,నీతిసూత్రాలుభోదించిన"హిందూదేశం"ఇదుగోఇదీ..అని ఇప్పుడుకూడా తలెత్తి గర్వంగా చెప్పగల దేశమా ?


     అతనేంచేసేడంటే,చిరిగిపోయినబట్టలుకట్టుకుని,స్వీపర్లువీధులుఊడ్చే,చీపురుపట్టుకుని,లీడెనుహాలువీధిలోఉన్నఈస్టిండియాకంపెనీ,విశాలమైనభవనముందునిలబడి,వీధంతాఊడ్చటంమొదలుపెట్టేడు.తానెవరోఇతరులకుతెలీకుండా,ఆపనిచెయ్యాలన్నఉద్దేశ్యంఏదీ,అతనికిలేదుకనుకఆరోడ్డుమీదవచ్చేపోయేవారితో,తానుకంపెనీవారికోసం,భారతదేశంలోచాలాసంపదలున్నజిల్లాకలెక్టరుగా,పనిచేసినవాడిననీ,వారికిందతాను,ఎన్నోసంవత్సరాలుకష్టపడిపనిచేసినాఈపెద్దవయసులో,తనకుతినడానికితిండీ,కట్టుకోవడానికిబట్టకూడా,లేకుండాచేసి,వీధుల్లోముష్టిఎత్తుకుని,బతకమనివదిలేసేరనీ,ఎంతోదీనంగాచిత్రమైనకధలుచెపుతూ,బతకడంమొదలెట్టేడు.లీడెను హాలువీధిపెద్దరాజవీధి.వచ్చీపోయేజనంతో,ఎప్పుడూకిటకిటలాడుతూఉండేది.తూర్పుదేశాలతోవర్తకవాణిజ్యసంపదలను,చాలాభారీగానిర్వహించే'ఈస్టిండియాకంపెనీకార్యాలయం'ఆవీధిలో,చాలాఅట్టహాసంగాఉండేది.ఇండియాలోధనాన్నిఆర్జించివచ్చిన,ఇంగ్లీషువాళ్ళనివాళ్ళదేశంలో,'నవాబు'లనిపిలిచేవారు. ఆనవాబులని,పిలిపించుకునేవాళ్ళు,తాముసంపాదించిన,అపారమైనధనంతోసుఖాల్లోదొర్లుతూ,నీతినియమాలులేకుండాప్రవర్తించడాన్ని,వాళ్ళువిచిత్రంగాచూసేవాళ్ళు..నాటకాలుగారాసివాటిని,ప్రదర్శించేవారు.అయితే,అదేకంపెనీపెద్దఉద్యోగిగా,ఇండియాలోనేపనిచేసివచ్చినఈపెద్దమనిషి,ఒకస్వీపరులాబతకవలసిరావటమేమిటి..ఎంతోమంచిమనిషిలా,కనిపిస్తున్నఈమనిషిబతుకు,ఇంతఘోరంగాదిగజార్చడంఏమిటని..లండనునగరంలో,గొప్పగొప్పవాళ్ళునివసించే,పడమటిప్రాంతంలోగుసగుసలుప్రారంభమయ్యేయి.


                         'స్నాడుగ్రాస'యితేతనపాత్రలోజీవించేసేవాడు.అలావీధంతాతుడుస్తూఎవరైనాకనికరించిఓపెన్నీచేతులోపెడితేకళ్ళకిఅద్దుకునితీసుకునిజేబులోవేసుకుంటూఉండేవాడు.రోజూఅతనుఅలాకంపెనీఎదురుగాతుడుస్తూనిలబడిఉండటంచూస్తూఉంటే,గుర్రపుసార్టులుదిగిఆభవనంలోకివెళ్ళాల్సినడైరక్టర్లకి,తలవంపులుగాతోచేది..పోనీఆన్యూసెన్సునుండితప్పించుకోవటానికిపోలీసుకంప్లైంటుఇద్దామనుకుంటే,ఏ నేరం చేసేడని చెప్పగలరు.పైగా అతడు చేసే పని సమాజానికి ఉపయోగపడేదిగా నే ఉంది.రోజూ తను చేస్తున్న పనిలో అతను ప్రదర్శిస్తున్న అంకిత భావం చూస్తూన్న ప్రజలలో అతనిపట్ల జాలి పెరిగిపోతూ ఉంది.కంపెనీ డైరక్టర్లు 'స్నాడు గ్రాసు'చేస్తున్నపనికిఎలాంటిప్రతిక్రియచేయలేని స్థితిలోపడి పోయేరు..

 ఈపరిస్థితిహిందూదేశంలోఅయితేవాళ్ళుఏదైనాచేయగలరు.తమస్వంతదేశంలోతమపేరుపొందినకార్యాలయంముందుపెంకితనంగాఅతనుచేసేపనిమరికొందరికిప్రేరణనిస్తేఏంచేయాలోవాళ్ళకితెలీలేదు.చివరికిఅతనితోరాజీపడడమేగత్యంతరంలేనిదనినిర్ణయించేరు.అందుకుగానుఅతనుచేస్తున్నపనిముందుఆపేస్తే,అతనిసంగతిపరిశీలిస్తామని,కబురుపెట్టేరు.తనకిన్యాయంగా,రావలసినపింఛనుమొత్తంతననుఉద్యోగంలోతొలగించినతేదీనుండితనకిఇస్తేనేతప్ప,తానుపనిమాననిఎంతోవినయంగాఅతనుజవాబిచ్చేడు.మారుమాటన్నదిలేకుండాఛైర్మన్,డైరక్టర్లుఏకగ్రీవంగాతీర్మానాలుచేసిఅతనుఅన్నవన్నీచేసివాళ్ళతలనొప్పులుపోగొట్టుకున్నారు.ఆమర్నాడు'స్నాడుగ్రాసు'మంచికొత్తసూటుతొడుక్కుని,దొరటోఫీపెట్టుకుని,జోడుగుర్రాలబగ్గీఎక్కిఆఫీసుకు,డైరక్టర్లకుధన్యవాదాలుచెప్పడానికివచ్చివాళ్లతోఒకమాటఅన్నాడు."అయ్యా...ఈనాటినుంచీనా సంవత్సరాదాయం5వేలపౌన్లుఅయ్యింది.అందుకు మీకునా ధన్యవాదాలు"అన్నాడు.


 ఇంకఆనాటినుంచీ'స్నాడుగ్రాసు'బతుకుతీరేమారిపోయింది.చిలకసముద్రంలో అతను బతికిన తీరు లోకి మళ్ళీ వచ్చేడు.లండను నగరంలో విలాసవంతులు నివశించే మేఫెయిర్ ప్రాంతంలోని ఛెస్టరు ఫీల్డులో ఒక పెద్దభవంతిని తనకోసం తీసుకున్నాడు. 1824 లో ఓరియంటల్ క్లబ్ ని స్ఠాపించేడు.దానిలో విలియం బెంటిక్,డ్యూక్ అఫ్ వెల్లింగ్ టన్,సర్ జాన్ మాల్కలం'వంటివాళ్ళుసభ్యులయ్యా రు.లండను మెరైన్ సొసైటీలో 15 ఏళ్ళు సభ్యుడిగా గౌరవాన్ని పొందేడు.లండ ను స్త్రీల  ఆసుపత్రికి ఇతను మహారాజ ఫోషకుడిగా కూడా వుండేవాడు.అలా లండను నగరంలో గొప్ప గౌరవాన్ని సంపాదించుకున్నాడు. 1834 ఆగష్టు నెల 29 న మరణించేడు.తను చనిపోవడానికి మూడేళ్ళముందు అతను విల్లు రాసేడు. ఛార్లెస్ లాసన్ తాను రాసిన మెమొరీస్ ఆఫ్ మద్రాసు పుస్తకంలో ఆ వివరాలను రాసేడు.అతడు తన స్నేహితులకూ స్నేహితురాళ్ళకూ  ఈ కింది విధం గా తన అక్రమ సంపాదనలను అందించేడు.



 రంభ పట్టణంలో 'స్నాడు గ్రాసు'  ప్రజాధనంతో కట్టిన ఇల్లు


1. చిలక సముద్రం తీరాన్న రంభలోఉన్న తన ఇంటినీ, భూమినీ, గాబ్రియేల్ గిల్బర్ట్ అనే తన స్నేహితుడికి రాసేడు.( అది 30 ఏళ్ళు ఖాళీగా ఉండి కళ్ళికోట రాజు చేతిలోకి పోయింది) .

2.తనుదోచికూడబెట్టినఆస్తికిముగ్గురినిట్రస్టీలుగానియమించఆపనిచేయడానికివాళ్ళకిప్రత్యేకంగా డబ్బు కేటాయించి,మిగిలినతనఆస్తిలోకొంతభాగాన్నితనసోదరికీ,మెరైన్ ట్రస్ట్ కీ,స్త్రీల ఆస్పత్రికీ పంచేడు.

3.తనకు40వేలపౌనులువిలువచేసే(పదిలక్షలఫ్రాంకులువిలువచేసే)బాండుల'పారిసు'బేంకులో(మననల్లధనంకోటీశ్వరులు,స్విట్జర్లాండుబేంకుల్లోదాచుకున్నట్టు,అతనుదాచుకున్నవి.)ఉన్నాయనీ,వాటినీ,వాటిమీదఏడాదికివచ్చే1200పౌనులువడ్డీని'ఎలీజారస్సెల్'అనేకన్యకిఇవ్వాలనీ,అవేకాకుండాఛెస్టరుఫీల్డులోఉన్న10వనెంబరుఇంటినీ,తనగుర్రపుబగ్గీనీ,వీలునామాలోరాయకుండావొదిలేసిన ఇతర చరాస్తులన్నిటినీ ఆమెకే ఇవ్వాలనీ రాసేడు.



(విశాఖ జిల్లాలోని "ఎలమంచిలి" ప్రత్యేకత గురించి తర్వాత పోష్టులో..)





7, జూన్ 2015, ఆదివారం

"ఊరి మురుగు నీరు ఏమడి లోకి వెళ్ళుతుందో ఊరి నాయుడు ఆమడే దున్నుతాడు."


"ఊరి మురుగు నీరు ఏమడి లోకి వెళ్ళుతుందో ఊరి నాయుడు ఆమడే దున్నుతాడు."-అన్నది  'డాకరుషి' ప్రవచనం.



ఇదిమద్రాసుప్రెశిడెన్సీలోకళింగసీమఉన్నపుడు, సుమారురెండువందలఏభై  సంవత్సరాలకిందట,కిందట,లంచగొండీ,అవినీతిపరుడూ,అయిన*"స్నాడ్ గ్రాస్' అనేపేరున్నబ్రిటీషునాయుడు..అతనిసహోద్యోగులూ,డబ్బుకోసం,కళింగసీమను,దున్నినతీరు,చిలకసముద్రంలోవెలిగించిన,వైభోగంగురించి చెపుతున్నకథలాంటినిజం.."చిలక సముద్రంకథ"


అవినీతిలోమనవాళ్ళెంతోముందుకువెళ్ళేమనిలోలోపల,సంబరపడిపోతున్నారు.వీడియోటేపుల్లోఅడ్డంగాదొరికిపోయినాకూడా,తమవాడునిర్దోషిగానేబయటకువస్తాడనిమీడియాలోనిర్భయంగావాగగలుగుతున్నారు.. అలాఅవినీతినిఅన్నంమెతుకుల్లాతింటున్నవాళ్ళతో,మీదిఅవినీతే..కాదనం..ఆబెంగమీకుఅవసరంలేదు.కానీ,మీకన్నాచాలాగొప్పవాడుఅయినఆంగ్లేయుడొకడు,చాలాకాలంకిందటే,మీకన్నాఎక్కువగామాకళింగసీమలో,అవినీతినిభోంచేసి,దర్జాగాబయటికివచ్చిసత్కారాలు,సన్మానాలూపొందినవాడయ్యేడు.అతనుమాకళింగసీమలోని,గంజాంజిల్లాని,పీకలలోతుఅవినీతిలోకి,కూరినఇంగ్లీషువాడే...ఆసంగతిమాకుబాగాతెలుసుఅనిచెప్పడానికీ, మేంరాష్ట్రప్రభుత్వంతీరుతెన్నులేకాదు.కేంద్రప్రభుత్వంపరిపాలనలోకూడాఅవినీతినికూడా పసిగట్టగలుగుతామనీ,అయినామేం ఏంచెయ్యమనీ,మేమంతానిమీలితనేత్రాలబుధ్ధులమనీ, మావల్లఏరాజకీయనాయకుడికిగానీ,ఎటువంటిఉద్యోగికిగానీ,ఎటువంటిఆపదాఎన్నడూకలగదనీ...అలాజరిగినట్టుఇన్నివేలఏళ్ళలోనూ,కనీసంఒక్కదాఖలాకూడా,ఎవ్వరూచూపలేరనీ,మనకళింగసీమవాసులంతాగర్వంగా,గొంతెత్తిమరీచెప్పాలన్నదే ఈ పోష్టు వెనుక ఉద్దేశ్యం. 


 *ఈపోష్టుచదివేందుకువీక్షకులకి,కొంచెంఎక్కువసమయమేపడుతుందని,అది,చాలాఇబ్బందినేకలిగిస్తుందని తెలిసినా, ఇందులోగతంలోనిజంగాజరిగినసంగతినే,పేర్కొనడంజరిగిందికనుక,మన్నించమని వీక్షకులకి మనవి.


ప్రస్తుతరాజధాని'అమరావతి'రాజధానినిర్మాణంకోసంగౌరవ'నవ్యఆంధ్రప్రదేష్'ముఖ్యమంత్రిశ్రీచంద్రబాబునాయుడుగారు,మొదటికూలీగానేడుజరిపిన,'భూమిపూజ'కిగానీ,,ఆయన'భూమిదున్నటాని'కిగానీ,మరేఇతరరాజకీయపార్టీవిన్యాసాలకిగానీ,సంబంధించినదిమాత్రం,ఈపోష్టు'శీర్షిక'కాదు....కాదు.ఎవరైనాఅన్వయించుకోవాలనుకొంటే,అందుకునాకే,అభ్యంతరమూలేదు.అన్వయించుకొనేవాళ్ళ,అపారమేధోప్రతిభకి నేను చేసే వందనాలకి లెక్కే ఉండదు. 
                                                   కళింగరాజ్యఉజ్వలచరిత్రను,క్రోడీకరించుకుంటున్నఈ'కళింగకేక'సందర్బంలోమన'వేమన'లాంటిఅస్సాం'డాకరుషి'ప్రవచనాన్ని,అన్వయిస్తూ,మంచిఅధికారీ,మహనీయుడు,అయిన'బ్రౌనుదొర'మాత్రమే,కాదుమహానయవంచకుడు.'క్లైవు'కూడావంచలేకపోయిన,లండనునగరంలోఉన్నఈస్టిండియాకంపెనీసైతంఅతన్నేమీచెయ్యలేక,దండంపెట్టేసిమరీగౌరవించినవాళ్ళదేశపు,వంచకుడు(కళింగులనుబానిసలుగాచూసి,గంజాంజిల్లాను,భారీగాదోచిన,జమీందార్లూ,రాజులూసైతంచిన్నబోయేలా,తలదించుకునేలాచేసిన)"స్నాడుగ్రాస్'అనే,గంజాంజిల్లాఆంగ్లకలెక్టరు,తాలూకా రెండువందలఏభైఏళ్ళకిందటి దోపిడీ గురించిచాలాకొద్దిగానే,చెప్పాలని,కళింగసీమవాసులతో,ఇతరప్రాంత వీక్షకులతో,పంచుకోవాలనుకుంటూ....సాక్ష్యాధారాలతో రాసిన రాత.



ప్రస్తుతం.ఒడిషారాష్ట్రంస్వంతంచేసుకున్న,ఎప్పటినుంచో,అదిమాదేఅంటున్న'చిలకసముద్రా'నికిసంబంధించిన,విషయం.అది'చిలకసముద్రం',కళింగసీమ'వాసులస్వంతఆస్తిగా,బ్రిటిషుప్రెశిడెన్శీలోఉన్నప్పుడు(రైలుమార్గంఇంకాఏర్పడనప్పుడు)జరిగినసంగతి.తానైతే,ఈసంగతులెన్నడూ,ఆరాష్ట్రంచెప్పదు...ఎందుకంటే,'స్నాడుగ్రాస్'కళింగసీమవాసుల,ధనాన్నేదోచుకున్నాడు.

ఒడిషాఅయితే..ఏకంగామొత్తంకళింగసీమలోని,అపారవనరులున్నభాగాన్నే,దేశానికి స్వాతంత్రం రాకముందే, పొద్దున్నే లేచిన పిట్టలా,దోచుకున్నదికదా..!




                                       
'హంటరు'అనేచరిత్రకారుడుచిలకాసరస్సుకుదక్షిణానఉన్నకొండలవరుసఒరియాప్రాంతానికిదక్షిణప్రాంతసరిహద్దుఅనిఖచ్చితంగారాసేడు.అసలుగంజాంజిల్లాయేఒరిస్సాప్రాంతంలోనిదికాదు.1936కుముందున్నఎప్పటిచరిత్రచూసినాఏరాజురాజ్యంచిత్రపటాలుచూసినాగంజాంజిల్లా,కోరాపుట్టి,పర్లాఖిమిడి,గుణుపురం,జయపురం,బరంపురం కళింగ సీమలోనివే.


ఆనాడేకాదుఈనాడేకాదు.ఏనాడూకళింగసీమలోతమసీమకోసంపోరాడితేగానీతమకేన్యాయమూ,జరగదన్నసంగతిగుర్తించిననాయకుడెవ్వరూ*ఈనాలుగుజిల్లాలలోనూలేకపోవడంవల్లనే,ఈ'కళింగసీమకొనలుసాగి,తనర్చి,తలిర్చిన,నవమాలికాలతలా,రత్నగర్భలాఉన్నప్పటికీకళింగమాతతనయులుగర్భదరిద్రులుగా,'కేడమూకలు'గానే ఉండిపోతున్నారు..



చిలకసముద్రం:






వెయ్యేళ్ళకిందటిబ్రహ్మాండపురాణంలో,చిలకసముద్రాన్నిగంగసాగరంగాపేర్కొంది,అంతేకాదు..బర్మా,మలయా,సియాం,చైనా,సుమత్రా,జావా,బాలి,బోర్నియో,శ్రీలంకలనుండీ,వేలకొద్దీఓడలువచ్చేవనీ,అవిరాగిరేకులతోకప్పబడిఉండేవనీ,నీటిఆవిరితోనడిచేవనీ,వాటికిందచక్రాలుఅతకబడిఉండేవనీ, వంటిఅనేకవివరాలు కూడా,అందులో రాసి,ఉన్నాయి.కళింగులుఅపారమైననౌకానైపుణ్యాన్నికలిగిఉన్నవారని,దేశదేశాలాఉన్నపేరు,గోపాలపురం,కళింగపట్టణం,కోరంగి,గంగసాగరం,ఱేవుపట్టణాలవల్లద్వారాజరిగిన,నౌకావ్యాపారాలవల్లవచ్చిందే.. ఆపేరు,ఏనాడూ, ఏదేశ చరిత్రలోనూ ఉత్కళ వాసులు లేదా ఓడ్రులు  పొందలేదు.



గంజాంజిల్లాలో"చిలకసముద్రం"అనేఈపెద్దసరస్సుఉంది.బంగాళాఖాతానికీదీనికీమధ్యగజాలదూరంమాత్రమేతేడాఉంది.అంటేఅంతవెడల్పుగాఉన్నఇసుకదిబ్బమాత్రమేసముద్రానికీదీనికీఅడ్డం.లేకపోతేఇదిసముద్రభాగమే.డిశెంబరునెలనుండీ'జూను'నెలవరకూదీనిలోనినీళ్ళుఉప్పగాఉంటాయి.వర్షాకాలంలోమాత్రం,అవితియ్యగాఉంటాయి.విదేశీపక్షులకిఇదివలసలఆవాసం.భారతదేశానికి'వైస్రాయిగా'పనిచేసిన'లార్డుకర్జన్'ఇక్కడికివచ్చిదీన్నిచూసి,"ఈచోటునుంచికనబడేద్రుశ్యంభారతదేశంలోకల్లా,సుందరమైనదనినాకనిపిస్తోంది"అన్నాడు.దీనికిదక్షిణంలోపడమరభాగంలోచిన్నచిన్నరాతికొండలునీటిలోకిచొచ్చుకునివచ్చిలంకల్లాగాకనిపిస్తాయి.వీటిలోఒకదానిపేరు"బ్రేక్ ఫాస్ట్ ద్వీపం". ఈసరస్సు మధ్యలో 'కళ్ళికోట' రాజుగారి భవనం ఒకటి ఉండేది.

'థామస్  స్నాడ్ గ్రాస్'1759 లో ఇంగ్లాండులోనే జన్మించినా అతడితండ్రి ఈస్టుఇండియా కంపెనీ లో పనిచేసేడు కనుక 1777 లో తాను చెన్నపట్టణం లో  సెయింట్ జార్జి కోటలో రైటర్ పదవిని పొందేడు. 1782 లో ఫాక్టరు అనేపదవిని,1790 లో సీనియర్ మర్చెంట్ హోదానీ,గంజాం అసిస్టెంట్ రెసిడెంట్ పదవినీ పొందేడు.


అతడు గంజాంజిల్లాకి రెసిడెంటు గా వచ్చిన రెండేళ్ళకి జిల్లాలో కరువు తీవ్రంగా వచ్చింది.(కిందటేడు కళింగ సీమకి దాపురించిన హుధుధ్ తుఫానులాగఅన్నమాట.)ఈస్టిండియాకంపెనీఉద్యోగులకు,భారతదేశం అంటే తవ్వుకోడానికి దొరికిన బంగారుగనే..స్నాడు గ్రాసుకి మద్రాసు నుండి దొరలెవ్వరూ ప్రయాస పడి రావడానికి ఇష్టపడని కళింగ సీమలో తను చేస్తున్నజిల్లాఅధికారిఉద్యోగం,జిల్లాకివచ్చిపడ్డకరువు,సిరులనేపండించేయి.జమీందారులందరినీ అదుపులో వుంచుకుని పనికి ఆహార పధకాన్ని ప్రకటించి ఆకలితో మలమల మాడుతున్న వాళ్ళచేత పనులు చేయించి వాళ్ళకి ప్రభుత్వ ధనంతో గంజి పోయించేడు.ఆ చేయించిన పనులలో గంజాం పట్టణానికి పది మైళ్ళ దూరంలో ఉన్న రంభ పట్టణంలో చిలక సముద్రం వొడ్డున కట్టించిన,నాటికాలంలోనే ఇరవై వేల రూపాయల విలువైన అందమైన భవనం కూడా ఉంది. అది తన స్వంత నివాసం చేసుకున్నాడు.సొమ్ము ప్రభుత్వానిదీ అంటే ప్రజలదీ,కట్టిందీ ప్రజలే..భవనం మాత్రం అతనిదే అన్నమాట.



'జాన్ లా' అనే అతడు తన 'గ్లింప్సెస్ ఆఫ్ హిడెన్ ఇండియా' అనే పుస్తకంలో గంజాం జిల్లాకి కలెక్టర్ గా ఉన్న   'థామస్  స్నాడ్ గ్రాస్' చేసిన పనులగురించి ఇలారాసేడు.






            "స్నాడ్ గ్రాస్"రంభలోకట్టించినదివ్యమైనభవనాన్నిఎంతోఅందంగా అలంకరించేడు.తన సాలలలో మంచి గుఱ్ఱాలనీ,ఏనుగులనీ కూడా కట్టి ఉంచేడు.పెద్ద నవాబు లాగా అతను జీవించే వాడు.రంభ పట్టణం మారు మూలగా ఉంది.మద్రాసు నుండి కలకత్తా వెళ్ళే ఇంగ్లీషు పెద్ద దొరలు తిన్నగా సముద్రం మీద ఓడల్లో అక్కడికి వెళ్ళిపోతారు గానీ గంజాంజిల్లాకు రారు.(అది ఇంకా రైలు దారులు పడని కాలంనాటి సంగతి.ఎప్పుడైనా ఎవరైనా ఇన్స్పెక్షన్ కి వస్తే  స్నాడ్ గ్రాస్ వాళ్ళని మామూలుగా పంపేవాడు కాదు.గొప్ప గొప్ప విందులు ఏర్పాటు చేసి,వేటలు ఏర్పాటు చేసి,వాళ్ళకడుపులు,జేబులు నింపి మరీ పంపేవాడు.అతడు కట్టుకున్న ఇంటికి ఎదురుగా చిలక సముద్రంలో రెండు మైళ్ళ దూరంలో ఉన్న 'బ్రేక్ ఫాస్ట్ ద్వీపం'ఐలాండులో తన పనికి అంతరాయం ఎవరూ కలిగించకుండా ఉండటానికి ఒక్కటే గదిని కట్టించి అది తన ఆఫీసు అన్నాడు.తన రెవెన్యూ లెక్కలూ ఆఫీసు రికార్డులూ అన్నీ దాన్లో పెట్టించేడు.దానికిఎదురుగా,ఒకఎత్తైనస్థూపాన్నికట్టించి...దానిపైనవెలుగుతున్న దీపాన్ని ఉంచేవాడు.దానికి 'దీప స్థంభం' అన్న పేరు పెట్టేడు.


 అప్పుడున్నమద్రాసుగవర్నరు'ఛార్లెసుఓఖ్లే'గంజాంజిల్లాలోకరువునివారణ కోసంప్రభుత్వంధనంచాలాఎక్కువగాఖర్చయ్యిందనీ,వివరాలుతెలియజెయ్యడానికి'స్నాడ్గ్రాస్'నిమద్రాసురమ్మనమనీకబురుపెట్టేడు..అతనుచెన్నపట్టణంవెళ్ళిరావడానికిపట్టేకాలంలోపనిచెయ్యడానికి'ఏక్టింగురెసిడెంట్ని'మద్రాసుగవర్నరునియమించేడు.'స్నాడ్గ్రాస్'గంజాంజిల్లానుంచిచెన్నపట్టణంకోసంబయల్దేరివెళ్ళగానే,అంతవరకూఊరుకున్నజమీందార్లంతాతాముస్నాడ్గ్రాస్ఆదేశాలమేరకుఅతని దుబాసీ గోపాలక్రిష్ణమ్మకి చాలాసార్లు చాలా డబ్బుని ఇచ్చేమనీ వాటిలో వేటికీ తమకి అతడు రశీదులివ్వలేదనీ ఫిర్యాదు చేసేరు.ఈ ఫిర్యాదులవల్ల అతడు తన దుబాసీకి విపరీతమైన చనువు ఇచ్చేడనీ అతడు కూడా చాలాడబ్బు తినేశాడనీ తేలింది.అప్పుడు ఏక్టింగు రెసిడెంటు తన పై వాళ్ళ కి ఆ సంగతి తెలియ చేసి దుబాసీ మీద కేసు పెట్టి బలవంతం గా కొంతసొమ్ము కక్కించేడు. ఆ తర్వాత ఉద్యోగం తీసేసేడు.గోపాలక్రిష్ణమ్మ ఆ తర్వాతెప్పుడూకనిపించకుండామాయయ్యేడు.రుజువైపోయినఈతప్పుకు రెసడెంటుపదవికారణంఅనిభావించి,గవర్నరు1794లోగంజాంజిల్లాకిరెసిడెంటుపదవిని తీసేసి కలెక్టరు పదవిని కల్పించేరు. ఆపదవిలోకి 'వాల్టరు బాల్ఫరు' అనే అతన్నినియమించేరు.'స్నాడ్గ్రాస్'నినాలుగేళ్ళుఏపదవీలేకుండాఖాళీగాఉంచేరు.ఆతర్వాతమళ్ళీఅతన్నే,గంజాంజిల్లాకి,కలక్టరుగానియమించేరు.అతనుఈనాలుగేళ్ళలో,ఏమీమారలేదుసరికదామరింతచెడిపోయేడు.కలెక్టరయ్యేక,మరింతరెచ్చిపోయేడు.పాతదుబాసీస్థానంలోఅతణ్ణిమించినవాడైన'జగన్నాధరావు'ని,నియమించిసర్వాధికారాలూఅతనికేఇచ్చితానురంభపట్టణంలోతనఇంటిలోనేవిలాసంగాజీవిస్తూఉండేవాడు.తనమనసుకునచ్చిన,అందమైనవేశ్యనుకూడాతననివాసంలోనేఅట్టేపెట్టుకున్నాడు.ఆమెఅతనిపరిపాలనని,తనచుట్టూనే,తిప్పుకునేది.

గంజాంజిల్లామాన్యూలురాసిన'మాల్టుబీ'చెప్పినట్టుగంజాంజిల్లాలోనిఅన్నిప్రభుత్వశాఖలూపుచ్చిపోయేయి.గంజాంపట్టణంలోదుబాసీతనకోకార్యాలయంఏర్పాటుచేసుకున్నాడు.కలెక్టరుతో,ప్రభుత్వానికి శిస్తు ఇవ్వడం వంటి విషయాల్లో మాట్లాడుకోవాలనుకున్నజమీందారులుముందుదుబాసీదర్శనంచేసుకోవాలి..ఆయనదర్శనానికి,వెళ్ళేటప్పుడు,ఎవరైనాసరేఖాళీచేతులతోమాత్రంవెళ్ళకూడదు.గంజాంజిల్లాలో కలెక్టరు ఉపేక్ష వల్లా,దుబాసీ అవినీతి వల్లా ప్రభుత్వానికి శిస్తులరాబడి బాగా మందగించి పోయింది.


 అప్పుడు మద్రాసు గవర్నరు గా రాబర్టు క్లైవు ఉన్నాడు.అతడు ప్రభుత్వాదాయం తగ్గిపోవడానికి సంజాయిషీ ఇమ్మని స్నాడ్ గ్రాస్ ని అడిగేడు.దానికి తడుముకోకుండా,వర్షాలు సకాలంలో కురవక పోవడం వల్ల పంటలు పండటం లేదనీ,ప్రజల్లో దబ్బు లేదనీ,జిల్లాలో జమీందారులెవరూ తను చెప్పిన మాట వినటం లేదనీ,కొండజాతి వాళ్ళు అల్లర్లు చేస్తున్నారనీ,శాంతిభద్రతలు కాపాడాలంటే తనకి తగిన సైన్య సిబ్బంది లేరనీ,జవాబిచ్చేడు. క్లైవు తక్కువ వాడు కాకపోవడంవల్ల ప్రభుత్వఆ దాయం తగ్గిపోవడానికి ఇంత తెలివిగా సమాధానం చెప్పిన కలెక్టర్లెవరూ లేరని భావించి,స్నాడ్ గ్రాస్ ని తప్పించి అతని స్థానంలోబ్రౌను దొరని,కలెక్టరుగా నియమించేడు. అయితే బ్రౌను గంజాంరావడానికి ఎక్కువ సమయమే పట్టింది. స్నాడ్ గ్రాస్ ను రంభ పట్టణం నుంచి కదపటం  అంతతేలిగ్గా మాత్రం జరగలేదు.. బ్రౌను గంజాంజిల్లా వ్యవహారాలను చక్కబెట్టాలని ఎంతగా ప్రయత్నించినా అతనికి అది సాధ్యం కాలేదు. మంచి అభివ్రుధ్ధిలో ఉన్నటువంటి జిల్లా పాడైపోయిందనీ,జనసంఖ్య కూడా క్షీణించిందనీ అతను పైకి రాసేడు. 1793 కీ 1801 కీ మధ్య గంజాంజిల్లాలో జరిగిన ప్రభుర్వ వ్యవహారాలు తెలుసుకోవడానికి రికార్డులేవీ లేవని 'మాల్ట్ బీ' తన మాన్యూల్ లో రాసేడు..తనపై సాక్ష్యం ఏదీ లేకుండా చేయాలని స్నాడ్ గ్రాస్ ఆ రికార్డులన్నీ చిలక సముద్రంలో పారేయించాడనీ,ఆ రికార్డులకోసం తన దగ్గరకు రంభ పట్టణానికి వస్తే ప్రాణం తీస్తానని అతను బ్రౌను ను బెదిరించేడనీ కూడా ఓ కథ ప్రచారంలో ఉంది. ఎలాగయితేనేం బ్రౌను దొర చాలా సమస్యలనెదుర్కుని స్నాడ్ గ్రాస్ సంగతుల్ని బయటకిలాగగలిగేడు మద్రాసు ప్రభుత్వం అతనిమీద కేసు పెడదామని అనుకుని అది తమ పరిధిలోకి రానిదనుకుని ఊరుకుండిపోయింది. చివరికి1800 నుండి 1804 వరకూ అతన్ని మద్రాసులోనే ఖాళీగా ఏ పనీ ఇవ్వకుండా ఉంచేరు..1804 లో విలియం బెంటిక్ గవర్నరుగా వచ్చేక అతడిని పనిలోంచి తీసేసేరు.స్నాడ్గ్రాస్ తన మూటా ముల్లే సర్దుకుని ఇంగ్లాండ్ వెళ్ళేడు. 

ఇక్కడితో ఇతనికథా,అతనితో ముడిపడ్డ చిలక సముద్రంకథా పూర్తవ్వలేదు. తర్వాత అతను మరో తమాషా చేసేడు . 

(దాని సంగతి తర్వాత పోష్టులో...)





-------------------------------------------------------------------------------------------------------------------------
 *ఇది స్వర్గీయ దిగవల్లి వేంకట శివరావు గారి "కథలు-గాధలు" పుస్తకం నుండి సేకరించినది. ఆయన కి నామన: పూర్వక వందనాలు.

*స్వర్గీయ పి.వెంకట్రామయ్య,బ్రుందావన్ పాత్రోవంటినాయకులుఇఛ్ఛాపురం నుండి, గంజాంను ఒరిస్సాలో కలిపెందుకు వ్యతిరేకంగా పోరాడేరు.కరపత్రాలు పంచేరు.బరంపురం నుండి విలీనానికి వ్యతిరేకంగా కోర్టులో కేసు కూడావేసేరు.
*నేటిఒడిషాలోనిఘుంసూరు,బుగుడాపట్టణాల్లోవిలీనానికివ్యతిరేకంగాఉద్యమమే నడిచింది.

*జయపురంరాజైనవిక్రమదేవవర్మ,టెక్కలి,చీకటి,కళ్ళికోటయువరాజులువిలీనానికి అనుకూలంగా లండను వరకూ వెళ్ళి మరీ అనుకూలంగా పోరాడేరు.

*స్వర్గీయ పట్టాభి సీతారామయ్య గారి సంపాదకత్వంలో మచిలీపట్టణం నుండి వెలువడ్డ" జన్మభూమి అన్న ఇంగ్లీషు పేపరు (నవంబరు 15,1924 లో)కళింగ సీమకు చెందిన ఒరియా మాట్లాడే ప్రజలున్న ప్రాంతాలను ఒడిషాలో విలీనం చేయటాన్ని వ్యతిరేకిస్తూ,రాసింది.

*బరంపురంనుండిఆశా,నవీన్,పత్రికలు,కటక్ నుండి ఉత్కళ దీపిక,సమాజ్ పత్రికలు విలీనాన్ని తీవ్రంగా సమర్ధించేయి.

*సైమన్ కమిషన్ 1928 లో విలీనానికి అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చింది.

*బరంపురంలో,మే9వతేదీ,1932లోవిలీనానికివ్యతిరేకంగాసభజరిగింది.గంజాంజిల్లానుఒరిస్సాలోవిలీనంచెయ్యకూడదని,అందుకుచేపట్టేవ్యతిరేకోద్యమానికివిజయనగరం,బొబ్బిలిరాజులనుండివిరాళాలుసేకరించాలనీతీర్మానాలుఆసభలో జరిగేయి.

*అదేబరంపురంలోని,'సీతారాంవిలాసఫిల్మ్'హాలు'లోగంజాం,విశాఖపట్టణం,తెలుగువారిసమావేశం,వి.రామదాసుపంతులుగారుఅధ్యక్షులుగాజరిగింది.ఆయనమద్రాసున్యాయవాది.జూలై11,1932ఒరిస్సా ఏర్పాటు వ్యతిరేకోద్యమంగా పాటించాలని,భాషాపరంగానేరాష్ట్రవిభజనజరగాలనీఆసమావేశంతీర్మానించింది. 

*1933మార్చి18వతేదీననాటి'హోమ్'గవర్నమెంట్'రాజ్యాంగసవరణలకుశ్వేతపత్రాన్నిప్రకటించింది.అయితేదానిలోపేర్కొన్నఒరిస్సారాష్ట్రసరిహద్దులలోజైపూర్,పర్లాఖిమిడిప్రాంతాలనుఒరిస్సాలోకలపలేదు.దానిమీదఒరిస్సాకాంగ్రెసువాదులుపోరాడేరు.పర్లాఖిమిడిరాజు,కళ్ళికోటరాజు,లింగరాజపాణిగ్రాహి,భుబనానందదాసు,శ్యామసుందరగంటాయతులు,లండనువెళ్ళి,స్టేట్ శెక్రటరీని కలిసి,తీవ్రంగావాదించేరు.అప్పుడుమార్పులొచ్చేయి.కటక్,సంబల్పూర్,పూరీ,బాలాసోర్ లతో పాటు,గంజాం కోరాపుట్లను ఒరిస్సాలో కలిపేరు.



1, జూన్ 2015, సోమవారం

" అణ్యాంక భీమేశ్వరాలయం"

'అణ్యాంక'(అనియంక)అంటే,'యుధ్ధంలోముందునిలబడ్డవాడు'అన్నఅర్థంఉంది.'అన్యంకభీమ'అన్నది,వజ్రహస్తరాజుకిఉన్నఇంకో పేరుకూడా...

" అణ్యాంక భీమేశ్వరాలయం"

ముఖలింగక్షేత్రంలోచూడవలసినమరొకప్రాచీనదేవాలయంభీమేశ్వరాలయం.ఇదిమధుకేశ్వరాలయానికి100గజాలదూరంలోనేఉంటుంది.అదిచాలావరకుకూలిపోయి,శిధిలావస్థలోనేఉంది.దీనిలోఉన్నశిల్పాలు,మధుకేశ్వరాలయంలోనిశిల్పాలు,ఒకేలాఉంటాయి.ఈదేవాలయంగోడలమీద,స్థంభాలమీద,గాంగవంశరాజులు,రెండోవజ్రహస్తుడు,అనంతవర్మచోడగంగదేవుడు,కాలంనాటిశాసనాలు,చాలాకనిపిస్తాయి.ఇవిఆనాటితెలుగుభాషలోనే,చెక్కించబడినవి.ఈదేవాలయంలోనల్లగామెరిసే,శివలింగానికి'అణ్యాంకభీమేశ్వరు'డన్నపేరుఉంది.అదిఇంద్రనీలమణిలాగా,రాత్రుళ్ళుమెరిసేస్వభావం,కలిగిఉన్నది.మంటపంనుంచిప్రాకారంవైపు,బయటకిపోవటానికి,దక్షిణంవైపుత్రోవఉంది.ఆగోడలమీదఉన్నశాసనాలన్నిటిలో,నగరంలోవేంచేసిఉన్న'అణ్యాంకభీమేశ్వరు'డన్నపేరేకనబడుతుంది'అణ్యాంక'(అనియంక)అంటే,'యుధ్ధంలోముందునిలబడ్డవాడు'అన్నఅర్థంఉంది.'అన్యంకభీమ'అన్నది,వజ్రహస్తరాజుకిఉన్నఇంకో పేరుకూడా..అలాఆదేవాలయంకట్టించినరాజుపేరు, అక్కడిదేవుడికివచ్చింది.అదిఅప్పుడెప్పుడోఆనాడేజరిగినా,ఈనాటిదాకాఅలాగేఉంది.అందుకేకాబోలు,నేడుకూడామనపాలకులు,తమపేర్లునిలబడిపోవాలని, చాలాచిన్నఆశతో,అలాంటివేఎన్నెన్నోపనులు,నిస్వార్ధంగాచేస్తుంటే,మనంసంబరాలతో అంబరాన్నంటేలా,పండగలే కదా..చేసుకుంటున్నాం.'కాలమేకదామారింది..మనంకాదుకదా'..


ఇప్పుడు,గౌరవనీయభారతప్రధాని,శ్రీమోదీగారి'స్వఛ్ఛభారత్','జనధనయోజన'పధకాలనూ,స్వర్గీయరాజకీయనేతల,'రాజీవుగ్రుహకల్ప','ఎన్టీఆరుసుజలస్రవంతి'అన్నపేర్లుఉన్నపథకాలను,తలుచుకుంటేనే,మననేత్రాలుఆనందాశ్రువులతోనిండిపోయి,చెఱువులైపోవటంలేదా.....మనశరీరాలుపులకించిపోయి,రోమాంచితాలుకావటంలేదా..మనం,ప్రతీరోజుకడుపునిండిపోయేంత,పరమానందాన్నిపొందటం లేదా..?


మరికొన్నాళ్ళకి,తిరుపతిదేవుడి,పేరుని"నారాచంద్ర వేంకటేశ్వరస్వామి", అనీ,యాదాద్రిదేవుడిపేరుని"చంద్రశేఖరనరసింహస్వామి",అనీమార్చాలని,ఆఇద్దరుపాతదేవుళ్ళవిగ్రహాలనూ,తమఅన్నలరూపాల్లోకిమార్చి,తమకికన్నులపండుగకలిగించాలనీ,తమఅన్నలకోసంవారిఅభిమానులునిరాహారదీక్షకికూర్చుంటే, నీళ్ళటేంకులుఎక్కి,దూకేస్తామనిబెదిరిస్తే,పెట్రోలుమీదపోసుకుని,అగ్గిపుల్లకనబడక,దానికోసం,వెతుక్కుంటూ,చిందులుతొక్కుతుంటే,మనంకళింగులంకూడా,అది అలాగే,జరిగితీరాలని,సమైక్యంగాపోరాడితీరుతాం..మీడియాల్లో,పత్రికల్లో,మనపండితప్రకాండులు,మేతావులు,ముద్దులమతాలమురిపెంపుపెద్దలూ,జ్నానవిజ్నాన ఇంద్రజాలదురంధరులూ, ఇందుకోసం అనర్గళఉపన్యాసాలని,రచ్చరచ్చచర్చలని,మనకోసంవొండివడ్డిస్తారు. అందులోసందేహం,ఏమీఅవసరంలేదు.చివరాఖరికి..కాగలకార్యంనెరవేరితే,చనిపోయినవారికి,ఒకస్థూపంకట్టేస్తారు..దానిముందునిలబడిదండాలుపెడతారు.ఏంపోతుందనీ..కావలసినదానికన్నాఎక్కువేదొరుకుతుందికదా..!.

అదేజీవన్మరణపోరాటమనుకుని,రంగంలోకిదిగి,ఉద్యమాలకిఊపిరులూది,చనిపోకుండాబతికున్నవాళ్ళసంగతెవరికికావాలనీ..అందుకుఉదాహరణలెన్నిలేవనీ..మచ్చుకుమన కళింగ సీమనుంచే,ఒకదానిగురించి చూద్దాం.


"మధురవాణి అంటూ ఒక వేశ్యాశిఖామణి ఈ కళింగ రాజ్యంలో వుండక పోతే, భగవంతుడి స్రుష్టికి ఎంత లోపం వచ్చి వుండును" అని కరటకశాస్త్రులు, చేతగురజాడ అప్పారావు గారు కన్యాశుల్కంలో చెప్పించినట్టు, 


'అమ్రుతరావు'లేకపోతే,'స్వర్గీయశ్రీపొట్టిశ్రీరాములు'గారిలాఆయననిరాహారదీక్షకి,కూర్చోకపోతే(1972నాటి)'జైఆంధ్రా'ఉద్యమం,ఇంతస్థాయికివచ్చివుండేదా..అని.మనంఆయనగొప్పదనాన్నితలుచుకుని ఆరోజుల్లోతన్మయత్వంలోతడిసిముద్దైపోతుంటే,మన'అమ్రుతరావు'చేత,దీక్షను,తెలంగాణావాడైన,నేటి గౌరవనీయరేవంతరెడ్డిగారిలా..అదేతెలంగాణాకిచెందిన,కీర్తిశేషులూ,గౌరవనీయులూ,అయిననాటిమర్రిచెన్నారెడ్డిగారు,మనకెవరికీ,తెలీనిఏవేవో,ఊసులు,చెప్పివిరమింపచేసేక,'జైఆంధ్రా'ఉద్యమాన్నివిజయవంతంగా,నీరుకార్చగలిగేడనిగట్టివాడనిపేరూ,పదవులూ,భోగాలూ,భాగ్యాలూ,తమఅధిష్టానవర్గంనుండి,ఆయన,పొందగలిగేడుగానీ, ఆ...అమ్రుతరావు,ఏమయ్యేడనిఎవరైనాపట్టించుకున్నారా..?

అతడు,మనకళింగసీమలోనే,ఓమూల,తన బతుకుతెరువుకోసం 'ప్రభుత్వహాస్టల్లోకుక్'గాబతికేడన్నసంగతి,మనలోఎంతమందికితెలుసు..?




వెయ్యేళ్ళకిందటనే'అన్యంకభీమ'రాజు,శివుడిపేరుకి,తనపేరుతగిలిస్తేఎవరూఅడగలేదు.ఆరాజూపోయి.ఆరాజ్యమూపోయిఆదేవాలయంకూడాకూలిపోతున్నా,శివుడిపేరు'అణ్యాంక భీమేశ్వరు'డనేకదాఈనాటికీమిగిలిఉంది.

కనుకమనదేశరాజకీయనాయకులుఆపాతకాలంనాటిరాజులకిఏంతీసిపోయేరనీ..ఆనాటిచక్రవర్తులకన్నాతక్కువెందుకవుతారనీ..వాళ్ళుచేసేవాటిని'ఎందుకిలా.?.అని,మనదేశపౌరులెప్పుడూఅడగనివాళ్ళేకదా..మన'కళింగులం',అందరిబాధామనబాధేఅని,మనకోసంతప్పమిగిలినఅందరికోసం,ఏంచెయ్యడానికైనాఅందరికన్నాముందే,ఎప్పుడూసిధ్ధంగాఉండేవాళ్ళమేకదా."మాదిమాదే..మీదిమాదే.. అంతామనదే".అనివాళ్ళుఎవరైనాపాడితే.."మీదిమీదే..మాదిమీదే..అంతామనదే" అనిచప్పట్లు కొడుతూమరీ,వంతపాడేవాళ్ళం కదా!  


"ముఖలింగేశ్వర శివలింగము": 

ముఖమంటపంనానుకుని,ఉన్నగర్భగుడిలో,'మధుకేశ్వరశివలింగము'కనిపిస్తుంది.సాధారణంగాశివలింగాలునల్లరాతితోచేయబడి,పానఘట్టంలోఅమర్చబడికనిపిస్తాయి.ఇక్కడమాత్రంఅలాకనబడదుతెల్లగాశిలలాగాకనిపిస్తుంది.ముందువైపునాశిక,నేత్రాలు,నుదురు ఉన్నట్టుచూపిస్తారు..వెనుకపక్కఅన్నిదేవాలయాలలో,శివలింగంఉన్నట్టేఇక్కడాకనిపిస్తుంది.ముందువైపు,నల్లనిమచ్చలుకనిపిస్తాయి.మరొకవిశేషంకూడాఈగర్భగుడిలో,కనిపిస్తుంది.శివలింగంవెనుకఒకచాలా'పెద్దమట్టిబానలేదాకుండ'కనిపిస్తుంది.దీనిలోస్వామివారిని,అభిషేకించేజలాన్నినిలవచేస్తారు.అదిచాలాబరువుగాఉన్నరెండడుగులలోతు,అయిదడుగులవెడల్పు,ఉన్నమట్టిపాత్ర.ఆమట్టిపాత్రపెంకుదళసరిరెండుఅంగుళాలుఉంటుంది.చూడడానికిఅదిపూర్వం,బెల్లంవండేపెనంలాకనిపిస్తుంది.అంత పెద్దదిఆచిన్నగర్భగుడిలోకి,ఎలాచేరిందన్నసంశయంకలిగినవారికిఆసంశయాన్నిపోగొట్టేందుకు,ఒకకథచెపుతారు.మధుకేశ్వరస్వామికిపరమభక్తుడయినఒకకుమ్మరిరెండుపెద్దబానలను,ఆయనకిసమర్పించేందుకుతయారుచేసి,ఆలయానికితీసుకువచ్చేడు.అప్పటికే,ఆలయనిర్మాణంపూర్తయిపోవడంవల్లఆరెంటినీ,లోపలచేర్చాలనిఅతనుప్రయత్నిస్తే,ఒకబానపగిలిముక్కలైపోయింది.అతనుచింతలోములిగిపోయి,ఆరాత్రిఅంతాఅక్కడేమధుకేశ్వరుణ్ణిధ్యానిస్తూఉండిపోయేడు.భక్తవత్సలుడయిన,పరమేశ్వరుడుఆభారాన్నితనమీదవేసుకునిఆరాత్రే,మిగిలిపోయినమట్టిబానను,తనగర్భగుడిలోకిచేర్చేడు.ఉదయాన్నేదేవాలయానికి,తనుఏంచేసి,తనుఎంతోప్రేమతోశివుడికిఅర్పించాలనుకున్నబాననుగర్భగుడిలోకిచేర్చాలోఅని,ఆలోచిస్తూవచ్చినఆకుమ్మరి,భగవంతుడికరుణవల్లజరిగినపనికి,పరమానందభరితుడయ్యేడు. ఇందులోఆశ్చర్యాన్నికలిగించేఆంశంఏమిటంటే,పదిఇరవైమందికలిసిదాన్నిఒకచక్రంలాగాలోపలకితీసుకువెళ్ళాలన్నాఅదేమంతసులభసాధ్యమైనదికాదు.ఆపనిజరిపినవిధానమేఆశ్చర్యకరమైనది.


గర్భగుడిబయటివైపున్నముఖమంటపంరెండుగోడలమీదాఏకాదశరుద్రరూపాలుఅష్టమూర్తులు,పంచదేహమూర్తి,దక్షిణామూర్తి,ఉమామహేశ్వరుడు,చంద్రశేఖరమూర్తి,అర్థనారీశ్వరుడు,అఘోరమూర్తి,రక్షోఘ్నమూర్తి,భైరవుడు,కాలభైరవుడు,పాశుపతమూర్తి,వంటివిగ్రహాలుచాలానేఉన్నాయివాటికాలాన్ని,వాటిరీతులనువిశ్లేషించిరాస్తె,ఒకసిధ్ధాంతగ్రంధంఅవుతుంది.ఆశక్తి,కళింగులలోఅపరిమితంగానే ఉంది. కానీ..ఆసక్తిమాత్రమెకొరవడింది. 

ఇక్కడమరొక్కశిల్పవిశేషాన్నిగురించి,చెప్పకతప్పదు.ముఖమంటపం,దక్షిణద్వారంనుండిబయటకివచ్చితలెత్తి,వెనక్కిచూస్తే,ఒకనైపుణ్యశిల్పప్రదర్శనంమన,ఱెప్పవాల్చనీదు. అందులోపార్వతీపరమేశ్వరులుజూదమాడుతూకనిపిస్తారు.ఆపాచికలాటలోశివుడు,పార్వతీదేవిముందుఓడిపోయి,తనకున్నవన్నీపోగొట్టుకోవడమేకాక,చివరికి,తనవాహనంనందినికూడాపోగొట్టుకున్నట్టు,కనిపిస్తుంది.పార్వతీదేవి,ఆమెచెలికత్తెలువిజయానందంతో,ఆనందినితోలుకుపోతుండగాశివుడుఖిన్నుడై,నిలబడిపోయిఉండటంఈశిల్పంలోఅద్భుతంగాకనిపించేశిల్పకళావైదుష్యం.


గుడిచుట్టూఉన్నప్రాకారందగ్గర,అష్టదిక్పాలకులదేవాలయాలుఉన్నాయి.గుడికి,ఉత్తరదిక్కులోఉన్నప్రాకారానికి,బయటగోడమీదచాలాప్రాచీనమైన,ఒకయోధుడిశిల్పంఉంది.అతడుతనఎడమచేతిలోఎత్తైనవిల్లు,కుడిచేతిలోఒకఅమ్ముపట్టుకునికనబడతాడు.మొలలోకత్తికనబడుతుంది.జుత్తునున్నగాదువ్వబడి,వీరపురుష,లాంఛనమైనకోరశిఖతలపైనకనిపిస్తుంది. ఆయోధుడివస్త్రధారణ,చాలాప్రాచీనమైనదిగనే,ఉంటుంది.ఆరూపం,నాడెన్నడోఎవరోశిల్పి,చెక్కినపరమశివుడిరూపమా.?లేక ఎవరో,ఆ శిల్పికాలంనాటి'కళింగరాజు'రూపమా..?అన్నది తెలుసుకోవటంమాత్రం కష్టమవుతుంది.




అష్టదిక్పాలకుల,దేవాలయాలలోవాయుదేవుడిదేవాలయం,మీదకొన్నిప్రాచీనశాసనాలు(తెలుగు,కన్నడలిపులలో)కనిపిస్తాయి.వాటిలో'త్రైలోక్యభీతదేవర,"న్రుపతుంగనరసింహుణ్డు"అనిచదవగలిగేవి,కనిపిస్తాయి.గుడిదాటిబయటకివస్తే,పక్కనేఒకఆంజనేయఆలయంఉంది.ఆఆలయంమరీపాతదేం,కాకపోయినప్పటికీ,దానినిర్మాణంలోఉపయోగించిన,రాళ్ళుకొన్నిచాలాపాతవే.ఆరాళ్ళమీదకూడాచక్కని,ప్రాచీనశిల్పాలుకొన్నిఉన్నాయి.ఒకరాయిమీద,యుధ్ధరంగంలోయేనుగులు,ఢీకొనిదెబ్బలాడుతున్నట్టు,చిత్రీక్రుతమైఉంది.బాణాలువచ్చి,,గుచ్చుకుంటున్నా,ఒకయేనుగులక్ష్యపెట్టకుండా,తనకాలికిందఒకతన్నితొక్కిపట్టి,తనతొండంతో,మరొకయేనుగుతోయుధ్ధంచేస్తున్నట్టూ,ఆయేనుగుమీదఒకమావటికూర్చున్నట్టూ,ఆశిల్పంలోకనిపిస్తుంది.


మరొకటి,ఆంజనేయస్వామిగర్భాలయం,బయటిగోడమీదకనిపిస్తుంది. అదిచాలాప్రాచీనమైనదే,అనిచెప్పగలశిల్పం.దానిలోమనుష్యునిమొహంతో,ఉన్నఒకమొసలిమీద,కూర్చునికొందరుయోగులు,చుట్టూఉన్నజలంలోప్రయాణంచేస్తున్నట్టుమనంచూడొచ్చు.

"సోమేశ్వరాలయం"

ఊరికిదూరంగాసోమేశ్వరాలయంఉందిగానీఅదిసుమారు150ఏళ్ళకిందట,పిడుగుపడిపునాదులంటాకదిలిపోయింది.దీనినిర్మాణశైలిభువనేశ్వరజగన్నాధదేవాలయంలాఉండెదిఅని,అనిపిస్తుంది.


 ("చిలక సముద్రం కథ" తర్వాత పోష్టులో)










23, మే 2015, శనివారం

"కళింగులు శిల్పకళా చాతుర్యంలో ఆరితేరినవారు"

            

కళింగులు శిల్పకళా చాతుర్యంలో ఆరితేరినవారు. దేవాలయ నిర్మాణంలో వాళ్ళు పూర్తిగా దక్షిణాది వారి శైలినే, అనుకరించిన వారు కాలేదు. మధుకేశ్వరాలయం చూసినప్పుడు ఆసంగతి స్పష్టంగా కనబడుతుంది.


...వస్తుశిల్పంలోచలనద్రుక్పధం,వీరిశిల్పకళలోకొట్టొచ్చినట్టుకనబడే,నైపుణ్యంఈదేవాలయాలలోఉన్నప్రత్యేకశిల్పాలనేకం..కనుబొమలు,చెతివేళ్ళుశిల్పకళలోవీరికున్నగొప్పతనాన్నితెలియచేస్తాయి.వాళ్ళనైపుణ్యాన్నివేలసంవత్సరాలతర్వాతకూడాపరిశీలించినవారు,రెండుచేతులూపైకెత్తిమరీఆశిల్పులనిర్మాణకౌశల్యానికినమస్కరించవలసిందే.ప్రాచీనకళింగదేశంలో'కళాకన్య'తనబంగారుగజ్జెలతోనర్తించి,దేశదేశాలనీ,తనగానంతో,ఉత్కంఠపరిచేదని,ఈచాలా...కొద్దిగానేఇంకామిగిలిపోయున్న సాక్ష్యాలు..ఢంకామీదకొట్టినట్టుగాచెపుతాయి....గుర్తించగలమా..లేదా అన్నదే..మిగిలున్న ప్రశ్న.

*అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన మధుకేశ్వరాలయంలోని కొన్ని శిల్పాల గురించిన వివరాలలోకి వెళితే....


ముఖలింగదేవాలయం,చుట్టూప్రాకారంఉంది.లోపలదేవాలయం.దానిచుట్టూఅష్టదిక్పాలకులుకళ్యాణమండపాలుదీని,నిర్మాణంలోనిభాగాలు.ప్రాకారంసింహద్వారానికిఎదురుగాఉండేధ్వజస్ఠంభం,నడివీధిదానిగామారిపోవటానికి,కారణందేవాలయప్రాంతం,ఆక్రమణలకి,లోనవ్వడమే.....







1.ధ్వజస్ఠంభంఎదురుగాసింహద్వారం,ద్వారానికిరండుపక్కలారాతితోచెక్కబడినవెనుకకాళ్ళమీదకూర్చున్నరెండుసింహాలుకనబడతాయి.గుడిలోకివెళ్ళటానికి,మెట్లుఎక్కుతున్నపుడుసింహద్వారానికిముందుఎడమవైపు,ఒకశిల్పంతోకూడినఱాయివుంటుంది.దానిమీదఒకవిలుకాడిబొమ్మ,అతడికివింజామరతోవిసరుతున్నమరొకతనిబొమ్మచెక్కబడిఉన్నాయి.అంతేకాకుండా,ఆవిలుకాడుతనకాళ్ళకిందఒకవ్యక్తినితొక్కుతున్నట్టుగాఆరాయిమీదచెక్కబడిఉంది...ఒకరాజుతనశత్రువునుజయించికాళ్ళకిందతొక్కి,అవమానిస్తున్నట్టుగానే,అనుకోవాలి.
  మంటపంలాఉన్నసింహద్వారానికి,రెండుపక్కలాఉన్నస్థంభాలమీదసింహద్వారంగోడలమీదప్రాచీనగాంగవంశపురాజులువేయించినశాసనాలుచాలానేఉన్నాయి.




2.సింహద్వారానికిఎడమపక్కనేమరొకరాతిపలకఉంది.దానిమీదఒకపురుషుడు,స్త్రీలింగరూపంలోఉన్నశివుడినిపూజిస్తున్నట్టుచెక్కబడిఉంది.శివలింగానికిపైనసూర్యచంద్రులబొమ్మలువాటికిందఒకహస్తంకూడాకనబడతాయి.ఆశిల్పంలోవ్యక్తివివరాలుచెప్పేఆధారాలురాసిలేవు,కానీఆమధుకేశ్వరఆలయాన్నినిర్మించినరెండవకామార్ణదేవుడిదేఆబొమ్మఅనిఅనుకోవడంసరైనదేఅవుతుంది.

3.సింహద్వారందాటిలోపలకిఅడుగుపెట్టగానే,ఒకపెద్దనందివిగ్రహంకనిపిస్తుంది.ఆనంది,కెదురుగాఒకమంటపం,ఆమంటపంలోనికి,ఒకద్వారంకూడాకనిపిస్తాయి..ఆద్వారానికి,రెండుపక్కలాఉన్నగోడలరాళ్ళమీద,చెక్కినన్రుత్యభంగిమల్లోఉన్నటువంటి,స్త్రీలబొమ్మలుకనిపిస్తాయి.ఆవిగ్రహాలనుఅక్కడచెక్కిన,శిల్పిదేనిని,ఉద్దేశించిఆరూపాలనుచిత్రీకరించేడో,ఆకాలంనాటి సామాజిక పరిస్థితుల విశ్లేషణ జరిపితేనే కానీ తెలియదు.


ఆ ద్వారాన్ని దాటి లోపలకి ప్రవేశిస్తే,చిన్న నంది విగ్రహం, దానిపైన విశాల ప్రాంగణం కనిపిస్తాయి.దేవాలయ శిఖరం కూడా కనిపిస్తుంది.ఇది రెండవ సింహద్వారం అవుతుంది.ఇది మొదటి దానికంటే చిన్నది.ఈ ద్వారానికి తలుపులు లేవు.అంతా శిల్పమయమే.ఆ ద్వారాన్ని దాటి లోపలకి వెళ్ళేక వెనక్కి తిరిగి చూస్తే,

4.ద్వారం పైన ఒక ఏడెనిమి అడుగుల పొడవు అడుగున్నర వెడల్పుతో ఉన్న ఒక రాతిమీద చెక్కిన కథాచిత్రం మనకెన్నో విశేషాలను చెప్పేదానిలా కనబడుతుంది.ఆ పలక మధ్య్ల లో ఒక చెట్టు,ఆ చెట్టుకు ఎడమపక్క ఒకవేదిక మీద కూర్చున్న ఒక వ్యక్తి అతడికి వింజామరతో విసురుతున్న మరొక మనిషి కనిపిస్తారు.అతనికి వెనుక 15 మంది శాంతపురుషులు స్థిరంగా కూర్చున్నవాళ్ళు కూడా కనిపిస్తారు.చెట్టుకు కుడివైపునుంచి బలమైన కత్తి పట్టుకుని ఒక మనిషి ప్రాకుతూ వస్తున్నట్టు,అతను ఆ చెట్టును నరకాలనే వస్తున్నట్టు కనబడుతుంది..అతని వెనకాతల ఇద్దరు స్త్రీలు ఉంటారు.వాళ్ళల్లో ఒకామె నిలబడిరెండు చేతులూ జోడించి కనబడుతుంది.రెండో ఆమె కూర్చుని ఉంటుంది.ఆ ఇద్దరు స్త్రీల వెనకా 21 మంది ఆయుధపాణులైన క్రోధావేశపరులైన పురుషులు కూడా నిలబడి ఉంటారు.వేదికమీద కూర్చున్న వ్యక్తి అతనిని వారిస్తున్నట్టు కనిపిస్తుంది.బొమ్మ మధ్యలో ఉన్న చెట్టు మొదట ఒక పద్మపీఠం కనబడుతుంది. ఈ రాతి పలకలోని చిత్రం మొత్తం మనకి ముఖలింగ క్షేత్ర మహాత్మ్యం కథను చెపుతున్నట్టే కనబడుతుంది.
       
      ఈచిత్రంలోచాలాస్పష్టంగాకనిపిస్తున్నమనుషులవస్త్రధారణ,కేశాలంకరణ ,కళింగజాతిజనులకీఇతరప్రాంతాలజనులకీఉన్నటువంటి,సంస్క్రుతీ,సంప్రదాయాలభేదాలనీ,రూపురేఖావిలాసాలలోనితేడాలనీకొట్టొచ్చెలా చూపుతాయి.వీటినిబట్టిక్రీ.స్తుశకారంభంలోనివశించినట్టికళింగదేశస్తులనుగురించిచాలావివరాలనూతెలుసుకోవచ్చు.తలలమీదఒకవైపున్నగుండ్రనితలకొప్పులు,నడుములచుట్టూబిగదీసికట్టినఅంగవస్త్రం,దానిమీదబిగించినకాసె,మొలనూలు,చూసేవాళ్ళలోఆసక్తినిరేకెత్తించేలా,ఇవితమజాతిపూర్వీకులవిఎంతమాత్రంకావనిఇవివేరేజాతివాళ్ళపూర్వీకులవని,వాళ్ళుకళింగులేననీ,ఇతరప్రాంతవాసులకిచూడగానేఅర్థమైపోయేలా,ఈరోజుకీకనిపిస్తాయి.ఆయుధాలతో,నిలబడ్డవాళ్ళెవ్వరికీవొంటిమీదరెండోవస్త్రంఏదీలేదు.వాళ్ళమెడలోహారాలుమాత్రమేకనిపిస్తాయి.చెట్టునరకాలనిముందుకువస్తున్నఅతని,ముంజేతులమీదకంకణాలు,మురుగులుకనబడతాయి.అతనివక్షస్థలంచుట్టూమరొకవస్త్రం(కంచుకంఅనొచ్చేమో..)అతనుమిగిలినవారందరికీఏలికఅన్నభావాన్నికలగచేస్తుంది.

(అలాఅంతతేడాగాకనిపించినా,కనిపిస్తే.వాటిగురించిఏఆలోచనాఈనాటికీ,రానికళింగులని,చూసిన,ఆఅసామాన్యకౌశల్యాపూరితుడైనచిత్రకారుడిఆత్మఅనేదేదైనా,ఇంకాఉంటే..దానిబాధకికొలతఉంటుందా..?)


ఈ రాతి పలక మీద పదిచేతులున్న చండికాదేవి శిల్పం కూడా దానంత పాతదే కనిపిస్తుంది.ఆ మూర్తి చేతుల్లో వున్న వస్తువులను సింహాసనారూఢ అయిన ఆ ప్రసన్న వదనాన్ని చూస్తే ఆమె కాళికా దేవా..? లేకపొతే జైన మత 'చక్రేశ్వరీ'దేవా..అన్నఅనుమానంకూడాకలుగుతుంది.




5.ముఖమంటపంగోపురాన్నిచూస్తే,ఆగొపురం4పలకలమీదపైకిలేచికనబడుతుంది.ఆపలకలనే,ఆగమశాస్త్రంలో'భూమికలు'అంటారు.ఈనాలుగుపలకలమీదాఅందమైనచిత్రాలుచెక్కబడిఉన్నాయి.

6.మొదటిపలకమీదఆరుహంసలు,వాటిలోరెండేసిహంసలమధ్య,ఒకపదహారురేకులకమలం,చెక్కబడిఉన్నాయి.దానిమీదున్నపలకమీదఇరువురుమల్లయోధులుద్వంద్వయుధ్ధంచేస్తూకనిపిస్తారు.వాళ్ళచుట్టూజనసమూహం,కొంచెందూరంలో,ఎడమవైపురాజు,రాణి,కూర్చునిఉన్నట్టు,వాళ్ళకిఇద్దరుసేవకులుయుధ్ధంగురించివివరిస్తున్నట్టు,రాజుతనచెవినిచెపుతున్నవానిమాటలపైకెంద్రీకరించినట్టు,స్పష్టంగాఅర్థమవుతుంది.రాణీకిఎడమవైపుఅంతఃపురస్త్రీలు,వాళ్ళపాదాలదగ్గర,సేవికలుసుఖంగాకూర్చున్నట్టు,కనిపిస్తుంది.మల్లయోధులున్నప్రాంతానికికుడివైపు,జనసమూహానికిపైనబ్రాహ్మణసమూహంకూర్చున్నట్తు,వాళ్ళముందుయేనుగులుతలపడుతున్నట్టుకనబడుతుంది.అనుభవపండితులు,చెప్పినమేరఆయుధ్ధం,శ్రీక్రిష్ణ,చాణూరుల...మల్లయుధ్ధమనీ..చూస్తున్నరాజు'కంసుడ'నీ,యేనుగులకాళ్ళదగ్గిర,కనిపిస్తున్నదిబాలక్రిష్ణుడనీఊహించాలి.

ఇందులో...ఆశ్చర్యంకలిగించేదేమిటంటే,అయిదారుగజాలపొడవు,అడుగున్నరకిమించివెడల్పువుండని,ఆపలకమీద,ఈవివరాలన్నీచెక్కడంలోశిల్పిచూపించినచాతుర్యం..ఆనైపుణ్యాన్నివేయినోళ్ళతోపొగిడితీరాల్సిందే..సూక్ష్మంగాబొమ్మలుచెక్కడమేకాదు..జనసందోహం,హావభావాలనికూడావేలఏళ్ళపాటునిలిచిపోయేలా,స్పష్టంగాచెక్కినఆఅపరమయుడికితలవొంచినమస్కరించాల్సిందే.

7.అంతకన్నాపరమానందాన్నీ,నిబిడాశ్చర్యాన్నీకలిగించేశిల్పం,ఆపైనున్నపలకమీదకనిపిస్తుంది.ఇందులోతనపేరు,ఎవరికీచెప్పాలనేఆలోచన,తనరూపుఅందరికీతెలియాలనే,కోరికఅసలెంతమాత్రంలేని,ఆశిల్పశేముషి,రాజువేటాడేవిధానాన్నిరూపుకట్టించేడు.వేగంగాపరుగెడుతున్నగుర్రాలనీ,విల్లునుచెవిదాకాలాగిజంతువుమీద,తనలక్ష్యాన్నిగురిచూస్తున్నరాజుని,ఇతరవేటగాళ్ళనివివరంగాచూడగలం.అంతేకాదు.ఆవేటగాళ్ళవెనకసంహరింపబడినజంతువులనుకర్రలకివేలాడదీసుకుని.వాటినిమోసుకువెళుతున్నసేవకులూకనబడతారు.వాళ్ళవెనకతప్పెటలువాయించేవాళ్ళు,మద్దెలవాయించేవాళ్ళుతమవాయిద్యాలకిపనిచెపుతూకనిపిస్తారు.బూరలుఊదేవాళ్ళు,శ్రుంగనాదాలుచేసేవాళ్ళూకనిపిస్తారు.వాళ్ళవెనుకకొందరుమ్రుగాలనుమోసుకువెళుతుంటే,కొందరుఆయుధాలనుపట్టుకునిపరుగెడుతున్నారు.కొందరుఆశ్వికులు,బల్లేలనుపట్టుకుని,గుర్రాలనునడిపించుకుంటూవెళుతున్నారు.ఈశిల్పంలోనేఎడమవైపుసగభాగంలోవేటకుఉద్దేశించినమ్రుగాలుమరికొన్నిపరుగులుతీస్తున్నట్టూ,వాటికిముందూ,వెనుకాఆశ్వికులు,వేటగాళ్ళుఆయుధాలుధరించిపరుగుపెడుతున్నట్టుకనిపిస్తుంది.రాజులమ్రుగయావినోదాన్నిజీవంఉట్టిపడేలా...ఇంతఅందంగా,చిత్రీకరించినశిల్పంమరెక్కడాకనబడదు..ఇదిఒకపురాణగాధగానీ,చారిత్రకఅంశంగానీకానేకాదు.ఒకసామాజికఅంశంమాత్రమే..ఆరోజుల్లోఇలాచిత్రీకరించాలనుకున్నశిల్పిగొప్పతనాన్నిగానీ,ఆపనికిఅతన్నిపురికొల్పినరాజుకళాభిరుచినిగానీ,ఏఇజంఅనిచెప్పాలి,దీనిమీదద్రుష్టిఎవరూ..ఏనాడూ..ఎందుకుపెట్టరు..కళింగ శిల్పమనా..?

8.ఇంక,ఆఖరిపలకనిచూస్తే,'యేనుగులవేట',అందులోచిత్రితమైఉంది.ఇదికళింగరాజులకు,తర్వాతికాలంలోని,గజపతులకుఎంతోఇష్టమైన'గజవేట'.ఈపలక,ఎడమభాగంలోఒకవేదికమీదతనచుట్టూచేరినసేవకులు,ఖడ్గహస్తులు,ధనుర్విద్యానిపుణులు,పరిచారకులుమధ్యఒకకులీనపురుషుడుకనిపిస్తాడు.......వాళ్ళముందుమచ్చిక,అయిఉన్నయేనుగులమీదకూర్చున్నమావటివాళ్ళు,యేనుగులవేటజరుపుతున్నారు.వాళ్ళముందుతాళ్ళతో,బంధింపబడ్డఅడవియేనుగులు పారిపోవాలని ప్రయత్నిస్తున్నట్టు ఈ శిల్పంలో కనిపిస్తుంది.

కొంచెంముందుకువెళితే,ఆరుస్థంభాలతోఉన్నముఖమంటపంఉంటుంది.ఈస్తంభాలపై శిల్పాలు లేవుగానీ చాలా శాసనాలు చెక్కబడి ఉన్నాయి.ప్రతీఏడూ వీటిమీద సున్నం పూతలు పూస్తూ ఉండటం వల్ల వాటి ఉనికి చాలావరకూ పోయింది.కొన్ని వైష్ణవ శిలావిగ్రహాలు ఎక్కడనుండో తెచ్చి ఉంచినట్లనిపించేవి కనిపిస్తాయి..ఒక శాసనంలో ఈ ప్రాంతంలో ఉన్న వైష్ణవ దేవాలయం ప్రస్తావన ఉంది..కానీ ఆ దేవాలయం ఇప్పుడెక్కడాలేదు. ఇక్కడ ఉన్న శిల్పాలు ఆ దేవాలయం తాలూకావి అయిఉండవచ్చు.అవి త్రివిక్రమావతారమూర్తి,దానికి కుడివైపున వరాహమూర్తి.ఆ విగ్రహం కింద అమరావతి లోకనిపించే నాగకన్యల విగ్రహాలవంటి ఇద్దరు నాగకన్యలు.ఈ విగ్రహాల నడుము నుండి పైవరకు మనుష్య రూపం తలవెనక పాము పడగ, నడుము కింది భాగమంతా సర్పశరీరము కనబడతాయి. ఇందులో ఒక నాగకన్య చేతిలో తామర పద్మం ఉంది.దాని మీద వరాహమూర్తి ఎడమ పాదం ఆన్చి ఉంది. రెండవ నాగకన్య తనరెండుచేతులతో,ఆమూర్తి కుడికాలును పట్టుకున్నట్టు కనిపిస్తుంది.ఇక్కడ వరాహమూర్తి విగ్రహరూపానికీ, దక్షిణాది దేవాలయాలలో కనిపించే రూపానికీ చాలా తేడా కనిపిస్తుంది.ఈ మూర్తికి నాలుగు చేతులు ఉంటాయి.పై రెండు చేతుల్తోఈమూర్తిభూమినిగట్టిగాపట్టుకున్నట్టుఉంటుంది.మిగిలినరెండుచేతులలో,కుడిదానితోచక్రాన్నీ,ఎడమదానితో,శంఖాన్నీపట్టుకున్నట్టుకనిపిస్తుంది.వరాహమూర్తివిగ్రహంవెనకసూర్యనారాయణుడిరూపం ఉంది.ఆరూపం తలవెనక తేజోవంతమైనకాంతి పుంజం కనబడుతుంది.రెండుచేతులలో,రెండు దీపాలు ఉంటాయి.(ఎరుపు తెలుపు దీపాలనే అనుకోవాలి.)

9.సూర్యదేవుడివిగ్రహానికి,కుడిపక్కనగరుడనారాయణుడివిగ్రహంఉంది.ఈముఖమంటపంలోనే,మరోపక్కఅత్యంతమనోహరమైన,వేరెక్కడా,కనిపించనటవంటి,'సౌభాగ్యవాగీశ్వరీ'విగ్రహంకనిపిస్తుంది.దానిగురించిస్థానికులు.....ఆవిగ్రహంముందునుండీఅక్కడున్నదికాదనీ,ఊరిచివరనున్నపొలాన్నిదున్నుతున్నప్పుడుదొరికిందనీఅప్పుడుతెచ్చిఅక్కడపెట్టేరనీచెపుతారు.సుందరమైనమోముతో,మందస్మితాలైనపెదవులతో,నిమీలితాలైననేత్రాలతో,ముగ్ధమోహనంగాకనిపించేఈవాగ్దేవినిచూసినవారిమనసులు,నేత్రాలూభక్తితోనిండిపోతాయి.ఈమాతవిగ్రహంలో,కొన్నిశైవలక్షణాలూకనిపిస్తాయి.ఆమెజడశివుడిజటాజూటంలాచెక్కిఉంటుంది.దానికిఎడమవైపుచంద్రకళఉంటుంది.సుఖాసీనఅయినఆమెముందున్నరెండుచేతులతోవీణనిపలికిస్తున్నట్టుకనబడుతుంది.వెనుకవున్నఒకచేతిలోపుస్తకంకనబడుతుంది.రెండవచేతిలోకమలంకనబడుతుంది.ఈశిల్పాన్నిచెక్కినశిల్పిపనితనం,మనకిఎనలేనిఆశ్చర్యాన్నికలిగిస్తుంది.నిత్యపూజలందుకున్నకాలంలోఆదేవి,వైభోగంఎంతగొప్పగా ఉండెదోనన్న భావం మనలో కదలాడుతుంది.

*ఈపోష్టులోపేర్కొన్నశిల్పాలలోకొన్నికనబడవు..కొన్నిభక్తులుభక్తిఎక్కువైపూసినదట్టమైనపసుపుకుంకుమలవల్లరంగు,రూపాన్నికోల్పోయేయి.మహానుభావులు'మహారాజశ్రీభావరాజువేంకటక్రిష్ణారావు'గారు,సందర్శించినపుడు(సుమారునూరుసంవత్సరములకిందటిమాట)ఆయనవెల్లడించినవిషయాలనుమాత్రమే,నేనుఇక్కడతెలియజేయడంజరిగింది.వారి స్ఫూర్తికి,నామనఃపూర్వ క వందనాలు.


(మధుకేశ్వరస్వామిగురించి..మరికొన్నిఇతరఆలయాలలోనిశిల్పాలగురించీ..తర్వాత పోష్టులో..)







17, మే 2015, ఆదివారం

"కనగ కళింగదేశమున కాలిడుటెంతయు దోషమన్న..."


చ. కనగ కళింగదేశమున కాలిడుటెంతయు దోషమన్న* నిం
    దను దొలగించుకొంటివి పినాకి మతంబున సింహభూధరం
    బును ముఖ లింగ కూర్మములు మున్నగుచోటశివాలయంబులన్
    బొనరిచి,పుణ్యభూమివయి పొల్చితి గాంగులచే గళింగమా.!

             (*క్రీ.పూ 3వ శతాబ్ది ప్రాంతంలో 'బొధాయనుడ'న్నమాట.)



చ. మొదట దయారసంబెసగు బుధ్ధుని శాంతమతంబు గ్రోలియున్
    పదపడి నీవు వీరరస భాసుర శైవ మతంబు పూని తూ
    ర్పుదెస గలట్టిదీవులను ముట్టితి వెంతయు ధైర్యశాలివై
    యెదిగితి చోళగంగ విభులేలిన కాలమునంకళింగమా..!





ఈ పైన పేర్కొన్న రెండు పద్యాలూ ఈనాటి వారి తాత,ముత్తాతల కాలం లో గొప్ప వేదపండితుడిగా పేరు పొందిన బ్రహ్మశ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు వంద ఏళ్లక్రితం తన కళింగ రాజ్య వర్ణనలో రాసినవి.ఇవి క్లిష్టమైన సంస్క్రుత సమాస బంధురాలు కావు కనుక వీటి ప్రతిపదార్ధ తాత్పర్యాల జోలికి నేను వెళ్ళాలనుకోవటంలేదు.


ఒక గొప్ప చరిత్ర కారుడు చెప్పిన ఇంగ్లీషు భాషలో ఉన్న మాటను తెలుగులోకి తర్జుమా చేస్తే కిందివిధంగా ఉంటుంది.
"ఒక మనిషిని హత్య చెయ్యడం హంతకులకి కష్టసాధ్యమైన పనే..ఇంకా అవే చేతులతో,అతడి తోటలోనే అతణ్ణి పాతిపెట్టడం అన్నది.. ఇంకా కష్ట సాధ్యం. ఆహత్య చేయబడ్డవాడు, తన ఇంట్లోకి.. తనే స్వయంగా నడిచివస్తే,జరిగిన సంగతులు చెపితే...ఆహత్య చేయడంలో హంతకులందరూ విఫలమైనట్టే...."
ఇక్కడహత్యచేయబడ్డది...'కళింగరాజ్యచరిత్ర'అన్నదేనాభావన.....అదే...సాక్ష్యాలు, ఆధారాలు నా ప్రయత్నాలమేరకు సంతరించగలిగిన వాటినన్నిటినీ కూడదీసి, కళింగదేశచరిత్ర సమూలంగా చెప్పాలనుకోవడం వెనుక ఉన్న నా ఆ లోచన..ఇప్పుడెవరూ పెద్దగా పట్టించుకోని"ముఖలింగ క్షేత్రం చరిత్ర" కళింగ రాజ్య చరిత్ర కి జరిగిన హత్యకు సాక్షీభూతం గా నిలుస్తుంది.  
ఇక్కడకళింగదేశచరిత్ర,చెప్పడంలోజరిగినసంగతులుఏవిముందు..ఏవి..వెనుక..అన్నది,నాపరంగాప్రధానంకాదు.మొదటనుంచీజరిగినవీ,ఇప్పుడుజరుగుతున్నవీ,కూడాఅన్యాయాలేఅయినప్పుడు,అవుతున్నప్పుడు.నేటికళింగవాసులెప్పుడూ,నిద్రపోవటమేఇష్టమైన,సింహాలుగాఎన్నితరాలక్రితమో..ఎప్పుడోమారిపోయి,ఇంకానిద్రలోనేనిండాములిగిపోయి,బొమ్మసింహాలుగానే మిగిలిపోయి ఉన్నప్పుడు,వెనకా...ముందా...అన్నది,ప్రధానంగానిలబడదుకూడా..జరిగినవా.జరగనివా...అన్నదేప్రధానం.గతించినవ్యక్తుల,ప్రాంతాలదురాగతాలుచెప్పడమంటే.....ఆవ్యక్తులని,ప్రాంతాలని,అవమానపరచాలనే,లక్ష్యంతోమాత్రం కాదు అని నా మనవి.




ముఖలింగ గ్రామం చాలా పురాతనమైనదని ఒకానొక కాలంలో ఇది గాంగ వంశ రాజుల రాజధాని కళింగ నగరంలో అంతర్భాగమే నని చెప్పడానికి సందేహమేమీ అవసరమే లేదు.అక్కడ ఇప్పుడున్న దేవాలయాల మీది శాసనాలుచాలు.


ఇంకా,నేడుఘనమైపోయిననాటిఘనచరిత్రతెలియాలంటే,ఇతరరాష్ట్రాలఆర్కియాలజీశాఖల్లోఎవరూపట్టించుకోకుండామూలపారేసినశిల్పాలు,శాసనాలు,ఇతరదేశాలమ్యూజియంలలోకొలువుచేస్తున్న,భారతదేశపురాతన,వస్తుసంపదాతప్పకుండాచెపుతాయి.ఆవిషయంమీద,పరిశీలనాసక్తి,పరిశోధనాకాంక్షఉన్న వ్యక్తులు వెతికి చూస్తే చాలు..అది నెరవేరడం కూడా  చాలా కష్టమైన.. ఒక చాలా పెద్ద ఆశ.


వంశధారానది,ఒకప్పుడుప్రస్తుతగ్రామానికిఇరుపక్కలాప్రవహిస్తూఉండేదనడానికి,ప్రబలతార్కాణాలుకనబడతాయి.ముఖలింగానికితూర్పుగావున్నకరకవలస గ్రామానికి చేరువలో ఉన్న పద్మనాభుని కొండనానుకుని కూడా ఈ నది,ప్రవహించేదని ఆకొండపాదాల జాడలని పరిశీలిస్తే ,స్పష్టంగా అర్ధమవు తుంది. పూర్వంకళింగ రాజ్యం అత్యంత వైభవోపేతంగా విలసిల్లేటప్పుడు రాజవంశీయులునౌకావిద్యనేర్వడానికి వంశధార నది ఉపయుక్తంగావుండెదని భావించేందుకు,అక్కడఓడలనిర్మాణంకూడాజరిగేదని,ఊహించేందుకుఊతంగా,చరిత్రలోనిలబడిన..రెండుగ్రామాలపేర్లుకనబడతాయి.ఒకప్పుడువాడవలస(ఓడలవలస),వాడపిల్లి(ఓడలపల్లి)అనేరెండుగ్రామాలుఒకదానికిమరొకటిఅరమైలుదూరంలోఉన్నట్టుగా,చరిత్రచెపుతుంది.ఇప్పుడుఆనౌకావ్యాపారవైభోగం,అంతరించిపోవటంచేత,వాడవలసగ్రామంకూడాకనుమరుగైపోయింది.వాడపిల్లి మాత్రమే కనబడుతుంది.


వంశధారనది,ఒడ్డునప్రాచీనముఖలింగనగరకోటఉండేదని,బలంగాచెప్పవచ్చు.అందుకుప్రస్తుతంమట్టిదిబ్బలయిపోయినఆధారాలుమౌనంగాఆసంగతిచెపుతూఉంటాయి.బ్రహ్మశ్రీగిడుగురామమూర్తిపంతులుగారుతానుతనచిన్నతనంలో,చూసినప్పుడుకోటగోడలజాడలు,స్పష్టంగాకనిపించేవనిశ్రీభావరాజువేంకటక్రిష్ణారావుగారితోచెప్పినట్టుఆయనరాసేరు.ముఖలింగంలోచూడవలసినఎన్నోచారిత్రకవిశేషాలు,చరిత్రపుస్తకాలప్రకారంఉన్నాయిగానీ,అవిశిధిలాలుగామారిపోవటంచేతా,మట్టిలోకూరుకుపోవటంవల్లా,సామాన్యులకి,కళింగరాజ్యచరిత్రగానీ,అందులోముఖలింగనగరానికిఉన్నప్రాముఖ్యతగానీఅవగతంచేసుకునేఅవకాశం అసలెంతమాత్రం లేకుండా పోయింది.


 'అమరావతి'మీదపాలకులకున్నఆసక్తి,అభిరుచి,ముఖలింగంమీద,కొద్దిపాటిగా అన్నా ఉంటే ఆ స్థల చరిత్ర సిరాతో రాసిన దానిగా మిగిలిపోదు. అందరికీ ఆ నగరం ఎంతో ప్రాచీనతను కలిగి ఉన్నదానిగా చెప్పేటందుకు మూడు దేవాలయాలుమాత్రమేనిలిచిఉన్నాయి.అవిముఖలింగేశ్వరాలయము,సోమేశ్వరాలయము(అణ్యాంక)భీమేశ్వరాలయము.వీటిలోఒక్కశ్రీముఖలింగేశ్వరాలయం తప్ప మిగిలిన రెండూ గుర్తులుగా నిలబడి ఉన్నవి మాత్రమే.ఈ ప్రాంతం చరిత్రకారులు అకుంఠిత దీక్షతో గతకాలపు స్మ్రుతులను పైకి తియ్యాలన్న నిర్దిష్ట లక్ష్యంతో, నిరంతర తలంపు తో ప్రయత్నిస్తే, కళింగ వాసులకు తమ ప్రాంతంమీదఅంతులేనిప్రేమనీ,ఇతర ప్రాంతాలవాసుల కి తమ ప్రాంతాలకన్నా ఎంతోమిన్నగా,ఎంతకాలం కిందటో ఖ్యాతిగాంచిన దీ ప్రాంతమని తెలిసి గగుర్పాటు చెంది ఆదరం తో అభిమానంతో అక్కున చెర్చుకొనేలా చేసే చరిత్రను చెప్పగలవీ దేవాలయాలు.




శ్రీముఖలింగేశ్వరాలయం


శ్రీముఖలింగేశ్వరాలయం క్షేత్రపురాణం:



ముందు,ముఖలింగేశ్వరాలయంక్షేత్రపురాణంగురించికొంచెతెలుసుకోవలసినఅవసరంఉంది.ఆకథలోకివస్తే..ద్వాపరయుగంలోవంశధారనదివొడ్డునవామదేవుడనే,తపోధనుడైనరుషి,ఒకయాగాన్నినిర్వహించాలనుకున్నాడు.ఆయాగానికిఆరుషి,దేవతలనీ,గంధర్వులనీ,యక్షులనీ,కిన్నరులనీ,కింపురుషులనీ,సిధ్ధులనీ,సాధ్యులనీఅందరినీఆహ్వానించేడు.ఆయనఆశ్రమానికితూర్పుదిక్కుగామధూకవ్రుక్షాలతో(ఇప్పచెట్లు)కూడినమహారణ్యంఉండేది.అందులోకిరాతజాతిప్రజలుజీవిస్తూఉండేవారు.అప్పట్లోనాగరికతఅంతగా,తెలీనిఆజాతిప్రజలు దిగంబరంగానేఉండేవారు.ఆరుషిపిలిచినయాగానికివచ్చినగంధర్వపురుషులుమధూకఅరణ్యంలోవిలాసంగాతిరుగుతూదిగంబరంగాకనిపించినకిరాతజాతిస్త్రీలసౌందర్యానికిపరవశులైతామువచ్చినపనినేమరిచిపోయేరు....తనుచేస్తున్నయాగంపూర్తిఅయ్యేక,హాజరైనవారికిహవిస్సులను,పంచేసందర్భంగావామదేవరుషిగంధర్వులను,పిలిచినప్పుడు,కిరాతస్త్రీలనుకూడి,ఉన్నందునగంధర్వులుఎవరూ,వాటినిఅందుకునేందుకురాలేదు.తనతపోద్రుష్టితోచూసివిషయాన్నితెలుసుకున్నవామదేవరుషికుపితుడై,ఆగంధర్వులందరినీ,కిరాతులై,పొమ్మనిశపించేడు.ఆసంగతినారదమునీంద్రుడిద్వారావారికితెలిసి,భయంతోఆమునిపాదాలమీదవాలితమనిక్షమించమనివేడుకున్నారు.వాళ్ళపశ్చాత్తాపానికి,రుషిప్రసన్నుడై,ద్వాపరయుగాంతంలో,ఆప్రాంతంలోశివుడుమధుకేశ్వరస్వామిగావెలుస్తాడనిఆశివలింగదర్శనాన్నిపొందినవెంటనేగంధర్వులకు శాపవిమోచనం జరుగుతుందనీ  వాళ్ళ కి వరాన్ని ప్రసాదించేడు.


  ఆ శాపవశులైన గంధర్వులు కిరాతులై జన్మించేరు.వాళ్ళ నాయకుడిగా చిత్రసేనుడు ఉండేవాడు.ఆ మధూక వనంలో సంవత్సరం పొడవునా ఇప్పపూలు పూసే చెట్టు ఒకటి ఒక పుట్టమీద పెరిగింది.దానికి రెండు కొమ్మలు మాత్రమే ఉండేవి.నిరంతరం పూలతో వాటి వాసనలతో ఆ ప్రాంతంఅంతా నిండిఉండేది. ఆ చెట్టును చిత్రసేనుడు తన రాణీకి ఇచ్చేడు.ఆమె ప్రతీ దినం ఆ చెట్టు పూలను కోసుకుని వంశధార నదికి అవతలి పక్కన ఉన్న సుమంతపురానికి పోయి అక్కడి షావుకారు సుమంతుడికి వాటిని అమ్మి అతడిచ్చే ధనంతో వంటకి అవసరమైన వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుని వాటితోభోజనాన్ని తయారుచేసి తన భర్తకీ మిగిలిన వాళ్ళ కీ పెట్టి, తాను తినేది.


అలా కొంతకాలం గడిచేక శ్రీశైల ప్రాంతంనుండి ఒక జంగమ కులస్త్రీ కాశీ యాత్రకని బయలుదేరి తోవతప్పి మధూక అరణ్యానికి చేరుకుంది.ఆ అడవిని చూసి భయపడి అక్కడే చిత్రసేనుడు రాజుగా ఉన్న కిరాతపల్లె కి పోయి ఆశ్రయంఅడిగింది.ఆమెనిరుపమానమైనఅందాన్నిచూసినచిత్రసేనుడు మోహ పరవశుడై,ఆమెకి అన్ని సౌకర్యాలనీ కల్పించేడు.ఆ మరుసటి దినం అతడు ఆమె మీద తన చిత్తభ్రమలను తొలగించుకుని ఆమె యోగ క్షేమాలను కనుక్కునిఆమెనుకాశీవిశ్వేశ్వరసందర్శనానికిమార్గాన్నితెలియచేసేడు.అయితే చిత్రంగా అతడి రూపురేఖలకి తన మనస్సు చలించి పోయిన ఆమె తనకి కాశీ ప్రయాణం మీద కోరిక మరిలేదనీ,అతనున్న ప్రాంతమే తనకి కాశీ తో సమానమనీ చెప్పి తనని పెళ్ళి చేసుకోమని కోరింది.ముందునుండే ఆ కోరిక తనలో ఉన్నందున అతడు ఆమెను తన రెండో భార్యగా చేసుకున్నాడు.తరువాత చిత్రసేనుడు తన రెండవ భార్యకు వేరే నివాసాన్ని ఏర్పాటుచేసి పెద్దభార్యతోచెప్పి పుట్ట మీదున్న మధూక చెట్టు రెండు శాఖలనూ వాళ్ళిద్దరికీ పంచి ఇచ్చి ఆ పూలను అమ్ముకుని ఎవరి సంసారాన్ని వాళ్ళు నడుపుకోమని చెప్పేడు. తాను ఒకరోజు పెద్దభార్యతో మరోరోజు రెండో భార్యతో గడిపేలా ఏర్పాటు చేసుకున్నాడు..ప్రతీరోజూ ఉదయాన్నే అతని భార్యలిద్దరూ నిద్రలేచి ఆ చెట్టు దగ్గరకి వెళ్ళి తమ కొమ్మలకింద రాలి పడిన ఇప్పపువ్వులను ఏరుకుని తీసుకుపోయి సుమంతుడికి అమ్మి తమకి కావలసిన దినుసులు తెచ్చుకుని తమ జీవితాలని ఆ నందంగానే  సాగించేరు.అయితే అతడి రెండో భార్య అయిన జంగమస్త్రీ,శివభక్తురాలు కనుక ప్రతీరోజూ ఉదయాన్నే వంశధార నదీ స్నానం చేసి, కొన్ని నీళ్ళని తీసుకుని,మధూక చెట్టు దగ్గరకి పోయి ఆ పుట్టని పార్వతీపతిగా భావించి అభిషేకించి,పూజలుచేసి,ఆ పుట్టచుట్టూప్రదక్షిణలు చేసి పూలను ఏరుకునేది. అయితే ఆమె పూజలకు ప్రీతిపాత్రుడైన ఉబ్బులింగడు ఎంతో కరుణతో, ఆమె భర్త ఆమెకి ఇచ్చిన మధూక శాఖ నుండి ఇప్పపూలు కాకుండా బంగారుపూలు రాలేలా అనుగ్రహించేడు..ఆ బంగారు పుష్పాలను ఆమె సుమంతుడికి అమ్మి ఎంతో విలువైన ఆహార పదార్ధాలనీ,ఇతర వస్తువులనీ కొని తెచ్చి, భర్తకి చాలా ప్రీతికలిగించే భక్ష్యాలనీ,భోజనాలనీ ఏర్పాటు చేసేది.ఈ విషయం పెద్ద భార్యకి నచ్చలేదు.భర్తతో దెబ్బలాడి అతడు తనకిచ్చిన కొమ్మను సవతికిచ్చేలా బంగారు పూలనిచ్చే సవతి, కొమ్మని తనకిమార్చేలా చేసింది.కానీ ఏంలాభం.?చిత్రసేనుడి భార్యలిద్దరి మధూక కొమ్మలు ఒకరిదొకరికి మారడం మాత్రమే కాదు రాలే బంగారు పూలు కూడా తమ కొమ్మలని మార్చేసుకున్నాయి..శివలీలలు చిన్నవేమీ కావు కదా..!. తన పన్నాగం పారకపోయేసరికి ఆ రాజు పెద్దభార్య కోపం పట్టలేక, ప్రతీరోజూ తన సవతితో దెబ్బలాటలు పెట్టుకునేది.పొద్దున్న అడవిలోకి వేటకి పోయి చిత్రసేనుడు .సాయంత్రం ఇంటికి వచ్చేసరకి ఇద్దరు భార్యల తగవులతో అతడికి ఇల్లు రణరంగంగా మారిపోతూ ఉండేది.అతడు వాళ్ళ తగవులు తీర్చలేక, ఈ గొడవలన్నిటికీ కారణం ఆ మధూక చెట్టు కనుక, దాన్ని లేకుండా చేస్తే ఈ గొడవలన్నీ లేకుండా పోతాయని భావించి ,పెద్ద భార్య చాలా సంతోషంగా ఆ పనికి ఒప్పుకోవటం వల్ల, చిన్నభార్య ఎంతగా, బ్రతి మాలినా కూడా, వినకుండా ఆ చెట్టుని మొదలంటా నరికేసేడు.ఆ చెట్టుని అతను నరికేసరికల్లా పుట్టలోనుండి అగ్నిజ్వాల ఒక్కసారిగా పైకి లేచింది.దాన్ని చూడగానే తాను తప్పు చేసినట్టు తెలిసిన, చిత్ర సేనుడు కిందపడి మూర్ఛ పోయేడు.ఆతని పెద్దభార్య ఎక్కడినుండో వచ్చిన తన సవితి మంత్రగత్తె అనీ మాయలాడి అనీ, ఆమే తన భర్త చావుకి కారణమైందనీ ఆ మెనుచంపాలనీ,పెద్దగా కేకలు పెడుతూ గట్టిగా ఏడ్వటం మొదలుపెట్టింది.ఇది చూసి మిగిలిన కిరాత జాతి వారంతా చిత్రసేనుడి రెండో భార్యని చంపడానికి కత్తులు గొడ్డళ్ళూ పట్టుకుని వచ్చేరు.అయితే ఆమె నిర్భీతితో పరమశివుణ్ణి ప్రార్ధించింది. అప్పుడు జడముడి జంగం దేవర తన ప్రమధ గణంతో సహా నరకబడ్డమధూకచెట్టుమొదట,కిరాతజాతికందరికీప్రత్యక్షమయ్యేడు.కిరాతులందరూ చిత్రసేనుడితో సహా వామదేవ రుషి శాప విముక్తులై గంధ ర్వులయ్యేరు.శివుణ్ణి స్తుతించేరు.


అలా మధూక చెట్టు నుంచి ప్రత్యక్షమైన శివుడు మధుకరేశ్వరుడయ్యేడు..ఆ మూర్తినే ఇప్పుడు ముఖలింగేశ్వరుడని పిలుస్తున్నారు.అంతేకాకుండా జయంతీశ్వరుడనీ,గోకర్ణేశ్వరుడనికూడానామాంతరాలున్నట్టుచరిత్రచెపుతుంది.ఈ ఆలయం గోడలమీదఉన్న ప్రాచీన శాసనాలన్నిటిలోనూ ఇతర ఇతిహాసాల్లోనూకూడామధుకేశ్వరుడనే,పేరు మాత్రమే కనిపిస్తుంది.  ముఖ లింగేశ్వరుడన్న పేరు కనిపించదు.ఈ పేరు నేటిఆధునిక కాలం లో వచ్చిన పేరు మాత్రమే.


 ...ప్రస్తుతం మనకి ఈ మధుకేశ్వరస్వామి దైవ దర్శనానికి అవకాశం కలిగిస్తున్న ఈ దేవాలయాన్ని గాంగ వంశ రాజైన రెండవ కామార్ణదేవుడు, క్రీ.శ.10వ శతాబ్దం మధ్యకాలంలో నిర్మించినట్టు, కొర్ని గ్రామ శాసనం చెపితే, విశాఖపట్టణానికిచెందిన,అనంతవర్మశాసనంకూడా అదే విషయాన్నిస్పష్టంగా చెపుతుంది.రెండవ కామార్ణవుడు 'తిరస్క్రుత త్రివిష్టపమ'నే పెద్ద నగరాన్ని నిర్మించి అందులో మధుకేశ్వరుడుకి పెద్ద ఆలయాన్ని నిర్మించినట్టు కూడా  ప్రాచీన శాసనమొకటి స్పష్టం గా చెపుతుంది.ముఖలింగాలయంలోని అన్ని శాసనాల్లోనూ ఆ ఊరి పేరు, 'కళింగావని నగరం','త్రిగళింగావని నగరం','కళింగనగరం' అనే కానీ ముఖలింగమన్నపేరు రాసిలేదు.ఈ ఆధునిక కాలంలోనే మధుకేశ్వర లింగం, మధుకలింగం పేర్లనుండికానీ,ఉత్కళ భాషా ప్రభావం వల్లకానీ అది ముఖలింగంగా మారి పోయి ఉండవచ్చు.

( ఈ దివ్య దేవాలయం శాసన ఆధారాల గురించీ, చారిత్రక విశేషాలు,శిల్ప విశేషాల గురించీ తర్వాత పోష్టులలో..)