కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

18, ఏప్రిల్ 2015, శనివారం

కళింగ సీమ ఖచిత నవరత్న లేమ'


'కళింగ సీమ ఖచిత నవరత్న లేమ' 


సీ.ఈ చోట తొలినాడు  ప్రాచీసతీముఖాబ్జ
            మున నెఱ్ఱ కుంకుమబొట్టు దిద్ది
ఈ నేలను కళింగ భూనాధ శౌర్యాన
         ల జ్వాల ధూమ నైల్యములు గ్రమ్మి
ఈ పవిత్ర ధరిత్రినోపి త్రైలింగ రా
               జ్య శ్రీ సుధా ప్రవర్షంబు గురిసి
కడగి ఇచ్చటి మంటిగడ్డలు సైతమ్ము
     నవమ్రుగీ మద వాసనలు విదిర్చి

వేంగి విషయేశ చాళుక్య విభులతోడ
మనసులో నన్నదమ్ములదనము కలిపి
మునుపిచటి తెలుగు రాణించుకొనియె శౌర్య
లీల న్రుపలీల ఈ ముఖలింగ భూమి

గీ.ఆ దినాల యెంతటి నిశితానురాగ
మవు కళాశిల్పములను విద్యలను చూడ
పగటి వేసాల కొరకు తూర్పారబట్టె
ప్రాణములను కళింగ గంగ్రాజు వైరి.

అని జ్నాన పీఠ అవార్డు గ్రహీత పండిత విశ్వనాధ సత్యనారాయణ గారితో కీర్తించ బడ్డనేల.
ప్రాచీన కళింగ దేశములో కళాకన్య తన బంగారు గజ్జెల చప్పుడు దిగంతాల మేరకు వినబడేలా నర్తించింది.కళింగుల నౌక రత్నాకరంలో విజయ విహారం చేసింది.కళింగుల ఖడ్గం గోదావరి దగ్గర సాము చేసిగంగలో స్నానం చేసింది.ఈ నాడు కళింగ దీపం కాంతులు మలిగిపోయేయి. మళ్ళీ కళింగ కేకపెట్టి కళింగ జ్వాల ఎగసిపడేలా చేస్తే తప్పకుండా 'కళింగ సీమ ఖచిత నవరత్న లేమ' గా భాసిల్లుతుంది.అది కాళింగుల పరంగా సామాన్య ధర్మం అయితే,ఇతరులకి వీర ధర్మం అవుతుంది. 
"ఒకమనిషినిహత్యచెయ్యడంహంతకులకికష్టసాధ్యమైనపనే..ఇంకాఅవేచేతులతో,అతడితోటలోనేఅతణ్ణిపాతిపెట్టడంఅన్నది..ఇంకాకష్టసాధ్యం.ఆహత్యచేయబడ్డవాడుతనఇంట్లోకితనేస్వయంగానడిచివస్తే,జరిగినసంగతులుచెపితే....ఆహత్యచేయడంలోహంతకులందరూవిఫలమైనట్టే..అదే.సంగతిఈకళింగసీమ,కళింగజాతి,కళింగసంస్క్రుతినీ,నిర్ధూమధామంగా..చేయగలిగేమన్నసంతోషంలోఉన్న,అన్నిఇతరప్రాంతాలతెలుగునాయకులతోపాటు,ఈభారతదేశంలోనిఇతరరాష్ట్రాల,జాతులవారుకూడాతెలుసుకునితీరవలసినకాలం..చాలాదగ్గరకొచ్చిందనీ.ఈకళింగసీమవాసులుపెట్టే,కళింగసింహగర్జనవీళ్ళల్లోకంపంపుట్టించితీరుతుందనీ,ఉదయిస్తున్నకళింగసూర్యుడు..తనప్రకాశంతోతిరిగితేజరిల్లుతాడనీ..స్పష్టంగాతెలిసిపోతోంది.


 అత్యద్భుత తేజో పరాక్రమాలతో కళింగ దేశంలో నేటికీ గుర్తుగా మిగిలిపోయిన దేవాలయాల ని నిర్మించి కళింగ రాజ్య ప్రాభవాన్ని భూమి నాలుగు చెరుగులా తేజరిల్లేలా చేసిన గాంగ వంశీయుల బంగారుకాలాన్ని పక్కనపెట్టి తర్వాతి కాలంనాటిచరిత్రలోకిఅడుగుపెడితే.....
1336A.D.లోఇంగ్లాండునిEdwardIIIరాజ్యమేలుతూఉన్నప్పుడు,భారతదేశదక్షిణాదిలోరాజకీయంగాపెనుమార్పులుకలిగేయి.అయితేఆమార్పులకికారణంఅప్పటికిఇంకా,ఆంగ్లేయులుకాదు.అదివిజయనగరసామ్రాజ్యస్థాపన.అప్పటినుండేప్రాచీనరాజ్యవంశాలపాలనఅంతరించిపోయిఆధునికరాజ్యపాలనప్రారంభమైందనిస్థూలంగానిర్ణయించుకోవచ్చు.1312లోముబారక్ ఢిల్లీ నుంచి దేవ గిరి సైన్యంతో వచ్చి రాజు హరిపాల దేవుడి ని నరికి అతని తలని దేవగిరి గేటుకి వేళ్ళాడ దీసేడు.1323 లో వరంగల్లు కూలిపోయింది. 1330 నాటికి వింధ్య పర్వతాల అవతల ఉత్తర ప్రాంతమంతా ముస్లిం పాలనలో మణిగి పోయింది.క్రిష్ణా నదికి దక్షిణ ప్రాంతం అంతా హిందూ రాజుల చేతిలో ఉంది.1325 లో తుగ్లక్ ఢిల్లీ సింహాసనం అధిష్టించేక మొత్తం దేశ పరిస్థితి అంతా పూర్తిగా చెడి పోయిందనే చెప్పాలి.వరంగల్,ద్వారసముద్రం అప్పటికే ముస్లింలకి లొంగిపోయినప్పటికీ ఆనెగొంది లో ప్రారంభ మైన  విజయనగర సామ్రాజ్యం బాగా విస్తరించి 250 ఏళ్ళపాటు ఈ ప్రాంతంలో ముస్లింలని అడ్డుకుంది.

క్రీ.శ.1434లో కడపటి, గాంగ వంశరాజు,నాల్గవ భానుదేవుడు మరణించేక అతనిమంత్రి కళింగరాజ్య సింహాసనాన్నిఆక్రమించుకుని కపిలేశ్వరగజపతి పేరుతోకళింగ రాజ్యాన్ని పాలించడం ప్రారంభించేడు.ఇతడే గజపతి వంశానికి మూలపురుషుడు.ఇతని రాజధాని కటకము. ఈ రాజు కాలంలోనే కళింగరాజ్యం, దక్షిణాన క్రిష్ణానది వరకు ఉత్తరాన గంగాతీరం వరకూ, విస్తరించి సకలసంపదల తో విలసిల్లుతూ ఉండేది. ఈవిస్తారమైన కళింగరాజ్యాధిపతి ప్రతాపకపిలేశ్వరగజపతికీ,కర్ణాటక లోని విజయనగర రాజులకీ, శత్రుత్వం ఏర్పడింది..క్రీ.శ.1449లో అప్పుడు విజయనగర సామ్రాజ్యాన్ని ఏలుతున్న సంగమవంశ రాజు రెండవ దేవరాయలు మరణించేడు. దేవరాయల పుత్రుడైన మల్లికార్జునరాయలు,రాజయ్యేడు.కానీఅతడుఅంతసమర్ధుడుకాకపోవడంవల్ల విజయనగర సామ్రాజ్యానికి, ముప్పు ఏర్పడింది. తుంగభద్రకి ఉత్తరాన్నుంచి చంద్రధ్వజుడు తూర్పు తీరప్రాంత సామ్రాజ్యాధీశుడు గజపతి విజయనగర సామ్రాజ్యం మీద దండయాత్రకి సిధ్ధమయ్యేరు.

 ఆసమయాన్నికనిపెట్టి,గజపతిసైన్యాన్నిసమకూర్చుకునియుధ్ధానికివిజయనగరం బయల్దేరేడు. అగ్నిదేవుడికి వాయుదేవుడు తోడయ్యినట్టు అతనికి, బహమనీ సుల్తాను అల్లాఉద్దీను చేయి అందించేడు.కానీ వీరుభయులూ విద్యానగరాన్నిముట్టడించేటఫ్ఫటికి,మల్లికార్జునరాయలు యుధ్ధానికి సిధ్ధమై రణరంగం లో అనన్యసామాన్య పరాక్రమాన్ని చూపి గజపతినీ, అల్లాఉద్దీనునీ, ఓడించి పారద్రోలేడు. అయితే కళింగాధీశుడు ఈఅవమానాన్ని సహించలే క,వేచిఉండి మరోసారి ప్రచండసైన్యంతో తన సేనాధిపతి గోపీనాధ మహాపాత్రుడితో వ్యూహరచన చేసి, దక్షిణదిగ్విజయయాత్రకి బయల్దేరేడు. ఈసారి విద్యానగరాన్నే కాదు ఇంకా ముందుకు కాంచీపురం వరకూ పోయి దాన్నీవశపరచుకున్నాడు.ఈదండయాత్ర వల్ల సాధించిన విజయాలు అతని కి"కర్ణాటకజయసింహుడు"అన్న బిరుదును తెచ్చిపెట్టేయి. ఈగెలుపుతో తన అవమానాగ్నినిచల్లార్చుకున్న,కపిలేశ్వరగజపతి వెంటనే కళింగరాజ్యానికి తిరిగివచ్చేడు. మొత్తం 'త్రిలింగదేశం' లేదా 'తెలింగానా' తమ రాజు ఏలుబడి లోకి వచ్చినందుకు, కాళింగులు పండుగలు జరుపుకున్నారు. అప్పటికే దక్షిణాది అంతా విస్తరించిన విజయనగర సామ్రాజ్యానికి సరైన పాలకులు లేకుండా పోయి కళింగరాజ్యానికి, లొంగిపోవలసివస్తే, ఓరుగల్లు నుండి రాజమహేంద్రి దాకా మహమ్మదీయ ప్రభువులైన బహమనీసుల్తానులకీ, పరిస్థితిఏమంతబాగాలేదు.చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయిన పాలెగాళ్ళు, ఏకమై తిరుగుబాట్లు చేయడం.. వాళ్ళ కి తలనొప్పిగా మారింది. అప్పటి కాలంలో ఒకప్పుడయితే విజయనగరసామ్రాజ్యం, కళింగరాజ్యాంతర్గతం అయి పోతుందేమోనన్నపరిస్థితికూడాఏర్పడింది.

కపిలేశ్వరగజపతి స్వర్గస్తుడయ్యేక, 1470 ప్రాంతాల్లో అతని కుమారుడు పురుషోత్తమ గజపతి రాజ్యాధీశుడయ్యేడు. బలశౌర్యాల్లో, అతడు కూడా తండ్రి అంతటి వాడే..ఆసంగతి ఒకసారి తన ప్రజలకు, పక్కరాజ్యాలకి చూపడానికి, అతడు,తన తండ్రిలాగానే విజయనగరం మీద, కాంచీపురం మీద దండెత్తి, జయించి కాళింగులకి తమ రాజు మీద బలమైన నమ్మకాన్ని కలిగించేడు.అతడు కాంచీపురాన్ని వశపర్చుకున్నపుడు పట్టుబడినవారిలో ఆరాజు,కుమార్తె కూడావుంది. పురుషోత్తమగజపతి, గౌరవంగాఆమెను, తనభార్యగా స్వీకరించేడు. గజపతుల ప్రారంభవైభవం పదిహేనవ శతాబ్దాంతం వరకూ ఎదురులేని దానిగా పరిఢవిల్లింది. ఆశతాబ్దాంతంలోనే పురుషోత్తమ గజపతి కుమారుడు ప్రతాపరుద్రగజపతి తండ్రి అనంతరం రాజ్యపాలన సాగిస్తున్న పుడు వంగ దేశ ప్రభువులైన మహమ్మదీయులు పూరీక్షేత్రం మీద దాడి చేసి, అక్కడ ఉన్నకొన్నిదేవాలయాలను కూడా ధ్వంసం చేసేరు.

     ఇంక విజయనగర సామ్రాజ్యం సంగతి చూస్తే అప్పుడు పాలకులైన సంగమ వంశపు రాజులు దుర్బలులూ విషయ లంపటులూ అవ్వడం వల్లా అప్పటికి రెండు సార్లు దండయాత్ర చేసిన కళింగ రాజ్యం గజపతుల చేతిలోకి గానీ,సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్న  యవనపతుల (మహమ్మదీ యుల) చేతిలోకి గానీ తమరాజ్యం పోతుందేమో నన్న భయంతో నే కాబోలు సాళువనరసింహరాయలు,సంగమవంశ రాజ్య సింహాసనాన్ని తానధిష్టించేడు. సరైన అవకాశంకోసం ఎదురుచూస్తున్న రాజ్యం తన చేతుల్లోకి రాగానే అతడు సైన్యాన్నిసమకూర్చుకుని,కళింగరాజ్యం పైన దండయాత్ర చేసి జయించేడు. పిల్లలమర్రిపినవీరభధ్రుడు తను రాసిన జైమినీ భారతాన్ని సాళ్వ నరసింహ రాయలకి అంకితమిస్తూ ఈ ప్రశంస చేశేడు.అలాసాళ్వ నరసింహ రాయల కాలంలోకళింగరాజ్యానికీ, విజయనగర రాజ్యానికీ పరస్పర యుధ్ధాలు వైష మ్యాలతోనే,పదిహేనవశతాబ్దం గడిచిపోయింది. పదిహేనవ శతాబ్దం, చివరలో విజయనగర రాజ్యం తుళు వంశం చేతుల్లోకి పోయింది. తుళువ నర సింహ రాయలు విజయనగర సామ్రాజ్య విస్తరణకి నడుం కట్టేడు. కళింగనీ, శ్రీరంగ పట్టణాన్నీజయించేడు.అలా కళింగ రాజైన  పురుషోత్తమ  గజపతి ఖార వేలు డితర్వాతతనఅపారబలంతో,అద్వితీయమైనశౌర్యంతో ఆంధ్రరాజ్యాన్ని కళింగ రాజ్యంలోవిలీనంచేసేడు.అతని కుమారుడైన ప్రతాప రుద్ర గజపతి పడమట నున్న ఉదయగిరి దుర్గంలో తిరుమల దేవ రాయ మహాపాత్రుడిని తన తరఫున నాయకుడిగా నియమించేడు కొండవీటి దుర్గం లో నయితే ప్రతాపరుద్ర గజపతి కుమారుడు వీర భద్ర గజపతి రాజ్య పాలకుడివారసుడిగా ఉండేవాడు. ప్రతాపరుద్ర గజపతి కటకాన్నిరాజధానిగా చేసుకుని మొత్తం కళింగఆంధ్రసంయుక్తరాజ్యపాలకుడిగాపాలనసాగించేడు..1496లోపురుషోత్తమగజపతి చనిపోయేక రాజయిన ప్రతాపరుద్రగజపతి నిస్సహాయుడేమీ కాదుగానీ,అతనికి,చిక్కులెక్కువయ్యేయి.ఉత్తరాన్నుండివంగదేశాన్నేలుతు న్నమహమ్మదీయులు,పడమటినుండిబహమనీ సుల్తానులు,దక్షిణాన్నుండివిజయనగరరాజులుఅనేకయుధ్ధక్రియలతో అతని పరిస్థితిని ఇబ్బందుల పాలే చేసేరు.
 ఇంక శ్రి క్రిష్ణ దేవరాయల దగ్గరకొస్తే ..అతడు కూడా ..ఒక్క సారి కాదు..తన  జీవిత కాలంలో మూడు సార్లు కళింగ దేశం మీద దండయాత్ర చేసేడు. ఆ వివరాలు తర్వాత పోష్టులో..
(Contd..)