కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.
 కళింగ ఆంటే ఏమిటి ?

మధ్య ప్రాచ్య భారతదేశం లో కళింగ  మొట్టమొదటి ప్రజాస్వామ్యరాజ్యం. .మరొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది  నవీన భారతంలో మొట్టమొదటి సామ్రాజ్యం ఏర్పడేందుకు (ఆశోక సామ్రాజ్యం) సహకరించిన రాజ్యం.
మెగస్థనీస్ తన "ఇండికా" పుస్తకంలో " Calingae"  గా కళింగ రాజ్యాన్ని పేర్కొన్నాడు.ఇంకా అతను మగధ, కళింగ రాజ్యాలు జైన మత ప్రాబల్యం వున్నవని చెప్పేడు.ఇంకా మరేం చెప్పేడంటే,prinas (ప్రాణహిత?),and Cainas (గంగానది)నదులు రెండూ నౌకాయానం చెయ్యగలిగే నదులు గా వున్నాయన్నాడు.అంతేకాదు ..కళింగుల రాజధాని నగరంగా parthalis (దంతపురం..?) ను పేర్కొన్నాడు.కళింగ రాజు సైన్యంలో 60000 మంది కాల్బలంగా,1000 మంది ఆశ్వికులుగా,700 గజసైన్యంగా విధులు నిర్వహిస్తున్నారని కూడా చెప్పేడు.బంగాళాఖాతం లో సముద్ర మార్గాలను వ్యాపార రంగంలో గొప్పగా నిర్విఘ్నం గా దీర్ఘ కాలం నిర్వహించిన జాతి. దక్షిణాసియా ,ఆగ్నేయాసియా లోని అనేక దేశాలతోకళింగవ్యైశ్యులకివ్యాపారసంబంధాలువిస్త్రుతంగావుండేవి.శ్రిలంక,కాంబోడియా,జావా,సుమత్రా,బాలి,వియత్నాం,థాయ్ లాండ్ దేశాలకు ఎంతమందో వలస వెళ్ళేరు.బర్మా దేశం తో కళింగ ప్రాంతానికి వున్న అనుబంధం గురించయితే ఒక పెద్ద పుస్తకమే రాయొచ్చు.కాళిదాసు రఘువంశంలో కపిశా నది (ప్రస్తుతం మిడ్నాపూర్ జిల్లాలోనిది) నుండి కళింగ రాజ్యం వరకూ వున్నది ఉత్కళదేశం అని చెప్పబడింది.వంగజాతికీ,ఉత్కళ జాతికీ మధ్య గీసిన గీత లాంటిది కపిశా నది అని కూడా చెప్పబడింది.
కళింగ జాతి బంగాళా ఖాతం అంచున జీవించే తెలుగు జాతి.మద్రాస్ ప్రెశిడెన్సీ లో గోదావరి ఇవతలి నుంచి ,గంజాం జిల్లావరకూ వుండే వాళ్ళని కళింగులనే వారు.  కళింగులనెప్పుడూ మద్రాసు రాష్త్ర మనుషులుగా చూసిన వాళ్ళెవ్వరూ లేరు.అధికారులుగా గానీ,గుమాస్తాలు గా గానీ తమిళులే వుండేవారు.రైలు మార్గాలు ఇంకా ఏర్పడని రోజుల్లో రాజధానికి సంబంధించి ఏవైనా వ్యవహారాలు చక్కబెట్టుకోవాలనుకుంటే ,పరిస్ఠితులు పరమ దుర్భరం గానే వుండేవి. గంజాం జిల్లాలోకి మద్రాసు నుండి ఏ అధికారి రావాలన్నా మద్రాసు రేవులో ఓడెక్కి,బారువా లేకపోతే గోపాలపురం రేవులలో ఓడ దిగేవారు. 
            క్రింద ప్రచురించిన దేశపటం 1936 లో ఒరిస్సా రాష్త్రం ఏర్పడకముందు వున్నటువంటి కళింగ ప్రాంతం.



ఇంతటి విశాల ప్రాంతాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసి,మిగతా రాష్ట్రాలకు పంచేయడాన్ని,కుట్ర..వివక్ష. అనే చిన్న చిన్న పదాలతో సరిపెట్టుకోవాలా?..ఈ దారుణం తో దేశం లో ఏ ప్రాంతానికి జరిగిన అన్యాయం సరితూగ గలుగుతుంది.ఇంత ఘోరాతి ఘోరమైన ద్రోహాన్ని గర్హించ లేకపోవడమే కాదు.గుర్తించడం కూడా చెయ్యలేని జాతివాళ్ళ మైపోయేమా..? ఇంత కబంధజాతి ఏ జీవమున్నఇతర ప్రాణుల్లో గానీ,ఏ దేశ చరిత్రలో గాని కాగడా వేసి వెతికినా కనిపించనిదే కదా !