కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

25, ఏప్రిల్ 2015, శనివారం

విస్మ్రుత కళింగ కవులు

విస్మ్రుత కళింగ కవులు

నన్నయ,తిక్కనలాంటి కవీంద్రులు పొందినటువంటి  కీర్తి, ప్రతిష్టలు...ఆనాడు ఈనాడు మాత్రమే కాదు ఏనాడూ పొందలేక పోయినా నిత్యోన్నతబుధ్ధితో కావ్య రచనలుచేసిన కవులకు,కళింగరాజ్యంలోకొరతఏనాడూలేదు.
తెలుగుభాషలోకవిత్వంప్రారంభమైనకాలంలో,కళింగదేశంలోనూపద్యాలరూపంలోశాసనాలురాయబడ్డాయి.పోయినవిపోగామనకిసాక్ష్యాధారంగా,దొరికినది....శ్రీకాకుళంజిల్లాలోనినరసన్నపేటతాలూకాలోని'దీర్ఘాశి' గ్రామంలోని శాసనం.ఇదిశాలివాహనశకం997అంటేక్రీ.శ.1075నాటిది.అంతేకాదు.క్రీ.శ.1769ప్రాంతంకవిఅయిన,అమితమేధోశాలి..అపరిమితధీశాలి'అడిదంసూరకవి'తనవంశంలో 23 పురుషాంతరాలనుండి కవులున్నారని చెప్పేడు.

సీ.వ్యాస భట్టారక భాషిత మైన కళింగ రాజ్య మహిమ
కాళిదాస కవీంద్ర ఘనవచో విలసితమైన కళింగ రాజ్యంబు గరిమ
దండి మహాకవి ధన్య వాగంచిత మైన కళింగ రాజ్యంబు పటిమ
గాంగ వంశ్య ప్రభుకాంక్షల కాకరమైన కళింగ రాజ్యంబు ప్రథిమ
గీ.కటకటా!యది కేవల గ్రాంధికమయి
నేటి వారికి దెలియక మాటుపడియె;
అవును,వాడుక లేని పదార్థములకు
నెంత దొర్లాడినా గతి యంతె కాదె?
(ఇది బ్రహ్మశ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు కళింగ రాజ్య వైభవాన్ని గురించి నూరేళ్ళకిందట చెప్పిన పద్యం) 

తెలుగు భాషాపరంగా తెలంగాణా ముఖ్యమంత్రి 'ఆదికవి' నన్నయ్యకాదు' పాల కురికి సోమనాధుడు' అని నిన్నో మొన్నో  మీడియాలో చెప్పినట్టు చూద్దా మంటే అతడు రాసిన 'వ్రుషాధిపశతకము' మొదటిది 'బసవపురాణం' తర్వాతదిఅవుతాయి.అయితే,అంతకుముందేక్రీ.శ.1170ప్రాంతాల్లోశ్రీమల్లిఖార్జునపండితారాధ్యుల'శివతత్వసారము'ఉన్నప్పటికీఅదిశతకంగానేగుర్తింపుపొందినప్పటికీ,అందులోసంఖ్యానియమంగానీ,మకుటనియమంగానీపాటించబడకపోవటంవల్ల'వ్రుషాధిపశతకమే'మొదటిదానిగాచెపుతున్నారు.తర్వాతివాటిల్లో"యధావాక్కులఅన్నమయ్య"గారి'సర్వేశ్వరశతకము'ముఖ్యమైనది.ఇదిక్రీ.శ.1242నాటిది.

    కళింగదేశంలో'శతకాలు'ముందుపుట్టలేదనిచెప్పడానికిగానీ...ముందే పుట్టేయనిచెప్పటానికిగానీఎటువంటిసరైనసాక్ష్యాధారాలూప్రస్తుతానికిలభ్యంకావడంలేదు.'అడిదంసూరకవి'రచించిన'రామలింగేశశతక'మేమొదటిదిగాచెప్పగలం.దీనితరువాత'గోగులపాటికూర్మనాధకవి'రాసిన'శ్రీవరాహలక్ష్మీన్రుసింహ'శతకముముఖ్యమైనది.గోగులపాటికూర్మనాధకవి'మ్రుత్యుంజయవిలాసం'అనేయక్షగానాన్నీ,'లక్ష్మీనారాయణసంవాదం'అనేప్రబంధాన్నీ,'చోరసంవాద'మనేపద్యకావ్యాన్నీ,'సుందరీమణి'అనేమరొకశతకాన్నీకూడారచించేడు.చాటరాతిలక్ష్మీనరసకవి,వేల్చూరివేంకటేశ్వరకవి,కవిరాయనిరామభద్రకవి,పచ్చమెట్టపాపకవి,మొదటివరుసశతకకవులు.అమలాపురపుసన్యాసకవిచాలాశతకాలురచించేడు.ఆంధ్రగీర్వాణభాషల్లోఅతనిపాండిత్యంఅసాధారణం.మంగళంపల్లిసుబ్రహ్మణ్యకవి"అర్సవిల్లిమార్తాండా..జగద్బాంధవా"అనేశతకాన్నిరాసేడు.మహామహోపాధ్యాయపరవస్తుభగవద్వేంకటరంగాచార్యులవారువిశాఖపట్టణవాసి,కూడాశతకరచయితే.మండపాకపార్వతీశ్వరశాస్త్రి40శతకాలురచించినశతకకవి.ఇందులో16ఏకప్రాసశతకాలుఉన్నాయి.'వరాహనారసింహశతకం','జగద్రక్షకశతకం,'కిందటిశతాబ్దంలోతెలుగువారందరికీసుపరిచితమైనవి.గంజాంజిల్లాకిచెందినపారనందిసర్వేశ్వరశాస్త్రి,,మచ్చవెంకటకవి,ముక్కవెల్లిసాంబయ్యశాస్త్రి,డబీరుక్రిష్ణమూర్తిసూరికూడాబాగాపేరుపొందినశతకకవులే. ఇంకా...గతశతాబ్దికవులగురించి,చెప్పాలంటే,ఇంద్రకంటివేంకటశాస్త్రి,కెళ్ళకప్పయ్యకవి,మ్రుత్యుంజయనిశ్శంకభూపతి,పూసపాటివీరపరాజు, వద్దిపర్తి అప్పల నరసింహ కవి,పంతుల లక్ష్మీ నరసింహ శాస్త్రి (తాబేలు మేటి శతక కర్త).వంటి కవుల లెక్క తక్కువ మాత్రం కాదు.
                కళింగదేశస్త్రీలలో,కూడాశతకాలుచెప్పినవారుఎక్కువగానేఉన్నారు.'తరిగొండవేంగమాంబ'తోసమకాలికురాలుగాఉండినటువంటి,1781లోజన్మించిన,కళింగకవయిత్రి'మదినసుభద్రమ్మ'గురించిఎందరికితెలుసు?.ఆమె'వేంకటాచలమహాత్మ్యము','రాజయోగసారము',అన్నగ్రంధాలనుమాత్రమేకాక,'శ్రీరామదండకము','రఘునాయకశతకము','కేశవశతకము','క్రిష్ణశతకము','రాఘవశతకము'అనేశతకాలనురచించినసంస్క్రుతాంధ్రవిదుషీమణి.ఈమెఒక్కతేకాక'కందాళంరంగనాయకమ్మ','సీతమరాజునరసమాంబ',లాంటివాళ్ళనుగురించితెలుసుకునిచెప్పినా,తెలుసుకోమనిచెప్పినా..కళింగదేశీయులకి,ఈనాటికవులకే,రచయితలకే,ఇక్కడఏదిక్కూలేకుండాచేసినవాళ్ళం.ఆకాలంనాటికళింగకవులుమాకేంఎక్కువ..అనిఅంటున్నారా...అనిపించేంతగానిద్రాణంగాఉండటం,ప్రశాంతంగానిద్రపోతున్నఒకమనిషిచెవిదగ్గరఓదోమవాలితే,ఆమనిషి........పట్టించుకున్నట్టుగానైనాకూడాపట్టించుకోకపోవటం,అలవాటైపోయిన,అతిపెద్దదౌర్భాగ్యం.('కళింగకవులజీవితచరిత్రలు' ఇంకొక పోష్టులో..)

ఇంక,కొద్దిగాకళింగరాజ్యపాలనాచరిత్రలోకివెళితే..వేంగిరాజధానిగాఆంధ్రతోపాటుగాకళింగదేశాన్నిపాలించిన'శాలంకాయనుల'తర్వాత(ప్రస్తుతహైదరాబాదుతోపాటుతెలంగాణాప్రాంతాన్నిఏలిన)వాకాటకరాజుల్లోరెండవప్రవరశేనుడికాలంలో(క్రీ.శ.425/450)వాకాటకయువరాణిని,మొదటిమాధవవర్మకిచ్చి,వివాహంచేసి,అతనినివేంగిరాజుగాచేసినట్టు,అప్పటినుంచిఆంధ్రరాజ్యమేకాదు.కళింగరాజ్యాన్నికూడావిష్ణుకుండినులుఏలినట్టుగా'రామతీర్థం'లోదొరికిన...రెండుదానశాసనాలు చెపుతాయి. 
రామతీర్థంప్రాచీనతకిఇంతకన్నసాక్ష్యాలుఇంకెన్నికావాలి..?

ఇంకాఅంతకుముందుకాలంనాటివి,మరెన్నోకళ్ళముందుపెట్టినా..పెట్టడానికి,సాక్ష్యాలతోసిధ్ధంగాఉన్నా,తమచెట్టుకొమ్మను,తామేనరుక్కున్నజాతివారసులకు..మూగగారోదించేపురాతనకాలంనాటిఆధారాలు(వేరువేరురాష్ట్రాలలో,ఎన్నోఇతరదేశాలమ్యూజియంలలోమగ్గిపోతున్నవి)తమనుచూడమని,కళింగజాతి...పునరేకీకరణకి,ఉన్ముఖం కమ్మనీ ,అందుకు గొంతెత్తి నినదించమనీ ఎలా చెప్పగలవు..?


మెగస్తనీసు'కాళింగులుచాలానాగరీకులనీ,అనేకవ్రుత్తులని,అవలంబించివాటిలోచాలానేర్పరులుకాగలిగేరనీ,విద్యాధికులనీ,వేదాంతచర్చలలోపారంగతులనీతనఇండికాపుస్తకంలోరాసేడు.ఎవరుమనకదిచెప్పేరు..? 
భారతీయులలోకాళింగులుపురాతనస్వాతంత్రనాగరికతకలిగిఉన్నవారు.వ్యాపారం,శిల్పకళ,రాజ్యాంగవిధానాలలో,గొప్పప్రావీణ్యులుగాఉండినజాతి.కళింగరాజ్యంప్రాచీనకాలంలో'నూలుబట్టల'కుప్రపంచఖ్యాతిపొందినదేశంగాఉండేది.తమిళభాషమాట్లాడేవాళ్ళు,...ఈరోజుకూడానూలుబట్టని'కాళింగ'మనేఅంటారు.ముందుఆమాటకళింగదేశంనుండివచ్చిన'నూలువస్త్రం'అనిపిలవబడుతూకాలక్రమంలో'కళింగ వస్త్రం'గాపేరుమార్చుకుంది.


పాణినీయసూత్రాలలోకూడా'కాళింగ'దేశప్రస్తావనఉంది.కౌటిల్యుడిఆర్థికశాస్త్రంలోఅనేకసార్లుకళింగరాజ్యంగురించిచెప్పబడింది.మహాభారతంలోఇంకావెనుకకువెళ్ళి,వేదపండితులునిష్పక్షపాతపరిశీలనచేయగలిగితే,ఐతరేయబ్రాహ్మణంలోని"భోజ'పదవిశ్లేషణలోకళింగజాతిఉనికిబయటపడతుంది.సంస్క్రుతవాజ్మయంనుండిబౌధ్ధవాజ్మయందగ్గరకివస్తే,'శుంభకరజాతకం''లోముందుగాఈపేరుకనబడుతుంది.గాంధారరాజయిననగ్నజిత్తుడికీ,విదర్భరాజయిన,భీముడికీసమకాలికుడైనకరండుడనేరాజుకళింగరాజ్యాన్నిపాలించినట్టుగాదీనిలోకనబడుతుంది..'ఉత్తరాధ్యాయనసూత్రం'అనేపుస్తకంకూడాఈవిషయాన్నిబలపరుస్తుంది.శతపధబ్రాహ్మణంలోపేర్కొన్నకాశీదత్తరాట్టు(ధ్రుతరాష్ట్రుడు)కి,సమకాలీకుడిగా,సత్తబాహుఅనేకళింగరాజుఉన్నట్టు,అతనుదంతపురంరాజధానిగాకళింగపాలనచేస్తున్నట్టు'మహాగోవిందసూత్రాంతం'చెపుతోందిసింహళద్వీపంలోని,మహావంశంఅనేజాతకపుస్తకంసింహళదేశంలోకికళింగరాజ్యంనుండి,విజయుడిఆగమనాన్ని,అతనితల్లిఉదంతాన్నీవిపులంగాపేర్కొంది.అతనితల్లి,కళింగపురాధీశునిపుత్రికఅనిఈపుస్తకంస్పష్టంగాచెపుతుంది.ఈపుస్తకంలోనేఉత్తరకళింగరాజ్యాన్నిసింహబాహుడనేరాజుస్థాపించడంమీదకూడాఒకకధకనబడుతుంది.


...తూర్పుగంగరాజులువారికిముందు8వశతాబ్దంలోఏలినకేసరిరాజులుకళింగదేశానికిచరిత్రలోసుస్థిరస్తానాన్నేకల్పించేరు.జగన్నాధదేవాలయం,కోణార్కదేవాలయం,ముఖలింగదేవాలయాలు,సింహాచల,శ్రీకూర్మదేవాలయాలుఇంకాఎన్నోచరిత్రలోవెలిగిపోతూ,జీర్ణమైమిగిలిపోయున్నశ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్టణం,తూర్పుగోదావరిజిల్లాలలోనిఅనేకదేవాలయాలూవాళ్ళపరాక్రమచరిత్రని,శాసనాలనివిప్పిచదివితేదిగ్భ్రమనేకలిగించితీరుతాయి.(ఆదేవాలయాల చరిత్ర మరొక పోష్టు లో పంచుకుందాం.)

......... క్రిష్ణదేవరాయలు,రాజైనకాలంలోకళింగదేశవిభావమెంతదూరంవరకూ వ్యాపించిందంటే.మహేంద్రగిరినుండిచెన్నపట్టణంవరకూ,ఉత్తరమహమ్మదీయరాజ్యాలన్నీ,విజయనగరసామ్రాజ్యానికి,బధ్ధశత్రువులవ్వటంవల్ల,కళింగగజపతి,మహమ్మదీయులతోమిత్రుత్వానికిఆసక్తివున్నవాడవ్వటంవల్ల,తనసామ్రాజ్యానికిఅదెంతప్రమాదకరమోతెలివైననాయకుడుక్రిష్ణదేవరాయలుఅతనిమంత్రితిమ్మరసుచాలావేగంగానేగ్రహించేరు.అందుకుమహమ్మదీయులను,గజపతులనువేరుపరిచివాళ్ళలోవివాదాలనుస్రుష్టించిగజపతులమీదకివరుసదండయాత్రలుచేసివిజయాలనుసాధించేడు..గజపతివొంటరైతానుఅంతవరకూ,సంపాదించినకొత్తరాజ్యాలను,వాటితోపాటు,గంజాంజిల్లావరకూ,తనస్వంతరాజ్యాన్నీ,కోల్ఫోవాల్సివచ్చింది.చివరకువిజయనగరసామ్రాజ్యానికీకళింగసామ్రాజ్యానికీ,సరిహద్దుగోదావరినదిగా,ఇద్దరికీ,ఆమోదయోగ్యమైంది.తనకూతురుని,తనకీ,ఆమెకీఎంతఇష్టంలేకపోయినా,సరే క్రిష్ణదేవరాయలకిచ్చి,అతను వివాహం చేయ వలసి వచ్చింది.. 

విజయనగరసామ్రాజ్యపతనానంతరం,గోలుకొండనుమొగలాయీలుముట్టడించి,స్వాధీనంచేసుకున్నాక,కళింగరాజ్యంవాళ్ళఆధీనంలోకివెళ్ళిపోయింది.కళింగరాజ్యక్షీణదశప్రారంభమయ్యింది.ముందుకాలాలలో,దేశదేశాలావజ్రకాంతులనువెదజల్లినకాళింగులు,తమసాంఘిక,ఆర్థికవ్యవస్థలలోతర్వాతనుండిపొందుతున్నఅవస్థలకు,నిర్లక్ష్యానికీ,అవమానాలకీమేరన్నదేలేదు.

కాళింగులలోభిన్నవర్ణవ్యవస్థలున్నసంగతి,నేటికీసాక్ష్యాధారాలనుమనకుచూపుతోంది.ఇప్పటికీ'కళింగకోమట్లు'ఇతరవైశ్యులకుభిన్నమైనతమవర్ణచిహ్నాలనుప్రదర్శిస్తూనేఉంటారు..కాళింగనంబులు,ముఖలింగందేవాలయలంలోఅర్చకులుగానేతమఉనికినితెలియచేస్తున్నారు..ముందుజైనమతంతర్వాతబౌధ్ధమతానికిపూర్తిగాఅంకితమైనజాతి,కనుకమిగిలినవర్ణభేదాలుఏకాలంలోనూకళింగరాజ్యంలోకనబడవు.బొధాయనుడిస్మ్రుతిఅందుకుబలమైనతార్కాణం.శ్రీరామానుజాచార్యులు,శ్రీచైతన్యస్వామి,విశిష్టాద్వైతసిధ్ధాంతము,...కాళింగులనిఎక్కువగాప్రభావితంచేసినవికాబట్టి,ఈప్రాంతంలోవర్ణభేధాలపట్టింపుమిగిలినప్రాంతాలతోపోలిస్తే,ఏనాడూకనబడదు.బౌధ్ధమతసిధ్ధాంతాలూ,విశిష్టాద్వైతసిధ్ధాంతాలూ..బాగాదగ్గరగాఉండటమేఅందుకుకారణంకావొచ్చు.కాళింగులలోఘనమైనవేదాంతపండితులుఎక్కువగానేఉన్నారు.కాళింగులేజంధ్యంవేసుకునితమజాతివారివివాహ,ఉపనయనాదిక్రతువులుజరిపించడం...ఈరోజుకీమిగిలినఆంధ్రులకీ,కాళింగులకీమధ్యకనబడే,భిన్నమైనసాంఘిక ఆచారం.

కళింగస్త్రీలకిమారుమనువుల,ఆచారంకూడామిగిలినప్రాంతాలవారికన్నాప్రత్యేకమే.ఇదిపూర్వంనుండీ,కళింగస్త్రీలస్వతంత్రాన్నిస్పష్టంగాచెపుతుంది.అంతేకాదు..పొగాకుసేవనంలోఈసీమ,పల్లెప్రాంతాల్లోని,స్త్రీలలోచాలావరకుసన్నగిల్లిపోయిన,'అడ్డపొగ'పీల్చటంఅన్నదీ,తలవెంట్రుకలనుకుడివైపుకొప్పుగాచుట్టుకోవడంఅన్నదీ,కూడామిగతాప్రాంతాలతోభిన్నమైనఈకళింగసీమ,స్త్రీల..భిన్నసంస్క్రుతీచిహ్నాలనిచాటిచెపుతాయి.వాళ్ళనిర్భయత్వాన్నీ,ధీరోదాత్తతనికూడాచెపుతాయి.వాళ్ళఅద్భుతనౌకానైపుణ్యచరిత్రనీ,శ్రమవారసత్వాన్నీకూడాతెలుసుకోమంటాయి.ఆశ్వయుజమాసంలో'ఆయుధపూజ'కళింగులకితప్పనిసరి.ఇదికూడాప్రాచీనంగానేమిగిలిపోయినఒకనాటికళింగుల"కళింగయుధ్ధవీరత్వాన్ని" చెపుతుంది. 

(Contd..)







18, ఏప్రిల్ 2015, శనివారం

కళింగ సీమ ఖచిత నవరత్న లేమ'


'కళింగ సీమ ఖచిత నవరత్న లేమ' 


సీ.ఈ చోట తొలినాడు  ప్రాచీసతీముఖాబ్జ
            మున నెఱ్ఱ కుంకుమబొట్టు దిద్ది
ఈ నేలను కళింగ భూనాధ శౌర్యాన
         ల జ్వాల ధూమ నైల్యములు గ్రమ్మి
ఈ పవిత్ర ధరిత్రినోపి త్రైలింగ రా
               జ్య శ్రీ సుధా ప్రవర్షంబు గురిసి
కడగి ఇచ్చటి మంటిగడ్డలు సైతమ్ము
     నవమ్రుగీ మద వాసనలు విదిర్చి

వేంగి విషయేశ చాళుక్య విభులతోడ
మనసులో నన్నదమ్ములదనము కలిపి
మునుపిచటి తెలుగు రాణించుకొనియె శౌర్య
లీల న్రుపలీల ఈ ముఖలింగ భూమి

గీ.ఆ దినాల యెంతటి నిశితానురాగ
మవు కళాశిల్పములను విద్యలను చూడ
పగటి వేసాల కొరకు తూర్పారబట్టె
ప్రాణములను కళింగ గంగ్రాజు వైరి.

అని జ్నాన పీఠ అవార్డు గ్రహీత పండిత విశ్వనాధ సత్యనారాయణ గారితో కీర్తించ బడ్డనేల.
ప్రాచీన కళింగ దేశములో కళాకన్య తన బంగారు గజ్జెల చప్పుడు దిగంతాల మేరకు వినబడేలా నర్తించింది.కళింగుల నౌక రత్నాకరంలో విజయ విహారం చేసింది.కళింగుల ఖడ్గం గోదావరి దగ్గర సాము చేసిగంగలో స్నానం చేసింది.ఈ నాడు కళింగ దీపం కాంతులు మలిగిపోయేయి. మళ్ళీ కళింగ కేకపెట్టి కళింగ జ్వాల ఎగసిపడేలా చేస్తే తప్పకుండా 'కళింగ సీమ ఖచిత నవరత్న లేమ' గా భాసిల్లుతుంది.అది కాళింగుల పరంగా సామాన్య ధర్మం అయితే,ఇతరులకి వీర ధర్మం అవుతుంది. 
"ఒకమనిషినిహత్యచెయ్యడంహంతకులకికష్టసాధ్యమైనపనే..ఇంకాఅవేచేతులతో,అతడితోటలోనేఅతణ్ణిపాతిపెట్టడంఅన్నది..ఇంకాకష్టసాధ్యం.ఆహత్యచేయబడ్డవాడుతనఇంట్లోకితనేస్వయంగానడిచివస్తే,జరిగినసంగతులుచెపితే....ఆహత్యచేయడంలోహంతకులందరూవిఫలమైనట్టే..అదే.సంగతిఈకళింగసీమ,కళింగజాతి,కళింగసంస్క్రుతినీ,నిర్ధూమధామంగా..చేయగలిగేమన్నసంతోషంలోఉన్న,అన్నిఇతరప్రాంతాలతెలుగునాయకులతోపాటు,ఈభారతదేశంలోనిఇతరరాష్ట్రాల,జాతులవారుకూడాతెలుసుకునితీరవలసినకాలం..చాలాదగ్గరకొచ్చిందనీ.ఈకళింగసీమవాసులుపెట్టే,కళింగసింహగర్జనవీళ్ళల్లోకంపంపుట్టించితీరుతుందనీ,ఉదయిస్తున్నకళింగసూర్యుడు..తనప్రకాశంతోతిరిగితేజరిల్లుతాడనీ..స్పష్టంగాతెలిసిపోతోంది.


 అత్యద్భుత తేజో పరాక్రమాలతో కళింగ దేశంలో నేటికీ గుర్తుగా మిగిలిపోయిన దేవాలయాల ని నిర్మించి కళింగ రాజ్య ప్రాభవాన్ని భూమి నాలుగు చెరుగులా తేజరిల్లేలా చేసిన గాంగ వంశీయుల బంగారుకాలాన్ని పక్కనపెట్టి తర్వాతి కాలంనాటిచరిత్రలోకిఅడుగుపెడితే.....
1336A.D.లోఇంగ్లాండునిEdwardIIIరాజ్యమేలుతూఉన్నప్పుడు,భారతదేశదక్షిణాదిలోరాజకీయంగాపెనుమార్పులుకలిగేయి.అయితేఆమార్పులకికారణంఅప్పటికిఇంకా,ఆంగ్లేయులుకాదు.అదివిజయనగరసామ్రాజ్యస్థాపన.అప్పటినుండేప్రాచీనరాజ్యవంశాలపాలనఅంతరించిపోయిఆధునికరాజ్యపాలనప్రారంభమైందనిస్థూలంగానిర్ణయించుకోవచ్చు.1312లోముబారక్ ఢిల్లీ నుంచి దేవ గిరి సైన్యంతో వచ్చి రాజు హరిపాల దేవుడి ని నరికి అతని తలని దేవగిరి గేటుకి వేళ్ళాడ దీసేడు.1323 లో వరంగల్లు కూలిపోయింది. 1330 నాటికి వింధ్య పర్వతాల అవతల ఉత్తర ప్రాంతమంతా ముస్లిం పాలనలో మణిగి పోయింది.క్రిష్ణా నదికి దక్షిణ ప్రాంతం అంతా హిందూ రాజుల చేతిలో ఉంది.1325 లో తుగ్లక్ ఢిల్లీ సింహాసనం అధిష్టించేక మొత్తం దేశ పరిస్థితి అంతా పూర్తిగా చెడి పోయిందనే చెప్పాలి.వరంగల్,ద్వారసముద్రం అప్పటికే ముస్లింలకి లొంగిపోయినప్పటికీ ఆనెగొంది లో ప్రారంభ మైన  విజయనగర సామ్రాజ్యం బాగా విస్తరించి 250 ఏళ్ళపాటు ఈ ప్రాంతంలో ముస్లింలని అడ్డుకుంది.

క్రీ.శ.1434లో కడపటి, గాంగ వంశరాజు,నాల్గవ భానుదేవుడు మరణించేక అతనిమంత్రి కళింగరాజ్య సింహాసనాన్నిఆక్రమించుకుని కపిలేశ్వరగజపతి పేరుతోకళింగ రాజ్యాన్ని పాలించడం ప్రారంభించేడు.ఇతడే గజపతి వంశానికి మూలపురుషుడు.ఇతని రాజధాని కటకము. ఈ రాజు కాలంలోనే కళింగరాజ్యం, దక్షిణాన క్రిష్ణానది వరకు ఉత్తరాన గంగాతీరం వరకూ, విస్తరించి సకలసంపదల తో విలసిల్లుతూ ఉండేది. ఈవిస్తారమైన కళింగరాజ్యాధిపతి ప్రతాపకపిలేశ్వరగజపతికీ,కర్ణాటక లోని విజయనగర రాజులకీ, శత్రుత్వం ఏర్పడింది..క్రీ.శ.1449లో అప్పుడు విజయనగర సామ్రాజ్యాన్ని ఏలుతున్న సంగమవంశ రాజు రెండవ దేవరాయలు మరణించేడు. దేవరాయల పుత్రుడైన మల్లికార్జునరాయలు,రాజయ్యేడు.కానీఅతడుఅంతసమర్ధుడుకాకపోవడంవల్ల విజయనగర సామ్రాజ్యానికి, ముప్పు ఏర్పడింది. తుంగభద్రకి ఉత్తరాన్నుంచి చంద్రధ్వజుడు తూర్పు తీరప్రాంత సామ్రాజ్యాధీశుడు గజపతి విజయనగర సామ్రాజ్యం మీద దండయాత్రకి సిధ్ధమయ్యేరు.

 ఆసమయాన్నికనిపెట్టి,గజపతిసైన్యాన్నిసమకూర్చుకునియుధ్ధానికివిజయనగరం బయల్దేరేడు. అగ్నిదేవుడికి వాయుదేవుడు తోడయ్యినట్టు అతనికి, బహమనీ సుల్తాను అల్లాఉద్దీను చేయి అందించేడు.కానీ వీరుభయులూ విద్యానగరాన్నిముట్టడించేటఫ్ఫటికి,మల్లికార్జునరాయలు యుధ్ధానికి సిధ్ధమై రణరంగం లో అనన్యసామాన్య పరాక్రమాన్ని చూపి గజపతినీ, అల్లాఉద్దీనునీ, ఓడించి పారద్రోలేడు. అయితే కళింగాధీశుడు ఈఅవమానాన్ని సహించలే క,వేచిఉండి మరోసారి ప్రచండసైన్యంతో తన సేనాధిపతి గోపీనాధ మహాపాత్రుడితో వ్యూహరచన చేసి, దక్షిణదిగ్విజయయాత్రకి బయల్దేరేడు. ఈసారి విద్యానగరాన్నే కాదు ఇంకా ముందుకు కాంచీపురం వరకూ పోయి దాన్నీవశపరచుకున్నాడు.ఈదండయాత్ర వల్ల సాధించిన విజయాలు అతని కి"కర్ణాటకజయసింహుడు"అన్న బిరుదును తెచ్చిపెట్టేయి. ఈగెలుపుతో తన అవమానాగ్నినిచల్లార్చుకున్న,కపిలేశ్వరగజపతి వెంటనే కళింగరాజ్యానికి తిరిగివచ్చేడు. మొత్తం 'త్రిలింగదేశం' లేదా 'తెలింగానా' తమ రాజు ఏలుబడి లోకి వచ్చినందుకు, కాళింగులు పండుగలు జరుపుకున్నారు. అప్పటికే దక్షిణాది అంతా విస్తరించిన విజయనగర సామ్రాజ్యానికి సరైన పాలకులు లేకుండా పోయి కళింగరాజ్యానికి, లొంగిపోవలసివస్తే, ఓరుగల్లు నుండి రాజమహేంద్రి దాకా మహమ్మదీయ ప్రభువులైన బహమనీసుల్తానులకీ, పరిస్థితిఏమంతబాగాలేదు.చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయిన పాలెగాళ్ళు, ఏకమై తిరుగుబాట్లు చేయడం.. వాళ్ళ కి తలనొప్పిగా మారింది. అప్పటి కాలంలో ఒకప్పుడయితే విజయనగరసామ్రాజ్యం, కళింగరాజ్యాంతర్గతం అయి పోతుందేమోనన్నపరిస్థితికూడాఏర్పడింది.

కపిలేశ్వరగజపతి స్వర్గస్తుడయ్యేక, 1470 ప్రాంతాల్లో అతని కుమారుడు పురుషోత్తమ గజపతి రాజ్యాధీశుడయ్యేడు. బలశౌర్యాల్లో, అతడు కూడా తండ్రి అంతటి వాడే..ఆసంగతి ఒకసారి తన ప్రజలకు, పక్కరాజ్యాలకి చూపడానికి, అతడు,తన తండ్రిలాగానే విజయనగరం మీద, కాంచీపురం మీద దండెత్తి, జయించి కాళింగులకి తమ రాజు మీద బలమైన నమ్మకాన్ని కలిగించేడు.అతడు కాంచీపురాన్ని వశపర్చుకున్నపుడు పట్టుబడినవారిలో ఆరాజు,కుమార్తె కూడావుంది. పురుషోత్తమగజపతి, గౌరవంగాఆమెను, తనభార్యగా స్వీకరించేడు. గజపతుల ప్రారంభవైభవం పదిహేనవ శతాబ్దాంతం వరకూ ఎదురులేని దానిగా పరిఢవిల్లింది. ఆశతాబ్దాంతంలోనే పురుషోత్తమ గజపతి కుమారుడు ప్రతాపరుద్రగజపతి తండ్రి అనంతరం రాజ్యపాలన సాగిస్తున్న పుడు వంగ దేశ ప్రభువులైన మహమ్మదీయులు పూరీక్షేత్రం మీద దాడి చేసి, అక్కడ ఉన్నకొన్నిదేవాలయాలను కూడా ధ్వంసం చేసేరు.

     ఇంక విజయనగర సామ్రాజ్యం సంగతి చూస్తే అప్పుడు పాలకులైన సంగమ వంశపు రాజులు దుర్బలులూ విషయ లంపటులూ అవ్వడం వల్లా అప్పటికి రెండు సార్లు దండయాత్ర చేసిన కళింగ రాజ్యం గజపతుల చేతిలోకి గానీ,సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్న  యవనపతుల (మహమ్మదీ యుల) చేతిలోకి గానీ తమరాజ్యం పోతుందేమో నన్న భయంతో నే కాబోలు సాళువనరసింహరాయలు,సంగమవంశ రాజ్య సింహాసనాన్ని తానధిష్టించేడు. సరైన అవకాశంకోసం ఎదురుచూస్తున్న రాజ్యం తన చేతుల్లోకి రాగానే అతడు సైన్యాన్నిసమకూర్చుకుని,కళింగరాజ్యం పైన దండయాత్ర చేసి జయించేడు. పిల్లలమర్రిపినవీరభధ్రుడు తను రాసిన జైమినీ భారతాన్ని సాళ్వ నరసింహ రాయలకి అంకితమిస్తూ ఈ ప్రశంస చేశేడు.అలాసాళ్వ నరసింహ రాయల కాలంలోకళింగరాజ్యానికీ, విజయనగర రాజ్యానికీ పరస్పర యుధ్ధాలు వైష మ్యాలతోనే,పదిహేనవశతాబ్దం గడిచిపోయింది. పదిహేనవ శతాబ్దం, చివరలో విజయనగర రాజ్యం తుళు వంశం చేతుల్లోకి పోయింది. తుళువ నర సింహ రాయలు విజయనగర సామ్రాజ్య విస్తరణకి నడుం కట్టేడు. కళింగనీ, శ్రీరంగ పట్టణాన్నీజయించేడు.అలా కళింగ రాజైన  పురుషోత్తమ  గజపతి ఖార వేలు డితర్వాతతనఅపారబలంతో,అద్వితీయమైనశౌర్యంతో ఆంధ్రరాజ్యాన్ని కళింగ రాజ్యంలోవిలీనంచేసేడు.అతని కుమారుడైన ప్రతాప రుద్ర గజపతి పడమట నున్న ఉదయగిరి దుర్గంలో తిరుమల దేవ రాయ మహాపాత్రుడిని తన తరఫున నాయకుడిగా నియమించేడు కొండవీటి దుర్గం లో నయితే ప్రతాపరుద్ర గజపతి కుమారుడు వీర భద్ర గజపతి రాజ్య పాలకుడివారసుడిగా ఉండేవాడు. ప్రతాపరుద్ర గజపతి కటకాన్నిరాజధానిగా చేసుకుని మొత్తం కళింగఆంధ్రసంయుక్తరాజ్యపాలకుడిగాపాలనసాగించేడు..1496లోపురుషోత్తమగజపతి చనిపోయేక రాజయిన ప్రతాపరుద్రగజపతి నిస్సహాయుడేమీ కాదుగానీ,అతనికి,చిక్కులెక్కువయ్యేయి.ఉత్తరాన్నుండివంగదేశాన్నేలుతు న్నమహమ్మదీయులు,పడమటినుండిబహమనీ సుల్తానులు,దక్షిణాన్నుండివిజయనగరరాజులుఅనేకయుధ్ధక్రియలతో అతని పరిస్థితిని ఇబ్బందుల పాలే చేసేరు.
 ఇంక శ్రి క్రిష్ణ దేవరాయల దగ్గరకొస్తే ..అతడు కూడా ..ఒక్క సారి కాదు..తన  జీవిత కాలంలో మూడు సార్లు కళింగ దేశం మీద దండయాత్ర చేసేడు. ఆ వివరాలు తర్వాత పోష్టులో..
(Contd..)

11, ఏప్రిల్ 2015, శనివారం

తెల్ల మేడ మీద కాకి వాలితేనే మేడ తెలుపు తెలుస్తుంది.

తెల్ల మేడ మీద కాకి వాలితేనే మేడ తెలుపు తెలుస్తుంది.

 రెండు వేల అయిదు వందల సంవత్సరాల పైబడిన  జైన,బౌధ్ధ హిందూ మత చరిత్ర ఉన్న విజయనగరం జిల్లాలోని రామతీర్థం, గురుభక్త కొండల(విశాలమైన తెల్లమేడలాంటి)  గురించి చరిత్ర తవ్వి తీస్తే  చాలాకాలం పాటుదశ దిశలా విరాజిల్లిన కళింగ సీమ ఖ్యాతి ఈనాడు ఈ ప్రభుత్వం ప్రభుత్వ అధికారిక లాంఛనాల విషయం లో పక్కన పెట్టడం వల్ల మాయమైపోదు.తెల్లమేడ మీద నల్లకాకి వాలినట్టే అవుతుంది.



రాజరాజనరేంద్రుడి తండ్రి విమలాదిత్యుడి కాలంలో అతని గురువు విజయనగరం జిల్లాలోని రామతీర్థం ( ఆ కాలంలో రామతీర్థం ఒక గొప్ప జైన పుణ్యక్షేత్రం.) వచ్చినట్టు రామతీర్థం లో ఉన్న కన్నడ శాసనం చెపుతుంది..ఆశాసనం చెపుతున్నదాన్ని బట్టి విమలాదిత్యుడు జైన మతాన్నవలంబిచేడనీ,జైన మతంలోని దేశి గణ శాఖకి చెందిన త్రికాళయోగ శిధ్ధాంతి ని గురువు గా స్వీకరించేడని ఆ గురువు రామతీర్థం వచ్చేడనీ రామతిర్థం కొండమీదున్న గుహలొ ఈ శాసనం చెక్కబడి ఉంది.తూర్పు చాళుక్యరాజుల పాలనలో ఉన్న ఆ నాటి కళింగ దేశంలో కూడా కన్నడ దేశం లాగానే జైనమతం బలంగా ఉండేదని తెలుస్తుంది రామ తీర్థం లో దొరికిన జైన ప్రతిమలని బట్టి,పాండవ పంచ గుహలో పూర్వ చాళుక్య లిపితో చెక్కబడిన జైన నామాలని బట్టి క్రీ.శ. 5 ,6 శతాబ్దాలలో నే కాదు అంతకు ముందు నుండీ కళింగ దేశం లో జైన మతవ్యాప్తి ఎక్కువగానే ఉండేదని తెలుస్తుంది. 

ఖారవేలుడి హాథీ గుంఫ శాసనాన్ని పరిశీలిస్తే,నంద వంశం రాజులు మగధనేలినప్పటినుంచీ అంటే క్రీ.పూ.5వ శతాబ్దం నుండీ వాళ్ళ పాలనలోనే ఉన్న కళింగం లో కూడా జైన మతావలంబనం చాలా ఎక్కువగానే ఉండేది.అంటే ఆ కాలంనుండీ రామగిరి ( రామ తీర్థం) కొండలమీద జైనమత గోళకీ మఠం తో పాటు  జైనులఆవాసాలకి కూడా నిర్మాణాలు ఎక్కువగానే ఉండేవి.జైనమతం తర్వాత కళింగ ప్రాంతం అంతటా బౌధ్ధమతం విస్తరించింది.ఆ సంగతికి రామ తీర్థం లోని గురుభక్త కొండ మీద నిలువెత్తు సాక్ష్యాధారాలు కనిపిస్తాయి..ఈ కొండ మీద పెద్ద పాడుపడిన బౌధ్ధ మఠం ఒకటి ఉంది.
ఈ ప్రాంతానికి రామతీర్థం అనే పేరు రావడానికి కారణం శ్రీరాముడు ఈ ప్రాంతంలో కొంతకాలం నివశించేడనీ,ప్రస్తుతం ఇక్కడున్న రామాలయానికి దగ్గర రామ సరోవరాన్ని అతడే నిర్మించేడనీ స్థల పురాణం చెపుతుంది.ఇది అర్థం చేసుకుంటే ఇక్కడి రామాలయ నిర్మాణం వనుక వేల సంవత్సరాల కాలం దాగి వుందనీ, ఇంక ఏ సీమ లోని రామాలయాలు ఇంతకన్న పురాతనమైవి కనబడవనీ తెలుస్తుంది. ఇది చెప్పే వారెవరు..? వినేవారెక్కడున్నారు?
ఈ కొండమీదున్న బౌధ్ధ మఠానికి  పడమరగా ఒక పెద్ద స్థూపం ఉంది.దానికి తూర్పుగా ఒక చైత్యాలయం ఉంది.ఇది 40 అడుగుల పొడవు 11 అడుగుల వడల్పు 6 అడుగుల ఎత్తు కలిగి ఉంది.దీనిలో ఉన్న గర్భాలయం గోబా అని బౌధ్ధులు పిలిచేది 7 అడుగుల ఎత్తు న ఉంది.దీన్లోనే బుధ్ధుడి స్మారక చిహ్నాలు ఉన్న భరిణ ఉండేది.. ఈ చైత్యాలయం నిర్మాణంలో పూజా ద్రవ్యాలు భద్రపరిచేందుకు గోబా,పూజలు చేయడానికి చైత్యాలయం,బౌధ్ధ సన్యాశులు  నివశించేందుకు బౌధ్ధ మఠం ఉపయుక్తమయ్యేవి.మద్రాసు వస్తు ప్రదర్శన శాలలో ఉంచిన భట్టిప్రోలు బౌధ్ధ స్థూపం లోని భరణ లాగానే ఇక్కడి భరిణ కూడా మంచి రాతి మూత కలిగి ఉంది.దీనిలో కూడా బుధ్ధుడి పన్ను,ఎముక ముక్కలు,నవరత్నాలు,నాణేలు ఉండేవి.ఈ చైత్యాలయం సమీపం లోనే బౌధ్ధ విహారం, కొన్ని నేలమాళిగలు ఉన్నవి.

ఈగురుభక్తకొండమీదమొత్తానికి5,6చైత్యాలయాలు,2విహారములు30మాళిగలు,అనేకడగోబాలు ,బుధ్ధవిగ్రహాలు ఉన్నాయి. అంతే కాకుండా ఈ కొండ గుహలలో అనేక జైన విగ్రహాలు కూడా దొరికేయి. అంటే ముందు ఈ కొండలు జైన మతస్థుల చే ఆక్రమింపబడి తర్వాత బౌధ్ధ మతస్థుల చేతిలోకి వెళ్ళేయనీ,అది కూడా క్రీ.పూ.3 వ శతాబ్ది కాలంలో అయి వుండవచ్చనీ పురాతన శాస్త్రవేత్తల అభిప్రాయం.

ఇంకాఇక్కడఆయాకాలాలకిచెందినచిత్రలేఖనాలతోకూడినకుండలు,బొమ్మలు,పాత్రలు,ముద్రలు,పూసలు,ఇనుప కత్తులు,సీసపు నాణేలు,బౌధ్ధ జైన విగ్రహాలు చాలానే దొరికేయి.సీసపు నాణేలు ఆంధ్రులవి అని శాస్త్రవేత్తల భావన.ఇందులో ఒక నాణెం మీద ఒక పక్క చైత్యం,మరొకపక్క'సిరిశివమక విజయరజ శెలసగన"( అంటే అమరావతి శాసనం లో కనిపించే 'శ్రీ శివమాక శాతకర్ణుని శైల సంఘము') అన్న పేరు కనిపిస్తాయి.ఈ శైల సంఘం రామతీర్థం కొండమీద ఉండినటువంటి బౌధ్ధ సన్యాశ సంఘం. ఈ గురుభక్త కొండకి పమటి దిశలో దుర్గ కొండ ఉంది.దానికి ఆ పేరు రావడానికి కారణం దాని మీద దుర్గాలయం ఉండటమే.అది కాదు విశేషం.అక్కకూడా బౌధ్ధ జైన హిందూమత చిహ్నాలు దొరకటమే.ఇంకా చెప్పాలంటే ఇక్కడకూడా ఒక చైత్యం, అనేకగుహాలయాలు,జైన విగ్రహాలు,మట్టి ముద్రలు,పాత్రలు,రాగి నాణేలు,ఇనుప కత్తులు దొరకటం.

 ఈ చారిత్రక విశేషాలని వీక్షకులకి చెప్పడంలో ఉన్న ఆశ ఒక్కటే.."Vision without Action is merely a dream.Action without vision  just passes the time.Vision with action can change the world." అని  Joel Arthur Barker చెప్పిన అంశమే.


4, ఏప్రిల్ 2015, శనివారం

మూల విరాట్టులు ముష్టెత్తుకుంటే..ఉత్సవ విగ్రహాలకి దధ్యోజనాలట.




...ఇంకమళ్ళీచరిత్రలోకివస్తే,తిరుగులేనిసాక్ష్యాధారాలతోకళింగదేశచరిత్రక్రీ.శ.3వశతాబ్దంనుండీప్రారంభంఅవుతుంది.260B.C.లోఅశోకుడుజయించడం,తర్వాతఖారవేలుడుపాలించడం,తర్వాతఆంధ్రశాతవాహనులురాజ్యంచేయడం(విజయనగరంజిల్లాజామిలో,శ్రీకాకుళంజిల్లాశాలిహుండంలోముఖలింగంలోనాణేలుదొరికేయి).

                                              శాలిహుండం

క్రీ.శ.4వశతాబ్దంలోకళింగ,ముతరాజుల,వశిష్టులచేతిలోకివెళ్ళింది.ముతరాజులుపిఠాపురాన్ని(పిష్టపురం)రాజధానిగాచేసుకునికళింగనిపాలించేరు.వశిష్టులురాజధానినిపిఠాపురంనుండిశ్రీకాకుళందగ్గరున్ననేటిసింగుపురంకిమార్చేరుమళ్ళీఅక్కడనుండివర్థమానపురానికీ,చివరకిశ్రీపురానికీమార్చేరు.ఇవినేటిశ్రీకాకుళానికిదగ్గరున్నవే.

శ్రీముఖలింగం

శాతవాహనులకాలంలోనేముఖలింగంలోమధుకేశ్వరాలయంనిర్మితమైందనేందుకుదాఖలాలున్నాయి.ముఖలింగంలోకళింగజాతిప్రాచీనతకి,కళింగరాజ్యప్రాచీనతకి,నిలువెత్తుసహస్రాబ్దసాక్షులుగా...ఒకటికాదుమూడుఅద్భుతదేవాలయాలున్నాయి.అవిఆంధ్రదేశంలోని,శతాబ్దాలవొంటిమిట్టలవంటి,ఆలయాలనిర్వాహకులకీ,వైష్ణవస్వాములకీ,కూడాఊహకికూడాఅందనంతదూరానఎత్తుగానిలబడ్డవి.అవేమధుకేశ్వరాలయం,భీమేశ్వరాలయం,సోమేశ్వరాలయంఎప్పుడుఆదేవాలయాలునిర్మించబడ్డాయో,ఆరహస్యాన్నిచరిత్రమంచుతెరలవెనకాతలదాచేసింది.మధుకేశ్వరవిగ్రహం'స్వయంభూ'అనంటారు.శివలింగంమీదరూపంచెక్కబడిందికనుకముఖలింగంఅంటారు.అందువల్లనేఆఊరుకూడాఎంతకాలంకిందటోముఖలింగమేఅయ్యింది.అనంతవర్మచోళుడురాజ్యంచేసినకాలంలో(క్రీ.శ.1112లో)శైవమతప్రాబల్యంపెరిగింది.గాంగులతో,చోళులతోమాత్రుసంబంధవ్యవహారాలుండటంవల్లముఖలింగంమీదతమిళప్రభావంపడింది.అతనికాలంలోనేఅప్పటికేఎంతోగొప్పగాఆరాధించబడేమధుకేశ్వరుడికిఅతనుచాలాదానాలుచేసేడు.దేవాలయంలోపూజాదికాలనిర్వహణనిమిత్తంశైవపూజారులని,సిధ్ధంచేసేడు.దేవాలయంరికార్డులప్రకారం'మాధవభట్టు'ఆకాలంనాటిపూజారిగాపేరుతోసహాతెలుస్తుంది.నిర్మాణం,శిల్పాక్రుతిప్రకారంచూస్తే,మధుకేశ్వరాలయంక్రీ.శ.8-10 శతాబ్దాలమధ్యలోనిర్మించబడివుంటుంది..భీమేశ్వరదేవాలయం11వ శతాబ్దంలోనిర్మించబడిఉంటుంది.సోమేశ్వరదేవాలయం11శతాబ్దిమధ్యకాలంలోఇంకాఖచ్చితంగాచెప్పాలనుకుంటేఅనంతవర్మవజ్రహస్త-5కాలంలో(1038-1070)నిర్మించబడిఉంటుంది.ఇంతచరిత్రా..అనంతఖ్యాతీఉన్నమూలవిరాట్టులఅతీగతీఈదేశానికీఈరాష్ట్రానికీఇంతవరకూపట్టలేదువీటిముందుఉత్సవవిగ్రహాల్లాంటిదేవాలయాలకి(ఇదిఆదేవాలయాలన్నాఆదేవుళ్ళన్నాభక్తిలేకగానీఆప్రాంతాలమీదద్వేషంతోగానీఅంటున్నమాటకాదుఈప్రాంతందుస్ఠితిగురించే) అద్భుతనీరాజనాలంటున్నపాలకులున్నఈదేశానికీఈరాష్ట్రానికీఇకముందైనాపడుతుందేమోనన్నఆశాకలగటంలేదు. 

............ ఇంక తర్వాతి కాలంలోకి వస్తే,


క్రిష్ణదేవరాయలు

కొండవీడూ మనదేరా
కొండపల్లీ మనదేరా
కాదని ఎవ్వడు వాదుకు వస్తే
కటకందాకా మనదేరా..
అనివొళ్ళుపోతరంతోపాడుకునేరాయలసీమపాటకజనంపాటవిని,దాన్నినిజంచేయాలని,పొట్నూరుదాకావచ్చిజయస్తంభంపాతేసి,కటకాన్నిపాలించినఅమితపరాక్రమశాలిగజపతినినెగ్గలేక,మాయోపాయంతోకళింగతోసంధిమార్గంచేపట్టిన,స్ఫోటకమచ్చల..అయిదడుగుల(46 ఏళ్ళకాలంమాత్రమేజీవించిన)క్రిష్ణదేవరాయలు,నేటికర్ణాటకవాస్తవులకీ,రాయలసీమవాసులకీ,తెలంగాణావాసులకీ,ఆంధ్రసీమవాసులకీ,ఆరాధనీయుడవ్వొచ్చేమోకానీ......కాళింగులకిఅంతవాడుఎలాఅవుతాడు..?ఎందుకవుతాడు..?
..ఇంకశ్రీక్రిష్ణదేవరాయలుకళింగజాతికి,కళింగరాజ్యానికీచేసినదిఏమిటన్నదానిదగ్గరకివస్తే,46సంవత్సరాలుమాత్రమేబతికినఆమచ్చలమొహంకర్ణాటకరాజు(రాయలసీమఇంకాఇవ్వాళ్టికీఅతనిపేరునేపిలవబడుతోంది.దానిసంగతికాళింగులకిఅవసరంలేదుగానీ)విజయాలనిదీర్ఘంగావర్ణిస్తూ.అల్లసానిపెద్దిరాజుగారురాసినఈపద్యాన్ని"తొలుదొల్తనుదయాద్రిశిలదాకితీండ్రించు....మాడెములువ్రేల్చెనొడ్డాదిమసియొనర్చె..గటకపురిగాల్చెగజరాజుకలగిపఱవ..."అనితియ్యగాపాడుకునేవాళ్ళల్లోమొదటవరుసలోనిలబడాలనిదెబ్బలాటకుతయారయ్యేకాళింగులగొప్పతనంచెప్పడానికి'ఆడిదంసూరకవి'లాంటివాడేముందుకురాలేకపోయేడంటే..నాటి..ఈనాటి..ఏనాటికళింగజనమైనావలసవాదులకు,ఎంతగాదాసోహమన్నారో..లెక్కఎవరుపెట్టగలరు.?
మిగిలినప్రాంతప్రజలకీ,దేవుళ్ళకీఏదైనాగొప్పపనిఅన్నదిచేసేడేమోకానీతననిపెళ్ళిచేసుకోకపోతే,కళింగయువరాణినిబలవంతంగాతెచ్చితనగుర్రానికినాడాలుకొట్టేవాడికిచ్చిపెళ్ళిచేస్తాననిచెప్పినఆమనిషిమాటా,దాన్నిశాసనంగా,చెక్కించిసింహాచలంలోదేవాలయంగోడలమీదనిలబెట్టినఅంశం..ఆమధ్యకాలంలోఎప్పుడోప్పుడుసిగ్గుపడినధర్మకర్తలు,ఆశాసనాన్నిఆగోడమీదనుంచితొలగించినసంగతిఎందరుగుర్తించేరు.?ఎందరురంగునాయకమ్మలు,హోలోల్గాలూ,జయజయప్రభలూ,అమ్మలక్కలూ,అంధత్వసంధ్యలూ..దాన్నడిగేరు..? అడగరు..ఎందుకంటేతెలీదు..అన్నమాటవెనుక..మాకెందుకు..మేంకాళింగులమైతేకదా..కళింగస్త్రీలైతేఅడగరు..కళింగపురుషులేవాళ్ళనిఆంధ్రావాళ్ళనుకుంటున్నఫ్ఫుడు..వాళ్ళేఈరోజుదాకాఏసంగతీఅడగనప్పుడువాళ్ళస్త్రీలెందుకుఅడుగుతారు?మేమెందుకుఅడగాలి?అదడిగితేమాకేంలాభం?వాళ్ళసంస్క్రుతిమాకన్నాదిగువస్థాయిదికదా.అన్నసిగ్గుమాలినభేషజమేకదా!అందుకు ప్రధాన కారణమవుతుంది.

(Contd..)
-----------------------------------------------------------------------------------------------------------
నిన్నటికినిన్నఈ'విశాఖపట్టణం.నాదిఅంటే..నాదని'అనిసుబ్బిరామిరెడ్డి,పురందరేశ్వరీదెబ్బలాడుకుంటే"ఇదేంఘోరం..ఇదేంచోద్యం..ఈవిశాఖపట్టణానికీమీకూఏంసంబంధం..అనిఅడగగలిగినవాడొక్కడూకనబడదెందుచేత?..ఇలాఎన్నిప్రశ్నలకైనాసమాధానంనిండుసున్నాయేకదా..!
అన్నఆవేదనకికొంచెంఉపశమనంకలిగించేవార్త నాఫేసుబుక్కుపేజీలో కనిపించింది.ఇదిమితవాదతత్వమేకావొచ్చుకానీఆవేదనఒకటే..ఈవార్తనురాసినపివిఎస్ఎస్ ప్రసాద్,విశాఖపట్నం,గారికి ధన్యవాదాలతో..ఈవార్తనివాడుకున్నందు కుక్షమించమనికోరుతూ..





అన్నీఉన్నాఅయిదవతనంలేదంటారు.ఇపుడువిశాఖకూడాసరిగ్గాఅలాంటిదుస్థితినేఎదుర్కొంటోంది.ప్రపంచంలోఏనగరానికిలేనివిశాఖకుమాత్రమేఉంది.ఇటుసముద్రం,అటుకొండలతోసహజసిద్ధమైనసౌందర్యంఈనగరానిది.సముద్రవాయు,రోడ్డురవాణావ్యవస్ధకలిగినఅరుదైనఅవకాశంకూడావిశాఖదే.అటువంటివిశాఖఅభివృద్ధిలోమాత్రంవెనకడుగువేస్తోందిఅంటేఅదిపాలకులతప్పిదమేతప్పమరేమీకాదు.పాతికేళ్లనుంచివిశాఖవలసపాలకులచేతులలోకివెళ్లిపోయింది...ఎక్కడనుంచోవిశాఖకువచ్చిఉపాధి,వ్యాపారప్రయోజనాలనునెరవేర్చుకున్నవారుఆనకరాజకీయాలపైదృష్టిసారించారు.ధనబలం,కులబలంతోఅలాగెలిచినవారుసొంతప్రయోజనాలుచూసుకుంటున్నారుతప్ప...తమనుగెలిపించినప్రాంతానికిఏమాత్రంన్యాయంచేయలేకపోతున్నారు.కాంగ్రెసుసీనియరునాయకుడుటి.సుబ్బరామిరెడ్డితోమొదలైనవలసపాలనఇపుడుపతాకస్ధాయికిచేరుకుంది. 
గతఏడాదిజరిగినసార్వత్రికఎన్నికలలో..వలసపాలకులు,అధికశాతంఎన్నికయ్యారు.ఫలితంగాప్రగతిఅధోగతిపాలైంది.ఇటీవలవలసపాలకులగురించిసీనియరుమంత్రిసిహెచ్అయ్యన్నపాత్రుడుఘాటైనవిమర్శలుచేశారు.ఎక్కడనుంచోవచ్చారంటూమరోమంత్రిగంటాశ్రీనివాసరావుపైఆయనశరసంధానంచేశారు.ఆయనఏఉద్దేశ్యంతోవ్యాఖ్యలుచేసినాజనంమాత్రంఆమాటలతోఏకీభవిస్తున్నారు. విశాఖకురావాల్సినరెండవపోర్టునుతనసొంతజిల్లాప్రకాశంలోనిరామాయంపేటకుతరలించుకుపోయినగంటావైనంజనంమరువలేరు.నాడుకాంగ్రెసుమంత్రిగాఉండి,ఆయనచేసిననిర్వాకంఇది.ఇకఅయిదేళ్లపాటుఎన్టీఆరుతనయ,విశాఖనుంచిపార్లమెంట్కుఎంపిగాఉన్నాకేంద్రంలోమంత్రిగాచేసినావిశాఖకుఒరగబెట్టిందిఏమీలేదు.అంతకుముందువిశాఖఎంపిగాగెలిచినమాజీముఖ్యమంత్రినేదురుమల్లిజనార్ధనరెడ్డికూడావిశాఖకువేళ్లమీదలెక్కపెట్టినన్నిసార్లుమాత్రమేవచ్చారు.ఇలాఎవరికివారువిశాఖనుముందుదగా,వెనుకదగాచేశారు.ఇపుడువిశాఖఎంపీగాఉన్నహరిబాబుకూడావలసవాదే.ఆయనప్రకాశంజిల్లాతిప్పసముద్రంనుంచివచ్చినవారు.కేంద్రంనుంచిపోరాడివిశాఖకురైల్వేజోనుతేవడంలో..బీజేపీఏపీరాష్ట్రఅధ్యక్షునిగాఉండికూడాహరిబాబుఏమీచేయలేకపోయారన్న,విమర్శను ఎదుర్కొంటున్నారు. 
అంతేనాహుధ్హుధుతుపానువల్లదారుణంగాదెబ్బతిన్నవిశాఖకువేయికోట్లుతక్షణసహాయంఇస్తామన్నప్రధానిమోడీమాటకూడానెరవేరలేదు.ఇప్పటికైతే650కోట్లరూపాయలుమాత్రమేవిడుదలఅయ్యాయి.విశాఖరాజధానికావాల్సినఅర్హతలుకలిగిఉన్నాకూడావలసపాలకులకుపట్టకపోవడంవల్లనేదక్కించుకోలేకపోయింది.ఇక,ఉత్తరాంధ్రవెనుకబాటుప్రాంతాలకుప్రత్యేకరాయితీలుకూడారాకపోవడంవెనుకకూడాప్రజాప్రతినిధులఅలసత్వంఉంది.విశాఖరైల్వేజోనుఓవేళకేంద్రంకేటాయించినాఅదివిశాఖకుదక్కుతుందాఅన్నదిఅనుమానమే.ఎందుచేతనంటేరైల్వేజోనుకోసంవిజయవాడప్రజాప్రతినిధులతోపాటు,సీమప్రతినిధులుకూడాపట్టుదలతోఉన్నారు.వారితోపోలిస్తేబలమైనవాణినివినిపించేనాధుడేవిశాఖలోకరవుఅయ్యారు. ఎయిమ్సువంటిసంస్ధలతోపాటు,త్రిపుల్ఐటీవిశాఖకురాకుండాపోవడంవెనుకకూడామనప్రజాప్రతినిధులనిర్వాకమేఉందన్నది..జనంమాటగాఉంది.విశాఖవిద్యలనిలయంగా,సాంస్కృతికరాజధానిగా,పర్యాటకరాజధానిగా,సినీరాజధానిగాబహుముఖంగాఎదిగేందుకుఎంతోఅవకాశంఉంది,కానీ,ప్రభుత్వాలవద్దబలమైనవాదనవినిపించివాటినితెచ్చుకోవడంలోమాత్రంమనప్రజాప్రతినిధులువిఫలమవుతున్నారు.ఎన్నికలవేళప్రజలునాయకులుఏప్రాంతానికిచెందినవాడుఅన్నదానినిచూసుకోకుండాఓటువేయడమేఇపుడుచేటుతెస్తోందన్నమాటకూడావినిపిస్తోంది.వలసపాలకులుఎపుడూతాముపుట్టినగడ్డపైనేమమకారంచూపుతారుతప్ప,బతుకుతెరువుఇచ్చినప్రాంతంపట్లకాదన్నదిపదేపదేరుజువుఅవుతోంది.ఈనేపథ్యంలోవిశాఖలోపుట్టిపెరిగినవారైనారాజకీయంగా,ఆర్ధికంగానష్టపోతున్నవిశాఖపైభారీఉద్యమంచేపడితేనేతప్పఈప్రాంతంపైపాలకులకుచూపుపడదన్నదినిర్వవాదాంశం.ఏదిఏమైనావలసవాదాన్నిస్ధానికులుగట్టిగావ్యతిరేకించేరోజులురాకముందేఇక్కడనుంచినెగ్గినవారుతమబాధ్యతలనుత్రికరణశుద్ధిగానెరవేర్చాల్సిఉంటుంది.లేకపోతే,జనచైతన్యంవెల్లివిరిసినవేళ,ఈతాజామంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలంతామాజీలయ్యేరోజుఎంతోదూరంలోలేదన్నదివాస్తవం.
పివిఎస్ఎస్ ప్రసాద్,
విశాఖపట్నం,
-------------------------------------------------------------------------------------------------------------------