కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

23, మే 2015, శనివారం

"కళింగులు శిల్పకళా చాతుర్యంలో ఆరితేరినవారు"

            

కళింగులు శిల్పకళా చాతుర్యంలో ఆరితేరినవారుదేవాలయ నిర్మాణంలో వాళ్ళు పూర్తిగా దక్షిణాది వారి శైలినేఅనుకరించిన వారు కాలేదుమధుకేశ్వరాలయం చూసినప్పుడు ఆసంగతి స్పష్టంగా కనబడుతుంది.


...వస్తుశిల్పంలోచలనద్రుక్పధం,వీరిశిల్పకళలోకొట్టొచ్చినట్టుకనబడే,నైపుణ్యంఈదేవాలయాలలోఉన్నప్రత్యేకశిల్పాలనేకం..కనుబొమలు,చెతివేళ్ళుశిల్పకళలోవీరికున్నగొప్పతనాన్నితెలియచేస్తాయి.వాళ్ళనైపుణ్యాన్నివేలసంవత్సరాలతర్వాతకూడాపరిశీలించినవారు,రెండుచేతులూపైకెత్తిమరీఆశిల్పులనిర్మాణకౌశల్యానికినమస్కరించవలసిందే.ప్రాచీనకళింగదేశంలో'కళాకన్య'తనబంగారుగజ్జెలతోనర్తించి,దేశదేశాలనీ,తనగానంతో,ఉత్కంఠపరిచేదని,చాలా...కొద్దిగానేఇంకామిగిలిపోయున్న సాక్ష్యాలు..ఢంకామీదకొట్టినట్టుగాచెపుతాయి....గుర్తించగలమా..లేదా అన్నదే..మిగిలున్న ప్రశ్న.

*అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన మధుకేశ్వరాలయంలోని కొన్ని శిల్పాల గురించిన వివరాలలోకి వెళితే....


ముఖలింగదేవాలయం,చుట్టూప్రాకారంఉంది.లోపలదేవాలయం.దానిచుట్టూఅష్టదిక్పాలకులుకళ్యాణమండపాలుదీని,నిర్మాణంలోనిభాగాలు.ప్రాకారంసింహద్వారానికిఎదురుగాఉండేధ్వజస్ఠంభం,నడివీధిదానిగామారిపోవటానికి,కారణందేవాలయప్రాంతం,ఆక్రమణలకి,లోనవ్వడమే.....







1.ధ్వజస్ఠంభంఎదురుగాసింహద్వారం,ద్వారానికిరండుపక్కలారాతితోచెక్కబడినవెనుకకాళ్ళమీదకూర్చున్నరెండుసింహాలుకనబడతాయి.గుడిలోకివెళ్ళటానికి,మెట్లుఎక్కుతున్నపుడుసింహద్వారానికిముందుఎడమవైపు,ఒకశిల్పంతోకూడినఱాయివుంటుంది.దానిమీదఒకవిలుకాడిబొమ్మ,అతడికివింజామరతోవిసరుతున్నమరొకతనిబొమ్మచెక్కబడిఉన్నాయి.అంతేకాకుండా,ఆవిలుకాడుతనకాళ్ళకిందఒకవ్యక్తినితొక్కుతున్నట్టుగాఆరాయిమీదచెక్కబడిఉంది...ఒకరాజుతనశత్రువునుజయించికాళ్ళకిందతొక్కి,అవమానిస్తున్నట్టుగానే,అనుకోవాలి.
  మంటపంలాఉన్నసింహద్వారానికి,రెండుపక్కలాఉన్నస్థంభాలమీదసింహద్వారంగోడలమీదప్రాచీనగాంగవంశపురాజులువేయించినశాసనాలుచాలానేఉన్నాయి.




2.సింహద్వారానికిఎడమపక్కనేమరొకరాతిపలకఉంది.దానిమీదఒకపురుషుడు,స్త్రీలింగరూపంలోఉన్నశివుడినిపూజిస్తున్నట్టుచెక్కబడిఉంది.శివలింగానికిపైనసూర్యచంద్రులబొమ్మలువాటికిందఒకహస్తంకూడాకనబడతాయి.ఆశిల్పంలోవ్యక్తివివరాలుచెప్పేఆధారాలురాసిలేవు,కానీఆమధుకేశ్వరఆలయాన్నినిర్మించినరెండవకామార్ణదేవుడిదేఆబొమ్మఅనిఅనుకోవడంసరైనదేఅవుతుంది.

3.సింహద్వారందాటిలోపలకిఅడుగుపెట్టగానే,ఒకపెద్దనందివిగ్రహంకనిపిస్తుంది.ఆనంది,కెదురుగాఒకమంటపం,ఆమంటపంలోనికి,ఒకద్వారంకూడాకనిపిస్తాయి..ఆద్వారానికి,రెండుపక్కలాఉన్నగోడలరాళ్ళమీద,చెక్కినన్రుత్యభంగిమల్లోఉన్నటువంటి,స్త్రీలబొమ్మలుకనిపిస్తాయి.ఆవిగ్రహాలనుఅక్కడచెక్కిన,శిల్పిదేనిని,ఉద్దేశించిఆరూపాలనుచిత్రీకరించేడో,ఆకాలంనాటి సామాజిక పరిస్థితుల విశ్లేషణ జరిపితేనే కానీ తెలియదు.


ఆ ద్వారాన్ని దాటి లోపలకి ప్రవేశిస్తే,చిన్న నంది విగ్రహం, దానిపైన విశాల ప్రాంగణం కనిపిస్తాయి.దేవాలయ శిఖరం కూడా కనిపిస్తుంది.ఇది రెండవ సింహద్వారం అవుతుంది.ఇది మొదటి దానికంటే చిన్నది.ఈ ద్వారానికి తలుపులు లేవు.అంతా శిల్పమయమే.ఆ ద్వారాన్ని దాటి లోపలకి వెళ్ళేక వెనక్కి తిరిగి చూస్తే,

4.ద్వారం పైన ఒక ఏడెనిమి అడుగుల పొడవు అడుగున్నర వెడల్పుతో ఉన్న ఒక రాతిమీద చెక్కిన కథాచిత్రం మనకెన్నో విశేషాలను చెప్పేదానిలా కనబడుతుంది.ఆ పలక మధ్య్ల లో ఒక చెట్టు,ఆ చెట్టుకు ఎడమపక్క ఒకవేదిక మీద కూర్చున్న ఒక వ్యక్తి అతడికి వింజామరతో విసురుతున్న మరొక మనిషి కనిపిస్తారు.అతనికి వెనుక 15 మంది శాంతపురుషులు స్థిరంగా కూర్చున్నవాళ్ళు కూడా కనిపిస్తారు.చెట్టుకు కుడివైపునుంచి బలమైన కత్తి పట్టుకుని ఒక మనిషి ప్రాకుతూ వస్తున్నట్టు,అతను ఆ చెట్టును నరకాలనే వస్తున్నట్టు కనబడుతుంది..అతని వెనకాతల ఇద్దరు స్త్రీలు ఉంటారు.వాళ్ళల్లో ఒకామె నిలబడిరెండు చేతులూ జోడించి కనబడుతుంది.రెండో ఆమె కూర్చుని ఉంటుంది.ఆ ఇద్దరు స్త్రీల వెనకా 21 మంది ఆయుధపాణులైన క్రోధావేశపరులైన పురుషులు కూడా నిలబడి ఉంటారు.వేదికమీద కూర్చున్న వ్యక్తి అతనిని వారిస్తున్నట్టు కనిపిస్తుంది.బొమ్మ మధ్యలో ఉన్న చెట్టు మొదట ఒక పద్మపీఠం కనబడుతుంది. ఈ రాతి పలకలోని చిత్రం మొత్తం మనకి ముఖలింగ క్షేత్ర మహాత్మ్యం కథను చెపుతున్నట్టే కనబడుతుంది.
       
      ఈచిత్రంలోచాలాస్పష్టంగాకనిపిస్తున్నమనుషులవస్త్రధారణ,కేశాలంకరణ ,కళింగజాతిజనులకీఇతరప్రాంతాలజనులకీఉన్నటువంటి,సంస్క్రుతీ,సంప్రదాయాలభేదాలనీ,రూపురేఖావిలాసాలలోనితేడాలనీకొట్టొచ్చెలా చూపుతాయి.వీటినిబట్టిక్రీ.స్తుశకారంభంలోనివశించినట్టికళింగదేశస్తులనుగురించిచాలావివరాలనూతెలుసుకోవచ్చు.తలలమీదఒకవైపున్నగుండ్రనితలకొప్పులు,నడుములచుట్టూబిగదీసికట్టినఅంగవస్త్రం,దానిమీదబిగించినకాసె,మొలనూలు,చూసేవాళ్ళలోఆసక్తినిరేకెత్తించేలా,ఇవితమజాతిపూర్వీకులవిఎంతమాత్రంకావనిఇవివేరేజాతివాళ్ళపూర్వీకులవని,వాళ్ళుకళింగులేననీ,ఇతరప్రాంతవాసులకిచూడగానేఅర్థమైపోయేలా,ఈరోజుకీకనిపిస్తాయి.ఆయుధాలతో,నిలబడ్డవాళ్ళెవ్వరికీవొంటిమీదరెండోవస్త్రంఏదీలేదు.వాళ్ళమెడలోహారాలుమాత్రమేకనిపిస్తాయి.చెట్టునరకాలనిముందుకువస్తున్నఅతని,ముంజేతులమీదకంకణాలు,మురుగులుకనబడతాయి.అతనివక్షస్థలంచుట్టూమరొకవస్త్రం(కంచుకంఅనొచ్చేమో..)అతనుమిగిలినవారందరికీఏలికఅన్నభావాన్నికలగచేస్తుంది.

(అలాఅంతతేడాగాకనిపించినా,కనిపిస్తే.వాటిగురించిఏఆలోచనాఈనాటికీ,రానికళింగులని,చూసిన,ఆసామాన్యకౌశల్యాపూరితుడైనచిత్రకారుడిఆత్మఅనేదేదైనా,ఇంకాఉంటే..దానిబాధకికొలతఉంటుందా..?)


ఈ రాతి పలక మీద పదిచేతులున్న చండికాదేవి శిల్పం కూడా దానంత పాతదే కనిపిస్తుంది.ఆ మూర్తి చేతుల్లో వున్న వస్తువులను సింహాసనారూఢ అయిన ఆ ప్రసన్న వదనాన్ని చూస్తే ఆమె కాళికా దేవా..? లేకపొతే జైన మత 'చక్రేశ్వరీ'దేవా..అన్నఅనుమానంకూడాకలుగుతుంది.




5.ముఖమంటపంగోపురాన్నిచూస్తే,ఆగొపురం4పలకలమీదపైకిలేచికనబడుతుంది.ఆపలకలనే,ఆగమశాస్త్రంలో'భూమికలు'అంటారు.ఈనాలుగుపలకలమీదాఅందమైనచిత్రాలుచెక్కబడిఉన్నాయి.

6.మొదటిపలకమీదఆరుహంసలు,వాటిలోరెండేసిహంసలమధ్య,ఒకపదహారురేకులకమలం,చెక్కబడిఉన్నాయి.దానిమీదున్నపలకమీదఇరువురుమల్లయోధులుద్వంద్వయుధ్ధంచేస్తూకనిపిస్తారు.వాళ్ళచుట్టూజనసమూహం,కొంచెందూరంలో,ఎడమవైపురాజు,రాణి,కూర్చునిఉన్నట్టు,వాళ్ళకిఇద్దరుసేవకులుయుధ్ధంగురించివివరిస్తున్నట్టు,రాజుతనచెవినిచెపుతున్నవానిమాటలపైకెంద్రీకరించినట్టు,స్పష్టంగాఅర్థమవుతుంది.రాణీకిఎడమవైపుఅంతఃపురస్త్రీలు,వాళ్ళపాదాలదగ్గర,సేవికలుసుఖంగాకూర్చున్నట్టు,కనిపిస్తుంది.మల్లయోధులున్నప్రాంతానికికుడివైపు,జనసమూహానికిపైనబ్రాహ్మణసమూహంకూర్చున్నట్తు,వాళ్ళముందుయేనుగులుతలపడుతున్నట్టుకనబడుతుంది.అనుభవపండితులు,చెప్పినమేరఆయుధ్ధం,శ్రీక్రిష్ణ,చాణూరుల...మల్లయుధ్ధమనీ..చూస్తున్నరాజు'కంసుడ'నీ,యేనుగులకాళ్ళదగ్గిర,కనిపిస్తున్నదిబాలక్రిష్ణుడనీఊహించాలి.

ఇందులో...ఆశ్చర్యంకలిగించేదేమిటంటే,అయిదారుగజాలపొడవు,అడుగున్నరకిమించివెడల్పువుండని,ఆపలకమీద,ఈవివరాలన్నీచెక్కడంలోశిల్పిచూపించినచాతుర్యం..ఆనైపుణ్యాన్నివేయినోళ్ళతోపొగిడితీరాల్సిందే..సూక్ష్మంగాబొమ్మలుచెక్కడమేకాదు..జనసందోహం,హావభావాలనికూడావేలఏళ్ళపాటునిలిచిపోయేలా,స్పష్టంగాచెక్కినఆఅపరమయుడికితలవొంచినమస్కరించాల్సిందే.

7.అంతకన్నాపరమానందాన్నీ,నిబిడాశ్చర్యాన్నీకలిగించేశిల్పం,ఆపైనున్నపలకమీదకనిపిస్తుంది.ఇందులోతనపేరు,ఎవరికీచెప్పాలనేఆలోచన,తనరూపుఅందరికీతెలియాలనే,కోరికఅసలెంతమాత్రంలేని,ఆశిల్పశేముషి,రాజువేటాడేవిధానాన్నిరూపుకట్టించేడు.వేగంగాపరుగెడుతున్నగుర్రాలనీ,విల్లునుచెవిదాకాలాగిజంతువుమీద,తనలక్ష్యాన్నిగురిచూస్తున్నరాజుని,ఇతరవేటగాళ్ళనివివరంగాచూడగలం.అంతేకాదు.ఆవేటగాళ్ళవెనకసంహరింపబడినజంతువులనుకర్రలకివేలాడదీసుకుని.వాటినిమోసుకువెళుతున్నసేవకులూకనబడతారు.వాళ్ళవెనకతప్పెటలువాయించేవాళ్ళు,మద్దెలవాయించేవాళ్ళుతమవాయిద్యాలకిపనిచెపుతూకనిపిస్తారు.బూరలుఊదేవాళ్ళు,శ్రుంగనాదాలుచేసేవాళ్ళూకనిపిస్తారు.వాళ్ళవెనుకకొందరుమ్రుగాలనుమోసుకువెళుతుంటే,కొందరుఆయుధాలనుపట్టుకునిపరుగెడుతున్నారు.కొందరుఆశ్వికులు,బల్లేలనుపట్టుకుని,గుర్రాలనునడిపించుకుంటూవెళుతున్నారు.ఈశిల్పంలోనేఎడమవైపుసగభాగంలోవేటకుఉద్దేశించినమ్రుగాలుమరికొన్నిపరుగులుతీస్తున్నట్టూ,వాటికిముందూ,వెనుకాఆశ్వికులు,వేటగాళ్ళుఆయుధాలుధరించిపరుగుపెడుతున్నట్టుకనిపిస్తుంది.రాజులమ్రుగయావినోదాన్నిజీవంఉట్టిపడేలా...ఇంతఅందంగా,చిత్రీకరించినశిల్పంమరెక్కడాకనబడదు..ఇదిఒకపురాణగాధగానీ,చారిత్రకఅంశంగానీకానేకాదు.ఒకసామాజికఅంశంమాత్రమే..ఆరోజుల్లోఇలాచిత్రీకరించాలనుకున్నశిల్పిగొప్పతనాన్నిగానీ,ఆపనికిఅతన్నిపురికొల్పినరాజుకళాభిరుచినిగానీ,ఏఇజంఅనిచెప్పాలి,దీనిమీదద్రుష్టిఎవరూ..ఏనాడూ..ఎందుకుపెట్టరు..కళింగ శిల్పమనా..?

8.ఇంక,ఆఖరిపలకనిచూస్తే,'యేనుగులవేట',అందులోచిత్రితమైఉంది.ఇదికళింగరాజులకు,తర్వాతికాలంలోని,గజపతులకుఎంతోఇష్టమైన'గజవేట'.ఈపలక,ఎడమభాగంలోఒకవేదికమీదతనచుట్టూచేరినసేవకులు,ఖడ్గహస్తులు,ధనుర్విద్యానిపుణులు,పరిచారకులుమధ్యఒకకులీనపురుషుడుకనిపిస్తాడు.......వాళ్ళముందుమచ్చిక,అయిఉన్నయేనుగులమీదకూర్చున్నమావటివాళ్ళు,యేనుగులవేటజరుపుతున్నారు.వాళ్ళముందుతాళ్ళతో,బంధింపబడ్డఅడవియేనుగులు పారిపోవాలని ప్రయత్నిస్తున్నట్టు ఈ శిల్పంలో కనిపిస్తుంది.

కొంచెంముందుకువెళితే,ఆరుస్థంభాలతోఉన్నముఖమంటపంఉంటుంది.ఈస్తంభాలపై శిల్పాలు లేవుగానీ చాలా శాసనాలు చెక్కబడి ఉన్నాయి.ప్రతీఏడూ వీటిమీద సున్నం పూతలు పూస్తూ ఉండటం వల్ల వాటి ఉనికి చాలావరకూ పోయింది.కొన్ని వైష్ణవ శిలావిగ్రహాలు ఎక్కడనుండో తెచ్చి ఉంచినట్లనిపించేవి కనిపిస్తాయి..ఒక శాసనంలో ఈ ప్రాంతంలో ఉన్న వైష్ణవ దేవాలయం ప్రస్తావన ఉంది..కానీ ఆ దేవాలయం ఇప్పుడెక్కడాలేదు. ఇక్కడ ఉన్న శిల్పాలు ఆ దేవాలయం తాలూకావి అయిఉండవచ్చు.అవి త్రివిక్రమావతారమూర్తి,దానికి కుడివైపున వరాహమూర్తి.ఆ విగ్రహం కింద అమరావతి లోకనిపించే నాగకన్యల విగ్రహాలవంటి ఇద్దరు నాగకన్యలు.ఈ విగ్రహాల నడుము నుండి పైవరకు మనుష్య రూపం తలవెనక పాము పడగ, నడుము కింది భాగమంతా సర్పశరీరము కనబడతాయి. ఇందులో ఒక నాగకన్య చేతిలో తామర పద్మం ఉంది.దాని మీద వరాహమూర్తి ఎడమ పాదం ఆన్చి ఉంది. రెండవ నాగకన్య తనరెండుచేతులతో,ఆమూర్తి కుడికాలును పట్టుకున్నట్టు కనిపిస్తుంది.ఇక్కడ వరాహమూర్తి విగ్రహరూపానికీ, దక్షిణాది దేవాలయాలలో కనిపించే రూపానికీ చాలా తేడా కనిపిస్తుంది.ఈ మూర్తికి నాలుగు చేతులు ఉంటాయి.పై రెండు చేతుల్తోఈమూర్తిభూమినిగట్టిగాపట్టుకున్నట్టుఉంటుంది.మిగిలినరెండుచేతులలో,కుడిదానితోచక్రాన్నీ,ఎడమదానితో,శంఖాన్నీపట్టుకున్నట్టుకనిపిస్తుంది.వరాహమూర్తివిగ్రహంవెనకసూర్యనారాయణుడిరూపం ఉంది.ఆరూపం తలవెనక తేజోవంతమైనకాంతి పుంజం కనబడుతుంది.రెండుచేతులలో,రెండు దీపాలు ఉంటాయి.(ఎరుపు తెలుపు దీపాలనే అనుకోవాలి.)

9.సూర్యదేవుడివిగ్రహానికి,కుడిపక్కనగరుడనారాయణుడివిగ్రహంఉంది.ఈముఖమంటపంలోనే,మరోపక్కఅత్యంతమనోహరమైన,వేరెక్కడా,కనిపించనటవంటి,'సౌభాగ్యవాగీశ్వరీ'విగ్రహంకనిపిస్తుంది.దానిగురించిస్థానికులు.....ఆవిగ్రహంముందునుండీఅక్కడున్నదికాదనీ,ఊరిచివరనున్నపొలాన్నిదున్నుతున్నప్పుడుదొరికిందనీఅప్పుడుతెచ్చిఅక్కడపెట్టేరనీచెపుతారు.సుందరమైనమోముతో,మందస్మితాలైనపెదవులతో,నిమీలితాలైననేత్రాలతో,ముగ్ధమోహనంగాకనిపించేఈవాగ్దేవినిచూసినవారిమనసులు,నేత్రాలూభక్తితోనిండిపోతాయి.ఈమాతవిగ్రహంలో,కొన్నిశైవలక్షణాలూకనిపిస్తాయి.ఆమెజడశివుడిజటాజూటంలాచెక్కిఉంటుంది.దానికిఎడమవైపుచంద్రకళఉంటుంది.సుఖాసీనఅయినఆమెముందున్నరెండుచేతులతోవీణనిపలికిస్తున్నట్టుకనబడుతుంది.వెనుకవున్నఒకచేతిలోపుస్తకంకనబడుతుంది.రెండవచేతిలోకమలంకనబడుతుంది.ఈశిల్పాన్నిచెక్కినశిల్పిపనితనం,మనకిఎనలేనిఆశ్చర్యాన్నికలిగిస్తుంది.నిత్యపూజలందుకున్నకాలంలోఆదేవి,వైభోగంఎంతగొప్పగా ఉండెదోనన్న భావం మనలో కదలాడుతుంది.

*ఈపోష్టులోపేర్కొన్నశిల్పాలలోకొన్నికనబడవు..కొన్నిభక్తులుభక్తిఎక్కువైపూసినదట్టమైనపసుపుకుంకుమలవల్లరంగు,రూపాన్నికోల్పోయేయి.మహానుభావులు'మహారాజశ్రీభావరాజువేంకటక్రిష్ణారావు'గారు,సందర్శించినపుడు(సుమారునూరుసంవత్సరములకిందటిమాట)ఆయనవెల్లడించినవిషయాలనుమాత్రమే,నేనుఇక్కడతెలియజేయడంజరిగింది.వారి స్ఫూర్తికి,నామనఃపూర్వ క వందనాలు.


(మధుకేశ్వరస్వామిగురించి..మరికొన్నిఇతరఆలయాలలోనిశిల్పాలగురించీ..తర్వాత పోష్టులో..)







17, మే 2015, ఆదివారం

"కనగ కళింగదేశమున కాలిడుటెంతయు దోషమన్న..."


చ. కనగ కళింగదేశమున కాలిడుటెంతయు దోషమన్న* నిం
    దను దొలగించుకొంటివి పినాకి మతంబున సింహభూధరం
    బును ముఖ లింగ కూర్మములు మున్నగుచోటశివాలయంబులన్
    బొనరిచి,పుణ్యభూమివయి పొల్చితి గాంగులచే గళింగమా.!

             (*క్రీ.పూ 3వ శతాబ్ది ప్రాంతంలో 'బొధాయనుడ'న్నమాట.)



చ. మొదట దయారసంబెసగు బుధ్ధుని శాంతమతంబు గ్రోలియున్
    పదపడి నీవు వీరరస భాసుర శైవ మతంబు పూని తూ
    ర్పుదెస గలట్టిదీవులను ముట్టితి వెంతయు ధైర్యశాలివై
    యెదిగితి చోళగంగ విభులేలిన కాలమునంకళింగమా..!





 పైన పేర్కొన్న రెండు పద్యాలూ ఈనాటి వారి తాత,ముత్తాతల కాలం లో గొప్ప వేదపండితుడిగా పేరు పొందిన బ్రహ్మశ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు వంద ఏళ్లక్రితం తన కళింగ రాజ్య వర్ణనలో రాసినవి.ఇవి క్లిష్టమైన సంస్క్రుత సమాస బంధురాలు కావు కనుక వీటి ప్రతిపదార్ధ తాత్పర్యాల జోలికి నేను వెళ్ళాలనుకోవటంలేదు.


ఒక గొప్ప చరిత్ర కారుడు చెప్పిన ఇంగ్లీషు భాషలో ఉన్న మాటను తెలుగులోకి తర్జుమా చేస్తే కిందివిధంగా ఉంటుంది.
"ఒక మనిషిని హత్య చెయ్యడం హంతకులకి కష్టసాధ్యమైన పనే..ఇంకా అవే చేతులతో,అతడి తోటలోనే అతణ్ణి పాతిపెట్టడం అన్నది.. ఇంకా కష్ట సాధ్యంఆహత్య చేయబడ్డవాడు, తన ఇంట్లోకి.. తనే స్వయంగా నడిచివస్తే,జరిగిన సంగతులు చెపితే...ఆహత్య చేయడంలో హంతకులందరూ విఫలమైనట్టే...."
ఇక్కడహత్యచేయబడ్డది...'కళింగరాజ్యచరిత్ర'అన్నదేనాభావన.....అదే...సాక్ష్యాలు, ఆధారాలు నా ప్రయత్నాలమేరకు సంతరించగలిగిన వాటినన్నిటినీ కూడదీసి, కళింగదేశచరిత్ర సమూలంగా చెప్పాలనుకోవడం వెనుక ఉన్న నా ఆ లోచన..ఇప్పుడెవరూ పెద్దగా పట్టించుకోని"ముఖలింగ క్షేత్రం చరిత్ర" కళింగ రాజ్య చరిత్ర కి జరిగిన హత్యకు సాక్షీభూతం గా నిలుస్తుంది.  
ఇక్కడకళింగదేశచరిత్ర,చెప్పడంలోజరిగినసంగతులుఏవిముందు..ఏవి..వెనుక..అన్నది,నాపరంగాప్రధానంకాదు.మొదటనుంచీజరిగినవీ,ఇప్పుడుజరుగుతున్నవీ,కూడాఅన్యాయాలేఅయినప్పుడు,అవుతున్నప్పుడు.నేటికళింగవాసులెప్పుడూ,నిద్రపోవటమేఇష్టమైన,సింహాలుగాఎన్నితరాలక్రితమో..ఎప్పుడోమారిపోయి,ఇంకానిద్రలోనేనిండాములిగిపోయి,బొమ్మసింహాలుగానే మిగిలిపోయి ఉన్నప్పుడు,వెనకా...ముందా...అన్నది,ప్రధానంగానిలబడదుకూడా..జరిగినవా.జరగనివా...అన్నదేప్రధానం.గతించినవ్యక్తుల,ప్రాంతాలదురాగతాలుచెప్పడమంటే.....ఆవ్యక్తులని,ప్రాంతాలని,అవమానపరచాలనే,లక్ష్యంతోమాత్రం కాదు అని నా మనవి.




ముఖలింగ గ్రామం చాలా పురాతనమైనదని ఒకానొక కాలంలో ఇది గాంగ వంశ రాజుల రాజధాని కళింగ నగరంలో అంతర్భాగమే నని చెప్పడానికి సందేహమేమీ అవసరమే లేదు.అక్కడ ఇప్పుడున్న దేవాలయాల మీది శాసనాలుచాలు.


ఇంకా,నేడుఘనమైపోయిననాటిఘనచరిత్రతెలియాలంటే,ఇతరరాష్ట్రాలఆర్కియాలజీశాఖల్లోఎవరూపట్టించుకోకుండామూలపారేసినశిల్పాలు,శాసనాలు,ఇతరదేశాలమ్యూజియంలోకొలువుచేస్తున్న,భారతదేశపురాతన,వస్తుసంపదాతప్పకుండాచెపుతాయి.ఆవిషయంమీద,పరిశీలనాసక్తి,పరిశోధనాకాంక్షఉన్న వ్యక్తులు వెతికి చూస్తే చాలు..అది నెరవేరడం కూడా  చాలా కష్టమైన.. ఒక చాలా పెద్ద ఆశ.


వంశధారానది,ఒకప్పుడుప్రస్తుతగ్రామానికిఇరుపక్కలాప్రవహిస్తూఉండేదనడానికి,ప్రబలతార్కాణాలుకనబడతాయి.ముఖలింగానికితూర్పుగావున్నకరకవలస గ్రామానికి చేరువలో ఉన్న పద్మనాభుని కొండనానుకుని కూడా ఈ నది,ప్రవహించేదని ఆకొండపాదాల జాడలని పరిశీలిస్తే ,స్పష్టంగా అర్ధమవు తుంది. పూర్వంకళింగ రాజ్యం అత్యంత వైభవోపేతంగా విలసిల్లేటప్పుడు రాజవంశీయులునౌకావిద్యనేర్వడానికి వంశధార నది ఉపయుక్తంగావుండెదని భావించేందుకు,అక్కడఓడలనిర్మాణంకూడాజరిగేదని,ఊహించేందుకుఊతంగా,చరిత్రలోనిలబడిన..రెండుగ్రామాలపేర్లుకనబడతాయి.ఒకప్పుడువాడవలస(ఓడలవలస),వాడపిల్లి(ఓడలపల్లి)అనేరెండుగ్రామాలుఒకదానికిమరొకటిఅరమైలుదూరంలోఉన్నట్టుగా,చరిత్రచెపుతుంది.ఇప్పుడుఆనౌకావ్యాపారవైభోగం,అంతరించిపోవటంచేత,వాడవలసగ్రామంకూడాకనుమరుగైపోయింది.వాడపిల్లి మాత్రమే కనబడుతుంది.


వంశధారనది,ఒడ్డునప్రాచీనముఖలింగనగరకోటఉండేదని,బలంగాచెప్పవచ్చు.అందుకుప్రస్తుతంమట్టిదిబ్బలయిపోయినఆధారాలుమౌనంగాఆసంగతిచెపుతూఉంటాయి.బ్రహ్మశ్రీగిడుగురామమూర్తిపంతులుగారుతానుతనచిన్నతనంలో,చూసినప్పుడుకోటగోడలజాడలు,స్పష్టంగాకనిపించేవనిశ్రీభావరాజువేంకటక్రిష్ణారావుగారితోచెప్పినట్టుఆయనరాసేరు.ముఖలింగంలోచూడవలసినఎన్నోచారిత్రకవిశేషాలు,చరిత్రపుస్తకాలప్రకారంఉన్నాయిగానీ,అవిశిధిలాలుగామారిపోవటంచేతా,మట్టిలోకూరుకుపోవటంవల్లా,సామాన్యులకి,కళింగరాజ్యచరిత్రగానీ,అందులోముఖలింగనగరానికిఉన్నప్రాముఖ్యతగానీఅవగతంచేసుకునేఅవకాశం అసలెంతమాత్రం లేకుండా పోయింది.


 'అమరావతి'మీదపాలకులకున్నఆసక్తి,అభిరుచి,ముఖలింగంమీద,కొద్దిపాటిగా అన్నా ఉంటే ఆ స్థల చరిత్ర సిరాతో రాసిన దానిగా మిగిలిపోదు. అందరికీ ఆ నగరం ఎంతో ప్రాచీనతను కలిగి ఉన్నదానిగా చెప్పేటందుకు మూడు దేవాలయాలుమాత్రమేనిలిచిఉన్నాయి.అవిముఖలింగేశ్వరాలయము,సోమేశ్వరాలయము(అణ్యాంక)భీమేశ్వరాలయము.వీటిలోఒక్కశ్రీముఖలింగేశ్వరాలయం తప్ప మిగిలిన రెండూ గుర్తులుగా నిలబడి ఉన్నవి మాత్రమే.ఈ ప్రాంతం చరిత్రకారులు అకుంఠిత దీక్షతో గతకాలపు స్మ్రుతులను పైకి తియ్యాలన్న నిర్దిష్ట లక్ష్యంతో, నిరంతర తలంపు తో ప్రయత్నిస్తే, కళింగ వాసులకు తమ ప్రాంతంమీదఅంతులేనిప్రేమనీ,ఇతర ప్రాంతాలవాసుల కి తమ ప్రాంతాలకన్నా ఎంతోమిన్నగా,ఎంతకాలం కిందటో ఖ్యాతిగాంచిన దీ ప్రాంతమని తెలిసి గగుర్పాటు చెంది ఆదరం తో అభిమానంతో అక్కున చెర్చుకొనేలా చేసే చరిత్రను చెప్పగలవీ దేవాలయాలు.




శ్రీముఖలింగేశ్వరాలయం


శ్రీముఖలింగేశ్వరాలయం క్షేత్రపురాణం:



ముందు,ముఖలింగేశ్వరాలయంక్షేత్రపురాణంగురించికొంచెతెలుసుకోవలసినఅవసరంఉంది.ఆకథలోకివస్తే..ద్వాపరయుగంలోవంశధారనదివొడ్డునవామదేవుడనే,తపోధనుడైనరుషి,ఒకయాగాన్నినిర్వహించాలనుకున్నాడు.ఆయాగానికిఆరుషి,దేవతలనీ,గంధర్వులనీ,యక్షులనీ,కిన్నరులనీ,కింపురుషులనీ,సిధ్ధులనీ,సాధ్యులనీఅందరినీఆహ్వానించేడు.ఆయనఆశ్రమానికితూర్పుదిక్కుగామధూకవ్రుక్షాలతో(ఇప్పచెట్లు)కూడినమహారణ్యంఉండేది.అందులోకిరాతజాతిప్రజలుజీవిస్తూఉండేవారు.అప్పట్లోనాగరికతఅంతగా,తెలీనిజాతిప్రజలు దిగంబరంగానేఉండేవారు.ఆరుషిపిలిచినయాగానికివచ్చినగంధర్వపురుషులుమధూకఅరణ్యంలోవిలాసంగాతిరుగుతూదిగంబరంగాకనిపించినకిరాతజాతిస్త్రీలసౌందర్యానికిపరవశులైతామువచ్చినపనినేమరిచిపోయేరు....తనుచేస్తున్నయాగంపూర్తిఅయ్యేక,హాజరైనవారికిహవిస్సులను,పంచేసందర్భంగావామదేవరుషిగంధర్వులను,పిలిచినప్పుడు,కిరాతస్త్రీలనుకూడి,ఉన్నందునగంధర్వులుఎవరూ,వాటినిఅందుకునేందుకురాలేదు.తనతపోద్రుష్టితోచూసివిషయాన్నితెలుసుకున్నవామదేవరుషికుపితుడై,ఆగంధర్వులందరినీ,కిరాతులై,పొమ్మనిశపించేడు.ఆసంగతినారదమునీంద్రుడిద్వారావారికితెలిసి,భయంతోఆమునిపాదాలమీదవాలితమనిక్షమించమనివేడుకున్నారు.వాళ్ళపశ్చాత్తాపానికి,రుషిప్రసన్నుడై,ద్వాపరయుగాంతంలో,ఆప్రాంతంలోశివుడుమధుకేశ్వరస్వామిగావెలుస్తాడనిఆశివలింగదర్శనాన్నిపొందినవెంటనేగంధర్వులకు శాపవిమోచనం జరుగుతుందనీ  వాళ్ళ కి వరాన్ని ప్రసాదించేడు.


  ఆ శాపవశులైన గంధర్వులు కిరాతులై జన్మించేరు.వాళ్ళ నాయకుడిగా చిత్రసేనుడు ఉండేవాడు.ఆ మధూక వనంలో సంవత్సరం పొడవునా ఇప్పపూలు పూసే చెట్టు ఒకటి ఒక పుట్టమీద పెరిగింది.దానికి రెండు కొమ్మలు మాత్రమే ఉండేవి.నిరంతరం పూలతో వాటి వాసనలతో ఆ ప్రాంతంఅంతా నిండిఉండేది. ఆ చెట్టును చిత్రసేనుడు తన రాణీకి ఇచ్చేడు.ఆమె ప్రతీ దినం ఆ చెట్టు పూలను కోసుకుని వంశధార నదికి అవతలి పక్కన ఉన్న సుమంతపురానికి పోయి అక్కడి షావుకారు సుమంతుడికి వాటిని అమ్మి అతడిచ్చే ధనంతో వంటకి అవసరమైన వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుని వాటితోభోజనాన్ని తయారుచేసి తన భర్తకీ మిగిలిన వాళ్ళ కీ పెట్టి, తాను తినేది.


అలా కొంతకాలం గడిచేక శ్రీశైల ప్రాంతంనుండి ఒక జంగమ కులస్త్రీ కాశీ యాత్రకని బయలుదేరి తోవతప్పి మధూక అరణ్యానికి చేరుకుంది.ఆ అడవిని చూసి భయపడి అక్కడే చిత్రసేనుడు రాజుగా ఉన్న కిరాతపల్లె కి పోయి ఆశ్రయంఅడిగింది.ఆమెనిరుపమానమైనఅందాన్నిచూసినచిత్రసేనుడు మోహ పరవశుడై,ఆమెకి అన్ని సౌకర్యాలనీ కల్పించేడు.ఆ మరుసటి దినం అతడు ఆమె మీద తన చిత్తభ్రమలను తొలగించుకుని ఆమె యోగ క్షేమాలను కనుక్కునిఆమెనుకాశీవిశ్వేశ్వరసందర్శనానికిమార్గాన్నితెలియచేసేడు.అయితే చిత్రంగా అతడి రూపురేఖలకి తన మనస్సు చలించి పోయిన ఆమె తనకి కాశీ ప్రయాణం మీద కోరిక మరిలేదనీ,అతనున్న ప్రాంతమే తనకి కాశీ తో సమానమనీ చెప్పి తనని పెళ్ళి చేసుకోమని కోరింది.ముందునుండే ఆ కోరిక తనలో ఉన్నందున అతడు ఆమెను తన రెండో భార్యగా చేసుకున్నాడు.తరువాత చిత్రసేనుడు తన రెండవ భార్యకు వేరే నివాసాన్ని ఏర్పాటుచేసి పెద్దభార్యతోచెప్పి పుట్ట మీదున్న మధూక చెట్టు రెండు శాఖలనూ వాళ్ళిద్దరికీ పంచి ఇచ్చి ఆ పూలను అమ్ముకుని ఎవరి సంసారాన్ని వాళ్ళు నడుపుకోమని చెప్పేడు. తాను ఒకరోజు పెద్దభార్యతో మరోరోజు రెండో భార్యతో గడిపేలా ఏర్పాటు చేసుకున్నాడు..ప్రతీరోజూ ఉదయాన్నే అతని భార్యలిద్దరూ నిద్రలేచి ఆ చెట్టు దగ్గరకి వెళ్ళి తమ కొమ్మలకింద రాలి పడిన ఇప్పపువ్వులను ఏరుకుని తీసుకుపోయి సుమంతుడికి అమ్మి తమకి కావలసిన దినుసులు తెచ్చుకుని తమ జీవితాని ఆ నందంగానే  సాగించేరు.అయితే అతడి రెండో భార్య అయిన జంగమస్త్రీ,శివభక్తురాలు కనుక ప్రతీరోజూ ఉదయాన్నే వంశధార నదీ స్నానం చేసి, కొన్ని నీళ్ళని తీసుకుని,మధూక చెట్టు దగ్గరకి పోయి ఆ పుట్టని పార్వతీపతిగా భావించి అభిషేకించి,పూజలుచేసి,ఆ పుట్టచుట్టూప్రదక్షిణలు చేసి పూలను ఏరుకునేది. అయితే ఆమె పూజలకు ప్రీతిపాత్రుడైన ఉబ్బులింగడు ఎంతో కరుణతో, ఆమె భర్త ఆమెకి ఇచ్చిన మధూక శాఖ నుండి ఇప్పపూలు కాకుండా బంగారుపూలు రాలేలా అనుగ్రహించేడు..ఆ బంగారు పుష్పాలను ఆమె సుమంతుడికి అమ్మి ఎంతో విలువైన ఆహార పదార్ధాలనీ,ఇతర వస్తువులనీ కొని తెచ్చి, భర్తకి చాలా ప్రీతికలిగించే భక్ష్యాలనీ,భోజనాలనీ ఏర్పాటు చేసేది.ఈ విషయం పెద్ద భార్యకి నచ్చలేదు.భర్తతో దెబ్బలాడి అతడు తనకిచ్చిన కొమ్మను సవతికిచ్చేలా బంగారు పూలనిచ్చే సవతి, కొమ్మని తనకిమార్చేలా చేసింది.కానీ ఏంలాభం.?చిత్రసేనుడి భార్యలిద్దరి మధూక కొమ్మలు ఒకరిదొకరికి మారడం మాత్రమే కాదు రాలే బంగారు పూలు కూడా తమ కొమ్మలని మార్చేసుకున్నాయి..శివలీలలు చిన్నవేమీ కావు కదా..!. తన పన్నాగం పారకపోయేసరికి ఆ రాజు పెద్దభార్య కోపం పట్టలేక, ప్రతీరోజూ తన సవతితో దెబ్బలాటలు పెట్టుకునేది.పొద్దున్న అడవిలోకి వేటకి పోయి చిత్రసేనుడు .సాయంత్రం ఇంటికి వచ్చేసరకి ఇద్దరు భార్యల తగవులతో అతడికి ఇల్లు రణరంగంగా మారిపోతూ ఉండేది.అతడు వాళ్ళ తగవులు తీర్చలేక, ఈ గొడవలన్నిటికీ కారణం ఆ మధూక చెట్టు కనుక, దాన్ని లేకుండా చేస్తే ఈ గొడవలన్నీ లేకుండా పోతాయని భావించి ,పెద్ద భార్య చాలా సంతోషంగా ఆ పనికి ఒప్పుకోవటం వల్ల, చిన్నభార్య ఎంతగా, బ్రతి మాలినా కూడా, వినకుండా ఆ చెట్టుని మొదలంటా నరికేసేడు.ఆ చెట్టుని అతను నరికేసరికల్లా పుట్టలోనుండి అగ్నిజ్వాల ఒక్కసారిగా పైకి లేచింది.దాన్ని చూడగానే తాను తప్పు చేసినట్టు తెలిసిన, చిత్ర సేనుడు కిందపడి మూర్ఛ పోయేడు.ఆతని పెద్దభార్య ఎక్కడినుండో వచ్చిన తన సవితి మంత్రగత్తె అనీ మాయలాడి అనీ, ఆమే తన భర్త చావుకి కారణమైందనీ ఆ మెనుచంపాలనీ,పెద్దగా కేకలు పెడుతూ గట్టిగా ఏడ్వటం మొదలుపెట్టింది.ఇది చూసి మిగిలిన కిరాత జాతి వారంతా చిత్రసేనుడి రెండో భార్యని చంపడానికి కత్తులు గొడ్డళ్ళూ పట్టుకుని వచ్చేరు.అయితే ఆమె నిర్భీతితో పరమశివుణ్ణి ప్రార్ధించింది. అప్పుడు జడముడి జంగం దేవర తన ప్రమధ గణంతో సహా నరకబడ్డమధూకచెట్టుమొదట,కిరాతజాతికందరికీప్రత్యక్షమయ్యేడు.కిరాతులందరూ చిత్రసేనుడితో సహా వామదేవ రుషి శాప విముక్తులై గంధ ర్వులయ్యేరు.శివుణ్ణి స్తుతించేరు.


అలా మధూక చెట్టు నుంచి ప్రత్యక్షమైన శివుడు మధుకరేశ్వరుడయ్యేడు..ఆ మూర్తినే ఇప్పుడు ముఖలింగేశ్వరుడని పిలుస్తున్నారు.అంతేకాకుండా జయంతీశ్వరుడనీ,గోకర్ణేశ్వరుడనికూడానామాంతరాలున్నట్టుచరిత్రచెపుతుంది.ఈ ఆలయం గోడలమీదఉన్న ప్రాచీన శాసనాలన్నిటిలోనూ ఇతర ఇతిహాసాల్లోనూకూడామధుకేశ్వరుడనే,పేరు మాత్రమే కనిపిస్తుంది.  ముఖ లింగేశ్వరుడన్న పేరు కనిపించదు.ఈ పేరు నేటిఆధునిక కాలం లో వచ్చిన పేరు మాత్రమే.


 ...ప్రస్తుతం మనకి ఈ మధుకేశ్వరస్వామి దైవ దర్శనానికి అవకాశం కలిగిస్తున్న ఈ దేవాలయాన్ని గాంగ వంశ రాజైన రెండవ కామార్ణదేవుడు, క్రీ.శ.10వ శతాబ్దం మధ్యకాలంలో నిర్మించినట్టు, కొర్ని గ్రామ శాసనం చెపితే, విశాఖపట్టణానికిచెందిన,అనంతవర్మశాసనంకూడా అదే విషయాన్నిస్పష్టంగా చెపుతుంది.రెండవ కామార్ణవుడు 'తిరస్క్రుత త్రివిష్టపమ'నే పెద్ద నగరాన్ని నిర్మించి అందులో మధుకేశ్వరుడుకి పెద్ద ఆలయాన్ని నిర్మించినట్టు కూడా  ప్రాచీన శాసనమొకటి స్పష్టం గా చెపుతుంది.ముఖలింగాలయంలోని అన్ని శాసనాల్లోనూ ఆ ఊరి పేరు, 'కళింగావని నగరం','త్రిగళింగావని నగరం','కళింగనగరం' అనే కానీ ముఖలింగమన్నపేరు రాసిలేదు.ఈ ఆధునిక కాలంలోనే మధుకేశ్వర లింగం, మధుకలింగం పేర్లనుండికానీ,ఉత్కళ భాషా ప్రభావం వల్లకానీ అది ముఖలింగంగా మారి పోయి ఉండవచ్చు.

( ఈ దివ్య దేవాలయం శాసన ఆధారాల గురించీ, చారిత్రక విశేషాలు,శిల్ప విశేషాల గురించీ తర్వాత పోష్టులలో..)






9, మే 2015, శనివారం

నా కళింగసీమ- "బలరామ దేవుడి పాదచలనం తో పులకరించిన నేల"..


"కళింగసీమ"బలరామదేవుడిపాదచలనంతోపులకరించిననేల.ఆయనఏనాడో  ప్రసాదించినలాంగుళ్యతో  నేటికీ దాహార్తినితీర్చుకుంటున్నబంగారుసీమ...నా "కళింగ సీమ .. ఇది ఖచితనవరత్నలేమ"

మహాభారతయుధ్ధకాలం...లోకౌరవులపక్షానగానీ,పాండవులపక్షానగానీ,చేరియుధ్ధంచెయ్యడానికిఇష్టపడనిబలరాముడుయుధ్ధానికిదూరంగావుండటానికితీర్థయాత్రలపేరుచెప్పిబయల్దేరిపోయేడు.


బలరాముడు


అతడు,వింధ్యపర్వతాలనుదాటి,దండకారణ్యంలోప్రవేశించి....ఒకనాటిమధ్యాహ్నాం,పద్మనాభపర్వతప్రాంతం(ప్రస్తుతంఒడిషాలోనికలాహండిప్రదేశం)లోనిమాధవవనం,లోసపరివారసమేతంగావిడిదిచేసేడు.ఆ టవీప్రాంతంలో,యాదవబలరాముడికి, ననిత్యనైమిత్తికాలునిర్వహించుకునేందుకుగానీ,మిగిలినపరివారానికి,ఏపనిచేయడానికయినా గానీ ఎంతప్రయత్నించినా,నీటిసదుపాయంకలగలేదు.విసిగిపోయినబలరాముడు,కోపంతోతన,లాంగలిని(నాగలిని)ప్రయోగించి,భూగర్భంలోనుంచినీటినిధారగాపైకితెచ్చేడు.ఆనీటితోఅతనూ,అతనిపరివారం,సంతోషంతోపనులన్నీపూర్తిచేసుకుని,ఆరాత్రిఅక్కడేనివశించేరు.ఆమరుసటిదినం,అక్కడినుంచివెళ్ళిపోతూ,బలరాముడుఆనీటిని,సముద్రజలాల్లోకలిసేలాతననాగలితోమార్గంచూపేడు. 


              శ్రీకాకుళంలోని నాగావళి

ఆనదిపేరేలాంగలిగా,లాంగుళ్యగా,నాగావళిగాపిలవబడుతోందనిఆనది,చరిత్రను,పురాణేతిహాసంచెపుతుంది.ఈనదీతీరంలో పాయకపాడు,గుంప,సంగం,శ్రీకాకుళం,కళ్ళేపల్లిప్రాంతాలలోఒకేరోజుఅదికూడాజ్యేష్టబహుళఏకాదశినాడుఆపుణ్యశీలి,పంచలింగాలనిప్రతిష్టించేడు.ఈఅయిదుక్షేత్రాలలోఒకేరోజుఅభిషేకం చేసిన వాళ్ళకి పునర్జన్మ ఉండదని కళింగ సీమ వాసుల కి పూర్వకాలంనుండీ ఉన్ననమ్మకం..అదేరోజుఆక్షేత్రాలలోశివపార్వతులకళ్యాణంచేస్తారు.

అవిమాత్రమేకాకుండా,అక్కడక్కడా(ఇంకాకాలగర్భంలోకలిసిపోయినవికలిసిపోగా, చెట్లగుబుర్లవెనకా,మట్టిదిబ్బలకిందా జాడలేకుండాపోయినవి  వాటి గుర్తులేలేకుండాపోయినా),కొన్నిమాత్రమేఇంకాశిధిలాలుగానిలబడి ఉన్నప్పటికీ,అవిపొందవలసినంతగుర్తింపుకుకూడా,నోచుకోకుండా పోతున్నాయి. పక్కరాష్ట్రంస్వంతఆస్తిగాకొన్నిమలిగిపోయి,వెలిగిపోతున్నాయి.పైనచెప్పిన,పంచలింగారామాలుమాత్రమేకాక మరికొన్నిబలరామప్రతిష్టితాలయినశివలింగక్షేత్రాల గురించి,సంక్షిప్తంగా చెప్పుకుందాం.


పంచలింగేశ్వరఆలయాలు
1.హటకేశ్వరదేవాలయం(రాయఘడదగ్గరున్నపాయకపాడు.)
2.సోమేశ్వరదేవాలయం(పార్వతీపురందగ్గరున్నగుంప)
3.సంగమేశ్వరదేవాలయం(రేగిడిఆముదాలవలసమండలంలోనిసంగం)
4.ఉమారుద్రకోటేశ్వరాలయం,(శ్రీకాకుళం.)
5.మణినాగేశ్వరదేవాలయం,(కళ్ళేపల్లి)


1.హటకేశ్వరుడు: (మరోపేరు పాటలేశ్వరుడు)


 పాటలేశ్వరుడు


కళింగసీమనుండి,తమదంటూతీసుకుపోయిన,ఒడిషారాష్ట్రవాసులప్రస్తుతంఒడిషాలోని'రాయఘఢ'దగ్గరున్నపాయకపాడుఅగ్రహారంలోనాగావళినదివొడ్డున ఉన్నశివలింగ క్షేత్రం..ఇదిబలరాముడుస్వయంగాప్రతిష్టించినశివలింగం ఉన్న ఆలయం. "ఇది మీదికాదు..మాదే"అనలేకపోయినకళింగవాసులబలహీనతకి ఉన్న ఎన్నో నిదర్శనాల్లో ఒక్కటిది


2. సోమేశ్వరుడు. 


                        సోమేశ్వరుడు. 


విజయనగరంజిల్లాలోపార్వతీపురంపక్కనేఉన్నగుంపగ్రామంలోవెసిఉన్నశివాలయంలోఉన్నశివుడు.ఇదిజంఝావతీ,నాగావళీనదులుఒకదానిలోమరొకటికలసినప్రదేశం.  ఆంధ్రహరికథాపితామహుడు"జ్జాడఆదిభట్లనారాయణదాసు"రెండెడ్లబండికట్టించుకునిమరీ...విజయనగరంనుండివచ్చిసందర్శించుకున్న క్షేత్రం ఇది.





 3.సంగమేశ్వరుడు:


సంగమేశ్వరుడు


ఈమూర్తిపార్వతీపురంప్రాంతానికే,చెందిన'సంగాం'గ్రామంలోపూజలందుకుంటున్న శివాలయంలో ని శివుడు.ఈ క్షేత్రం కూడా నాగావళీ సువర్ణముఖీ నదుల సంగమ ప్రదేశమే.






4.కోటీశ్వరుడు:
కోటీశ్వరుడు

క్రీ.శ.7వశతాబ్దంనుండీ,చరిత్రపుటల్లో కనబడుతూ,ప్రస్తుతం*శ్రీకాకుళం  పేరుతోవున్నఅంతకుముందుకాలంలోకోటీశ్వరాగ్రహారంఅన్నపేరుతోవర్ధిల్లిన,శ్రీకాకుళం జిల్లా కేంద్ర పట్టణం లో, ఉన్న శివాలయంలోప్రతిష్టితుడయిన మూర్తి. 





5.మణినాగేశ్వరుడు:


మణినాగేశ్వరుడు
నాగావళినదిసముద్రంలోకలిసేస్థానంలోఉన్నకళ్ళేపల్లి ( ఈ ఊరి మరో పేరు మఫీజ్ బందరు) గ్రామంలొ ఉన్న శివాలయ స్వామి.


మరికొన్ని ఒకప్పటి శివ తేజోనిలయాలు

దేవగిరీశ్వరుడు: 

దేవగిరీశ్వరుడు: 


నాగావళినదిజన్మస్థానానికిదగ్గరలోఉన్నదేవగిరిపర్వతగుహలో,ఈమూర్తిఉందిఒకప్పుడదికళింగసీమది.ఇప్పుడుఒడిషాలోనిరాయఘడకి48కి.మీ.దూరంలోఉన్నకళ్యాణసింగుపురంపక్కనఉన్నకొండమీదఉంది.మిగిలినకొండల్లాగా..ఈకొండకిందనించి,పైకివెళ్ళేటప్పటికి,సన్నగాఎంతమాత్రంఉండదు.పైభాగంలోచతురస్రంగావుంటుంది.ఇక్కడ గంగయమున,భార్గవి,సరస్వతి,ఇంద్రద్యుమ్నఅనేఅయిదునిరంతరంనిండుగాఉండేనీటికొలనులుఉంటాయి.ఈకొలనుల్లోనీళ్ళుపచ్చిపాలరుచులతో ఉంటాయి.





గోకర్ణేశ్వరుడు:
Mahendragiri Temple, Gajapati, Shiva Temple
గోకర్ణేశ్వరుడు
ఈక్షేత్రంచాలాపురాతనమైనది.మహేంద్రగిరిపర్వతంమీద,బలరాముడితో,ప్రతిష్టించబడినత్రిలింగమూర్తులదేవాలయాలలోప్రధానమైనదిగోకర్ణేశ్వరస్వామివెలసిఉన్నగోకర్ణక్షేత్రం.పూర్వకాలంలోబ్రహ్మదేవుడుహరిహరాదులకోసం,పరుశురాముడు,మహేశ్వరుడికోసం,తపస్సులుచేసినపవిత్ర,ప్రాంతంగా,పురాణాల్లోచెప్పబడినప్రాంతం.అశోకుడు,రక్తబాహుడు,విజయవర్మ, విజయస్థంభాలను పాతి శాసనాలను చెక్కించిన ప్రదేశం.కళింగాధీశులెందరో తమ ఇలవేల్పు అ ని కీర్తించి తమదాన శాసనాలు ప్రకటించిన ప్రదేశం.

ఒకప్పటికళింగసీమలోనిగంజాంతాలూకాలోఉండి1936నుండీబలవంతంగాఒడిషారాష్ట్రంలోకిచేర్చబడిన దేవాలయాలలోఇదికూడాఒకటి.


కపాల లింగేశ్వరుడు: 


Jaugada, Visit Jaugada of Orissa, Temple tour of Jaugada, Religious place of Orissa
కపాల లింగేశ్వరుడు:


అశోకుడి శాసనాలున్న జౌగడ (లక్కకోట) పర్వత ప్రాంతలో ఉన్న ప్రాచీన శివాలయంలోని శివ మూర్తి.

మల్లికేశ్వరుడు:

మల్లికేశ్వరుడు

ఇప్పటిఒడిషారాష్ట్రంలోని,గుణుపురందగ్గరున్న'జగమండ'గ్రామాన్నిఆనుకునిఉన్నచిన్నకొండమీద,ప్రతిష్టించబడినశివుడు.ఈమల్లికేశ్వరస్వామినిదర్శించుకుని కొండమీద15రోజులుంటేఎలాంటిరోగమైనానశిస్తుందని ప్రజల విశ్వాసం.


గుప్తేశ్వరుడు

                              

                                             గుప్తేశ్వరుడు


ఈ తేజో విరాజిత శివమూర్తి దట్టమైనఅరణ్యప్రాంతంలోఒడిషాలోని,కోరాపుట్ కీ,జయపూర్ కీ,మధ్యకొండగుహలోగుప్తంగాఉన్న గుప్తేశ్వరుడు.దుర్గమమై , కిక్కిరిసిన ఈఅరణ్యంలోపర్వతాలనుండిజాలువారుతున్నజలపాతాలహొయలు,కనులవిందుచేస్తుంటే,పక్కనే'కొలాబ్'నదిపరుగులుపెడుతుంటే..గుప్తేశ్వరస్వామిసన్నిధానం..ఎవరినైనా,రెండుచేతులూజోడించేలాగే,చేస్తుంది.కళింగరాజ్యంలో,ఈప్రాంతానికిసామంతపాలకుడయిన*జయపురంరాజు1617సంవత్సరంలోఈశివలింగమూర్తికిసన్నిధాననిర్మాణంజరిపేడు.

 "ఈ కళింగ వాసులకిఎక్కితే గుర్రపు బండి..ఎత్తితే ముష్టి చెంబు" 

అనిభావించే వాళ్ళకి మాత్రమే..

ఈకళింగసీమనీ,కళింగజాతినీ,కళింగసంస్క్రుతినీ,నిర్ధూమధామంగా..చేయగలిగేమన్నసంతోషంలోఉన్న,అన్నిఇతరప్రాంతాలతెలుగునాయకులతోపాటు,ఈభారతదేశంలోనిఇతరరాష్ట్రాల,జాతులవారుకూడాతమతప్పులుతెలుసుకునితీరవలసినకాలం..చాలాదగ్గరకొచ్చిందనీ...
ఈకళింగసీమవాసులుపెట్టే,కళింగసింహగర్జన,వీళ్ళందరిలో,కంపంపుట్టించితీరుతుందనీ,ఉదయిస్తున్నకళింగసూర్యుడు..కొద్దిగాఆలస్యమైనాసరే,దట్టంగాఅల్లుకున్ననల్లమబ్బులన్నిటినీ,దాటుకుని,తనప్రకాశంతోతిరిగితేజరిల్లుతాడనీఇప్పుడున్నకళింగ వాసులకిస్పష్టంగాతెలిసిపోతోంది.

(ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలోనూ అనంత ఖ్యాతినితెచ్చుకున్నముఖలింగ దేవాలయ చరిత్ర తర్వాత పోష్టులో..)

(Contd..)
-----------------------------------------------------------------------------------------------------------------------------

*దక్కనుసుల్తానులుకళింగప్రాంతాన్నిపాలించేరోజుల్లోఆసుల్తానులసుబేదారులు ఇక్కడే నివాసముండి ఇక్కడనుండి తమప్రభువులఫర్మానాలనుసామంత ప్రభువులకు,అప్పటి రాజులకు పంపేటప్పుడు ఆ ఫర్మానాలమీద వున్న శిఖా (లక్కసీలు)విప్పిఖోల్(బట్వాడా)చేయడంచేసేవారుకనుకముందుగాశిఖాకోల్అన్నపేరుతోఆ గ్రామం,పిలవబడేదనీఅదేక్రమంగాశ్రీకాకుళంఅయ్యిందనీకూడా ఒక వాడుక ఉంది.

*క్రీ.శ.1640లోఅప్పటిసుబేదారు'షేర్మహమ్మదుఖాన్'కట్టించినమసీదుఇప్పటికీఉంది.అంతేకాదు..ఆపట్టణంప్రాచీనతకోసంవెతకాలనుకుంటే,ఎంతకాలం,వెనుకకు వెళ్ళినా ఆ కాలంలోనూ తన సాక్ష్యాధారాలను అందించగలిగేది గానే ఉంది.

*..జయపురం రాజుల చరిత్ర సంక్షిప్తంగానే..

సూర్యవంశరాజైన'వినాయకదేవ్'తోప్రారంభమైనఈరాజులపాలన508ఏళ్ళ(1443/1951)కొనసాగింది.నందపురం,జయపురంఅనేరెండుపరగణాలుగావీరురాజ్యపాలనచేసేరు.25మందిఈవంశంరాజులుఈసుదీర్ఘపాలనసాగించేరు.1637/69మధ్యపాలించిన'వీరవిక్రమదేవ్'రాజధానినినందపురంనుండిజయపురానికి మార్చేడు.

1/4/1936లోఒరిస్సారాష్ట్రంఏర్పాటయ్యేటప్పుడుపర్లాఖిమిడిపరిపాలకుడిగావున్న'విక్రమదేవ్'పాచిపెంట,మాడుగులప్రాంతాలనుతప్ప,అన్నింటినీ,ఒడిషాలోకలిపేడు.గంజాంజిల్లానుఒడిషాలోచేర్చేందుకుఈయనచేసినపనితక్కువేంకాదు.అదినచ్చకే'పిడుగులాంటిగిడుగు'పర్లాఖిమిడి,వొదిలేసితనజీవితచరమాంకంలోరాజమండ్రివెళ్ళిపోయేడు.మహారాజావిక్రమదేవవర్మతన62వఏటతగాదాలువిడగొట్టుకుని,జయపురంరాజయ్యేడు.అతనిదే..ఆరాజ్యానికిఆఖరిరాజుఅవకాశమైంది.అతనికిమగసంతానంలేకపొవడంవల్ల,తనఏకైకకుమార్తెసువర్నముఖీదేవి రెండోకొడుకుని దత్త త తీసుకున్నాడు.ఆమె భర్త పేరువిద్యాధర సింగ్ దేవ్.అతన్ని'అల్లుడురాజా'అనితెలుగు లోనే  అందరూ అనేవారు.వీళ్ళు ఓఢ్రులా..?

14/4/51లోఆయనతన82వఏటచనిపోతే,వారసుడుమైనరుకావటంవల్లరాజ్యం'కోర్ట్ ఆఫ్ వార్డ్స్'కిపోయింది.29-12-52లోఎస్టేట్రద్దయిపోయింది. 9-3-2006లోతన72వఏటఆఖరిరాజుచనిపోయేడు.




2, మే 2015, శనివారం

విస్మ్రుత కళింగ కవులు 2.- "అడిదం సూరకవి"



విస్మ్రుత కళింగ  కవులు 2.

              
               

అతడు అశే శేముషీ సంపన్నుడు. అప్రమేయ సాహితీ ధురీణుడు.. వాజ్మయ దిగ్గజం అయిన ఈకవి సమకాలీన పండితులను కవులను తన ముందు తలవంచేలాచేసి, తన కవిత్వ ధారలతో తెలుగు భాషా మాగాణిని తడి ఆరనీకుండా చేసిన వాడు.

ఇంకవిస్మ్రుతకళింకవులచరిత్రలో'మహారాజశ్రీఅడిదంరామారావు' గారు తెలిపిన చరిత్ర ప్రకారం చూస్తే..

 1.శ్రీ పూసపాటి తమ్మ భూపతి(1620-1700)

1652లోఈరాజుఅప్పట్లో,ఉత్తరసర్కారులుగాఉన్నఈప్రాంతానికివచ్చిశ్రీకాకుళంలోఈప్రాంతానికిఫౌజుదారుడిగాఉన్నషేరుమహమ్మదుఖాన్నుండిప్రస్తుతంవిజయనగరానికి6కి.మీదూరంలోఉన్నకుమిలి,20కి.మీదూరంలోఉన్నభోగాపురంగ్రామాలనుపెత్తనానికితీసుకునిమహమ్మదీయ ప్రభుత్వానికిలోబడినఓచిన్నరాజుగాపాలించినవ్యక్తి.15శతాబ్దిలోకర్ణాటకలోనివిజయనగరసామ్రాజ్యానికిరాజయినఫ్రౌడదేవరాయలకిసమకాలికుడయినశ్రీపూసపాటిరాచిరాజుకి5వతరంవాడయినగోపాలక్రిష్ణమరాజుఈతడితండ్రి.తల్లిజగ్గమాంబ.ఇతడుక్రిష్ణవిజయముఅనే5ఆశ్వాసాలగ్రంధాన్నిరచించేడు.

2.పూసపాటి వేంకటపతి మహీపాలుడు: (1660-1720);
ఈ రాజకవి బొబ్బిలి యుధ్ధంలో వీరస్వర్గాన్ని పొందిన విజయరామ రాజు కు పెదతండ్రి.ఈయన తమ్ముడు,విజయరామరాజు తండ్రి అయిన ఆనంద గజపతి బాలుడుగా ఉన్నప్పుడు విజయనగరానికి దగ్గరగాఉన్న కుంభిళాపురం ( ప్రస్తుతం కుమిలి) రాజధానిగా పాలించేవాడు.అప్పటికి విజయనగరం కోట ఇంకా కట్టలేదు.తన తమ్ముడికి రాజ్యపాలనకు తగిన వయస్సు రాగానే ఈ యన తాను దానం చేసిన అగ్రహారం లో జీవిస్తూ అక్కడి బ్రాహ్మణుల భోజనాలనే భుజిస్తూ,ఆధ్యాత్మిక చింతనలో నే శేష జీవితాన్నిరాజరుషిలా గడిపినట్టు తెలుస్తోంది.ఈయన సరస రస భరిత మైన "ఉషాభ్యుదయాన్ని  రచించి రామ తీర్థం లో కొలువై ఉన్న శ్రీరామ చంద్రునికి దాన్ని అంకితమిచ్చేడు.

పూసపాటిరాజులవంశంలోకొందరుకవులైవుండటంఅనుశ్రుతమైనవిషయమే.రేగులవలసలోనిపూసపాటికుటుంబానికిచెందినవిజయరామరాజు"విష్ణుభక్తిసుధాకరం","హోరాలక్షణం"అనేరెండుగ్రంధాలురచించేరు. ఈవంశంలోనిరాజులందరువిద్యాధికులుకవిపోషకులుకూడా.పద్మనాభయుధ్ధంలోవీరస్వర్గంఅలంకరించినశ్రీచినవిజయరామమహారాజుసంస్క్రుతంతెలుగుభాషల్లోకవితాసామర్ధ్యంకలవ్యక్తిఅనిఎన్నోశ్లోకాలు,పద్యాలుఅందుకుఉదాహరణలుగాకనబడుతున్నాయి.


3.అడిదంబాలభాస్కరకవి(1690/1750):
ఇతడుసుప్రసిధ్ధకళింగకవిఅడిదంసూరకవిజనకుడు.నారసామాత్యుడికిమనుమడు.చినలచ్చనమంత్రికుమారుడు.విజయనగరానికిదగ్గరలోఉన్న(భూపాలరాజురేగ)నేటిపూసపాటిరేగకాపురస్తుడు.అతనితనయుడుతనగ్రంధం'కవిసంశయవిఛ్ఛేధం'లోపేర్కొనినదానినిబట్టిచూస్తేకూచిమంచితిమ్మకవిరాసినఅచ్చతెలుగురామాయణానికి,ఏభైఅరవైసంవత్సరాలకుముందే,ఇతడు'శుధ్ధాంధ్రరామాయణాన్ని'రాసినట్టుతెలుస్తుంది.తెలుసుకోవాలనిఅనుకునేదెవరు..తెలుసనిచెపితేకళింగకవులనిగుర్తించేదెవరు?ఈకవికూడాతనశుధ్ధాంధ్రరామాయణాన్ని"శ్రీమందిరరామతీర్థసీతారామా"అనిరామతీర్థంలోనిరాముడికే అంకితమిచ్చేడు. 

4.రేకపల్లిసోమప్పకవి(1720-1790):
ఈయన అసలు పేరు సోమప్పశాస్త్రి. గోదావరి మండలంలోని తాళ్ళపూడి గ్రామం జన్మస్థలం అయినా అక్కడ గడపలేక భుక్తికోసం తుని దగ్గరలో ఉన్న సత్యవరం కాపురం మార్చుకోవటం జరిగింది. ఆ గ్రామాన్ని రాజధానిగా పాలిస్తున్న కాకర్లపూడి గోపాలరాయ పాయక రావు ( పాయక రావు అంటే యుధ్ధంలో ముందు నడిచేవాడని అర్థం) ఈ కవిని ఆస్థాన పండితుడిగా చేసుకుని అతని సుఖ నివాసానికి అన్ని ఏర్పాట్లు చేశేడు.ఈయన ప్రద్యుమ్నాభ్యుదయం ,రుక్మవతీ పరిణయం అనే గ్రంధాలను రచించినట్టు తెలుస్తోంది.ఈయనకీ అడిదం సూరకవికీ ఒకరంటే ఒకరికి పడదు.ఇద్దరూ సమకాలికులే.

5.కొట్ర బాలకవి (1730-1790).
నివాసస్థలం విజయనగరంలో రాజాం ఊరికి దగ్గరగా ఉన్న యిల్లంనాయుడు వలస.దీన్ని ఈకవి కుటుంబానికి బొబ్బిలి రాజుల అగ్రహారం గా దానమివ్వటం జరిగింది.ఇతడు అడిదం సూరకవికి మిత్రుడు.ఈ కింద పద్యం అతని మీద ఈ కవికి ఉన్న అభిమానాన్ని తెలియజేస్తుంది.

కం.అంతా కవులము  గామా  
అంతింతో పద్యమైన నల్లగలేమా 
దంతివి నీతో సమమా 
కాంతా సుమ బాణ! సూరకవి నెఱజాణా.

భల్లాణ చరిత్రము,విమలాంగీ పరిణయము ఈ కవి రాసిన ప్రబంధాలు.

6. పచ్చమెట్ట పాపయ్యకవి (1765-1840)
నివాసస్థలం విజయనగరం జిల్లాలో తూర్పుగా సముద్రతీరంలో పూసపాటి రేగ మండలంలోఉన్నకోనాడగ్రామం.ఇతని కుటుంబానికి భోగాపురం మండలంలో ఉన్న గూడెపువలస గ్రామం ఇనాం గ్రామం గా వుండేది.కామయ చంద్ర శతకం,మహిషాసుర మర్దనీ శతకం మాత్రమే ఇతను రాసినవి దొరికినవి.

7.వద్దిపర్తికోనరాట్కవి(1754/1834):
నివాసస్థలంవిశాఖపట్టణంజిల్లాలోనిసర్వసిధ్ధిగ్రామం.300ఎకరాలఇనాంభూములతోకరణీకంకులవ్రుత్తిగాచేసుకుంటూసరసకవిత్వభూషణాలైనప్రబంధరత్నాలనురచించికీర్తికాయుడయ్యేడు.ఇతడువేంకటేశ్వరోపాఖ్యానము,మహాలక్ష్మీపరిణయము,రేవతీపరిణయము,జానకీరామ శతకము అన్న పుస్తకాలను రాసేడు.

8.కాళ్ళకూరిగౌరీకాంతకవి(1770-1840) 
విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి దగ్గరలోఉన్న గోప్పేట గ్రామం.ఆ గ్రామ కరణీకం ఆ కుటుంబం వారికి వ్రుత్తిగా వుండేది.'ధర్మనందన విలాసం' ఆ యన రాసిన పద్య క్రుతి.

9.అడిదంసూరకవి:


అతడు అశే శేముషీ సంపన్నుడు. అప్రమేయ సాహితీ ధురీణుడు.. వాజ్మయ దిగ్గజం అయిన ఈకవి సమకాలీన పండితులను కవులను తన ముందు తలవంచేలాచేసి, తన కవిత్వ ధారలతో తెలుగు భాషా మాగాణిని తడి ఆరనీకుండా చేసిన వాడు.  అంతటి సూరకవి గురించి ప్రస్తుత తరం కళింగ సీమ వాసులకు తెలియదు..తెలియచెప్పిన వాళ్ళు లేరు.ఏ  తరగతి తెలుగు పుస్తకంలోనూఆయనపద్యాలూ లేవు.. ఉంచమని కోరిన తెలుగు పండితులూ మనకి లేరు. "సూరకవి తిట్టు..కంసాలి సుత్తిపెట్టు.."అన్న నాటి మాట నేటికీ అక్కడక్కడా నిలిచే వుంది..కానీ అతను ఇక్కడివాడే అన్న ఆలోచనకానీ అతన్ని స్మరించుకుందామన్న భావన కానీ ఎవరికీ రాదు.ఆయన గురించి గానీ నడిమింటి మంగళేశ్వర శాస్త్రి గారి గురించి కానీ రాయాలంటే పుస్తకాలే రాయాలి.పరిశోధనలు చేసి డాక్టరేటులు పొందవచ్చు. ఈ బ్లాగులోని పోష్టు పరిమితి అందుకు చాలదు కనుక తెలిసిన ఆంశాలనీ తెలియజేయటానికి వీలు కావటం లేదు.అందుకు మన్నించమని విన్నపం.


విజయనగరరాజుపూసపాటిచినవిజయరామరాజుదగ్గర1750ప్రాంతంలోఈకవిఆస్థానపండితుడిగాఉండేవాడు.'ఆంధ్రచంద్రాలోకం','కవిసంశయవిఛ్ఛేదం','కవి జన రంజనం' మొదలయిన గ్రంధాలరచయిత.అతడుప్రశ్నజవాబులరూపంలో ఈ కిందికందపద్యంలోతనగురించిచెప్పుకున్నాడు.

కం. ఊరెయ్యది.చీపురుపలి
పేరో? సూరకవి:ఇంటిపే?రడిదము వార్: 
మీరాజు? విజయరామ మ
హారా:జతడేమి సరసుడా..?భోజుడయా.

అతనిదే మరొక పద్యం: 

చ:గడియకు నూరు పద్దెములు గంటము లేక రచింతు దిట్టగా.
దొడగితినా పఠాల్ మని తూలిపడుం కులశైలరాజముల్
విడిచి యనుగ్రహించి నిఱుపేద ధనాధిపతుల్యు జేతు,నే
నడిదము వాడ:సూరనసమాఖ్యుడ: నాకొకరుండు సాటియే?

10.అడిదంరామకవి
ఈయనసూరకవితండ్రి ,మంచికవితాశక్తికలవాడే ఎంతోప్రసిధ్ధిపొందినచెఱువుమీదపద్యాలనుచెప్పినఅతడు"సరోజనేత్రరామతీర్థజానకీమనోహరా.."అన్నమకుటంతోపంచచామరవ్రుత్తాలనురచించిఆదేవుడికేఅంకితమిచ్చేడు.. కొట్రబాల(భాస్కర)కవిఇతడికిసమకాలికుడు.ఇతనిప్రపౌత్రుడుబాలభాస్కరకవికూడాకవితాధురీణుడే. 
11.అల్లమరాజుసుబ్రహ్మణ్యం:1850ప్రాంతాలకవి.బహుగ్రంధకర్త.పిఠాపురంరాజుగారితోసన్మానంపొందినవాడు.
12.తురగావెంకమరాజుగారు అప్పటిమరొక కళింగ కవి.
13.తురగారామకవి: 
ఇతడుపెద్దాపురసంస్థానరాజయినవత్సవాయితిమ్మగజపతి ఆ స్థానకవి.ఇతని చాటు పద్యాలు చాలానే ఉన్నాయి గానిరాసినగ్రంధాలు ఏవన్నది తెలియడంలేదు.ఇతను ఏకారణంవల్లనో తిమ్మ భూపాలుణ్ణితిట్టినఈ పద్యంఎక్కువగానేటికీ ప్రచారంలో నే ఉంది.

కం.అద్దిర:శ్రీ భూ నీలలు 
ముద్దియలాహరికి గలరు ముగురందఱలో  
బెద్దమ్మ నాట్యమాడును 
దిద్దిమ్మని వత్సవాయి తిమ్మని ఇంటన్.


పైనపేర్కొన్నవారందరూఈ500ఏళ్ళల్లోరాసినగ్రంధాలుపూర్తిగాదొరకకపోయినా ఇంకాపేరునిలిచిఉన్నకళింగకవిరాజులే..వీరితో పాటు మరొక్క కవి సామ్రాట్టుని ,గురించి చెప్పితీరాలి.ఆయన నడిమింటి మంగళేశ్వర శాస్త్రి .ఆయన గురించి కొన్ని వివరాలు మాత్రమే కింద రాస్తున్నాను.

.....విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ లో ఉన్న నాగూరు అగ్రహారం లో నడిమింటి మంగళేశ్వర శాస్త్రి అన్న ఉద్దండ పండితుడు జన్మించేడు.కళింగ దేశం లో మాత్రమే కాదు సర్వాంధ్ర దేశం లోనూ ఆ పండిత ప్రకాండుని పేరు ప్రఖ్యాతిచెందినదిగాఉండేది.వ్యాకరణశాస్త్రంలోఆయనమహాపండితుడుసంస్క్రుతభాషనేర్చుకునేవాళ్ళందరూ,చదివితీరాల్సినగ్రంధం'సమాసకుసుమావళి'ఆయన రచించేడు. తెనాలి రామలింగ కవి లాంటి వ్యక్తి.మంచి కవి.అతని మీద అనేక కధలు ప్రచారంలో ఉండేవి.. ఒక్క రెండిటిని మాత్రం పేర్కొంటాను.
1.ఆకాలంలోపూసపాటినారాయణగజపతివిజయనగరంరాజుగావున్నవ్యక్తి.ఆరాజుకిఈయనఅంటేప్రేమఎక్కువ.ఒకనాడుఆయన"శాస్త్రులవారూ...మీపాండిత్యానికీ,చాతుర్యానికీమీఇంటిపేరుతగినట్టుగాలేదండీ..నడిమింటివారేంటి..మొదటింటివారుకాకుండా.!"అనివెక్కిరించేరట.ఒక్కనిముషంఊరుకుండిఅప్పుడుఆయనఅన్నారట"ప్రభూ..ఏఇల్లయినా..పూసపాటిచెయ్యదా..?"అని.
2.ఒకసారిఆయనజగన్నాధస్వామినిదర్శించుకోవడానికిపూరీక్షేత్రానికివెళ్ళేరు.ఆమధ్యాహ్నంభోజనంచేసేందుకుమంచిపొడవువెడల్పుఉన్నమఱ్ఱిఆకులనుకోసి,తెచ్చుకుని..ఆయనవిస్తళ్ళుకుట్టుకుంటున్నారట.ఆయనప్రతిభముందునుంచీతెలిసిఉన్నఓఢ్రపండితులుఆయన్నిదర్శించుకోవాలనివచ్చేరు.పూరీక్షేత్రంలోమఱ్ఱిఆకులలోభోజనంచేయడంనిషిద్ధం.ఆపండితులుఆయనచేస్తున్న పనిచూసి."ఇదేమిటి..శాస్త్రిగారూ.ఈఘోరంచేస్తున్నారు.?"అనిఅడిగేరు.ఆయనకిఅదిఅర్థంకాక"నేనేఘోరంచెస్తున్నాను.."అనడిగేరు."వటపత్రాలతోవిస్తరికుడుతున్నారు..అదిచాలదా..మాకదినిషేధం..వటపత్రశాయిశ్రీనారాయణమూర్తినిపూజించే.ఇక్కడయితే పూర్తిగానిషేధం.".అనిగర్వంగాచెప్పేరట.దానికిఆయనెంతమాత్రంతడుముకోకుండా."శ్రీమన్నారాయణునిఅవతారాన్నేలొట్టలువేసుకుంటూ భుజించే మీకు ఆయన శయ్య అయిన వటపత్రంలో భోజనం మాత్రమే నిషేధం అయ్యిందా.!"అని వెటకారంగా నవ్వేడు.(ఉత్కళబ్రాహ్మణులు ,వంగ దేశ బ్రాహ్మణులలాగే మత్స్యభు క్కులు.)

కళింగదేశంలో కవితాకన్య,తనబంగారుగజ్జెలతోనర్తించితన వైదుష్యంతో,మిగిలినఅన్నిప్రాంతాల,తెలుగువారినీ,ఉత్కంఠపరిచేదని..ఈచాలాకొద్దిగానేఇంకామిగిలిపోయున్న సాక్ష్యాలు చెప్పటంలేదా..?


ఇంకాఎంతెంతమందిఉన్నారోతెలుసుకోవటానికిమద్రాసుప్రాచ్యలిఖితభాండాగారంలో,నేటిరాజ్యాలుపోయినారాజులుగామిగిలిపోయినవారిదగ్గరఉన్నభాండాగారాలలోనూ,నూరేళ్ళకాలంకిందటస్థాపించబడినపాఠశాలల,కళాశాలలగ్రంధాలయాలలో,ఒడిషాప్రాచీనగ్రంధాలరాష్ట్రభాండాగారంలోనూఇందుకోసంపరిశోధనలు జరగవలసి ఉంది. జరుగుతుందా..?ఆఅవకాశమైతేప్రస్తుతానికికనిపించనిదిగానే ఉంది.
(పురాతన కళింగ ఆలయాల చరిత్ర తరువాత పోష్టులో)

(Contd...)