కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

19, నవంబర్ 2014, బుధవారం

“పిల్లి దేవుడు-పీట ముత్తైదువు”

“పదివేలమంది సామాన్యులు మాట్లాడే పదివేల మాటలు ఒక్క రాజు ఒక్కమాటకు సరికావు”- ఇది కూడా కౌటిల్యుడు అర్థశాస్త్రం లో చెప్పినమాటే..

కళింగ రాష్ట్రం పేరు ఆధునిక భారతం లో లేకుండా చెయ్యడం,జాతీయగీతం లో" ద్రావిడ,ఉత్కళ, వంగ,కళింగా" కాకుండా "ద్రావిడ, ఉత్కళ ..  వంగా " అనిమాత్రమే పేర్కొనడం ఒక్క రాజు మాటకు,ఒక్క రాణీ చేతకు గురైనవే.

కళింగ రాష్త్రం కోసం మనం కేక పెట్టవచ్చా...?.మనం ఆంధ్రులం కదా..కళింగ రాష్త్రం అంటే,ఒరిస్సా అవుతుంది కదా….! అన్న ఆలోచన మనలో చాలా మంది కి కలిగే అవకాశం ఖచ్చితం గా వుండి తీరుతుంది.అలాంటి అన్ని సందేహాలనీ మనం చితక్కొట్టి మరీ పక్కకి విసిరెయ్యాలి. 

“పాగా,పంచా చూసి పాపరాజనుకున్నాను పేర్రాజు వటోయ్.. నువ్వుఈర్రాజూ…” అన్న పాత కాలం వెటకారం మన కళింగ సీమ వాసులపై మిగిలిన ప్రాంతాలవాళ్ళు చేస్తారేమో అన్న అనుమానం కూడా మనకి కలగొచ్చు..మనం కళింగ రాష్ట్రవాళ్ళమని,మాగధి నుండి,పాళీ నుండి మా మాత్రుభాష తెలుగే అయ్యిందనీ,అందుకు శెట్టి,నాపసాని, సొమ్ములు.. సాహు,తెలగలాంటి ఉదాహరణలు మా కళింగ విశ్వవిద్యాలయం అన్నది మాకు ఉండి ఉంటే (మా తాతల కి దేశాభిమానం చాలా చాలా ఎక్కువైపోబట్టే,ఆంధ్ర విశ్వవిద్యా లయాన్ని ఆనందంగా స్వాగతించేరు.ఆ పేరు మా ప్రాంతానికి పెట్టడమేంటన్న ఆలోచనే వాళ్ళ కలలలోకి కూడా వచ్చిన దాఖలాలే ఎక్కడా లెవు) మా భాషా శాస్త్రవేత్తలు లెక్కకి మిక్కిలిగాఅనేక పదాలు తెచ్చి రుజువు చేసి తెలంగాణా,వేరు,ఆంధ్రా వేరు,కళింగ వేరు అని ముక్కు మీద గుద్దినట్టుగా చెప్పగలిగే వారు. 

మనది మన శ్రీకాకుళంలో ఉన్నకళింగపట్నం రాజధాని అయిన కళింగరాజ్యంముఖలింగం కూడా రాజధాని అని అనుకోవచ్చు.ఎందుకంటేఅక్కడున్నదికళింగరాజులుపూజించినమధుకేశ్వరుడిఆలయంకనుక. అంతేకాదుదీర్ఘకాలకళింగచరిత్రలోరాజపురమ్దంతపురం,సింగుపురం ప్రాంతాలుకూడా కళింగ రాజధానులే..అన్న సంగతి రుజువయ్యేదే కదా ...!

చరిత్ర ఒక్కసారి తిరగేస్తే, త్రికళింగాధి పతి అయిన ,యుద్ద మల్లుని శాసనం ప్రకారం,త్రికళింగ మంటే, 1.గంగానది నుండి కటక పురి (నేటి కటక్) వరకూ ఉత్కళం,(నేటి ఒడిషా),ఉత్తర కళింగం.2.కటక పురి నుండి మహేంద్ర గిరివరకూ మధ్య కళింగం. (కన్యోఢ దేశం ) 3.మహేంద్రగిరి నుండి గోదావరి వరకూ కళింగ దేశం.

ఇలా ఎంతోఘనమైనచరిత్రకలిగిఉన్నప్పటికీ,ఏసంస్క్రుతీలేనివాళ్ళనిఅయిపోయేం.ఇవ్వాల్టికి ఇలాఏదిక్కూలేకుండాదిక్కుమాలిపోయున్నవాళ్ళమైపోయేం. ఇంకా ఇప్పుడైనా కళింగ సేన గా ఏర్పడి పెనుకేక పెట్టకపోతే .“పిల్లే దేవుడు-పీటే ముత్తైదువు అన్న చందంగావుంటుంది మన భవిష్యత్ తరాల జీవితం .అసలు మన ఉద్యమాలు మనంతట మనం ఏనాడు చేసేం కనుక.."విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు "అన్నాం".జై ఆంధ్రా "అన్నాం. ఇంకా “జై సమైక్యాంధ్రా అన్నాం..కానీ ఏనాడన్నా మనం..కానీ మన మేధావులు కానీ “జై కళింగా..జై ..జై.. కళింగా..అని అన్నారా..                                                          

                                                                      ****
 చరిత్ర మీద దట్టంగా అల్లుకున్న తెరలు ఒక్కటొక్కటిగా తొలగించుకుంటూ పోతే, నిజాలు నిజంగా మనల్ని దుఃఖ్ఖ పెట్టక మానవు.....
.త్రేతాయుగం లోకి వెళితే,ఆర్యుడైన రాముడు కిష్కింధా రాజైన (అప్పుడు కళింగ రాజ్యం పేరు వేరు గా లేదు. కిష్కింధ లో భాగం గానే.ఉండేది.) .వాలిని..అప్పట్లో ..ఇప్పుడూ.. కూడా వేదపండితులు అందరూ పూజించే దేవదేవుడు.. ఇంద్రుడి కొడుకు..
క్షీర సాగర మధనం లో దేవతలకి సహాయం చేసి,ఉద్భవించిన తార ను భార్యగా పొందినవాడు.సూర్యోదయం ముందే తూర్పు సముద్రతీరం నుండి ( మా బంగాళాఖాతం..) బయల్దేరి, పశ్చిమసముద్రతీరానికీ  ,అక్కణ్ణుంచి, ఉత్తరసముద్రతీరానికీ,దక్షిణసముద్రతీరానికీ,ప్రయాణించి సూర్యుడికి వందనం చేసేత్రివిక్రముడు.ఆ  సమయాల్లో అడ్డొచ్చేపర్వతశిఖరాల్తో బంతులాట ఆడిన పరాక్రముడు.

(Contd..)

16, నవంబర్ 2014, ఆదివారం

కళింగ కేక: “మా సీమ … ఆన.” !




ఔను..ఔనౌను..

ఇది ప్రళయమే..ఇది నిజంగా మా పట్ల విలయమే
వేల వేల సంవత్సరాలుగా మా సీమకెన్ని ప్రళయాలనీ….
మేం తరతరాలుగా ఎన్ని కన్నీటి కడవలని పగులగొట్టామనీ


అందుకే,
ధైర్యం మా దగ్గరే కదా…!

తల వొంచి నిలబడుతుంది.                             
నిబ్బరమే కదా మా వెన్నునానుకుని దన్ను చూసుకుంటుంది
భయానికి  మేమెప్పుడూ తానెక్కలేని మేరువులమే కదా….!

మాకళింగ సీమ..


దివ్య రోచుల భామ..ఖచిత నవరత్న లేమ" కదా…!
 ఇంకా..ఇది అలనాడు ..
వాలి ఉయ్యాలలూపిన సీమ.
పాండవులు నెత్తికెత్తుకున్ననేల
కౌరవులు గుండెకత్తుకున్నభామ
చావుకు భయం కలిగించి అమర్త్యులైన..
మర్త్యులు మొగ్గ తొడిగిన నేల
అ.శోకుడి నేత్రాలు నీటి నిలయాలు చేసిన గడ్డ కదా..!
అశోకుడి కాలం నుంచీ మా కళింగ  సీమలో
యేడుపులు ఇంకిపోలేదా…?
ఈ సీమ
ఖారవేలుడు క ణం కణమూవెలిగించినజ్వాల
ఇది తాండ్ర పాపారాయుడు తొడలు చరిచిన భూమి
ఇదిగో..అందరూనడవాల్సిన అడుగుజాడలివిగో

ఇక్కడున్నాయని చెప్పిందిక్కడి గురజాడే..!!
ఇదే కోడి రామ్మూర్తి నాయుడురొమ్ము చూపిన నేల
శంభో అన్న  కేకతో  దేశ దేశాలనూ అజ్జాడ అదరగొట్టిన నేల ఇదే..!
ఇది సాటెవ్వరూ రాలేని మా మేటి
బొమ్మలరేడువడ్డాది పాపయ్య బొమ్మ గీసిన భామ..
మణుగుబరువులిక్కడి మగువలెత్తగలరని
లోకానికి లెక్క చెప్పిన మల్లీశ్వరిక్కడిమాణిక్యమే కదా..!!
ఈ గడ్డ మీదకి
ఎగబడ్డ హుధూద్,తనను హర్యక్షం
అనుకుంది కాబోలు

మమ్మల్ని భయపెట్టాలని పర్జన్య గర్జనలెన్నిచేసిందనీ
తురంగపదాంగ చలనాలెన్నిచేసిందనీ
కురంగరంగేళీ విన్యాసాలెన్ని చూపిందనీ

మేం..
మందగమన మద మత్తేభం లాంటి
ఏరాడ కొండ మాకండగా ఉన్నవాళ్ళం కదా..!
మానవత్వం
ఇంకా మరణశాసనం రాసేసుకోలేదని
మీరంతామాకుమీ సహకారంతో
నిండునమ్మకాన్ని కలిగించేరు కదా…!!!

మిత్రులారా..!
ఇంక మేంనిలబడతాం ..
మళ్ళీ
అందరూ మెచ్చే,నచ్చే శిల్పం లాగా  మా విశాఖను
నవ్వే,తుళ్ళే
పాపాయి లాగా,కదిలే కురిసే మేఘం లాగా
మా కళింగసీమను
మీకు కనబరుస్తాం
..ఇది
మా సీమ ఆన.







15, నవంబర్ 2014, శనివారం

ఆత్మలను మరింత వెలుగులతో నింపడానికే చరిత్ర చదవాలి !


“History is not a burden on the memory but illumination of the soul ““అని ఆంగ్ల చరిత్రకారుడు Lord Action (1834-1902) వ్యాఖ్యానించేడు .( చరిత్ర తెలుసుకోవడమంటే జ్నాపకాల కి బరువు పెంచు కోవడం కోసం కానేకాదు.అది తెలుసుకున్న ప్రతీ వాళ్ళ లో నూ వారి ఆత్మను మరిన్ని వెలుగులతో నింపేది మాత్రమే అవుతుంది.)

ఐతే చరిత్ర పట్ల ఆసక్తి ఏజాతి ప్రజల్లోనూ ఈదేశం లో ఏనాడూ లేకపోవటం వల్ల ప్రాచీనభారత దేశం లోని పదహారు మహాజనపధాల చరిత్ర అరకొరగానే ఉండిపోయింది.ఆంగ్లేయులు భారతదేశ పాలనకి ఈస్టిండియా కంపెనీ రూపం లోకి వచ్చిన తర్వాత మాత్రమే చరిత్ర విషయం లో చాలానే మేలు జరిగింది. కళింగ సీమకి మాత్రం పెద్ద ద్రోహం జరిగింది. మంచి ఉన్న దగ్గర మంచీ, చెడు ఉన్న దగ్గర చెడూ చెప్పడమే నిష్పక్ష పాత వ్రాతకి సాక్ష్యమవుతుంది. మెకంజీ కైఫీయతులూ,గెజిట్ లూ,అశోకుడి శాసనాలూ,ఇతర రాజుల దానశాసనాలూ,ప్రాచీననాణేలూ,పురాణ ఇతిహాసాలూ,బౌధ్ధుల పిటకలూ,జైనమత గ్రంధాలూ,విదేశీ యాత్రికుల కాలానుగత అనుభవాలూ,చరిత్రాత్మక పరిశోధనలూ,ఇతర ప్రాంతీయ దేశాల చరిత్ర ,మన జాతి చరిత్రను గుర్తించేందుకు,కాలానుగుణంగా ఏర్పరిచేందుకు కల్ప తరువులవుతాయి. మనవిశ్వవిద్యాలయాలు,ప్రాచీన నలందా,తక్షశిలల నుండి ఏది నేర్చుకున్నా నేర్చుకోక పోయినా,పరిశోధనలు (నేను చెప్పేది చరిత్ర గురించి మాత్రమే) కేవలం దాక్టరేట్ లు సంపాదించుకోవడానికనీ,ప్రొఫెసర్ లు గా ,మామూలు ప్రజలతో ఏ అవసరమూ లేని గొప్ప ప్రతిభావంతులుగా ముద్రలు వేయించుకోవడానికేననీ తాము తెలుసుకున్నది ఏదీ సామాన్యులకి చెప్పే అవసరం ఎంత మాత్రం లేదనీ త్రికరణ శుధ్ధిగా నమ్మిన వాళ్ళన్న నమ్మకాన్ని ఇంతవరకూ సడలి పో కుండా కాపాడుకున్నారు. మన దేశంలో ఉన్న మన తాతల కాలంనాటి తాటాకు పత్ర గ్రంధాలు రంగు వెలసి పోతూ,బూజు పట్టి పోతూ అన్ని రాష్ట్రా లలో,కొన్నైతే దేశ విదేశాల మ్యూజియం ల లో మగ్గిపోతూనే ఉంటాయి.కొందరు రాజులు సేకరించిన గ్రంధాలు వారి వారి లైబ్రరీ లలో నిద్రపోతూ ఉంటాయి.విశ్వ విద్యాలయాలలో ఆచార్యులు చరిత్రకు సంబంధించి చేసిన పరిశోధన, వారికి ఆచార్యత్వం తెచ్చి పెట్టిన పరిశోధనా పత్రాలు, గ్రంధాలు విద్యాలయాల మాళిగల్లో భద్రంగా కొలువు తీరే ఉంటాయి. మన తాతల కాలంనాటి చరిత్రోపాధ్యాయులు పాఠశాలల్లో బోధించే చరిత్ర పాఠ్య పుస్తకాలల్లోనిదే తప్ప అంతకుమించి ఒక్క అడుగు ఏనాడూ ముందుకు వెయ్యనే వెయ్యదు.

కళింగ సీమకి ఎంతద్రోహం జరిగిందో మునుముందు ఈ కళింగ కేకలో తెలుసు కుందాం !

12, నవంబర్ 2014, బుధవారం


తొలి కేక !

కళింగ కేకలో ఇది నా మొదటి పోస్టు ! ఈ వ్యాసం ఇవాళ  తే 12-11-2014దీ న ఆంధ్ర జ్యోతి దిన పత్రికలో  వచ్చింది. దీని మీద మీ స్పందన తెలియ జేస్తారు కదూ !