కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

28, మార్చి 2015, శనివారం

" కారణం...లేకుండా కార్యం ఉండదు "

" కారణం...లేకుండా కార్యం ఉండదు " అన్నసూక్తిప్రకారం,నేనుతెలుసుకున్నఆధారసహితమైనఅంశాలనే,నేనుఈ'కళింగకేక'బ్లాగువీక్షకుల,ముందుపెడుతున్నాను.ఇందులోనిపోష్టులద్వారా,నేనుచెప్పాలనుకుంటున్నవి..చెపుతున్నవీ,పాక్షికసత్యాలెప్పుడూకాదు.అర్థసత్యాలుకూడాఅవ్వవు."కళింగకేక"అనేకార్యానికిఎంతోఅవసరమైనబలమైనకారణాన్నినేనుచూపగలను.కానీ..ఆకార్యనిర్వహణకు,నాశక్తిఏమాత్రంచాలదన్నసంగతినాకుచాలాబాగాతెలుసు.ఈమట్టిమీదనేపుట్టినగురజాడచూడగలిగిన'వేగుచుక్క'నునేనుకూడాచూడగలుగుతాన్నబలమైనఆశఒక్కటే"తూర్పుబలబలతెల్లవారుతుందన్న"నమ్మకమొక్కటే..నాలో స్థిరంగా..నిలబడిఉంది.

ఈసందర్భంగాప్రసిధ్ధఆంగ్లరచయితచెప్పినకిందిమాటలునాపోష్టులకిఅన్వయిస్తాయనికూడా,నేనుఅనుకుంటున్నాను." I don`t want to be a lawyer and live upon men`s quarrels.I don`t want to be a physician and live upon men`s diseases.I don`t want to be a priest and live upon men`s sins, but I want to make my living as a writer."-Nathaniel Hawthorne"






......మధ్యయుగాల్లోసువిశాలమయినకళింగసీమ,వేరువేరురాజ్యాలుగావిడిపోయి,చాలాచిన్నరాజవంశాలపాలనలోవుండేది.శాతవాహనులు,వాకాటకులు,నలులు,ముతరాజులు,తూర్పుగాంగులు,చాళుక్యులు,సోమవంశీయులు,గాంగులు,కాలచూరులు,చండికనాగులు...వంటిఅనేకరాజవంశాలుక్రీ.శ.13వశతాబ్దంవరకూఈభాగాన్నిపాలించేయి.వడ్డాదిమత్స్యరాజులు,జంతర్నాడు(నేటివిజయనగరంజిల్లాలోనిశ్రుంగవరపుకోటనాడుజంతుర్నాటిసీమగాపిలవబడేది).గాంగులు,వీరకూటపల్లవులు,నందపురశైలులువంటివాళ్ళువీళ్ళలోముఖ్యులు.చాళుక్యులు,హైహయులుఎలాగావీళ్ళకన్నపెద్దరాజులుకనుకవాళ్ళప్రభావంకూడావీళ్ళమీదబాగానేవుండేది.తూర్పుకనుమలలోసముద్రమట్టానికి500అడుగులఎత్తునుంచీ5000అడుగులఎత్తువరకూవున్నకళింగరాజ్యంలోనిచాలాభాగాన్నినిషాదరాజ్యంఅనీ,ఆటవికప్రాంతంఅనీకూడాఅనేవారు. అంతేకాదు..విద్యాధరప్రాంతమనీ,మహావనంఅనీ,మహాకాంతారమనీ,దండకారణ్యమనీప్రాచీనకాలంనుండీఅనేకరకాలపేర్లతోకూడాఈకళింగప్రాంతంపిలవబడుతూఉండేది.కళింగయుధ్ధంలోఅశోకుడంతటివాడుకూడాతాకలేనిప్రాంతంఇదిమాత్రమే..మొదటనందపురరాజ్యంగాపిలవబడినప్రస్తుతంజైపూరుగా...పిలవబడుతున్నప్రాంతంకళింగసీమలోనిదే.ప్రస్తుతంవిశాఖపట్టణంజిల్లాలో'వడ్డాది'గాపిలవబడుతున్నప్రాంతంపేరుపూర్వం 'చక్రకొట్టం'గావుండేది.దాన్నిచండికనాగులుపరిపాలిస్తూక్రీ.శ.13శతాబ్దిలోమత్స్యరాజులకిసామంతులుగాలొంగిపోయేరు.వడ్డాదిమత్స్యరాజులు(A.D.1200/1470)..అనకాపల్లికి16K.M.దూరంలోఉన్న ఈవడ్డాదినే..రాజధానిగాచేసుకుని,రెండున్నరశతాబ్దాలుమత్స్యదేశాన్ని(వాళ్ళుపాలించినసముద్రతీరకళింగప్రాంతానికివిశాఖపట్నాన్నికూడాకలుపుకునివాళ్ళరాజ్యానికిఅప్పట్లొవాళ్ళుపెట్టుకున్నపేరది)సమర్ధవంతంగాపాలించేరు.ఉత్కళరాజైనజయత్సేనుడికుమార్తెప్రభావతినిమత్స్యరాజైనసత్యప్రతాపరాజువివాహమాడిఉత్కళరాజులస్నేహ,సహకారాలతోవడ్డాదిరాజధానిగామత్స్యదేశానికిచక్కటిపాలనఅందించేడు.వాళ్ళచరిత్రచాలాప్రాచీనమైందే.క్రీ.శ.5వతాబ్దంనుండీ,దానిఉనికితెలుస్తుంది.. ఎక్కువగారాజస్తాన్ ప్రాంతంతోఅదిముడిపడివుంటుం దికూడా.
రెండుచేపలజెండావాళ్ళది.ఒక్కచేపజెండాఉన్నపాండ్యులకీ,వాళ్ళకీకూడాసంబంధంఉండితీరుతుంది.మత్స్యకులతిలక,రిపుదర్పమర్దన,గాంగవంశవిద్రోహ,చలమర్తిగండ,ధవళమాండలీక,అన్నబిరుదులున్న'కుమారఅనంతజీయన'గంజాందగ్గరున్నచీకటినిపాలించేవాడు(సింహాచలందేవాలయశాసనంఈవిషయాన్నిచెపుతుంది).అలాగేవింధ్యప్రాంతంలోనిబలమైనరాజులైనశైలవంశీయులుతమ'నందివర్ధన'రాజధానినివిడిచిపెట్టికళింగరాజధానినిసొంతంచేసుకునితర్వాతికాలంలోవడ్డాదిమత్స్యరాజులంతటిబలమైనవారుగాఎదిగేరు.నందవరపుశైలవంశీయులలోరెండవరాజైనవిశ్వనాధరాజుమత్స్యవంశపుయువరాణినివివాహమాడేడు.తర్వాతవడ్డాదిమత్స్యవంశీయురాజ్యం,నందవరపుశైలవంశీయులదేయిపోయింది.క్రీ.శ.1443వరకూఆరాజ్యాన్నిపాలించిన,పరాక్రమశాలిగాపేరుపొందిన'సూర్యప్రతాపగంగరాజు'కిపుత్రసంతానంలేకపోవడంవల్లతనకుమార్తెలీలావతిని,కాష్మీరుపాలకుడైనసూర్యవంశక్షత్రియుడైనవినాయకదేవ్ కు ఇచ్చివివాహంచేసేడు.                    తూర్పుగాంగవంశరాజులుచక్రవర్తులైనాత్రికళింగాధిపతులని,కళింగాధిపతులనీ,వాళ్ళశాసనాల్లోచెక్కించుకున్నా,వాళ్ళుపైనుంచిపాలించేరాజులుకనుక..చిన్నరాజ్యాలుగాకళింగసీమనుపాలించినరాజులకిఎటువంటిఇబ్బందీఎదురవ్వలేదు.
కోణార్క సూర్య దేవాలయం
కోణార్కదేవాలయాన్నినిర్మించినవాళ్ళుకూడా,కళింగనగరాన్నిరాజధానిగాచేసుకునిపాలించినతూర్పుగాంగరాజులే..వాళ్ళుతూర్పుచాళుక్యులతోదగ్గరిసంబంధాలున్నవాళ్ళుకావటంతో,ఇప్పటికీకొన్నిప్రాచీనదేవాలయాలుదక్షిణాదిశిల్పరీతులతోకనువిందుచేస్తాయి.వాళ్లు,వాడుకలోకితెచ్చిన'గంగాఫణాలు'అన్ననాణేలువిస్త్రుతంగాదేశమంతటాప్రచారాన్నిపొందేయి.గొప్పదైవభక్తుడూ,కళారాధకుడూఅయిన'అనంతవర్మచోడగంగదేవుడే'పూరీలోనిప్రస్తుతజగన్నాధదేవాలయాన్నినిర్మించినవాడు.


జగన్నాధ దేవాలయం
క్రమక్రమంగాచిన్నరాజ్యాలుబలపడ్డాయి.గజపతివంశం(క్రీ.శ.1500లో)పాలనప్రారంభంఅయ్యేకవీటిప్రాబల్యం,క్రమేపీతగ్గిపోయింది.చివరికిఉనికికూడామాయమైపోయింది.కపిలేశ్వరగజపతి(1424/1434)కళింగరాజ్యంలోనిఅందరిరాజులనీలొంగదీసుకున్నాడు.అతనిసామంతులందరూ..అతనినుండి'మహాపాత్ర'బిరుదునిగ్రహించేరు.'ప్రతాపవల్లభ'అనేమత్స్యరాజు,వల్లభరాజుమహాపాత్ర,శ్రీవీరప్రతాపవల్లభరాజమహాపాత్ర,కుమారత్రయిదబెహరామహాపాత్రవంటివికూడా.అంటించుకున్నాడులేదాతగిలించుకున్నాడు.1435నాటికిమత్స్యరాజులుపూర్తిగాగజపతులకిస్వాధీనంఅయిపోయేరు.తమపేరన్నదిలేకుండాచేసుకున్నారు.1471సంవత్సరంవచ్చేసరికి,మత్స్యరాజ్యం..పూసపాటి,మాడుగులజమీందార్లచేతుల్లోకివెళ్ళిపోయింది.ఈజమీందార్లుఅప్పట్లోగజపతులసామంతులుగానేవుండేవారు.ఒకప్పుడువాళ్ళరాజధానిఅయినవడ్డాది,చిన్నఎస్టేటుగారూపాంతరంచెందితర్వాత్తర్వాతపూసపాటిరాజులచేతిలోకివెళ్ళింది..1618లో'మితరామరాజువిజయరామరాజు'ఆచిన్నమత్స్యరాజ్యాన్ని(..జమీందారీ..!)పాలించేవాడుఅలాసముద్రతీరప్రాంతం,అయినకళింగసీమలోమాత్రమే,తమప్రాభవాన్నిచాటుకున్నమత్స్యరాజులశకంపూర్తిగాఅంతరించిపోయింది.

(Contd..)
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

*క్రీ.శ.275లోసింహళద్వీపరాజుమహేశుడుకళింగరాజునుండిబుధ్ధునిదంతంవొకటిసంపాదించి,కాండీపట్టణంలోబౌధ్ధారామంకట్టిదానిలోభద్రపరిచేడు.
**ఆంధ్రదేశమంతటావిలసిల్లినబౌధ్ధస్థూపాలు33.అవిఉత్తరానశ్రీకాకుళంజిల్లాలోనిశాలిహుండంనుంచిదక్షిణానచినగంజాంవరకూతూర్పునఘంటశాలనుండిపడమరగుత్తివరకూఉండేవి.
***1936లోఒరిస్సారాష్ట్రంఏర్పడకముందుఉండిన,గంజాంజిల్లాలోనిఉత్తరభాగం,పర్లాఖిమిడి,బరంపురం,గుణుపురం,విశాఖఏజెన్సీలోని,జయపురంసంస్థాన..ప్రదేశం,కొత్తఒరిస్సారాష్ట్రంలోనికిచేర్చబడ్డఅధికసంఖ్యాకకళింగప్రాంతాలు.
****జయపురంరాజులు,రాజపుత్రవంశంవాళ్ళమనిఔధ్,,కాశ్మీర్,జమ్మూసంస్థానాలనుంచివచ్చినవాళ్ళమనిచెప్పుకుంటారుగానీ,ఓడ్రవంశజులమనిఎక్కడా..ఎప్పుడూచెప్పుకోలేదు.వాళ్ళ'తామర'శాసనాలుతెలుగులోనేఉన్నాయి.జయపురం,బస్తరు8,9శతాబ్దాలనుండికళింగలోనేఉన్నట్టుచారిత్రకాధారాలుచెపుతాయి.
*****పర్లాఖిమిడినిఒరిస్సాలోకలపాలనివాదించి,ఆపుణ్యాన్నిమూటకట్టుకున్నశ్రీక్రిష్ణచంద్రగజపతినారాయణదేవ్(1892/1974)ఒరిస్సాప్రభుత్వాన్నిఏర్పాటుచేస్తే,కళింగలోచివరిప్రాంతమైనగంజాంజిల్లాకిచెందినబిశ్వనాధదాసుమొదటి ఒరిస్సాముఖ్యమంత్రిఅయ్యేడు.ఈఏభైఎనిమిదేళ్ళల్లో..సమైక్యాంధ్రాసింహాసనాన్నితెలంగాణాదొరలూ,రాయలసీమరెడ్లూ,ఆంధ్రానాయుడురాజులూ,కమ్మప్రభువులే..ఏలేరు,ఏలుతున్నారుగానీ,తమకళింగసీమపేరును,భారతదేశంనుంచేతీసిపారేసి'ఉత్తరాంధ్ర'గనేఅందరూపిలుస్తుంటే,అదేతమప్రాంతంముద్దుపేరుగాఆనందంగాపిలుచుకుంటున్నకళింగసీమవాసులు,మిగిలిపోయినఈనాలుగుజిల్లాల్లోఏఒక్కజిల్లావ్యక్తయినా,సమగ్రాంధ్రాకి,కనీసంఒక్కరోజైనాముఖ్యమంత్రికాలేదనిగుర్తించి...మేంచేసినపాపంఏమిటీ?,,మాకున్నదేశాపం.?.అనిఏనాడన్నాఎక్కడైనా..ఎవ్వరైనా,ఎవ్వరినైనాఅడిగారా..?అసలాఆలోచనఏకాళింగుడికీఏనాడూరాలేదు.ఎందుచేత..?