కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

28, మార్చి 2015, శనివారం

రైతుల నుంచి భూ సేకరణ-రెండావుల కథ.”

రైతుల నుంచి భూ సేకరణ-రెండావుల కథ.”






నవ్యాంధ్రప్రదేశ్లో,కొత్తరాజధానికోసంప్రభుత్వంచేపడుతున్నభూసేకరణవిధానంతీరుతెన్నులుపరిశిలిస్తుంటే,కేంద్రప్రభుత్వంభూసేకరణచట్టంసవరణకోసం..మళ్ళీఆర్డినెన్సుతేవడానికి,ఆలోచనచేస్తూఉండటాన్నిగమనిస్తూఉంటే..అప్పుడెప్పుడోచదివిన,రాజ్యాంగవ్యవస్థలకిపేరడీగా1936ప్రాంతాల్లో,విస్త్రుతంగాఅమెరికాలోసందడిచేసినటువంటి(parableoftheIsms)"రెండావులకథ”గుర్తొస్తోంది.
తరతరాలుగాఅనేకరాజ్యవ్యవస్థలలోఎన్నెన్నోచిక్కులకీఅవస్థలకీగురై,ఇంకావ్యవసాయాధారితజీవితాన్నేకొనసాగిస్తున్నతుళ్ళూరురాయపాడు,ఉండవల్లి,పెనుమాక..వంటి(భవిష్యత్అమరావతిరాజధానిగామారబోయే)అనేకగ్రామాల్లోఉన్నసన్నకారు,చిన్నకారురైతులకి,వాళ్ళభూములమీదఆధారపడిబతుకుతున్నపేదవర్గాలవారికీఇప్పుడెదురైనరాష్ట్రప్రభుత్వంసి.ఆర్.డి.యే.ద్వారాప్రకటించినభూసేకరణవిధానాలసుడిగుండం,అయోమయంలోకినెట్టేస్తూంది
      ఆ,రైతులుఇంతకాలంగాఇన్నివ్యవస్థలనుండీ,రక్షించుకుంటూ వస్తున్నతమకొద్దిపాటిభూముల్నితమకునచ్చినట్టు,తామునిర్ణయించుకున్నట్టుప్రభుత్వానికిఇవ్వడమో,లేదాతమదగ్గరేవుంచుకోవడమోచేయడానికీ,వ్యవసాయాన్నికొనసాగించాలనుకుంటేఆనందంగాకొనసాగించటం,అక్కర్లేదనుకుంటేతామేఆనిర్ణయంకూడాఅంతేఅనందంగాతీసుకోవడంచేయడానికీ..ఎంతమాత్రంవీలుగాగానీ,నమ్మకంగాగానీఈవిధానాలుకనబడటంలేదు.      రెండావులపేరడీకథలోచెప్పినఆవులుఅక్కడడబ్బుకిసంకేతంఅయితే,ఇక్కడకాసేపు,రెండెకరాలుస్వంతభూమివున్నఒకరైతునికాసేపురెండావులున్నరైతేఅనుకుందాం.అప్పుడువాటికోసంరాజకీయవ్యవస్థలెలామాట్లాడుతాయో....ఆయాకథలెలామారుతాయోఅన్నదాన్నిఒకసారిచూద్దాం . 
సోషలిజంవ్యవస్థలో,ఆరైతువున్నాడనుకుంటేఆప్రభుత్వంనడిపేనాయకులమాటలు:"నీదగ్గరరెండావులున్నాయి.ఒకటిప్రభుత్వానికిఇచ్చెయ్యి...దాన్నిప్రభుత్వం నీపక్కవాడికి ఇస్తుంది.."
వ్యవస్థకమ్యూనిజంఅనుకుంటే:"నీరెండుఆవుల్నీగవర్నమెంటుకిచ్చెయ్యి.గవర్నమెంటునీకుకొన్నిపాలిస్తుందిలే."
వ్యవస్థఫాసిజంఅయితే:"నీరెండుఆవుల్నీగవర్నమెంటుకిఅప్పచెప్పు.నీకుపాలుకావాలనుకుంటేనీకు,మేంఅమ్ముతాంలే."
వ్యవస్థపెట్టుబడిదారీదయితే"నీకురెండుఆవులున్నాయికదా..ఒకదాన్నిఅమ్మేసి,ఒకఎద్దునికొను..నీఇంటినిండాఆవులే..ఆవులు."
వ్యవస్థనాజీయిజమైతేమాత్రం"చూడూ..గవర్నమెంటునీరెండుఆవుల్నీతీసుకుంటుంది.నిన్నుమాత్రంకాల్చిపారేస్తుంది.రెడీగావుండు."
వ్యవస్థజమీందారీవ్యవస్థఅయితే"నీరెండావులపాలనూభూస్వామికిచ్చేసి..నువ్వుపిడకలమ్ముకునిబతుకు."
                                 విపరీతంగాప్రచారంలోకివచ్చినఈపేరడీకిPat Paulsen"అనేఅమెరికనుకమెడియనుతన"PatPaulsenforPresident"అనేఆల్బమ్(1960)లో,కేపిటలిజంవ్యవస్థకిమరొకటికలిపేడు."నీఆవుల్ని..నీభార్యపేరుమీదపెట్టు.ఆతర్వాతఆవులవ్యాపారంలోదివాలాతీసేననిచెప్పు."
ప్రస్తుతకాలంలోఎదుగుతున్నకొత్తవ్యవస్థలవిధానాలుమనంకూడాకలిపిచూస్తే,
వ్యవస్థపవరిజమ్,అయితే“మనప్రభుత్వంఆలోచనమహగొప్పదిలే..ఇన్నేళ్ళగామిమ్మల్నిదోచుకుతింటున్నమీఅందరిముష్టిఆవుల్నిదూరంగాతరిమికొట్టండి..రెండ్రోజులువేరేపనులుండి,తనకట్టువిప్పలేదని,గడ్డిపెట్టలేదనిఒకఅమాయకపేదరైతుని,అతనిదుర్మార్గపుఆవు,తోకతోకొట్టిందట..పాపంనాదగ్గరఆవిషయంచెప్పుకునిఅతనుభోరుమన్నాడు.నాకూకన్నీళ్ళాగలేదు.కనక..అలాంటిమీదుర్మార్గపురెండుఆవులకిబదులుతిండిఅసలేమాత్రంఅడగనిగంటకివెయ్యిలీటర్లపాలిచ్చేజెర్శిఆవుల్నితెచ్చిమీకిచ్చి,పాలధారతోదేశంలోమనరాష్ట్రాన్ని.."శ్వేతరాష్ట్రం"గామార్చేసత్తావున్ననాయకుడుమనకున్నాడుకనకమీఅవుల్నిమనరాష్ట్రాని.కిచ్చేయండి.మనరాష్ట్రాన్నిన్యూజెర్శీగామార్చేద్దామనిఅందరంకలిసిప్రమాణంచేద్దాం”.జైన్యూజెర్శీ”."మరొక్కసంగతికూడామీకుఇప్పుడేచెపుతున్నా..మనంఅనుకున్నట్టుగాకానీ,జరగకపోతే..నాసంగతిమీకుతెలుసుగా..తాటవొలుస్తా.తిత్తి..తీస్తా..ఆ..”
అదేబాబిజంవ్యవస్థఅయితే.."నేనుసామాన్యప్రజలకోసం..రాత్రింబగళ్ళుఅలుపెరగకుండాకష్టపడేఅతిసామాన్యకార్యకర్తని.కష్టజీవిని.. మీఆవుల్నిరాష్ట్రానికికాపుకిచ్చిమీరుసింగపూర్,జపానులాంటిదేశాలన్నీహాయిగాతిరిగిరండి.మీఆవులబంగారుదూడల్నిమళ్ళీమీకప్పగిస్తాగా...మీమీదొట్టు..అన్నట్టురెండ్రోజులపాటుయోగాచెయ్యడంనేర్చుకోండి.మీకేచికాకులూరానేరావు."
అదేవ్యవస్థసత్తావాదందయితే.."మేంఎప్పటినుంచోమొత్తుకుంటూనేవున్నాం.మామాటఎవరూపట్టించుకోరు.రైతుకున్నరెండావులగురించిఈఅనవసరపుఆందోళనలింతఅవసరమా..?.చక్కగాచిన్నవైనకోడిపెట్టలైతేఅందరూబాగాపెంచుకోవచ్చు.ముద్దుముద్దుగా,చూడముచ్చటగాకూడాఉంటాయి.ఇంకగుడ్లైతేఎన్నిపెడతాయోలెక్కకూడపెట్టలేము.కొంచెంఅలోచించండి”అంటుంది.
              ఇంకRichard M.Steers & LucianaNardenవాళ్ళ"Global Economy"పుస్తకంలో,దీనిలోసాంస్క్రుతికభేదాలనికూడాచేర్చేరు.అవికూడాచూద్దాం.
1.ప్రభుత్వంఈఆవులసేకరణపనినిరష్యనుకంపెనీకిఅప్పగిస్తే,ఆకంపెనీనిర్వాహకులుఏంచెపుతారంటే,”నీకురెండావులున్నాయి.కొంచెంవోడ్కాతాగు..తాగేవా.! ఇప్పుడుమళ్ళీలెక్కపెట్టు.చూసేవా..?అవి అయిదు.”
ఇంతలోరష్యామాఫియాఎంటరవుతుంది.ఆరైతుదగ్గరున్నవిరెండా..అయిదా..అన్నలెక్కేఅవసరంలేకుండామొత్తంఅన్నిటినీతోలుకుపోతుంది.
2.అదేకాలిఫోర్నియాకంపెనీఅయితే”,ఏమోయ్.రైతూ..నీదగ్గరలక్షఆవులున్నాయి.కానీచాలావాటినినువ్వుఅసలురిజిష్టరేచేయించుకోలేదు.కనకఅవినీవికావన్నమాట.”అంటుంది.
3.ఇంకఆస్ట్రేలియాకంపెనీకిగానీ..ప్రభుత్వంగానీఅప్పచెప్పిందంటే,“నీకురెండుఆవులున్నాయికదా..వెళ్ళిభోజనంచేసిరా.!".అంటుంది.రైతుతిరిగొచ్చేక”నీఆవులులేవయ్యా..రాష్ట్రప్రభుత్వంనీజాగానిచైనావాళ్ళుతయారుచేసేన్యూక్లియరురియాక్టరుకోసంతీసేసుకుంది.నీఆవులూఅక్కడేవున్నాయి.నీభూమితోపాటేఅవీ వెళ్ళేయి.”అంటుంది.          గొప్పగొప్పఆర్థికనీతివేత్తలు,ప్రభుత్వసలహాదారులుఏకాలంలోనైనాప్రభుత్వాలకిచ్చేఆర్థికవిధానాలుకొద్దిపాటిహెచ్చుతగ్గులతోఈరెండావులపేరడీగాకధలావుంటే,ఇప్పుడునవ్యాంధ్రప్రదేశ్లో..రాజధానినిర్మాణంకోసంప్రజలవద్దనుంచితమకికావాలనుకున్నంత..భూమిసేకరణకోసం,ప్రభుత్వంఅవలంబిస్తున్నఆర్థికవిధానంకూడా,పైవాటిలోకేవస్తుందా..వస్తే,ఏవ్యవస్థావిధానంలోకి వస్తుంది.
ఈరాష్ట్రం,ఈదేశం,అవలంబిస్తున్నవిధానాలుప్రజాస్వామ్యవిధానాలేనా...లేకపోతేఫాసిస్టువిధానాలా...అన్నసందేహం..ఈమధ్యప్రభుత్వాలువిడుదలచేస్తున్నఆర్డినెన్సులుచూస్తే,ఏకపక్షనిర్ణయాలుచూస్తూవుంటేఅనేకమార్లు,అనేకమందిఅంతోఇంతో,అక్షరాస్యతకలిగినప్రజల్లోకలుగుతోంది.
ప్రసిధ్ధబ్రిటిషురాజకీయనాయకుడూ,రచయితా,LordActonతన“TheHistoryofFreedominAntiquity,ఉపన్యాసంలో(1877సంవత్సరంలో)చెప్పిన,"ప్రజాస్వామ్యంలోపెద్దచెడుఏమిటంటే,ఎన్నికలలోమెజారిటీసీట్లుసంపాదించినవారినిరంకుశత్వం.ఆనిరంకుశత్వంవ్యక్తులదైనాకావొచ్చు.లేదాఆపార్టీదైనా..కావొచ్చు.ఇంకాచెప్పాలంటే,ఆమెజారిటీనిజమైందికూడా..కాకపోవచ్చు.ఎన్నికల్లో,బలంఉపయోగించడంవల్లలేదామోసంవల్లసంపాదించినమెజారిటీకావొచ్చు."అన్నమాటనిజమేమో..!అనికూడాఅనిపిస్తుంది.
ప్రస్తుతం,కొన్నికొన్నిపత్రికల్లోవస్తున్న,రాజకీయదర్పంతోకూడినవ్యక్తివిశ్లేషణలూ,రాజకీయపార్టీలకుసంబంధించిననాయకులుటి.వి.ఛానెళ్ళలోవ్యక్తపరుస్తున్నపరిమితులుదాటిపోతున్నవ్యక్తిఆరాధనలురాజరికాన్నీ,దానితోకగావెలిగినజమీందారీవ్యవస్థలనీగుర్తుచేస్తూవున్నాయి.రాజకీయదర్పంతోకూడిననాజీయిస్టులనాయకుడుహిట్లరుతనుఅధికారంలోకిరాగానేచేసినమొట్టమొదటిపనిపాఠశాలల్లో.పిల్లలపాఠ్యపుస్తకాలని,తనభావాలకిఅనుగుణంగామార్చటంప్రస్తుతందేశంలోప్రాంతీయపార్టీలేకాదుజాతీయపార్టీలుకూడాకొత్తగాఏమీచెయ్యకుండాపాతప్రభుత్వాలురూపకల్పనచేసినవిధానాలన్నిటిపేర్లూ,నిర్మించిన..నిర్మాణాలపేర్లూమాత్రమేమార్చితమపార్టీలపేర్లూ,రంగులూపెట్టుకుంటూవుంటేగబగబా..శంకుస్ధాపనలపర్వంకొనసాగిస్తూవుంటే(ఏపార్టీనాయకులుశంకుస్ధాపనచేసినఏనిర్మాణమైనా,మళ్ళీఅదేపార్టీనాయకులు,ప్రారంభోత్సవంచేసిమరీఎన్నికలకివెళ్ళాలనేది,ప్రజలదురాశేఅయిపోతోంది.)ఎందుకోగానీప్రస్తుతప్రభుత్వాలవిధానాల్లోహిట్లర్నాజీయిజంజాడలుకొంతవరకూకనిపిస్తున్నాయి.
పెద్దపెద్దపారిశ్రామికవేత్తలకిప్రాంతీయంగా,జాతీయంగాజరుగుతున్న..గౌరవమర్యాదలూ,వారికిప్రజలఆలోచనలతో,ప్రజాస్వామ్యఎన్నికలతోఏమాత్రంసంబంధంలేకుండాదక్కుతున్నఅధికారికహోదాలూ,వాళ్ళఅనాలోచితప్రజావ్యతిరేకవిధాననిర్ణయాలూ,ప్రభుత్వసరళీకరణఆర్ధికవిధానాలసంగీతరాగాలూ...ఈస్వామ్యంకాపిటలిస్ట్స్వామ్యమేఅంటేఔనేమో..అనిపించేలావున్నాయి.
ఇంకసాంస్క్రుతికవిధానాలలోప్రపంచీకరణఇప్పటికేచాలాజరిగిపోయిందికనుక,రష్యన్,కాలిఫోర్నియన్,ఆస్ట్రేలియనుకంపెనీల,విధానాలనికలగలిపిమరీకాపీకొట్టగలిగేసింగపూరుకంపెనీలకి,రాజధానినిర్మాణాన్నిఅప్పగించినట్టుస్పష్టమవుతోంది.
        ఇప్పటికి,ఇన్నిరకాలవిధానాలనీనిస్సిగ్గుగాఆచరణలోకిపెట్టగలిగే ప్రభుత్వాలుఇంతకంటేనిస్సిగ్గుగామరేవిధానాన్నిఆచరణలోకితేవన్నధైర్యంగానీ,నిబ్బరంగానీ,నమ్మకంగానీ,ఎక్కడాఎవరిలోనూఇంతమాత్రంకూడామిగల్లేదు. ఊసరవెల్లులుఎవరికీచెప్పిఎన్నడూరంగులుమార్చవుకదా..!
ఒకపాశ్చ్యాత్యఅర్ధనీతికోవిదుడుఎప్పుడోచెప్పినప్రభుత్వాలఈఆర్ధికవిధానరహస్యాలు,ఏప్రాంతంఅయితేనేం,ఏదేశంఐతేనేం,ఏఖండంఅయితేనేంగాక,ఏకాలంలోఅయినాఈకథనిత్యనూతనంగానేఉంటుంది.ఎందుకంటేఇదిఅవాస్తవికకల్పనఅప్పటికీఇప్పటికీ...కూడా..కాలేదు..కనుక.
అసమానమేధోవికాస,ఆర్ధికవిధానదురంతరులూ,కీర్తికిరీటాలవెలుగులతో,దుర్నిరీక్ష్యంగావెలిగిపోతున్నపండితప్రకాండులూ,నిండైనబొజ్జలనునిమురుకుంటూపగలబడినవ్వగలిగేకధకూడా..ఇదికానేకాదు...ఇంకాఖచ్చితంగాచెప్పాలంటే,చిన్నరైతులు,సన్నకారురైతులు,కౌలుకివ్యవసాయంచేస్తున్నరైతులు,బడుగురైతుకూలీలు..అర్థనిమీలితనేత్రాలబుధ్ధుడిలావుండిపోయినంతకాలం..ఆత్మహత్యలనే,తమకిమిగిలున్నపరిష్కారంగాభావించినంతకాలం.ఇది కంచికివెళ్ళే కథకాదు.
 ప్రభుత్వం..తమమీదఎక్కుపెట్టినఈబాణందెబ్బనుంచితట్టుకోవడమెలాగోతెలీకుండాదిక్కుమాలిపోయి,అన్నిదిక్కులకీద్రుష్టిసారించిఏదారీతోచని,ఏభరోసాదొరకనిపరిస్థితిలోఇప్పుడుఆరైతులున్నారు.కనుకనిబధ్ధతేకొలబద్దగానిలవగలిగే,నిపుణతఉన్నఆర్థికశాస్త్రవేత్తలతో,ఏరాజకీయపార్టీలోఉన్నా,ఇబ్బందులజీవితాన్నేఎప్పుడూఎదుర్కొనేబడుగురైతులకిఅండగావుండటమే..తమప్రధానలక్ష్యంగాభావించేప్రజ్నకలిగినరాజకీయనాయకులుకలిసిపోయి,ఎటువంటిభేషజాలకీపోకుండా,ప్రస్థుతానికయినాసరే,కలిసిమెలిసిరైతులముందుండి...ప్రభుత్వానితో,రైతులకిమేలైనఒకమార్గంలేదా,వారందరికీ,అనుకూలంగావుండేమార్గాలనువెతికి,వాటినిఆచరణీయం..చేయించితీరాలి.
                                                           “  వేద ప్రభాస్”

                                                                                                     

.