కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

25, ఏప్రిల్ 2015, శనివారం

విస్మ్రుత కళింగ కవులు

విస్మ్రుత కళింగ కవులు

నన్నయ,తిక్కనలాంటి కవీంద్రులు పొందినటువంటి  కీర్తి, ప్రతిష్టలు...ఆనాడు ఈనాడు మాత్రమే కాదు ఏనాడూ పొందలేక పోయినా నిత్యోన్నతబుధ్ధితో కావ్య రచనలుచేసిన కవులకు,కళింగరాజ్యంలోకొరతఏనాడూలేదు.
తెలుగుభాషలోకవిత్వంప్రారంభమైనకాలంలో,కళింగదేశంలోనూపద్యాలరూపంలోశాసనాలురాయబడ్డాయి.పోయినవిపోగామనకిసాక్ష్యాధారంగా,దొరికినది....శ్రీకాకుళంజిల్లాలోనినరసన్నపేటతాలూకాలోని'దీర్ఘాశి' గ్రామంలోని శాసనం.ఇదిశాలివాహనశకం997అంటేక్రీ.శ.1075నాటిది.అంతేకాదు.క్రీ.శ.1769ప్రాంతంకవిఅయిన,అమితమేధోశాలి..అపరిమితధీశాలి'అడిదంసూరకవి'తనవంశంలో 23 పురుషాంతరాలనుండి కవులున్నారని చెప్పేడు.

సీ.వ్యాస భట్టారక భాషిత మైన కళింగ రాజ్య మహిమ
కాళిదాస కవీంద్ర ఘనవచో విలసితమైన కళింగ రాజ్యంబు గరిమ
దండి మహాకవి ధన్య వాగంచిత మైన కళింగ రాజ్యంబు పటిమ
గాంగ వంశ్య ప్రభుకాంక్షల కాకరమైన కళింగ రాజ్యంబు ప్రథిమ
గీ.కటకటా!యది కేవల గ్రాంధికమయి
నేటి వారికి దెలియక మాటుపడియె;
అవును,వాడుక లేని పదార్థములకు
నెంత దొర్లాడినా గతి యంతె కాదె?
(ఇది బ్రహ్మశ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు కళింగ రాజ్య వైభవాన్ని గురించి నూరేళ్ళకిందట చెప్పిన పద్యం) 

తెలుగు భాషాపరంగా తెలంగాణా ముఖ్యమంత్రి 'ఆదికవి' నన్నయ్యకాదు' పాల కురికి సోమనాధుడు' అని నిన్నో మొన్నో  మీడియాలో చెప్పినట్టు చూద్దా మంటే అతడు రాసిన 'వ్రుషాధిపశతకము' మొదటిది 'బసవపురాణం' తర్వాతదిఅవుతాయి.అయితే,అంతకుముందేక్రీ.శ.1170ప్రాంతాల్లోశ్రీమల్లిఖార్జునపండితారాధ్యుల'శివతత్వసారము'ఉన్నప్పటికీఅదిశతకంగానేగుర్తింపుపొందినప్పటికీ,అందులోసంఖ్యానియమంగానీ,మకుటనియమంగానీపాటించబడకపోవటంవల్ల'వ్రుషాధిపశతకమే'మొదటిదానిగాచెపుతున్నారు.తర్వాతివాటిల్లో"యధావాక్కులఅన్నమయ్య"గారి'సర్వేశ్వరశతకము'ముఖ్యమైనది.ఇదిక్రీ.శ.1242నాటిది.

    కళింగదేశంలో'శతకాలు'ముందుపుట్టలేదనిచెప్పడానికిగానీ...ముందే పుట్టేయనిచెప్పటానికిగానీఎటువంటిసరైనసాక్ష్యాధారాలూప్రస్తుతానికిలభ్యంకావడంలేదు.'అడిదంసూరకవి'రచించిన'రామలింగేశశతక'మేమొదటిదిగాచెప్పగలం.దీనితరువాత'గోగులపాటికూర్మనాధకవి'రాసిన'శ్రీవరాహలక్ష్మీన్రుసింహ'శతకముముఖ్యమైనది.గోగులపాటికూర్మనాధకవి'మ్రుత్యుంజయవిలాసం'అనేయక్షగానాన్నీ,'లక్ష్మీనారాయణసంవాదం'అనేప్రబంధాన్నీ,'చోరసంవాద'మనేపద్యకావ్యాన్నీ,'సుందరీమణి'అనేమరొకశతకాన్నీకూడారచించేడు.చాటరాతిలక్ష్మీనరసకవి,వేల్చూరివేంకటేశ్వరకవి,కవిరాయనిరామభద్రకవి,పచ్చమెట్టపాపకవి,మొదటివరుసశతకకవులు.అమలాపురపుసన్యాసకవిచాలాశతకాలురచించేడు.ఆంధ్రగీర్వాణభాషల్లోఅతనిపాండిత్యంఅసాధారణం.మంగళంపల్లిసుబ్రహ్మణ్యకవి"అర్సవిల్లిమార్తాండా..జగద్బాంధవా"అనేశతకాన్నిరాసేడు.మహామహోపాధ్యాయపరవస్తుభగవద్వేంకటరంగాచార్యులవారువిశాఖపట్టణవాసి,కూడాశతకరచయితే.మండపాకపార్వతీశ్వరశాస్త్రి40శతకాలురచించినశతకకవి.ఇందులో16ఏకప్రాసశతకాలుఉన్నాయి.'వరాహనారసింహశతకం','జగద్రక్షకశతకం,'కిందటిశతాబ్దంలోతెలుగువారందరికీసుపరిచితమైనవి.గంజాంజిల్లాకిచెందినపారనందిసర్వేశ్వరశాస్త్రి,,మచ్చవెంకటకవి,ముక్కవెల్లిసాంబయ్యశాస్త్రి,డబీరుక్రిష్ణమూర్తిసూరికూడాబాగాపేరుపొందినశతకకవులే. ఇంకా...గతశతాబ్దికవులగురించి,చెప్పాలంటే,ఇంద్రకంటివేంకటశాస్త్రి,కెళ్ళకప్పయ్యకవి,మ్రుత్యుంజయనిశ్శంకభూపతి,పూసపాటివీరపరాజు, వద్దిపర్తి అప్పల నరసింహ కవి,పంతుల లక్ష్మీ నరసింహ శాస్త్రి (తాబేలు మేటి శతక కర్త).వంటి కవుల లెక్క తక్కువ మాత్రం కాదు.
                కళింగదేశస్త్రీలలో,కూడాశతకాలుచెప్పినవారుఎక్కువగానేఉన్నారు.'తరిగొండవేంగమాంబ'తోసమకాలికురాలుగాఉండినటువంటి,1781లోజన్మించిన,కళింగకవయిత్రి'మదినసుభద్రమ్మ'గురించిఎందరికితెలుసు?.ఆమె'వేంకటాచలమహాత్మ్యము','రాజయోగసారము',అన్నగ్రంధాలనుమాత్రమేకాక,'శ్రీరామదండకము','రఘునాయకశతకము','కేశవశతకము','క్రిష్ణశతకము','రాఘవశతకము'అనేశతకాలనురచించినసంస్క్రుతాంధ్రవిదుషీమణి.ఈమెఒక్కతేకాక'కందాళంరంగనాయకమ్మ','సీతమరాజునరసమాంబ',లాంటివాళ్ళనుగురించితెలుసుకునిచెప్పినా,తెలుసుకోమనిచెప్పినా..కళింగదేశీయులకి,ఈనాటికవులకే,రచయితలకే,ఇక్కడఏదిక్కూలేకుండాచేసినవాళ్ళం.ఆకాలంనాటికళింగకవులుమాకేంఎక్కువ..అనిఅంటున్నారా...అనిపించేంతగానిద్రాణంగాఉండటం,ప్రశాంతంగానిద్రపోతున్నఒకమనిషిచెవిదగ్గరఓదోమవాలితే,ఆమనిషి........పట్టించుకున్నట్టుగానైనాకూడాపట్టించుకోకపోవటం,అలవాటైపోయిన,అతిపెద్దదౌర్భాగ్యం.('కళింగకవులజీవితచరిత్రలు' ఇంకొక పోష్టులో..)

ఇంక,కొద్దిగాకళింగరాజ్యపాలనాచరిత్రలోకివెళితే..వేంగిరాజధానిగాఆంధ్రతోపాటుగాకళింగదేశాన్నిపాలించిన'శాలంకాయనుల'తర్వాత(ప్రస్తుతహైదరాబాదుతోపాటుతెలంగాణాప్రాంతాన్నిఏలిన)వాకాటకరాజుల్లోరెండవప్రవరశేనుడికాలంలో(క్రీ.శ.425/450)వాకాటకయువరాణిని,మొదటిమాధవవర్మకిచ్చి,వివాహంచేసి,అతనినివేంగిరాజుగాచేసినట్టు,అప్పటినుంచిఆంధ్రరాజ్యమేకాదు.కళింగరాజ్యాన్నికూడావిష్ణుకుండినులుఏలినట్టుగా'రామతీర్థం'లోదొరికిన...రెండుదానశాసనాలు చెపుతాయి. 
రామతీర్థంప్రాచీనతకిఇంతకన్నసాక్ష్యాలుఇంకెన్నికావాలి..?

ఇంకాఅంతకుముందుకాలంనాటివి,మరెన్నోకళ్ళముందుపెట్టినా..పెట్టడానికి,సాక్ష్యాలతోసిధ్ధంగాఉన్నా,తమచెట్టుకొమ్మను,తామేనరుక్కున్నజాతివారసులకు..మూగగారోదించేపురాతనకాలంనాటిఆధారాలు(వేరువేరురాష్ట్రాలలో,ఎన్నోఇతరదేశాలమ్యూజియంలలోమగ్గిపోతున్నవి)తమనుచూడమని,కళింగజాతి...పునరేకీకరణకి,ఉన్ముఖం కమ్మనీ ,అందుకు గొంతెత్తి నినదించమనీ ఎలా చెప్పగలవు..?


మెగస్తనీసు'కాళింగులుచాలానాగరీకులనీ,అనేకవ్రుత్తులని,అవలంబించివాటిలోచాలానేర్పరులుకాగలిగేరనీ,విద్యాధికులనీ,వేదాంతచర్చలలోపారంగతులనీతనఇండికాపుస్తకంలోరాసేడు.ఎవరుమనకదిచెప్పేరు..? 
భారతీయులలోకాళింగులుపురాతనస్వాతంత్రనాగరికతకలిగిఉన్నవారు.వ్యాపారం,శిల్పకళ,రాజ్యాంగవిధానాలలో,గొప్పప్రావీణ్యులుగాఉండినజాతి.కళింగరాజ్యంప్రాచీనకాలంలో'నూలుబట్టల'కుప్రపంచఖ్యాతిపొందినదేశంగాఉండేది.తమిళభాషమాట్లాడేవాళ్ళు,...ఈరోజుకూడానూలుబట్టని'కాళింగ'మనేఅంటారు.ముందుఆమాటకళింగదేశంనుండివచ్చిన'నూలువస్త్రం'అనిపిలవబడుతూకాలక్రమంలో'కళింగ వస్త్రం'గాపేరుమార్చుకుంది.


పాణినీయసూత్రాలలోకూడా'కాళింగ'దేశప్రస్తావనఉంది.కౌటిల్యుడిఆర్థికశాస్త్రంలోఅనేకసార్లుకళింగరాజ్యంగురించిచెప్పబడింది.మహాభారతంలోఇంకావెనుకకువెళ్ళి,వేదపండితులునిష్పక్షపాతపరిశీలనచేయగలిగితే,ఐతరేయబ్రాహ్మణంలోని"భోజ'పదవిశ్లేషణలోకళింగజాతిఉనికిబయటపడతుంది.సంస్క్రుతవాజ్మయంనుండిబౌధ్ధవాజ్మయందగ్గరకివస్తే,'శుంభకరజాతకం''లోముందుగాఈపేరుకనబడుతుంది.గాంధారరాజయిననగ్నజిత్తుడికీ,విదర్భరాజయిన,భీముడికీసమకాలికుడైనకరండుడనేరాజుకళింగరాజ్యాన్నిపాలించినట్టుగాదీనిలోకనబడుతుంది..'ఉత్తరాధ్యాయనసూత్రం'అనేపుస్తకంకూడాఈవిషయాన్నిబలపరుస్తుంది.శతపధబ్రాహ్మణంలోపేర్కొన్నకాశీదత్తరాట్టు(ధ్రుతరాష్ట్రుడు)కి,సమకాలీకుడిగా,సత్తబాహుఅనేకళింగరాజుఉన్నట్టు,అతనుదంతపురంరాజధానిగాకళింగపాలనచేస్తున్నట్టు'మహాగోవిందసూత్రాంతం'చెపుతోందిసింహళద్వీపంలోని,మహావంశంఅనేజాతకపుస్తకంసింహళదేశంలోకికళింగరాజ్యంనుండి,విజయుడిఆగమనాన్ని,అతనితల్లిఉదంతాన్నీవిపులంగాపేర్కొంది.అతనితల్లి,కళింగపురాధీశునిపుత్రికఅనిఈపుస్తకంస్పష్టంగాచెపుతుంది.ఈపుస్తకంలోనేఉత్తరకళింగరాజ్యాన్నిసింహబాహుడనేరాజుస్థాపించడంమీదకూడాఒకకధకనబడుతుంది.


...తూర్పుగంగరాజులువారికిముందు8వశతాబ్దంలోఏలినకేసరిరాజులుకళింగదేశానికిచరిత్రలోసుస్థిరస్తానాన్నేకల్పించేరు.జగన్నాధదేవాలయం,కోణార్కదేవాలయం,ముఖలింగదేవాలయాలు,సింహాచల,శ్రీకూర్మదేవాలయాలుఇంకాఎన్నోచరిత్రలోవెలిగిపోతూ,జీర్ణమైమిగిలిపోయున్నశ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్టణం,తూర్పుగోదావరిజిల్లాలలోనిఅనేకదేవాలయాలూవాళ్ళపరాక్రమచరిత్రని,శాసనాలనివిప్పిచదివితేదిగ్భ్రమనేకలిగించితీరుతాయి.(ఆదేవాలయాల చరిత్ర మరొక పోష్టు లో పంచుకుందాం.)

......... క్రిష్ణదేవరాయలు,రాజైనకాలంలోకళింగదేశవిభావమెంతదూరంవరకూ వ్యాపించిందంటే.మహేంద్రగిరినుండిచెన్నపట్టణంవరకూ,ఉత్తరమహమ్మదీయరాజ్యాలన్నీ,విజయనగరసామ్రాజ్యానికి,బధ్ధశత్రువులవ్వటంవల్ల,కళింగగజపతి,మహమ్మదీయులతోమిత్రుత్వానికిఆసక్తివున్నవాడవ్వటంవల్ల,తనసామ్రాజ్యానికిఅదెంతప్రమాదకరమోతెలివైననాయకుడుక్రిష్ణదేవరాయలుఅతనిమంత్రితిమ్మరసుచాలావేగంగానేగ్రహించేరు.అందుకుమహమ్మదీయులను,గజపతులనువేరుపరిచివాళ్ళలోవివాదాలనుస్రుష్టించిగజపతులమీదకివరుసదండయాత్రలుచేసివిజయాలనుసాధించేడు..గజపతివొంటరైతానుఅంతవరకూ,సంపాదించినకొత్తరాజ్యాలను,వాటితోపాటు,గంజాంజిల్లావరకూ,తనస్వంతరాజ్యాన్నీ,కోల్ఫోవాల్సివచ్చింది.చివరకువిజయనగరసామ్రాజ్యానికీకళింగసామ్రాజ్యానికీ,సరిహద్దుగోదావరినదిగా,ఇద్దరికీ,ఆమోదయోగ్యమైంది.తనకూతురుని,తనకీ,ఆమెకీఎంతఇష్టంలేకపోయినా,సరే క్రిష్ణదేవరాయలకిచ్చి,అతను వివాహం చేయ వలసి వచ్చింది.. 

విజయనగరసామ్రాజ్యపతనానంతరం,గోలుకొండనుమొగలాయీలుముట్టడించి,స్వాధీనంచేసుకున్నాక,కళింగరాజ్యంవాళ్ళఆధీనంలోకివెళ్ళిపోయింది.కళింగరాజ్యక్షీణదశప్రారంభమయ్యింది.ముందుకాలాలలో,దేశదేశాలావజ్రకాంతులనువెదజల్లినకాళింగులు,తమసాంఘిక,ఆర్థికవ్యవస్థలలోతర్వాతనుండిపొందుతున్నఅవస్థలకు,నిర్లక్ష్యానికీ,అవమానాలకీమేరన్నదేలేదు.

కాళింగులలోభిన్నవర్ణవ్యవస్థలున్నసంగతి,నేటికీసాక్ష్యాధారాలనుమనకుచూపుతోంది.ఇప్పటికీ'కళింగకోమట్లు'ఇతరవైశ్యులకుభిన్నమైనతమవర్ణచిహ్నాలనుప్రదర్శిస్తూనేఉంటారు..కాళింగనంబులు,ముఖలింగందేవాలయలంలోఅర్చకులుగానేతమఉనికినితెలియచేస్తున్నారు..ముందుజైనమతంతర్వాతబౌధ్ధమతానికిపూర్తిగాఅంకితమైనజాతి,కనుకమిగిలినవర్ణభేదాలుఏకాలంలోనూకళింగరాజ్యంలోకనబడవు.బొధాయనుడిస్మ్రుతిఅందుకుబలమైనతార్కాణం.శ్రీరామానుజాచార్యులు,శ్రీచైతన్యస్వామి,విశిష్టాద్వైతసిధ్ధాంతము,...కాళింగులనిఎక్కువగాప్రభావితంచేసినవికాబట్టి,ఈప్రాంతంలోవర్ణభేధాలపట్టింపుమిగిలినప్రాంతాలతోపోలిస్తే,ఏనాడూకనబడదు.బౌధ్ధమతసిధ్ధాంతాలూ,విశిష్టాద్వైతసిధ్ధాంతాలూ..బాగాదగ్గరగాఉండటమేఅందుకుకారణంకావొచ్చు.కాళింగులలోఘనమైనవేదాంతపండితులుఎక్కువగానేఉన్నారు.కాళింగులేజంధ్యంవేసుకునితమజాతివారివివాహ,ఉపనయనాదిక్రతువులుజరిపించడం...ఈరోజుకీమిగిలినఆంధ్రులకీ,కాళింగులకీమధ్యకనబడే,భిన్నమైనసాంఘిక ఆచారం.

కళింగస్త్రీలకిమారుమనువుల,ఆచారంకూడామిగిలినప్రాంతాలవారికన్నాప్రత్యేకమే.ఇదిపూర్వంనుండీ,కళింగస్త్రీలస్వతంత్రాన్నిస్పష్టంగాచెపుతుంది.అంతేకాదు..పొగాకుసేవనంలోఈసీమ,పల్లెప్రాంతాల్లోని,స్త్రీలలోచాలావరకుసన్నగిల్లిపోయిన,'అడ్డపొగ'పీల్చటంఅన్నదీ,తలవెంట్రుకలనుకుడివైపుకొప్పుగాచుట్టుకోవడంఅన్నదీ,కూడామిగతాప్రాంతాలతోభిన్నమైనఈకళింగసీమ,స్త్రీల..భిన్నసంస్క్రుతీచిహ్నాలనిచాటిచెపుతాయి.వాళ్ళనిర్భయత్వాన్నీ,ధీరోదాత్తతనికూడాచెపుతాయి.వాళ్ళఅద్భుతనౌకానైపుణ్యచరిత్రనీ,శ్రమవారసత్వాన్నీకూడాతెలుసుకోమంటాయి.ఆశ్వయుజమాసంలో'ఆయుధపూజ'కళింగులకితప్పనిసరి.ఇదికూడాప్రాచీనంగానేమిగిలిపోయినఒకనాటికళింగుల"కళింగయుధ్ధవీరత్వాన్ని" చెపుతుంది. 

(Contd..)