కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

2, మే 2015, శనివారం

విస్మ్రుత కళింగ కవులు 2.- "అడిదం సూరకవి"



విస్మ్రుత కళింగ  కవులు 2.

              
               

అతడు అశే శేముషీ సంపన్నుడు. అప్రమేయ సాహితీ ధురీణుడు.. వాజ్మయ దిగ్గజం అయిన ఈకవి సమకాలీన పండితులను కవులను తన ముందు తలవంచేలాచేసి, తన కవిత్వ ధారలతో తెలుగు భాషా మాగాణిని తడి ఆరనీకుండా చేసిన వాడు.

ఇంకవిస్మ్రుతకళింకవులచరిత్రలో'మహారాజశ్రీఅడిదంరామారావు' గారు తెలిపిన చరిత్ర ప్రకారం చూస్తే..

 1.శ్రీ పూసపాటి తమ్మ భూపతి(1620-1700)

1652లోఈరాజుఅప్పట్లో,ఉత్తరసర్కారులుగాఉన్నఈప్రాంతానికివచ్చిశ్రీకాకుళంలోఈప్రాంతానికిఫౌజుదారుడిగాఉన్నషేరుమహమ్మదుఖాన్నుండిప్రస్తుతంవిజయనగరానికి6కి.మీదూరంలోఉన్నకుమిలి,20కి.మీదూరంలోఉన్నభోగాపురంగ్రామాలనుపెత్తనానికితీసుకునిమహమ్మదీయ ప్రభుత్వానికిలోబడినఓచిన్నరాజుగాపాలించినవ్యక్తి.15శతాబ్దిలోకర్ణాటకలోనివిజయనగరసామ్రాజ్యానికిరాజయినఫ్రౌడదేవరాయలకిసమకాలికుడయినశ్రీపూసపాటిరాచిరాజుకి5వతరంవాడయినగోపాలక్రిష్ణమరాజుఈతడితండ్రి.తల్లిజగ్గమాంబ.ఇతడుక్రిష్ణవిజయముఅనే5ఆశ్వాసాలగ్రంధాన్నిరచించేడు.

2.పూసపాటి వేంకటపతి మహీపాలుడు: (1660-1720);
ఈ రాజకవి బొబ్బిలి యుధ్ధంలో వీరస్వర్గాన్ని పొందిన విజయరామ రాజు కు పెదతండ్రి.ఈయన తమ్ముడు,విజయరామరాజు తండ్రి అయిన ఆనంద గజపతి బాలుడుగా ఉన్నప్పుడు విజయనగరానికి దగ్గరగాఉన్న కుంభిళాపురం ( ప్రస్తుతం కుమిలి) రాజధానిగా పాలించేవాడు.అప్పటికి విజయనగరం కోట ఇంకా కట్టలేదు.తన తమ్ముడికి రాజ్యపాలనకు తగిన వయస్సు రాగానే ఈ యన తాను దానం చేసిన అగ్రహారం లో జీవిస్తూ అక్కడి బ్రాహ్మణుల భోజనాలనే భుజిస్తూ,ఆధ్యాత్మిక చింతనలో నే శేష జీవితాన్నిరాజరుషిలా గడిపినట్టు తెలుస్తోంది.ఈయన సరస రస భరిత మైన "ఉషాభ్యుదయాన్ని  రచించి రామ తీర్థం లో కొలువై ఉన్న శ్రీరామ చంద్రునికి దాన్ని అంకితమిచ్చేడు.

పూసపాటిరాజులవంశంలోకొందరుకవులైవుండటంఅనుశ్రుతమైనవిషయమే.రేగులవలసలోనిపూసపాటికుటుంబానికిచెందినవిజయరామరాజు"విష్ణుభక్తిసుధాకరం","హోరాలక్షణం"అనేరెండుగ్రంధాలురచించేరు. ఈవంశంలోనిరాజులందరువిద్యాధికులుకవిపోషకులుకూడా.పద్మనాభయుధ్ధంలోవీరస్వర్గంఅలంకరించినశ్రీచినవిజయరామమహారాజుసంస్క్రుతంతెలుగుభాషల్లోకవితాసామర్ధ్యంకలవ్యక్తిఅనిఎన్నోశ్లోకాలు,పద్యాలుఅందుకుఉదాహరణలుగాకనబడుతున్నాయి.


3.అడిదంబాలభాస్కరకవి(1690/1750):
ఇతడుసుప్రసిధ్ధకళింగకవిఅడిదంసూరకవిజనకుడు.నారసామాత్యుడికిమనుమడు.చినలచ్చనమంత్రికుమారుడు.విజయనగరానికిదగ్గరలోఉన్న(భూపాలరాజురేగ)నేటిపూసపాటిరేగకాపురస్తుడు.అతనితనయుడుతనగ్రంధం'కవిసంశయవిఛ్ఛేధం'లోపేర్కొనినదానినిబట్టిచూస్తేకూచిమంచితిమ్మకవిరాసినఅచ్చతెలుగురామాయణానికి,ఏభైఅరవైసంవత్సరాలకుముందే,ఇతడు'శుధ్ధాంధ్రరామాయణాన్ని'రాసినట్టుతెలుస్తుంది.తెలుసుకోవాలనిఅనుకునేదెవరు..తెలుసనిచెపితేకళింగకవులనిగుర్తించేదెవరు?ఈకవికూడాతనశుధ్ధాంధ్రరామాయణాన్ని"శ్రీమందిరరామతీర్థసీతారామా"అనిరామతీర్థంలోనిరాముడికే అంకితమిచ్చేడు. 

4.రేకపల్లిసోమప్పకవి(1720-1790):
ఈయన అసలు పేరు సోమప్పశాస్త్రి. గోదావరి మండలంలోని తాళ్ళపూడి గ్రామం జన్మస్థలం అయినా అక్కడ గడపలేక భుక్తికోసం తుని దగ్గరలో ఉన్న సత్యవరం కాపురం మార్చుకోవటం జరిగింది. ఆ గ్రామాన్ని రాజధానిగా పాలిస్తున్న కాకర్లపూడి గోపాలరాయ పాయక రావు ( పాయక రావు అంటే యుధ్ధంలో ముందు నడిచేవాడని అర్థం) ఈ కవిని ఆస్థాన పండితుడిగా చేసుకుని అతని సుఖ నివాసానికి అన్ని ఏర్పాట్లు చేశేడు.ఈయన ప్రద్యుమ్నాభ్యుదయం ,రుక్మవతీ పరిణయం అనే గ్రంధాలను రచించినట్టు తెలుస్తోంది.ఈయనకీ అడిదం సూరకవికీ ఒకరంటే ఒకరికి పడదు.ఇద్దరూ సమకాలికులే.

5.కొట్ర బాలకవి (1730-1790).
నివాసస్థలం విజయనగరంలో రాజాం ఊరికి దగ్గరగా ఉన్న యిల్లంనాయుడు వలస.దీన్ని ఈకవి కుటుంబానికి బొబ్బిలి రాజుల అగ్రహారం గా దానమివ్వటం జరిగింది.ఇతడు అడిదం సూరకవికి మిత్రుడు.ఈ కింద పద్యం అతని మీద ఈ కవికి ఉన్న అభిమానాన్ని తెలియజేస్తుంది.

కం.అంతా కవులము  గామా  
అంతింతో పద్యమైన నల్లగలేమా 
దంతివి నీతో సమమా 
కాంతా సుమ బాణ! సూరకవి నెఱజాణా.

భల్లాణ చరిత్రము,విమలాంగీ పరిణయము ఈ కవి రాసిన ప్రబంధాలు.

6. పచ్చమెట్ట పాపయ్యకవి (1765-1840)
నివాసస్థలం విజయనగరం జిల్లాలో తూర్పుగా సముద్రతీరంలో పూసపాటి రేగ మండలంలోఉన్నకోనాడగ్రామం.ఇతని కుటుంబానికి భోగాపురం మండలంలో ఉన్న గూడెపువలస గ్రామం ఇనాం గ్రామం గా వుండేది.కామయ చంద్ర శతకం,మహిషాసుర మర్దనీ శతకం మాత్రమే ఇతను రాసినవి దొరికినవి.

7.వద్దిపర్తికోనరాట్కవి(1754/1834):
నివాసస్థలంవిశాఖపట్టణంజిల్లాలోనిసర్వసిధ్ధిగ్రామం.300ఎకరాలఇనాంభూములతోకరణీకంకులవ్రుత్తిగాచేసుకుంటూసరసకవిత్వభూషణాలైనప్రబంధరత్నాలనురచించికీర్తికాయుడయ్యేడు.ఇతడువేంకటేశ్వరోపాఖ్యానము,మహాలక్ష్మీపరిణయము,రేవతీపరిణయము,జానకీరామ శతకము అన్న పుస్తకాలను రాసేడు.

8.కాళ్ళకూరిగౌరీకాంతకవి(1770-1840) 
విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి దగ్గరలోఉన్న గోప్పేట గ్రామం.ఆ గ్రామ కరణీకం ఆ కుటుంబం వారికి వ్రుత్తిగా వుండేది.'ధర్మనందన విలాసం' ఆ యన రాసిన పద్య క్రుతి.

9.అడిదంసూరకవి:


అతడు అశే శేముషీ సంపన్నుడు. అప్రమేయ సాహితీ ధురీణుడు.. వాజ్మయ దిగ్గజం అయిన ఈకవి సమకాలీన పండితులను కవులను తన ముందు తలవంచేలాచేసి, తన కవిత్వ ధారలతో తెలుగు భాషా మాగాణిని తడి ఆరనీకుండా చేసిన వాడు.  అంతటి సూరకవి గురించి ప్రస్తుత తరం కళింగ సీమ వాసులకు తెలియదు..తెలియచెప్పిన వాళ్ళు లేరు.ఏ  తరగతి తెలుగు పుస్తకంలోనూఆయనపద్యాలూ లేవు.. ఉంచమని కోరిన తెలుగు పండితులూ మనకి లేరు. "సూరకవి తిట్టు..కంసాలి సుత్తిపెట్టు.."అన్న నాటి మాట నేటికీ అక్కడక్కడా నిలిచే వుంది..కానీ అతను ఇక్కడివాడే అన్న ఆలోచనకానీ అతన్ని స్మరించుకుందామన్న భావన కానీ ఎవరికీ రాదు.ఆయన గురించి గానీ నడిమింటి మంగళేశ్వర శాస్త్రి గారి గురించి కానీ రాయాలంటే పుస్తకాలే రాయాలి.పరిశోధనలు చేసి డాక్టరేటులు పొందవచ్చు. ఈ బ్లాగులోని పోష్టు పరిమితి అందుకు చాలదు కనుక తెలిసిన ఆంశాలనీ తెలియజేయటానికి వీలు కావటం లేదు.అందుకు మన్నించమని విన్నపం.


విజయనగరరాజుపూసపాటిచినవిజయరామరాజుదగ్గర1750ప్రాంతంలోఈకవిఆస్థానపండితుడిగాఉండేవాడు.'ఆంధ్రచంద్రాలోకం','కవిసంశయవిఛ్ఛేదం','కవి జన రంజనం' మొదలయిన గ్రంధాలరచయిత.అతడుప్రశ్నజవాబులరూపంలో ఈ కిందికందపద్యంలోతనగురించిచెప్పుకున్నాడు.

కం. ఊరెయ్యది.చీపురుపలి
పేరో? సూరకవి:ఇంటిపే?రడిదము వార్: 
మీరాజు? విజయరామ మ
హారా:జతడేమి సరసుడా..?భోజుడయా.

అతనిదే మరొక పద్యం: 

చ:గడియకు నూరు పద్దెములు గంటము లేక రచింతు దిట్టగా.
దొడగితినా పఠాల్ మని తూలిపడుం కులశైలరాజముల్
విడిచి యనుగ్రహించి నిఱుపేద ధనాధిపతుల్యు జేతు,నే
నడిదము వాడ:సూరనసమాఖ్యుడ: నాకొకరుండు సాటియే?

10.అడిదంరామకవి
ఈయనసూరకవితండ్రి ,మంచికవితాశక్తికలవాడే ఎంతోప్రసిధ్ధిపొందినచెఱువుమీదపద్యాలనుచెప్పినఅతడు"సరోజనేత్రరామతీర్థజానకీమనోహరా.."అన్నమకుటంతోపంచచామరవ్రుత్తాలనురచించిఆదేవుడికేఅంకితమిచ్చేడు.. కొట్రబాల(భాస్కర)కవిఇతడికిసమకాలికుడు.ఇతనిప్రపౌత్రుడుబాలభాస్కరకవికూడాకవితాధురీణుడే. 
11.అల్లమరాజుసుబ్రహ్మణ్యం:1850ప్రాంతాలకవి.బహుగ్రంధకర్త.పిఠాపురంరాజుగారితోసన్మానంపొందినవాడు.
12.తురగావెంకమరాజుగారు అప్పటిమరొక కళింగ కవి.
13.తురగారామకవి: 
ఇతడుపెద్దాపురసంస్థానరాజయినవత్సవాయితిమ్మగజపతి ఆ స్థానకవి.ఇతని చాటు పద్యాలు చాలానే ఉన్నాయి గానిరాసినగ్రంధాలు ఏవన్నది తెలియడంలేదు.ఇతను ఏకారణంవల్లనో తిమ్మ భూపాలుణ్ణితిట్టినఈ పద్యంఎక్కువగానేటికీ ప్రచారంలో నే ఉంది.

కం.అద్దిర:శ్రీ భూ నీలలు 
ముద్దియలాహరికి గలరు ముగురందఱలో  
బెద్దమ్మ నాట్యమాడును 
దిద్దిమ్మని వత్సవాయి తిమ్మని ఇంటన్.


పైనపేర్కొన్నవారందరూఈ500ఏళ్ళల్లోరాసినగ్రంధాలుపూర్తిగాదొరకకపోయినా ఇంకాపేరునిలిచిఉన్నకళింగకవిరాజులే..వీరితో పాటు మరొక్క కవి సామ్రాట్టుని ,గురించి చెప్పితీరాలి.ఆయన నడిమింటి మంగళేశ్వర శాస్త్రి .ఆయన గురించి కొన్ని వివరాలు మాత్రమే కింద రాస్తున్నాను.

.....విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ లో ఉన్న నాగూరు అగ్రహారం లో నడిమింటి మంగళేశ్వర శాస్త్రి అన్న ఉద్దండ పండితుడు జన్మించేడు.కళింగ దేశం లో మాత్రమే కాదు సర్వాంధ్ర దేశం లోనూ ఆ పండిత ప్రకాండుని పేరు ప్రఖ్యాతిచెందినదిగాఉండేది.వ్యాకరణశాస్త్రంలోఆయనమహాపండితుడుసంస్క్రుతభాషనేర్చుకునేవాళ్ళందరూ,చదివితీరాల్సినగ్రంధం'సమాసకుసుమావళి'ఆయన రచించేడు. తెనాలి రామలింగ కవి లాంటి వ్యక్తి.మంచి కవి.అతని మీద అనేక కధలు ప్రచారంలో ఉండేవి.. ఒక్క రెండిటిని మాత్రం పేర్కొంటాను.
1.ఆకాలంలోపూసపాటినారాయణగజపతివిజయనగరంరాజుగావున్నవ్యక్తి.ఆరాజుకిఈయనఅంటేప్రేమఎక్కువ.ఒకనాడుఆయన"శాస్త్రులవారూ...మీపాండిత్యానికీ,చాతుర్యానికీమీఇంటిపేరుతగినట్టుగాలేదండీ..నడిమింటివారేంటి..మొదటింటివారుకాకుండా.!"అనివెక్కిరించేరట.ఒక్కనిముషంఊరుకుండిఅప్పుడుఆయనఅన్నారట"ప్రభూ..ఏఇల్లయినా..పూసపాటిచెయ్యదా..?"అని.
2.ఒకసారిఆయనజగన్నాధస్వామినిదర్శించుకోవడానికిపూరీక్షేత్రానికివెళ్ళేరు.ఆమధ్యాహ్నంభోజనంచేసేందుకుమంచిపొడవువెడల్పుఉన్నమఱ్ఱిఆకులనుకోసి,తెచ్చుకుని..ఆయనవిస్తళ్ళుకుట్టుకుంటున్నారట.ఆయనప్రతిభముందునుంచీతెలిసిఉన్నఓఢ్రపండితులుఆయన్నిదర్శించుకోవాలనివచ్చేరు.పూరీక్షేత్రంలోమఱ్ఱిఆకులలోభోజనంచేయడంనిషిద్ధం.ఆపండితులుఆయనచేస్తున్న పనిచూసి."ఇదేమిటి..శాస్త్రిగారూ.ఈఘోరంచేస్తున్నారు.?"అనిఅడిగేరు.ఆయనకిఅదిఅర్థంకాక"నేనేఘోరంచెస్తున్నాను.."అనడిగేరు."వటపత్రాలతోవిస్తరికుడుతున్నారు..అదిచాలదా..మాకదినిషేధం..వటపత్రశాయిశ్రీనారాయణమూర్తినిపూజించే.ఇక్కడయితే పూర్తిగానిషేధం.".అనిగర్వంగాచెప్పేరట.దానికిఆయనెంతమాత్రంతడుముకోకుండా."శ్రీమన్నారాయణునిఅవతారాన్నేలొట్టలువేసుకుంటూ భుజించే మీకు ఆయన శయ్య అయిన వటపత్రంలో భోజనం మాత్రమే నిషేధం అయ్యిందా.!"అని వెటకారంగా నవ్వేడు.(ఉత్కళబ్రాహ్మణులు ,వంగ దేశ బ్రాహ్మణులలాగే మత్స్యభు క్కులు.)

కళింగదేశంలో కవితాకన్య,తనబంగారుగజ్జెలతోనర్తించితన వైదుష్యంతో,మిగిలినఅన్నిప్రాంతాల,తెలుగువారినీ,ఉత్కంఠపరిచేదని..ఈచాలాకొద్దిగానేఇంకామిగిలిపోయున్న సాక్ష్యాలు చెప్పటంలేదా..?


ఇంకాఎంతెంతమందిఉన్నారోతెలుసుకోవటానికిమద్రాసుప్రాచ్యలిఖితభాండాగారంలో,నేటిరాజ్యాలుపోయినారాజులుగామిగిలిపోయినవారిదగ్గరఉన్నభాండాగారాలలోనూ,నూరేళ్ళకాలంకిందటస్థాపించబడినపాఠశాలల,కళాశాలలగ్రంధాలయాలలో,ఒడిషాప్రాచీనగ్రంధాలరాష్ట్రభాండాగారంలోనూఇందుకోసంపరిశోధనలు జరగవలసి ఉంది. జరుగుతుందా..?ఆఅవకాశమైతేప్రస్తుతానికికనిపించనిదిగానే ఉంది.
(పురాతన కళింగ ఆలయాల చరిత్ర తరువాత పోష్టులో)

(Contd...)