కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

16, నవంబర్ 2014, ఆదివారం

కళింగ కేక: “మా సీమ … ఆన.” !




ఔను..ఔనౌను..

ఇది ప్రళయమే..ఇది నిజంగా మా పట్ల విలయమే
వేల వేల సంవత్సరాలుగా మా సీమకెన్ని ప్రళయాలనీ….
మేం తరతరాలుగా ఎన్ని కన్నీటి కడవలని పగులగొట్టామనీ


అందుకే,
ధైర్యం మా దగ్గరే కదా…!

తల వొంచి నిలబడుతుంది.                             
నిబ్బరమే కదా మా వెన్నునానుకుని దన్ను చూసుకుంటుంది
భయానికి  మేమెప్పుడూ తానెక్కలేని మేరువులమే కదా….!

మాకళింగ సీమ..


దివ్య రోచుల భామ..ఖచిత నవరత్న లేమ" కదా…!
 ఇంకా..ఇది అలనాడు ..
వాలి ఉయ్యాలలూపిన సీమ.
పాండవులు నెత్తికెత్తుకున్ననేల
కౌరవులు గుండెకత్తుకున్నభామ
చావుకు భయం కలిగించి అమర్త్యులైన..
మర్త్యులు మొగ్గ తొడిగిన నేల
అ.శోకుడి నేత్రాలు నీటి నిలయాలు చేసిన గడ్డ కదా..!
అశోకుడి కాలం నుంచీ మా కళింగ  సీమలో
యేడుపులు ఇంకిపోలేదా…?
ఈ సీమ
ఖారవేలుడు క ణం కణమూవెలిగించినజ్వాల
ఇది తాండ్ర పాపారాయుడు తొడలు చరిచిన భూమి
ఇదిగో..అందరూనడవాల్సిన అడుగుజాడలివిగో

ఇక్కడున్నాయని చెప్పిందిక్కడి గురజాడే..!!
ఇదే కోడి రామ్మూర్తి నాయుడురొమ్ము చూపిన నేల
శంభో అన్న  కేకతో  దేశ దేశాలనూ అజ్జాడ అదరగొట్టిన నేల ఇదే..!
ఇది సాటెవ్వరూ రాలేని మా మేటి
బొమ్మలరేడువడ్డాది పాపయ్య బొమ్మ గీసిన భామ..
మణుగుబరువులిక్కడి మగువలెత్తగలరని
లోకానికి లెక్క చెప్పిన మల్లీశ్వరిక్కడిమాణిక్యమే కదా..!!
ఈ గడ్డ మీదకి
ఎగబడ్డ హుధూద్,తనను హర్యక్షం
అనుకుంది కాబోలు

మమ్మల్ని భయపెట్టాలని పర్జన్య గర్జనలెన్నిచేసిందనీ
తురంగపదాంగ చలనాలెన్నిచేసిందనీ
కురంగరంగేళీ విన్యాసాలెన్ని చూపిందనీ

మేం..
మందగమన మద మత్తేభం లాంటి
ఏరాడ కొండ మాకండగా ఉన్నవాళ్ళం కదా..!
మానవత్వం
ఇంకా మరణశాసనం రాసేసుకోలేదని
మీరంతామాకుమీ సహకారంతో
నిండునమ్మకాన్ని కలిగించేరు కదా…!!!

మిత్రులారా..!
ఇంక మేంనిలబడతాం ..
మళ్ళీ
అందరూ మెచ్చే,నచ్చే శిల్పం లాగా  మా విశాఖను
నవ్వే,తుళ్ళే
పాపాయి లాగా,కదిలే కురిసే మేఘం లాగా
మా కళింగసీమను
మీకు కనబరుస్తాం
..ఇది
మా సీమ ఆన.