కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

1, డిసెంబర్ 2014, సోమవారం

కళింగ రాజ్య ఉజ్వల చరిత్ర


(ఇది కాంభోజ రాజ్యం.(నేటి కాంబోడియా దేశం.) లో ఏనాడో శిలఫై చెక్కబడి లభించిన వాలి వధ శిల్పం.కుడివైపున ఉన్నది.రాముడు.మధ్య నున్నది ..రాముడి ప్రొత్సాహంతో,యుధ్ధానికి వొచ్చిన సుగ్రీవుడి తో పోరాడుతున్న వాలి..ఎడమ చివర ఒక వానరుడి చేతుల్లో..చనిపోతున్న వాలి..)
ఎంతో ప్రయత్నం చేస్తేనే,కానీ,ఎందరో సహాయం చేస్తేనో కానీ,ఒక తప్పు చేసిన రావణుణ్ణి ,రాముడు సంహరించే అవకాశం దొరకకపోయింది..కానీ అదే రావణుడిని అవలీలగా కాలికింద తొక్కిపెట్టగలిగిన మహా యోధుడు. అపరిమిత పరాక్రమశాలి ..అందుకే రాముణ్ణి నిలదీసి అడగగలిగేడు. "నేనే నేరం చేసేనని నన్ను నువ్వు దొంగచాటు గా దెబ్బ తీసేవు రామా...? ఒక వేళ నా తమ్ముడి పట్ల నేనేదైనా తప్పు చేసిన వాడినైతే,నన్ను చంపే హక్కు నీకెక్కడిది..? నేను మరొకడితో యుధ్ధం చేస్తున్నపుడు వెనుకనుంచి నువ్వు బాణం వేస్తున్నట్టు నేను తెలుసుకోలేకపోవటమే నా పెద్ద తప్పయ్యిందా..?"
.అలా అడగగలిగింది..రామాయణం మొత్తం మీద మనవాడే..మన కళింగ రాజే..ఇంకా ఖ చ్చితంగా చెప్పాలంటే
మన కిష్కింధ రాజే.. ఆవాలిరాజు తమ్ముడు సుగ్రీవుడు అన్నకి చేసినద్రోహం రామాయణం తోనే   మనలోదుర్లక్షణంగా ఎదుగుతూనే వస్తోంది. 

అన్న మరణించేక అందరితో పాటు దుఃఖాన్ని (లోపల రాజ్యాధికారం సాధించిన ఆనందాన్ని దాచుకుని)  ప్రదర్శిస్తున్న సుగ్రీవుడు కూడా మనకి ఈ శిల్పంలో కనిపిస్తుంది.
రాముడుకి రామ మందిరాలూ,గుళ్ళూ, కట్టని ఊళ్ళూ,సీతమ్మకి స్నానం చెయ్యడానికి ఇవ్వని చెరువులూ (ఆమె స్నానం చేసి ఉండవచ్చు..చేసి ఉండకపోవచ్చు.అదివేరే సంగతి..ఆవాదాల మీదకి పోయే దిగ్దంత పండితులు,ప్రవచన పరమహంసలూ,
శాస్త్రవేత్తలూ,విజ్నాన వేదిక నిష్ణాతులు లెక్కకి మించి ఉన్నారు. కళింగరాజ్యంలోమచ్చుకు వెతికినా కనబడవు.అలాగే అద్భుత పరాక్రమశాలి,అగణిత తేజోవిరాజితుడూ అయిన వాలి కి ఉత్కళసీమ (ఒరిస్సా/ఒడిషా)ఈ  కళింగసీమ,సీమాంధ్ర,తెలంగాణా,రాయలసీమ ఏ పల్లెలోనూ,ఒక్క గుడి కాదు..కాదు.కనీసం మందిరమైనా కనబడదెందు చేత..?అదీఎందువల్ల..?
ఇక్కడ,ఇతరుల సంస్క్రుతిని మనందోచుకున్నట్టవు తుందా..? మనకిసంస్క్రుతి అన్నదే లేదని తీర్మానించాలని మిగిలిన అందరి అంతర్గత కుట్రవల్లనే అని..అనుకోవాల్సివస్తుందా..?..,ఈ రోజు కాకపోతే. ఇకపై ఏరోజన్నా..ఇప్పుడు నేను కాకపోతే..తర్వాత కాలంలొ మరెవ్వరైనా..అడిగితే…!.ప్రాచీన కాలంలో ఇక్కడ కొండజాతులే తప్ప మరే జాతులూ లేవని కూసిన విభాత వేళళ రోమను చరిత్రకారులూ....వాళ్ళ పాదధూళే అమ్రుతం అనుకునే థాపర్లూ,ఈ సీమాంధ్రరాజ్యం..తెలంగాణా రాష్త్రం,..మీడియాలలో చిందులేసే పతంజలి యోగ నిష్ణాతులమని చెప్పుకొనేవాళ్ళూ,మనప్రాచీన ఆహార విధానాన్ని తన పరికల్పన అని ఊదర గొట్టేవాళ్ళూ, వ్యాస,ఉపనిషత్వి దాంసులూ,నిత్య ప్రవచనకారులూ,చరిత్రోపాధ్యాయులూ,మేధావులూ,అప్పటి కాంతార,మహాకాంతార సీమా(ఇప్పటి ఒడిషా) వాసులూఏం చెపుతారు..ఏమని చెప్పగలరు..
 వాలిని రాక్షసుడనగలరా..? ఎప్పుడో రాసిన రామాయణంలో అలా వాల్మీకి ఎందుకు రాయలేకపోయాడు..?.ఆకాలం నాటి సమాజ పరిస్తితులు అందుకు అంగీకరించవనా..?రచయితగా స్ఫురణ కలిగినవాడవ్వటం వల్లనా..? సమకాలీన పరిస్తితులకు దర్పణంగా ఉండాలన్న భావన వల్లనా?
(Contd..)