కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

9, డిసెంబర్ 2014, మంగళవారం

కళింగ రాజ్య ఉజ్వల చరిత్ర


                                                     వాలి వధ-రాముడి వివరణ

( ఈ చిత్రంలోరాముడిని  ప్రశ్నిస్తున్న మరణోన్ముఖుడైన వాలినీ, అతని ప్రశ్నలకి అర్ధం -పర్ధం లేని సమాధానాలిస్తున్న రాముడినీ చూడవచ్చు)



త్రేతా యుగం నాటిదైన రామాయణ కథ కల్పితమా ..? చారిత్రాత్మకమా..? అనే విషయం చాలా కాలం నుంచీ విమర్శలోనే ఉంది.
రాముడి మీద,రామాయణం మీద,వాల్మీకి మీద,భక్తి,గౌరవం లోపించి నేనీ అంశాలు రాయడం లేదు.చిరకాలం నుండీ అమోఘమైన కళింగ చరిత్ర మరుగు పరచబడడానికి వున్న కారణాలను తెలుసుకోవాలన్న అలోచన ను బాధిస్తున్న ఈ సందేహాలనుఈ బ్లాగు ద్వారా పంచుకోవాలనే తాపత్రయమే ఈ త్రేతాయుగ కాలం నాటి కళింగ చరిత్రను మననం చేసుకోవటానికి కారణం.
రామాయణం లో రాముడు వాలిని వధించటం న్యాయ సమ్మతమా ..? అనే సందేహాన్ని పోగొట్టుకోవాలంటే రాముడితో వాల్మీకి,వాలికి చెప్పించిన సమాధానమే ఆధారం అనుకుని విచారిస్తే,

తనకు మనుధర్మ శాస్త్రం లోని సూక్తులే ప్రమాణాలని,తాను ధర్మశాస్త్రబద్దుడిని కావటం వల్ల తనకు స్వతంత్రం లేదనీ,శాస్త్రం లో చెప్పినట్టు తాను
ప్రవర్తించాలనీ రాముడు వాలితో చెప్పినట్టు వాల్మీకి కిష్కింధా కాండలో రాసేడు. రాముడు లేదా రచయిత వాల్మీకి మనుస్మ్రతినే ప్రమాణం తీసుకున్నట్టైతే  దాని ఆదారం గా మనం కూడా వాలి నేరాన్ని గణించినట్టైతే,ప్రధానంగా అది తన తమ్ముడి భార్యని అపహరించటం.అందుకే వాలి వధకు పాత్రుడు.ఇలాంటి నేరానికి దండన చంపటమే అని మనుధర్మ శాస్త్రం లో వుందని రాముడు వాలితో చెప్పేడు.ఈ శిక్షమనుధర్మ శాస్త్రం లో వుందని అనుకొన్నా ( వాస్తవానికి లేదు.) రాముడికి అందుకు అధికారమెక్కడిది?.రాజుకి తన దేశం లోని పౌరులని దండించేందుకే అధికారం గానీ, ఇతరదేశాల్లోని ప్రజలను దండించేందుకు అధికారమెక్కడుంటుంది.?. రాముడు ఉత్తర దేశంలోని అయోధ్య కి రాజు.వాలి దక్షిణంలో వున్న కిష్కింధకి ప్రభువు.రావణుడిలాంటి మహావీరులెందరినో మట్టికరిపించిన మహాబలశాలి.అలాంటి కిష్కింధాధీశుడిని చంపే అధికారం రాముడికి ఎక్కడిదో తెలీదు.ఈ ప్రశ్నకీ వాల్మీకి రాముడితో సమాధానం చెప్పించేడు. అదేమిటంటే,

శ్లో. ఇక్ష్వాకూనాం ఇయం భూమి:
సశైల వర కాననా
మ్రగ పక్షి మనుష్యానాం
నిగ్రహ ప్రగ్రహనసి. (కిష్కింధా కాండ)

అంటే వాలి పరిపాలిస్తున్న భూమి ఇక్ష్వాకులదట.అసలు రాముడికి పూర్వమున్న ఇక్ష్వాకులెవ్వరూ దక్షిణాపధానికి వచ్చినట్టు గాని రాజ్యాలను జయించినట్టు గానీ ఏ పురాణాలలోనూ,ఏ శాస్త్రాలలోనూ ఎవ్వరూ చెప్పనే లేదు.రాముడికి ప్రమాణకర్త అయిన మనువు బ్రహ్మావర్తము, కురుక్షేత్రం,మత్స్యదేశం,పాంచాలం,శూరసేనం,మధ్యదేశం,ఆర్యావర్తం మాత్రమే ద్విజులకి వసింపదగిన కర్మభూమి అనీ,మిగిలిన దక్షిణాపధం దేశాలన్నీ మ్లేచ్ఛ దేశాలనీ రాసి వున్నాడు.ఇలా నిషేధింపబడిన దేశాలన్నిటినీ,కిష్కింధనీ,రాముడి పూర్వీకులెప్పుడు పాలించారో తెలీదు.తన పూర్వీకులెవ్వరూ పాలించని కిష్కింధ తమదని రాముడితో వాల్మీకి ఎందుకు చెప్పించినట్టో తెలీదు.బహుశా అది వాలి మెడకి అధర్మాన్ని చుట్టెయ్యడానికి వాల్మీకి రచయితగా తలపెట్టిన  యుక్తి కావొచ్చు.రాముడికి నిజంగా కిష్కింధ మీద అధికారం వుంటే,సుగ్రీవుణ్ణి కానీ వాలినికానీ రావణ సంహారానికి సహాయాన్ని అధికార పూర్వకంగానే కోరి వుండేవాడు కానీ,సుగ్రీవుడితో స్నేహం చేసి,అతనికోసం వాలిని చంపి,దానికి ప్రతిఫలంగా సీతను వెతకటంలో సహాయం చెయ్యమని కోరుకోడు. పోనీ వాదం కోసం కిష్కింధ ఇక్ష్వాకులదని వొప్పుకున్నా రాముడు నేరస్తుడిని శిక్షించే దండనాధికారం వున్న రాజు అవుతాడా? తండ్రి చనిపోయేక రాముడికి రాజుగా పట్టాభిషేకం చేసేరా? రాముడు అరణ్యవాసం లో వుండగానే దశరధుడు కాలధర్మం చెందేడు. రాజ్యాన్ని భరతుడు ఏలుతున్నాడు. రాముడికింకా పట్టాభిషేకం కానప్పుడు అయితే భరతుడు రాజవుతాడు గానీ, రాముడు కానేకాడు కదా...! తను రాజును కాదనీ ,భరతుడె రాజనీ రాముడు వొప్పుకున్నట్టు ,అంతేకాకుండా భరతుడి ఆజ్న మేరకే తానూ, మరికొంతమంది రాజులూ,ధర్మహాని చేసే పురుషులని దండించటానికి బయల్దేరేమనీ రాముడితో వాల్మీకి చెప్పించేడు.అయితే అయోధ్యా కాండలో ఎక్కడా రామ,భరత సంభాషణల్లో భరతుడు రాముడికా అధికారం ఇచ్చినట్లు కనిపించదు.
నిజంగా రాముడు ధర్మ రక్షణ చేయడానికే అడవికి బయల్దేరేడా?.
రాముణ్ణి అడవికి పంపడంలో కైక వుద్దేశ్యం తన కొడుకు రాజ్యపాలన  సాగిస్తున్నప్పుడు రాముడి వునికి అయోధ్య లో వుండకూడదనీ,రాముడు అన్ని రాజచిహ్నాలనీ విడిచిపెట్టాలనీ కదా?.పధ్నాలుగేళ్ళు రాముడు అడవిలో కాలం గడిపి,భరతుడు రాజ్యపాలన చేస్తే,ప్రజలు రాముడ్ని మరచిపోయి,భరతుడి పాలనే ఇష్టపడతారనీ కూడా..!ఆడవిలో వున్నా రాముడు రాజులా అధికారం చెలాయించాలని మాత్రం కాదు..కాదు...కానే కాదు.ఇంకా తనతో పాటు మరికొందరు రాజులు కూడా ధర్మసంరక్షణార్థం బయల్దేరేరని రాముడు చెప్పినా వాళ్ళెవరో వాళ్ళు ఏం చేసేరో వాల్మీకి రామాయణం లో ఎక్కడా చెప్పనే లేదు.
రాముడి ధర్మవిచారణ మనుధర్మ శాస్త్రచట్టప్రకారం జరిగిందా?.మనుస్మ్రుతి , తప్పు చేసిన మనిషి కి శిక్ష విధించాలనుకొన్నాప్పుడు రాజు (రాముడు రాజే అనుకొంటే) దేశం,కాలం,సామర్ధ్యం,విద్య అన్నిటినీ పరిగణన లోకి తీసుకుని,దీర్ఘంగా ఆలోచన చేసి మరీ శిక్షించాలని చెపుతుంది.రాముడు అవేవీ పరిగణన లోకి తీసుకోనేలేదు. అసలు దండనాధికారం ,పట్టాభిషేకం జరిగిన రాజుకి,సత్యాన్నే పలికేవాడికీ, సత్యాన్నీ,అసత్యాన్నీ తెలుసుకుని తీర్పు నిర్ణయించ గలిగే దక్షత వున్న వ్యక్తికీ,నీతిశాస్త్రం బాగా తెలిసిన వ్యక్తి కీ,ధర్మార్ధ కామాలను గుర్తించగలిగే దక్షుడికీ మాత్రమే వుంటుందని మనుధర్మశాస్త్రం చెపుతుంది.రాముడు  పట్టాభిషిక్తుడూ కాదు. ఇద్దరు విరోధులనూ దగ్గర పెట్టి సత్యాసత్య విచారణ కూడా చేయలేదు.ధర్మశాస్త్ర సమ్మతమైన సాక్ష్యం కూడా తీసుకోలేదు.వాలిని నువ్వు నేరస్తుడవు అవునా..? కాదా? అని అయినా ప్రశ్నించలేదు. సుగ్రీవుడు చెప్పిన మాటనే ప్రమాణం గా తీసుకుని వాలిని చంపాలని నిర్నయించుకున్నాడు.
          ఇక్కడ రాముడు చేసిన వాలివధ ధర్మశాస్త్ర సమ్మతం కానే కాదని తేలిపోతోంది. పోనీ ధర్మయుధ్ధం చేసి చంపాడా ఆంటే,మనువు చెప్పిన  యుధ్ధ ధర్మాల ను చూస్తే,నిద్ర పొయిన వాళ్ళని,వుత్సాహం లేనివాళ్ళని,దిగంబరులని,ఆయుధం లేనివాళ్ళని,యుధ్ధభూమి లో ఎదిరించని వాళ్ళని,యుధ్ధాన్ని చూడటానికి వచ్చిన వాళ్ళని చంపకూడదు.రాముడు ఎలాంటి వాలిని కొట్టాడంటే,సుగ్రీవుడితో పోరాడుతున్న వాలినిచెట్టుచాటునుంచికొట్టేడు.ఇదిఎంతటిధర్మసమ్మతమో..బోధపడదు.ఇంకా..అలాపొంచి,కొట్టడానికివాల్మీకిరాముడితోభలేసమాధానం
చెప్పించేడు.వాలికోతట.జంతువులను మాంసాన్ని తినే రాజులు ఎలాగైనా చంపవచ్చట.ధర్మ శాస్త్ర పారంగతులు అలాగే చేస్తారట. ఇక్కడొక పెద్దతప్పు కనబడుతుంది. అంతవరకూ వాలిని తనతమ్ముడి భార్యని అపహరించినందుకు మనుధర్మ శాస్త్రం ప్రకారం శిక్షార్హుడని అతన్ని తాను చంపబూనడం శాస్త్ర సమ్మతమని చెప్పిన వాదన అంతా గాలికి కొట్టుకు పోయింది. వాలిని జంతువు అన్నట్టయితే,మనుధర్మశాస్త్రం ,మనుషులకోసం రాయబడింది గానీ , జంతువులకోసం కాదు కదా..! జంతువులకు వావి,వరుసలే వుండవు కదా..! ఆవు మీద దాని దూడ పడితే,రాజు దాన్ని దండిస్తాడా..?
 ఇంకా పరిశీలించి చూస్తే,ఏ మాంసతినే వాళ్ళయినా కోతి మాంసం తినరు.కోతి చర్మం దేనికీ పనికిరాదు.కోతి వెంట్రుకలు గానీ,ఎముకలు గానీ వుపయోగ పడనే పడవు.తెలివైన వాలి రాముడిని అదే ప్రశ్నఅడిగి ఇరుకునపెట్టేడు కూడా..!
ఇంకా చెప్పాలంటే,వాలి భార్య తారను రాముడు వాలి మరణించేక సుగ్రీవుడికి కట్టబెట్టేదు.మరి అదేమి ధర్మమో

పై నున్న చిత్రం లో రాముడు తన తప్పుఒప్పుకుంటూ,వాలికి అభయమిస్తున్నాదు.(.ఏమనీ..) ఇప్పుడు నిన్ను తప్పుగా చంపేను కదా..! దానికి ప్రతిగా నువ్వు ద్వాపరయుగంలో ఒక బోయవాడుగా జర గా జన్మించి, శ్రీక్రిష్ణుడిగా జన్మించిన నన్నుపడుకున్నప్పుడు అరికాల్లో బాణం వెయ్యి.. (వహ్వా..వహ్వా..) ఏమి దాక్షిణ్యం..రామా...!.అమేయ ధీశాలీ.!!! .అవక్రపరాక్రముడైన మావాలి బాణం వెయ్యడం నేర్చుకొంటున్న  బోయవాడుగా..నిన్ను.జింక అనుకుని బాణం..వెయ్యడం..సమన్యాయమా..? ఇది మా రాజు కి నువ్విచ్చిన వరమా..? దీనికి మేం నీకు ప్రణతిల్లి భజనచెయ్యాలా...? అని కళింగులు ఎవ్వరూ ఏనాడూ  అనలేదు..మిగిలిన దక్షిణా పథం వాళ్ళెవ్వరూ కూడా అనలేదు కదా..!అన్నమాట రావొచ్చు.అది వాళ్ళ ఇష్టా ఇష్టాల  సంగతి..కళింగ కేకకి ఎంతమాత్రం సంబంధం లేనిది. అసలు కిష్కింధ కర్నాటక రాష్ట్రం లోనిదేమో.!.అన్న ఆలోచనకూడా కలగవచ్చు..! 
దానికి వాల్మీకి రామాయణం లో చెప్పిన సరిహద్దులను గుర్తించగలిగితే చాలు. .
.ఈ రాష్త్రవిభజనలో కూడా మన కళింగులకి బాగా పదును తేరిన సుగ్రీవుని తెలివితేటలున్న సంగతి రాష్త్రం అంతా తెలిసిపోయింది.
ఇక్కడే మరోవిషయం కూడా చెప్పాలి.


వరాహగిరి వెంకటగిరి 1960 దశకం లో భారత దేశానికి నాల్గవ రాష్త్రపతిగా ఎన్నికయినప్పుడు, ఒరియా ప్రజలు ఎట్టకేలకు తమరాష్త్రం మనిషి రాష్త్రపతి భవన్ లో అడుగుపెట్టేడని ఆనందించేరు.అయితే వాళ్ళకి గిరి బరంపురం మనిషి అని తెలిసేక బరంపురం ఇప్పుడు ఒరిస్సా రాష్త్రం లోనిదే అని తెలిసినా కూడా..అతను తెలుగువాడని తెలిసి పట్టించుకోవడం మానేసేరు.నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాత్రం తమవాడని తమ కటక్ లో పుట్టినవాడనీ (అప్పుడు,బరంపురం మద్రాస్ ప్రెసిడెన్సీ లో ఉంటే,కటక్ బెంగాల్ప్రెసిడెన్సీ లో ఉండేది ) జబ్బలు చరుస్తున్నారు.
            తెలుగు వాళ్ళయితే అతను మనవాడు కాదని ఎప్పుడొ వొదిలేసేరు. మీలో ఎవరు కోటీశ్వరుడు పోటీలో పాల్గొన్న యువతీ /యువకులు కూడా ఆయన మీద ఏదైనా ప్రశ్న వస్తే ఆప్షన్ కోరుకుంటారు.ఇప్పటి కళింగులకి అతని ఊసే పట్టదు.తాము సీమాంధ్రులమూ,తెలంగాణా ప్రజలమూ కానేకాదని..కళింగ దేశంవాళ్ళమని గుర్తుపట్టగలిగితేకదా..ఇవన్నీ వచ్చేది. పిడుగు లాంటి గిడుగు కూడా పర్లాఖిమిడి ప్రాంతాన్ని ఆరాజు తను ఎంత చెప్పినా వినకుండా ఒడిషా లో కలిపేందుకు సిధ్ధపడితే,కోపం తో  పర్లాఖిమిడి విడిచిపెట్టి శేష జీవితాన్ని రాజమండ్రిలో గడపటం జరిగిన సంగతే కదా..!


(Contd..)