కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

17, మే 2015, ఆదివారం

"కనగ కళింగదేశమున కాలిడుటెంతయు దోషమన్న..."


చ. కనగ కళింగదేశమున కాలిడుటెంతయు దోషమన్న* నిం
    దను దొలగించుకొంటివి పినాకి మతంబున సింహభూధరం
    బును ముఖ లింగ కూర్మములు మున్నగుచోటశివాలయంబులన్
    బొనరిచి,పుణ్యభూమివయి పొల్చితి గాంగులచే గళింగమా.!

             (*క్రీ.పూ 3వ శతాబ్ది ప్రాంతంలో 'బొధాయనుడ'న్నమాట.)



చ. మొదట దయారసంబెసగు బుధ్ధుని శాంతమతంబు గ్రోలియున్
    పదపడి నీవు వీరరస భాసుర శైవ మతంబు పూని తూ
    ర్పుదెస గలట్టిదీవులను ముట్టితి వెంతయు ధైర్యశాలివై
    యెదిగితి చోళగంగ విభులేలిన కాలమునంకళింగమా..!





 పైన పేర్కొన్న రెండు పద్యాలూ ఈనాటి వారి తాత,ముత్తాతల కాలం లో గొప్ప వేదపండితుడిగా పేరు పొందిన బ్రహ్మశ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు వంద ఏళ్లక్రితం తన కళింగ రాజ్య వర్ణనలో రాసినవి.ఇవి క్లిష్టమైన సంస్క్రుత సమాస బంధురాలు కావు కనుక వీటి ప్రతిపదార్ధ తాత్పర్యాల జోలికి నేను వెళ్ళాలనుకోవటంలేదు.


ఒక గొప్ప చరిత్ర కారుడు చెప్పిన ఇంగ్లీషు భాషలో ఉన్న మాటను తెలుగులోకి తర్జుమా చేస్తే కిందివిధంగా ఉంటుంది.
"ఒక మనిషిని హత్య చెయ్యడం హంతకులకి కష్టసాధ్యమైన పనే..ఇంకా అవే చేతులతో,అతడి తోటలోనే అతణ్ణి పాతిపెట్టడం అన్నది.. ఇంకా కష్ట సాధ్యంఆహత్య చేయబడ్డవాడు, తన ఇంట్లోకి.. తనే స్వయంగా నడిచివస్తే,జరిగిన సంగతులు చెపితే...ఆహత్య చేయడంలో హంతకులందరూ విఫలమైనట్టే...."
ఇక్కడహత్యచేయబడ్డది...'కళింగరాజ్యచరిత్ర'అన్నదేనాభావన.....అదే...సాక్ష్యాలు, ఆధారాలు నా ప్రయత్నాలమేరకు సంతరించగలిగిన వాటినన్నిటినీ కూడదీసి, కళింగదేశచరిత్ర సమూలంగా చెప్పాలనుకోవడం వెనుక ఉన్న నా ఆ లోచన..ఇప్పుడెవరూ పెద్దగా పట్టించుకోని"ముఖలింగ క్షేత్రం చరిత్ర" కళింగ రాజ్య చరిత్ర కి జరిగిన హత్యకు సాక్షీభూతం గా నిలుస్తుంది.  
ఇక్కడకళింగదేశచరిత్ర,చెప్పడంలోజరిగినసంగతులుఏవిముందు..ఏవి..వెనుక..అన్నది,నాపరంగాప్రధానంకాదు.మొదటనుంచీజరిగినవీ,ఇప్పుడుజరుగుతున్నవీ,కూడాఅన్యాయాలేఅయినప్పుడు,అవుతున్నప్పుడు.నేటికళింగవాసులెప్పుడూ,నిద్రపోవటమేఇష్టమైన,సింహాలుగాఎన్నితరాలక్రితమో..ఎప్పుడోమారిపోయి,ఇంకానిద్రలోనేనిండాములిగిపోయి,బొమ్మసింహాలుగానే మిగిలిపోయి ఉన్నప్పుడు,వెనకా...ముందా...అన్నది,ప్రధానంగానిలబడదుకూడా..జరిగినవా.జరగనివా...అన్నదేప్రధానం.గతించినవ్యక్తుల,ప్రాంతాలదురాగతాలుచెప్పడమంటే.....ఆవ్యక్తులని,ప్రాంతాలని,అవమానపరచాలనే,లక్ష్యంతోమాత్రం కాదు అని నా మనవి.




ముఖలింగ గ్రామం చాలా పురాతనమైనదని ఒకానొక కాలంలో ఇది గాంగ వంశ రాజుల రాజధాని కళింగ నగరంలో అంతర్భాగమే నని చెప్పడానికి సందేహమేమీ అవసరమే లేదు.అక్కడ ఇప్పుడున్న దేవాలయాల మీది శాసనాలుచాలు.


ఇంకా,నేడుఘనమైపోయిననాటిఘనచరిత్రతెలియాలంటే,ఇతరరాష్ట్రాలఆర్కియాలజీశాఖల్లోఎవరూపట్టించుకోకుండామూలపారేసినశిల్పాలు,శాసనాలు,ఇతరదేశాలమ్యూజియంలోకొలువుచేస్తున్న,భారతదేశపురాతన,వస్తుసంపదాతప్పకుండాచెపుతాయి.ఆవిషయంమీద,పరిశీలనాసక్తి,పరిశోధనాకాంక్షఉన్న వ్యక్తులు వెతికి చూస్తే చాలు..అది నెరవేరడం కూడా  చాలా కష్టమైన.. ఒక చాలా పెద్ద ఆశ.


వంశధారానది,ఒకప్పుడుప్రస్తుతగ్రామానికిఇరుపక్కలాప్రవహిస్తూఉండేదనడానికి,ప్రబలతార్కాణాలుకనబడతాయి.ముఖలింగానికితూర్పుగావున్నకరకవలస గ్రామానికి చేరువలో ఉన్న పద్మనాభుని కొండనానుకుని కూడా ఈ నది,ప్రవహించేదని ఆకొండపాదాల జాడలని పరిశీలిస్తే ,స్పష్టంగా అర్ధమవు తుంది. పూర్వంకళింగ రాజ్యం అత్యంత వైభవోపేతంగా విలసిల్లేటప్పుడు రాజవంశీయులునౌకావిద్యనేర్వడానికి వంశధార నది ఉపయుక్తంగావుండెదని భావించేందుకు,అక్కడఓడలనిర్మాణంకూడాజరిగేదని,ఊహించేందుకుఊతంగా,చరిత్రలోనిలబడిన..రెండుగ్రామాలపేర్లుకనబడతాయి.ఒకప్పుడువాడవలస(ఓడలవలస),వాడపిల్లి(ఓడలపల్లి)అనేరెండుగ్రామాలుఒకదానికిమరొకటిఅరమైలుదూరంలోఉన్నట్టుగా,చరిత్రచెపుతుంది.ఇప్పుడుఆనౌకావ్యాపారవైభోగం,అంతరించిపోవటంచేత,వాడవలసగ్రామంకూడాకనుమరుగైపోయింది.వాడపిల్లి మాత్రమే కనబడుతుంది.


వంశధారనది,ఒడ్డునప్రాచీనముఖలింగనగరకోటఉండేదని,బలంగాచెప్పవచ్చు.అందుకుప్రస్తుతంమట్టిదిబ్బలయిపోయినఆధారాలుమౌనంగాఆసంగతిచెపుతూఉంటాయి.బ్రహ్మశ్రీగిడుగురామమూర్తిపంతులుగారుతానుతనచిన్నతనంలో,చూసినప్పుడుకోటగోడలజాడలు,స్పష్టంగాకనిపించేవనిశ్రీభావరాజువేంకటక్రిష్ణారావుగారితోచెప్పినట్టుఆయనరాసేరు.ముఖలింగంలోచూడవలసినఎన్నోచారిత్రకవిశేషాలు,చరిత్రపుస్తకాలప్రకారంఉన్నాయిగానీ,అవిశిధిలాలుగామారిపోవటంచేతా,మట్టిలోకూరుకుపోవటంవల్లా,సామాన్యులకి,కళింగరాజ్యచరిత్రగానీ,అందులోముఖలింగనగరానికిఉన్నప్రాముఖ్యతగానీఅవగతంచేసుకునేఅవకాశం అసలెంతమాత్రం లేకుండా పోయింది.


 'అమరావతి'మీదపాలకులకున్నఆసక్తి,అభిరుచి,ముఖలింగంమీద,కొద్దిపాటిగా అన్నా ఉంటే ఆ స్థల చరిత్ర సిరాతో రాసిన దానిగా మిగిలిపోదు. అందరికీ ఆ నగరం ఎంతో ప్రాచీనతను కలిగి ఉన్నదానిగా చెప్పేటందుకు మూడు దేవాలయాలుమాత్రమేనిలిచిఉన్నాయి.అవిముఖలింగేశ్వరాలయము,సోమేశ్వరాలయము(అణ్యాంక)భీమేశ్వరాలయము.వీటిలోఒక్కశ్రీముఖలింగేశ్వరాలయం తప్ప మిగిలిన రెండూ గుర్తులుగా నిలబడి ఉన్నవి మాత్రమే.ఈ ప్రాంతం చరిత్రకారులు అకుంఠిత దీక్షతో గతకాలపు స్మ్రుతులను పైకి తియ్యాలన్న నిర్దిష్ట లక్ష్యంతో, నిరంతర తలంపు తో ప్రయత్నిస్తే, కళింగ వాసులకు తమ ప్రాంతంమీదఅంతులేనిప్రేమనీ,ఇతర ప్రాంతాలవాసుల కి తమ ప్రాంతాలకన్నా ఎంతోమిన్నగా,ఎంతకాలం కిందటో ఖ్యాతిగాంచిన దీ ప్రాంతమని తెలిసి గగుర్పాటు చెంది ఆదరం తో అభిమానంతో అక్కున చెర్చుకొనేలా చేసే చరిత్రను చెప్పగలవీ దేవాలయాలు.




శ్రీముఖలింగేశ్వరాలయం


శ్రీముఖలింగేశ్వరాలయం క్షేత్రపురాణం:



ముందు,ముఖలింగేశ్వరాలయంక్షేత్రపురాణంగురించికొంచెతెలుసుకోవలసినఅవసరంఉంది.ఆకథలోకివస్తే..ద్వాపరయుగంలోవంశధారనదివొడ్డునవామదేవుడనే,తపోధనుడైనరుషి,ఒకయాగాన్నినిర్వహించాలనుకున్నాడు.ఆయాగానికిఆరుషి,దేవతలనీ,గంధర్వులనీ,యక్షులనీ,కిన్నరులనీ,కింపురుషులనీ,సిధ్ధులనీ,సాధ్యులనీఅందరినీఆహ్వానించేడు.ఆయనఆశ్రమానికితూర్పుదిక్కుగామధూకవ్రుక్షాలతో(ఇప్పచెట్లు)కూడినమహారణ్యంఉండేది.అందులోకిరాతజాతిప్రజలుజీవిస్తూఉండేవారు.అప్పట్లోనాగరికతఅంతగా,తెలీనిజాతిప్రజలు దిగంబరంగానేఉండేవారు.ఆరుషిపిలిచినయాగానికివచ్చినగంధర్వపురుషులుమధూకఅరణ్యంలోవిలాసంగాతిరుగుతూదిగంబరంగాకనిపించినకిరాతజాతిస్త్రీలసౌందర్యానికిపరవశులైతామువచ్చినపనినేమరిచిపోయేరు....తనుచేస్తున్నయాగంపూర్తిఅయ్యేక,హాజరైనవారికిహవిస్సులను,పంచేసందర్భంగావామదేవరుషిగంధర్వులను,పిలిచినప్పుడు,కిరాతస్త్రీలనుకూడి,ఉన్నందునగంధర్వులుఎవరూ,వాటినిఅందుకునేందుకురాలేదు.తనతపోద్రుష్టితోచూసివిషయాన్నితెలుసుకున్నవామదేవరుషికుపితుడై,ఆగంధర్వులందరినీ,కిరాతులై,పొమ్మనిశపించేడు.ఆసంగతినారదమునీంద్రుడిద్వారావారికితెలిసి,భయంతోఆమునిపాదాలమీదవాలితమనిక్షమించమనివేడుకున్నారు.వాళ్ళపశ్చాత్తాపానికి,రుషిప్రసన్నుడై,ద్వాపరయుగాంతంలో,ఆప్రాంతంలోశివుడుమధుకేశ్వరస్వామిగావెలుస్తాడనిఆశివలింగదర్శనాన్నిపొందినవెంటనేగంధర్వులకు శాపవిమోచనం జరుగుతుందనీ  వాళ్ళ కి వరాన్ని ప్రసాదించేడు.


  ఆ శాపవశులైన గంధర్వులు కిరాతులై జన్మించేరు.వాళ్ళ నాయకుడిగా చిత్రసేనుడు ఉండేవాడు.ఆ మధూక వనంలో సంవత్సరం పొడవునా ఇప్పపూలు పూసే చెట్టు ఒకటి ఒక పుట్టమీద పెరిగింది.దానికి రెండు కొమ్మలు మాత్రమే ఉండేవి.నిరంతరం పూలతో వాటి వాసనలతో ఆ ప్రాంతంఅంతా నిండిఉండేది. ఆ చెట్టును చిత్రసేనుడు తన రాణీకి ఇచ్చేడు.ఆమె ప్రతీ దినం ఆ చెట్టు పూలను కోసుకుని వంశధార నదికి అవతలి పక్కన ఉన్న సుమంతపురానికి పోయి అక్కడి షావుకారు సుమంతుడికి వాటిని అమ్మి అతడిచ్చే ధనంతో వంటకి అవసరమైన వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుని వాటితోభోజనాన్ని తయారుచేసి తన భర్తకీ మిగిలిన వాళ్ళ కీ పెట్టి, తాను తినేది.


అలా కొంతకాలం గడిచేక శ్రీశైల ప్రాంతంనుండి ఒక జంగమ కులస్త్రీ కాశీ యాత్రకని బయలుదేరి తోవతప్పి మధూక అరణ్యానికి చేరుకుంది.ఆ అడవిని చూసి భయపడి అక్కడే చిత్రసేనుడు రాజుగా ఉన్న కిరాతపల్లె కి పోయి ఆశ్రయంఅడిగింది.ఆమెనిరుపమానమైనఅందాన్నిచూసినచిత్రసేనుడు మోహ పరవశుడై,ఆమెకి అన్ని సౌకర్యాలనీ కల్పించేడు.ఆ మరుసటి దినం అతడు ఆమె మీద తన చిత్తభ్రమలను తొలగించుకుని ఆమె యోగ క్షేమాలను కనుక్కునిఆమెనుకాశీవిశ్వేశ్వరసందర్శనానికిమార్గాన్నితెలియచేసేడు.అయితే చిత్రంగా అతడి రూపురేఖలకి తన మనస్సు చలించి పోయిన ఆమె తనకి కాశీ ప్రయాణం మీద కోరిక మరిలేదనీ,అతనున్న ప్రాంతమే తనకి కాశీ తో సమానమనీ చెప్పి తనని పెళ్ళి చేసుకోమని కోరింది.ముందునుండే ఆ కోరిక తనలో ఉన్నందున అతడు ఆమెను తన రెండో భార్యగా చేసుకున్నాడు.తరువాత చిత్రసేనుడు తన రెండవ భార్యకు వేరే నివాసాన్ని ఏర్పాటుచేసి పెద్దభార్యతోచెప్పి పుట్ట మీదున్న మధూక చెట్టు రెండు శాఖలనూ వాళ్ళిద్దరికీ పంచి ఇచ్చి ఆ పూలను అమ్ముకుని ఎవరి సంసారాన్ని వాళ్ళు నడుపుకోమని చెప్పేడు. తాను ఒకరోజు పెద్దభార్యతో మరోరోజు రెండో భార్యతో గడిపేలా ఏర్పాటు చేసుకున్నాడు..ప్రతీరోజూ ఉదయాన్నే అతని భార్యలిద్దరూ నిద్రలేచి ఆ చెట్టు దగ్గరకి వెళ్ళి తమ కొమ్మలకింద రాలి పడిన ఇప్పపువ్వులను ఏరుకుని తీసుకుపోయి సుమంతుడికి అమ్మి తమకి కావలసిన దినుసులు తెచ్చుకుని తమ జీవితాని ఆ నందంగానే  సాగించేరు.అయితే అతడి రెండో భార్య అయిన జంగమస్త్రీ,శివభక్తురాలు కనుక ప్రతీరోజూ ఉదయాన్నే వంశధార నదీ స్నానం చేసి, కొన్ని నీళ్ళని తీసుకుని,మధూక చెట్టు దగ్గరకి పోయి ఆ పుట్టని పార్వతీపతిగా భావించి అభిషేకించి,పూజలుచేసి,ఆ పుట్టచుట్టూప్రదక్షిణలు చేసి పూలను ఏరుకునేది. అయితే ఆమె పూజలకు ప్రీతిపాత్రుడైన ఉబ్బులింగడు ఎంతో కరుణతో, ఆమె భర్త ఆమెకి ఇచ్చిన మధూక శాఖ నుండి ఇప్పపూలు కాకుండా బంగారుపూలు రాలేలా అనుగ్రహించేడు..ఆ బంగారు పుష్పాలను ఆమె సుమంతుడికి అమ్మి ఎంతో విలువైన ఆహార పదార్ధాలనీ,ఇతర వస్తువులనీ కొని తెచ్చి, భర్తకి చాలా ప్రీతికలిగించే భక్ష్యాలనీ,భోజనాలనీ ఏర్పాటు చేసేది.ఈ విషయం పెద్ద భార్యకి నచ్చలేదు.భర్తతో దెబ్బలాడి అతడు తనకిచ్చిన కొమ్మను సవతికిచ్చేలా బంగారు పూలనిచ్చే సవతి, కొమ్మని తనకిమార్చేలా చేసింది.కానీ ఏంలాభం.?చిత్రసేనుడి భార్యలిద్దరి మధూక కొమ్మలు ఒకరిదొకరికి మారడం మాత్రమే కాదు రాలే బంగారు పూలు కూడా తమ కొమ్మలని మార్చేసుకున్నాయి..శివలీలలు చిన్నవేమీ కావు కదా..!. తన పన్నాగం పారకపోయేసరికి ఆ రాజు పెద్దభార్య కోపం పట్టలేక, ప్రతీరోజూ తన సవతితో దెబ్బలాటలు పెట్టుకునేది.పొద్దున్న అడవిలోకి వేటకి పోయి చిత్రసేనుడు .సాయంత్రం ఇంటికి వచ్చేసరకి ఇద్దరు భార్యల తగవులతో అతడికి ఇల్లు రణరంగంగా మారిపోతూ ఉండేది.అతడు వాళ్ళ తగవులు తీర్చలేక, ఈ గొడవలన్నిటికీ కారణం ఆ మధూక చెట్టు కనుక, దాన్ని లేకుండా చేస్తే ఈ గొడవలన్నీ లేకుండా పోతాయని భావించి ,పెద్ద భార్య చాలా సంతోషంగా ఆ పనికి ఒప్పుకోవటం వల్ల, చిన్నభార్య ఎంతగా, బ్రతి మాలినా కూడా, వినకుండా ఆ చెట్టుని మొదలంటా నరికేసేడు.ఆ చెట్టుని అతను నరికేసరికల్లా పుట్టలోనుండి అగ్నిజ్వాల ఒక్కసారిగా పైకి లేచింది.దాన్ని చూడగానే తాను తప్పు చేసినట్టు తెలిసిన, చిత్ర సేనుడు కిందపడి మూర్ఛ పోయేడు.ఆతని పెద్దభార్య ఎక్కడినుండో వచ్చిన తన సవితి మంత్రగత్తె అనీ మాయలాడి అనీ, ఆమే తన భర్త చావుకి కారణమైందనీ ఆ మెనుచంపాలనీ,పెద్దగా కేకలు పెడుతూ గట్టిగా ఏడ్వటం మొదలుపెట్టింది.ఇది చూసి మిగిలిన కిరాత జాతి వారంతా చిత్రసేనుడి రెండో భార్యని చంపడానికి కత్తులు గొడ్డళ్ళూ పట్టుకుని వచ్చేరు.అయితే ఆమె నిర్భీతితో పరమశివుణ్ణి ప్రార్ధించింది. అప్పుడు జడముడి జంగం దేవర తన ప్రమధ గణంతో సహా నరకబడ్డమధూకచెట్టుమొదట,కిరాతజాతికందరికీప్రత్యక్షమయ్యేడు.కిరాతులందరూ చిత్రసేనుడితో సహా వామదేవ రుషి శాప విముక్తులై గంధ ర్వులయ్యేరు.శివుణ్ణి స్తుతించేరు.


అలా మధూక చెట్టు నుంచి ప్రత్యక్షమైన శివుడు మధుకరేశ్వరుడయ్యేడు..ఆ మూర్తినే ఇప్పుడు ముఖలింగేశ్వరుడని పిలుస్తున్నారు.అంతేకాకుండా జయంతీశ్వరుడనీ,గోకర్ణేశ్వరుడనికూడానామాంతరాలున్నట్టుచరిత్రచెపుతుంది.ఈ ఆలయం గోడలమీదఉన్న ప్రాచీన శాసనాలన్నిటిలోనూ ఇతర ఇతిహాసాల్లోనూకూడామధుకేశ్వరుడనే,పేరు మాత్రమే కనిపిస్తుంది.  ముఖ లింగేశ్వరుడన్న పేరు కనిపించదు.ఈ పేరు నేటిఆధునిక కాలం లో వచ్చిన పేరు మాత్రమే.


 ...ప్రస్తుతం మనకి ఈ మధుకేశ్వరస్వామి దైవ దర్శనానికి అవకాశం కలిగిస్తున్న ఈ దేవాలయాన్ని గాంగ వంశ రాజైన రెండవ కామార్ణదేవుడు, క్రీ.శ.10వ శతాబ్దం మధ్యకాలంలో నిర్మించినట్టు, కొర్ని గ్రామ శాసనం చెపితే, విశాఖపట్టణానికిచెందిన,అనంతవర్మశాసనంకూడా అదే విషయాన్నిస్పష్టంగా చెపుతుంది.రెండవ కామార్ణవుడు 'తిరస్క్రుత త్రివిష్టపమ'నే పెద్ద నగరాన్ని నిర్మించి అందులో మధుకేశ్వరుడుకి పెద్ద ఆలయాన్ని నిర్మించినట్టు కూడా  ప్రాచీన శాసనమొకటి స్పష్టం గా చెపుతుంది.ముఖలింగాలయంలోని అన్ని శాసనాల్లోనూ ఆ ఊరి పేరు, 'కళింగావని నగరం','త్రిగళింగావని నగరం','కళింగనగరం' అనే కానీ ముఖలింగమన్నపేరు రాసిలేదు.ఈ ఆధునిక కాలంలోనే మధుకేశ్వర లింగం, మధుకలింగం పేర్లనుండికానీ,ఉత్కళ భాషా ప్రభావం వల్లకానీ అది ముఖలింగంగా మారి పోయి ఉండవచ్చు.

( ఈ దివ్య దేవాలయం శాసన ఆధారాల గురించీ, చారిత్రక విశేషాలు,శిల్ప విశేషాల గురించీ తర్వాత పోష్టులలో..)