కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

7, జూన్ 2015, ఆదివారం

"ఊరి మురుగు నీరు ఏమడి లోకి వెళ్ళుతుందో ఊరి నాయుడు ఆమడే దున్నుతాడు."


"ఊరి మురుగు నీరు ఏమడి లోకి వెళ్ళుతుందో ఊరి నాయుడు ఆమడే దున్నుతాడు."-అన్నది  'డాకరుషి' ప్రవచనం.



ఇదిమద్రాసుప్రెశిడెన్సీలోకళింగసీమఉన్నపుడు, సుమారురెండువందలఏభై  సంవత్సరాలకిందట,కిందట,లంచగొండీ,అవినీతిపరుడూ,అయిన*"స్నాడ్ గ్రాస్' అనేపేరున్నబ్రిటీషునాయుడు..అతనిసహోద్యోగులూ,డబ్బుకోసం,కళింగసీమను,దున్నినతీరు,చిలకసముద్రంలోవెలిగించిన,వైభోగంగురించి చెపుతున్నకథలాంటినిజం.."చిలక సముద్రంకథ"


అవినీతిలోమనవాళ్ళెంతోముందుకువెళ్ళేమనిలోలోపల,సంబరపడిపోతున్నారు.వీడియోటేపుల్లోఅడ్డంగాదొరికిపోయినాకూడా,తమవాడునిర్దోషిగానేబయటకువస్తాడనిమీడియాలోనిర్భయంగావాగగలుగుతున్నారు.. అలాఅవినీతినిఅన్నంమెతుకుల్లాతింటున్నవాళ్ళతో,మీదిఅవినీతే..కాదనం..ఆబెంగమీకుఅవసరంలేదు.కానీ,మీకన్నాచాలాగొప్పవాడుఅయినఆంగ్లేయుడొకడు,చాలాకాలంకిందటే,మీకన్నాఎక్కువగామాకళింగసీమలో,అవినీతినిభోంచేసి,దర్జాగాబయటికివచ్చిసత్కారాలు,సన్మానాలూపొందినవాడయ్యేడు.అతనుమాకళింగసీమలోని,గంజాంజిల్లాని,పీకలలోతుఅవినీతిలోకి,కూరినఇంగ్లీషువాడే...ఆసంగతిమాకుబాగాతెలుసుఅనిచెప్పడానికీ, మేంరాష్ట్రప్రభుత్వంతీరుతెన్నులేకాదు.కేంద్రప్రభుత్వంపరిపాలనలోకూడాఅవినీతినికూడా పసిగట్టగలుగుతామనీ,అయినామేం ఏంచెయ్యమనీ,మేమంతానిమీలితనేత్రాలబుధ్ధులమనీ, మావల్లఏరాజకీయనాయకుడికిగానీ,ఎటువంటిఉద్యోగికిగానీ,ఎటువంటిఆపదాఎన్నడూకలగదనీ...అలాజరిగినట్టుఇన్నివేలఏళ్ళలోనూ,కనీసంఒక్కదాఖలాకూడా,ఎవ్వరూచూపలేరనీ,మనకళింగసీమవాసులంతాగర్వంగా,గొంతెత్తిమరీచెప్పాలన్నదే ఈ పోష్టు వెనుక ఉద్దేశ్యం. 


 *ఈపోష్టుచదివేందుకువీక్షకులకి,కొంచెంఎక్కువసమయమేపడుతుందని,అది,చాలాఇబ్బందినేకలిగిస్తుందని తెలిసినా, ఇందులోగతంలోనిజంగాజరిగినసంగతినే,పేర్కొనడంజరిగిందికనుక,మన్నించమని వీక్షకులకి మనవి.


ప్రస్తుతరాజధాని'అమరావతి'రాజధానినిర్మాణంకోసంగౌరవ'నవ్యఆంధ్రప్రదేష్'ముఖ్యమంత్రిశ్రీచంద్రబాబునాయుడుగారు,మొదటికూలీగానేడుజరిపిన,'భూమిపూజ'కిగానీ,,ఆయన'భూమిదున్నటాని'కిగానీ,మరేఇతరరాజకీయపార్టీవిన్యాసాలకిగానీ,సంబంధించినదిమాత్రం,ఈపోష్టు'శీర్షిక'కాదు....కాదు.ఎవరైనాఅన్వయించుకోవాలనుకొంటే,అందుకునాకే,అభ్యంతరమూలేదు.అన్వయించుకొనేవాళ్ళ,అపారమేధోప్రతిభకి నేను చేసే వందనాలకి లెక్కే ఉండదు. 
                                                   కళింగరాజ్యఉజ్వలచరిత్రను,క్రోడీకరించుకుంటున్నఈ'కళింగకేక'సందర్బంలోమన'వేమన'లాంటిఅస్సాం'డాకరుషి'ప్రవచనాన్ని,అన్వయిస్తూ,మంచిఅధికారీ,మహనీయుడు,అయిన'బ్రౌనుదొర'మాత్రమే,కాదుమహానయవంచకుడు.'క్లైవు'కూడావంచలేకపోయిన,లండనునగరంలోఉన్నఈస్టిండియాకంపెనీసైతంఅతన్నేమీచెయ్యలేక,దండంపెట్టేసిమరీగౌరవించినవాళ్ళదేశపు,వంచకుడు(కళింగులనుబానిసలుగాచూసి,గంజాంజిల్లాను,భారీగాదోచిన,జమీందార్లూ,రాజులూసైతంచిన్నబోయేలా,తలదించుకునేలాచేసి)"స్నాడుగ్రాస్'అనే,గంజాంజిల్లాఆంగ్లకలెక్టరు,తాలూకా రెండువందలఏభైఏళ్ళకిందటి దోపిడీ గురించిచాలాకొద్దిగానే,చెప్పాలని,కళింగసీమవాసులతో,ఇతరప్రాంత వీక్షకులతో,పంచుకోవాలనుకుంటూ....సాక్ష్యాధారాలతో రాసిన రాత.



ప్రస్తుతం.ఒడిషారాష్ట్రంస్వంతంచేసుకున్న,ఎప్పటినుంచో,అదిమాదేఅంటున్న'చిలకసముద్రా'నికిసంబంధించిన,విషయం.అది'చిలకసముద్రం',కళింగసీమ'వాసులస్వంతఆస్తిగా,బ్రిటిషుప్రెశిడెన్శీలోఉన్నప్పుడు(రైలుమార్గంఇంకాఏర్పడనప్పుడు)జరిగినసంగతి.తానైతే,ఈసంగతులెన్నడూ,ఆరాష్ట్రంచెప్పదు...ఎందుకంటే,'స్నాడుగ్రాస్'కళింగసీమవాసుల,ధనాన్నేదోచుకున్నాడు.

ఒడిషాఅయితే..ఏకంగామొత్తంకళింగసీమలోని,అపారవనరులున్నభాగాన్నే,దేశానికి స్వాతంత్రం రాకముందే, పొద్దున్నే లేచిన పిట్టలా,దోచుకున్నదికదా..!




                                       
'హంటరు'అనేచరిత్రకారుడుచిలకాసరస్సుకుదక్షిణానఉన్నకొండలవరుసఒరియాప్రాంతానికిదక్షిణప్రాంతసరిహద్దుఅనిఖచ్చితంగారాసేడు.అసలుగంజాంజిల్లాయేఒరిస్సాప్రాంతంలోనిదికాదు.1936కుముందున్నఎప్పటిచరిత్రచూసినాఏరాజురాజ్యంచిత్రపటాలుచూసినాగంజాంజిల్లా,కోరాపుట్టి,పర్లాఖిమిడి,గుణుపురం,జయపురం,బరంపురం కళింగ సీమలోనివే.


ఆనాడేకాదుఈనాడేకాదు.ఏనాడూకళింగసీమలోతమసీమకోసంపోరాడితేగానీతమకేన్యాయమూ,జరగదన్నసంగతిగుర్తించిననాయకుడెవ్వరూ*ఈనాలుగుజిల్లాలలోనూలేకపోవడంవల్లనే,ఈ'కళింగసీమకొనలుసాగి,తనర్చి,తలిర్చిన,నవమాలికాలతలా,రత్నగర్భలాఉన్నప్పటికీకళింగమాతతనయులుగర్భదరిద్రులుగా,'కేడమూకలు'గానే ఉండిపోతున్నారు..



చిలకసముద్రం:






వెయ్యేళ్ళకిందటిబ్రహ్మాండపురాణంలో,చిలకసముద్రాన్నిగంగసాగరంగాపేర్కొంది,అంతేకాదు..బర్మా,మలయా,సియాం,చైనా,సుమత్రా,జావా,బాలి,బోర్నియో,శ్రీలంకలనుండీ,వేలకొద్దీఓడలువచ్చేవనీ,అవిరాగిరేకులతోకప్పబడిఉండేవనీ,నీటిఆవిరితోనడిచేవనీ,వాటికిందచక్రాలుఅతకబడిఉండేవనీ, వంటిఅనేకవివరాలు కూడా,అందులో రాసి,ఉన్నాయి.కళింగులుఅపారమైననౌకానైపుణ్యాన్నికలిగిఉన్నవారని,దేశదేశాలాఉన్నపేరు,గోపాలపురం,కళింగపట్టణం,కోరంగి,గంగసాగరం,ఱేవుపట్టణాలవల్లద్వారాజరిగిన,నౌకావ్యాపారాలవల్లవచ్చిందే.. ఆపేరు,ఏనాడూ, ఏదేశ చరిత్రలోనూ ఉత్కళ వాసులు లేదా ఓడ్రులు  పొందలేదు.



గంజాంజిల్లాలో"చిలకసముద్రం"అనేఈపెద్దసరస్సుఉంది.బంగాళాఖాతానికీదీనికీమధ్యగజాలదూరంమాత్రమేతేడాఉంది.అంటేఅంతవెడల్పుగాఉన్నఇసుకదిబ్బమాత్రమేసముద్రానికీదీనికీఅడ్డం.లేకపోతేఇదిసముద్రభాగమే.డిశెంబరునెలనుండీ'జూను'నెలవరకూదీనిలోనినీళ్ళుఉప్పగాఉంటాయి.వర్షాకాలంలోమాత్రం,అవితియ్యగాఉంటాయి.విదేశీపక్షులకిఇదివలసలఆవాసం.భారతదేశానికి'వైస్రాయిగా'పనిచేసిన'లార్డుకర్జన్'ఇక్కడికివచ్చిదీన్నిచూసి,"ఈచోటునుంచికనబడేద్రుశ్యంభారతదేశంలోకల్లా,సుందరమైనదనినాకనిపిస్తోంది"అన్నాడు.దీనికిదక్షిణంలోపడమరభాగంలోచిన్నచిన్నరాతికొండలునీటిలోకిచొచ్చుకునివచ్చిలంకల్లాగాకనిపిస్తాయి.వీటిలోఒకదానిపేరు"బ్రేక్ ఫాస్ట్ ద్వీపం". ఈసరస్సు మధ్యలో 'కళ్ళికోట' రాజుగారి భవనం ఒకటి ఉండేది.

'థామస్  స్నాడ్ గ్రాస్'1759 లో ఇంగ్లాండులోనే జన్మించినా అతడితండ్రి ఈస్టుఇండియా కంపెనీ లో పనిచేసేడు కనుక 1777 లో తాను చెన్నపట్టణం లో  సెయింట్ జార్జి కోటలో రైటర్ పదవిని పొందేడు. 1782 లో ఫాక్టరు అనేపదవిని,1790 లో సీనియర్ మర్చెంట్ హోదానీ,గంజాం అసిస్టెంట్ రెసిడెంట్ పదవినీ పొందేడు.


అతడు గంజాంజిల్లాకి రెసిడెంటు గా వచ్చిన రెండేళ్ళకి జిల్లాలో కరువు తీవ్రంగా వచ్చింది.(కిందటేడు కళింగ సీమకి దాపురించిన హుధుధ్ తుఫానులాగఅన్నమాట.)ఈస్టిండియాకంపెనీఉద్యోగులకు,భారతదేశం అంటే తవ్వుకోడానికి దొరికిన బంగారుగనే..స్నాడు గ్రాసుకి మద్రాసు నుండి దొరలెవ్వరూ ప్రయాస పడి రావడానికి ఇష్టపడని కళింగ సీమలో తను చేస్తున్నజిల్లాఅధికారిఉద్యోగం,జిల్లాకివచ్చిపడ్డకరువు,సిరులనేపండించేయి.జమీందారులందరినీ అదుపులో వుంచుకుని పనికి ఆహార పధకాన్ని ప్రకటించి ఆకలితో మలమల మాడుతున్న వాళ్ళచేత పనులు చేయించి వాళ్ళకి ప్రభుత్వ ధనంతో గంజి పోయించేడు.ఆ చేయించిన పనులలో గంజాం పట్టణానికి పది మైళ్ళ దూరంలో ఉన్న రంభ పట్టణంలో చిలక సముద్రం వొడ్డున కట్టించిన,నాటికాలంలోనే ఇరవై వేల రూపాయల విలువైన అందమైన భవనం కూడా ఉంది. అది తన స్వంత నివాసం చేసుకున్నాడు.సొమ్ము ప్రభుత్వానిదీ అంటే ప్రజలదీ,కట్టిందీ ప్రజలే..భవనం మాత్రం అతనిదే అన్నమాట.



'జాన్ లా' అనే అతడు తన 'గ్లింప్సెస్ ఆఫ్ హిడెన్ ఇండియా' అనే పుస్తకంలో గంజాం జిల్లాకి కలెక్టర్ గా ఉన్న   'థామస్  స్నాడ్ గ్రాస్' చేసిన పనులగురించి ఇలారాసేడు.






            "స్నాడ్ గ్రాస్"రంభలోకట్టించినదివ్యమైనభవనాన్నిఎంతోఅందంగా అలంకరించేడు.తన సాలలలో మంచి గుఱ్ఱాలనీ,ఏనుగులనీ కూడా కట్టి ఉంచేడు.పెద్ద నవాబు లాగా అతను జీవించే వాడు.రంభ పట్టణం మారు మూలగా ఉంది.మద్రాసు నుండి కలకత్తా వెళ్ళే ఇంగ్లీషు పెద్ద దొరలు తిన్నగా సముద్రం మీద ఓడల్లో అక్కడికి వెళ్ళిపోతారు గానీ గంజాంజిల్లాకు రారు.(అది ఇంకా రైలు దారులు పడని కాలంనాటి సంగతి.ఎప్పుడైనా ఎవరైనా ఇన్స్పెక్షన్ కి వస్తే  స్నాడ్ గ్రాస్ వాళ్ళని మామూలుగా పంపేవాడు కాదు.గొప్ప గొప్ప విందులు ఏర్పాటు చేసి,వేటలు ఏర్పాటు చేసి,వాళ్ళకడుపులు,జేబులు నింపి మరీ పంపేవాడు.అతడు కట్టుకున్న ఇంటికి ఎదురుగా చిలక సముద్రంలో రెండు మైళ్ళ దూరంలో ఉన్న 'బ్రేక్ ఫాస్ట్ ద్వీపం'ఐలాండులో తన పనికి అంతరాయం ఎవరూ కలిగించకుండా ఉండటానికి ఒక్కటే గదిని కట్టించి అది తన ఆఫీసు అన్నాడు.తన రెవెన్యూ లెక్కలూ ఆఫీసు రికార్డులూ అన్నీ దాన్లో పెట్టించేడు.దానికిఎదురుగా,ఒకఎత్తైనస్థూపాన్నికట్టించి...దానిపైనవెలుగుతున్న దీపాన్ని ఉంచేవాడు.దానికి 'దీప స్థంభం' అన్న పేరు పెట్టేడు.


 అప్పుడున్నమద్రాసుగవర్నరు'ఛార్లెసుఓఖ్లే'గంజాంజిల్లాలోకరువునివారణ కోసంప్రభుత్వంధనంచాలాఎక్కువగాఖర్చయ్యిందనీ,వివరాలుతెలియజెయ్యడానికి'స్నాడ్గ్రాస్'నిమద్రాసురమ్మనమనీకబురుపెట్టేడు..అతనుచెన్నపట్టణంవెళ్ళిరావడానికిపట్టేకాలంలోపనిచెయ్యడానికి'ఏక్టింగురెసిడెంట్ని'మద్రాసుగవర్నరునియమించేడు.'స్నాడ్గ్రాస్'గంజాంజిల్లానుంచిచెన్నపట్టణంకోసంబయల్దేరివెళ్ళగానే,అంతవరకూఊరుకున్నజమీందార్లంతాతాముస్నాడ్గ్రాస్ఆదేశాలమేరకుఅతని దుబాసీ గోపాలక్రిష్ణమ్మకి చాలాసార్లు చాలా డబ్బుని ఇచ్చేమనీ వాటిలో వేటికీ తమకి అతడు రశీదులివ్వలేదనీ ఫిర్యాదు చేసేరు.ఈ ఫిర్యాదులవల్ల అతడు తన దుబాసీకి విపరీతమైన చనువు ఇచ్చేడనీ అతడు కూడా చాలాడబ్బు తినేశాడనీ తేలింది.అప్పుడు ఏక్టింగు రెసిడెంటు తన పై వాళ్ళ కి ఆ సంగతి తెలియ చేసి దుబాసీ మీద కేసు పెట్టి బలవంతం గా కొంతసొమ్ము కక్కించేడు. ఆ తర్వాత ఉద్యోగం తీసేసేడు.గోపాలక్రిష్ణమ్మ ఆ తర్వాతెప్పుడూకనిపించకుండామాయయ్యేడు.రుజువైపోయినఈతప్పుకు రెసడెంటుపదవికారణంఅనిభావించి,గవర్నరు1794లోగంజాంజిల్లాకిరెసిడెంటుపదవిని తీసేసి కలెక్టరు పదవిని కల్పించేరు. పదవిలోకి 'వాల్టరు బాల్ఫరు' అనే అతన్నినియమించేరు.'స్నాడ్గ్రాస్'నినాలుగేళ్ళుఏపదవీలేకుండాఖాళీగాఉంచేరు.ఆతర్వాతమళ్ళీఅతన్నే,గంజాంజిల్లాకి,కలక్టరుగానియమించేరు.అతనుఈనాలుగేళ్ళలో,ఏమీమారలేదుసరికదామరింతచెడిపోయేడు.కలెక్టరయ్యేక,మరింతరెచ్చిపోయేడు.పాతదుబాసీస్థానంలోఅతణ్ణిమించినవాడైన'జగన్నాధరావు'ని,నియమించిసర్వాధికారాలూఅతనికేఇచ్చితానురంభపట్టణంలోతనఇంటిలోనేవిలాసంగాజీవిస్తూఉండేవాడు.తనమనసుకునచ్చిన,అందమైనవేశ్యనుకూడాతననివాసంలోనేఅట్టేపెట్టుకున్నాడు.ఆమెఅతనిపరిపాలనని,తనచుట్టూనే,తిప్పుకునేది.

గంజాంజిల్లామాన్యూలురాసిన'మాల్టుబీ'చెప్పినట్టుగంజాంజిల్లాలోనిఅన్నిప్రభుత్వశాఖలూపుచ్చిపోయేయి.గంజాంపట్టణంలోదుబాసీతనకోకార్యాలయంఏర్పాటుచేసుకున్నాడు.కలెక్టరుతో,ప్రభుత్వానికి శిస్తు ఇవ్వడం వంటి విషయాల్లో మాట్లాడుకోవాలనుకున్నజమీందారులుముందుదుబాసీదర్శనంచేసుకోవాలి..ఆయనదర్శనానికి,వెళ్ళేటప్పుడు,ఎవరైనాసరేఖాళీచేతులతోమాత్రంవెళ్ళకూడదు.గంజాంజిల్లాలో కలెక్టరు ఉపేక్ష వల్లా,దుబాసీ అవినీతి వల్లా ప్రభుత్వానికి శిస్తులరాబడి బాగా మందగించి పోయింది.


 అప్పుడు మద్రాసు గవర్నరు గా రాబర్టు క్లైవు ఉన్నాడు.అతడు ప్రభుత్వాదాయం తగ్గిపోవడానికి సంజాయిషీ ఇమ్మని స్నాడ్ గ్రాస్ ని అడిగేడు.దానికి తడుముకోకుండా,వర్షాలు సకాలంలో కురవక పోవడం వల్ల పంటలు పండటం లేదనీ,ప్రజల్లో దబ్బు లేదనీ,జిల్లాలో జమీందారులెవరూ తను చెప్పిన మాట వినటం లేదనీ,కొండజాతి వాళ్ళు అల్లర్లు చేస్తున్నారనీ,శాంతిభద్రతలు కాపాడాలంటే తనకి తగిన సైన్య సిబ్బంది లేరనీ,జవాబిచ్చేడు. క్లైవు తక్కువ వాడు కాకపోవడంవల్ల ప్రభుత్వఆ దాయం తగ్గిపోవడానికి ఇంత తెలివిగా సమాధానం చెప్పిన కలెక్టర్లెవరూ లేరని భావించి,స్నాడ్ గ్రాస్ ని తప్పించి అతని స్థానంలోబ్రౌను దొరని,కలెక్టరుగా నియమించేడు. అయితే బ్రౌను గంజాంరావడానికి ఎక్కువ సమయమే పట్టింది. స్నాడ్ గ్రాస్ ను రంభ పట్టణం నుంచి కదపటం  అంతతేలిగ్గా మాత్రం జరగలేదు.. బ్రౌను గంజాంజిల్లా వ్యవహారాలను చక్కబెట్టాలని ఎంతగా ప్రయత్నించినా అతనికి అది సాధ్యం కాలేదు. మంచి అభివ్రుధ్ధిలో ఉన్నటువంటి జిల్లా పాడైపోయిందనీ,జనసంఖ్య కూడా క్షీణించిందనీ అతను పైకి రాసేడు. 1793 కీ 1801 కీ మధ్య గంజాంజిల్లాలో జరిగిన ప్రభుర్వ వ్యవహారాలు తెలుసుకోవడానికి రికార్డులేవీ లేవని 'మాల్ట్ బీ' తన మాన్యూల్ లో రాసేడు..తనపై సాక్ష్యం ఏదీ లేకుండా చేయాలని స్నాడ్ గ్రాస్ ఆ రికార్డులన్నీ చిలక సముద్రంలో పారేయించాడనీ,ఆ రికార్డులకోసం తన దగ్గరకు రంభ పట్టణానికి వస్తే ప్రాణం తీస్తానని అతను బ్రౌను ను బెదిరించేడనీ కూడా ఓ కథ ప్రచారంలో ఉంది. ఎలాగయితేనేం బ్రౌను దొర చాలా సమస్యలనెదుర్కుని స్నాడ్ గ్రాస్ సంగతుల్ని బయటకిలాగగలిగేడు మద్రాసు ప్రభుత్వం అతనిమీద కేసు పెడదామని అనుకుని అది తమ పరిధిలోకి రానిదనుకుని ఊరుకుండిపోయింది. చివరికి1800 నుండి 1804 వరకూ అతన్ని మద్రాసులోనే ఖాళీగా ఏ పనీ ఇవ్వకుండా ఉంచేరు..1804 లో విలియం బెంటిక్ గవర్నరుగా వచ్చేక అతడిని పనిలోంచి తీసేసేరు.స్నాడ్గ్రాస్ తన మూటా ముల్లే సర్దుకుని ఇంగ్లాండ్ వెళ్ళేడు. 

ఇక్కడితో ఇతనికథా,అతనితో ముడిపడ్డ చిలక సముద్రంకథా పూర్తవ్వలేదు. తర్వాత అతను మరో తమాషా చేసేడు . 

(దాని సంగతి తర్వాత పోష్టులో...)





-------------------------------------------------------------------------------------------------------------------------
 *ఇది స్వర్గీయ దిగవల్లి వేంకట శివరావు గారి "కథలు-గాధలు" పుస్తకం నుండి సేకరించినది. ఆయన కి నామన: పూర్వక వందనాలు.

*స్వర్గీయ పి.వెంకట్రామయ్య,బ్రుందావన్ పాత్రోవంటినాయకులుఇఛ్ఛాపురం నుండి, గంజాంను ఒరిస్సాలో కలిపెందుకు వ్యతిరేకంగా పోరాడేరు.కరపత్రాలు పంచేరు.బరంపురం నుండి విలీనానికి వ్యతిరేకంగా కోర్టులో కేసు కూడావేసేరు.
*నేటిఒడిషాలోనిఘుంసూరు,బుగుడాపట్టణాల్లోవిలీనానికివ్యతిరేకంగాఉద్యమమే నడిచింది.

*జయపురంరాజైనవిక్రమదేవవర్మ,టెక్కలి,చీకటి,కళ్ళికోటయువరాజులువిలీనానికి అనుకూలంగా లండను వరకూ వెళ్ళి మరీ అనుకూలంగా పోరాడేరు.

*స్వర్గీయ పట్టాభి సీతారామయ్య గారి సంపాదకత్వంలో మచిలీపట్టణం నుండి వెలువడ్డ" జన్మభూమి అన్న ఇంగ్లీషు పేపరు (నవంబరు 15,1924 లో)కళింగ సీమకు చెందిన ఒరియా మాట్లాడే ప్రజలున్న ప్రాంతాలను ఒడిషాలో విలీనం చేయటాన్ని వ్యతిరేకిస్తూ,రాసింది.

*బరంపురంనుండిఆశా,నవీన్,పత్రికలు,కటక్ నుండి ఉత్కళ దీపిక,సమాజ్ పత్రికలు విలీనాన్ని తీవ్రంగా సమర్ధించేయి.

*సైమన్ కమిషన్ 1928 లో విలీనానికి అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చింది.

*బరంపురంలో,మే9వతేదీ,1932లోవిలీనానికివ్యతిరేకంగాసభజరిగింది.గంజాంజిల్లానుఒరిస్సాలోవిలీనంచెయ్యకూడదని,అందుకుచేపట్టేవ్యతిరేకోద్యమానికివిజయనగరం,బొబ్బిలిరాజులనుండివిరాళాలుసేకరించాలనీతీర్మానాలుఆసభలో జరిగేయి.

*అదేబరంపురంలోని,'సీతారాంవిలాసఫిల్మ్'హాలు'లోగంజాం,విశాఖపట్టణం,తెలుగువారిసమావేశం,వి.రామదాసుపంతులుగారుఅధ్యక్షులుగాజరిగింది.ఆయనమద్రాసున్యాయవాది.జూలై11,1932ఒరిస్సా ఏర్పాటు వ్యతిరేకోద్యమంగా పాటించాలని,భాషాపరంగానేరాష్ట్రవిభజనజరగాలనీఆసమావేశంతీర్మానించింది. 

*1933మార్చి18వతేదీననాటి'హోమ్'గవర్నమెంట్'రాజ్యాంగసవరణలకుశ్వేతపత్రాన్నిప్రకటించింది.అయితేదానిలోపేర్కొన్నఒరిస్సారాష్ట్రసరిహద్దులలోజైపూర్,పర్లాఖిమిడిప్రాంతాలనుఒరిస్సాలోకలపలేదు.దానిమీదఒరిస్సాకాంగ్రెసువాదులుపోరాడేరు.పర్లాఖిమిడిరాజు,కళ్ళికోటరాజు,లింగరాజపాణిగ్రాహి,భుబనానందదాసు,శ్యామసుందరగంటాయతులు,లండనువెళ్ళి,స్టేట్ శెక్రటరీని కలిసి,తీవ్రంగావాదించేరు.అప్పుడుమార్పులొచ్చేయి.కటక్,సంబల్పూర్,పూరీ,బాలాసోర్ లతో పాటు,గంజాం కోరాపుట్లను ఒరిస్సాలో కలిపేరు.