కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

4, జులై 2015, శనివారం

"వెళ్ళ వల్సిన వాళ్ళ ఇళ్ళ కి తరుచుగా వెళ్ళు...నడవని దారిలో పల్లేళ్ళు మొలిచేస్తాయి"


"వెళ్ళ వల్సిన వాళ్ళ ఇళ్ళ కి తరుచుగా వెళ్ళు.నడవని దారిలో పల్లేళ్ళు మొలిచేస్తాయి"-

ఇది"గెలుపుసరే..బతకడంఎలాగ"అన్నతనపుస్తకంలో,నేటిఈఆధునికరచనాకాలంలో,తనకెవ్వరూ,'ఏనాటికీసాటిరాలేని'...తెలుగుతెలిసినవాళ్ళుమావాడని(మాకళింగుడేననీ)గర్వించితీరవలసిన,స్వర్గీయరచయిత'పతంజలి'చెప్పినమాట.

ఈమాటప్రకారమే,ఈకళింగకేకబ్లాగులోనిపోష్టులు...'గతకాలంనాటిముచ్చట్లేకదాఇవి'అనుకున్నవాళ్ళకీ..ఇదంతా'నాస్టాల్జియా'అనుకునేవాళ్ళకీశతాధికదివ్యవందనాలు." 

"ఒకవేళభగవంతుడుకానీఈలోకంలోకాపురంవుంటేఆయనఇంట్లోఖచ్చితంగాదొంగలుపడిపోయేవారు".అనిఈనాటిరాజకీయనాయకులకిపూర్తిగారూపుకట్టగలిగిన,కళింగజాతిరత్నం,'రచనామేరునగం'స్వర్గీయకె.ఎన్.వై.పతంజలిగారికి  స్మ్రుత్యాభివందనం చేస్తూ, బ్లాగు నేటి పోష్టు లోకి అడుగు పెడితే ...







క్రీ..శ.7వ శతాబ్దం లో హర్షవర్ధన చక్రవర్తి దక్షిణ హిందూ దేశమంతటినీ జయించాలని బయల్దేరేడు.అయితే అతణ్ణి నర్మదా నదీతీరంలో చాళుక్య వంశపు రాజైన సత్యాశ్రయ పులకేశి ఓడించి వెనక్కి పంపేడు.అదేసమయంలో అతడు వేంగినీ (ప్రస్తుతఆంధ్రప్రదేశ్ నీ,కళింగాన్నీ జయించి వాటికి తన తమ్ముడు కుబ్జ విష్ణు వర్ధనుణ్ణి రాజుగా పట్టం కట్టేడు. క్రీ.శ. 615 నుండి ఈ  కుబ్జ విష్ణు వర్ధనుడు ఈ రాజ్యాలకి స్వతంత్ర పాలకుడై పూర్వ చాళుక్య వంశ స్థాపకుడన్న పేరు చరిత్రలో నిలబెట్టుకున్నాడు.ఇతను రూపంలో పొట్టివాడైనా పరాక్రమంలో చాలా గట్టివాడవ్వడం వల్ల "విషమసిధ్ధి " అన్న బిరుదుపొందేడు. ఎలమంచిలి దగ్గరున్న తిమ్మాపురంలో దొరికినశాసనంలో జలదుర్గమైనా,స్థల దుర్గమైనా ఎంత బలమైన దుర్గాన్నైనా సాధించి తీరాలన్న పట్టుదలకల రాజు కనుకే ఇతడి "విషమసిధ్ధి " పేరు సార్ధకమయ్యిందని రాసి ఉందిఇతడు తను రాజ్యానికి వచ్చిన 18 వ సంవత్సరం లో 'కలవలపల్లి' అనే గ్రామాన్నిమాధవ శర్మ,విష్ణు శర్మ అనే బ్రాహ్మణులకి దానం చేసిన శాసనం ఉంది.. ఎలమంచిలికి 3 మైళ్ళ దూరంలో ఉన్న 'దిమిలి' కి ఈ గ్రామం మైలు దూరంలో ఉంది.పూర్వం దిమిలి కళింగుల నౌకాధికారానికి గొప్ప పేరున్న గ్రామంగా నిలిచిఉండేది.ఇక్కడ ఉండే దీప స్థంభాలు సముద్రంలోని నౌకలకి దిశా నిర్దేశనం చేసేవి.దిమిలి పక్కనే ఉన్న తెరువుపల్లె గ్రామంలో ఉన్నరత్నాకరస్వామి దేవాలయం చాలాకాలంపాటు రత్నప్రభలతో వెలిగిపోతూ ఉండేది.రత్నాకరం అంటే సముద్రం అంటే ఈ దేవాలయం పక్కనే ఉన్న తూర్పుతీర సముద్రదేవుని గౌరవార్థం అప్పటి కాలంలో కట్టినది. వేనవేలుగా ప్రాచీనకాలంనాటి ఇటుకలు అక్కడ చాలా కాలం పాటు ఉన్నాయి. సముద్రంమీది ఓడలకి దారి చూపించే దివ్వెలు లేదా దీపాలు ప్రతిష్టించిన చోటు కనుకనే అది కాలక్రమంలో దిమిలి దివిలి అయ్యింది.కుబ్జ విష్ణు వర్ధనుడు తన సోదరుడు రెండవ పులకేశి తరఫున  క్రీ.శ.641 లో పల్లవ రాజు ఒకటవ నరసింహ వర్మ తో పోరాడి మరణించేడని చరిత్ర చెపుతుంది.కుబ్జ విష్ణు వర్ధను డి తర్వాత అతని కుమారుడు జయసింహుడు రాజయ్యేదు. అతను అన్ని కార్యాలూ సాధించగలిగేడని అతని పేరు సర్వసిధ్ధి అయ్యింది.అతడు తనపేరు మీద సర్వసిధ్ధి పట్టణాన్ని కట్టించేడు. సర్వసిధ్ధి పట్టణం సరసులకి చాలాప్రసిధ్ధి చెందినదిగా ఉండేది. నెల్లూరు నెరజాణల ఆటలేవీ ఈసర్వసిధ్ధి  సరసుల ముందు సాగేవి కావన్నమాట నానుడిలో మిగిలిపోయింది.ఈ నాటికీ ఆ పేరు సర్వసిధ్ధి తాలూకా రూపంలో నిలబడి ఉంది.ఈ రాజు శాసనాలెన్నో ఈ ప్రాంతాల్లో దొరికేయి. ఈ రాజు తర్వాత రాజ్యం ఏలిన రాజులెందరో ఈ బిరుదు నే ధరించేరు.

ఈ జయసింహ సర్వసిధ్ధి గురించి క్రీ.శ.7 వ శతాబ్ద కాలంనాటి దండి మహాకవి తన కావ్యాల్లో వర్ణించేడు. కళింగదేశపు వసంతోత్సవ వివరాలను,కళింగుల నౌకా సమర కౌశలాన్ని,వారి ప్రచండ నౌకా బలాన్ని ఆ మహాకవి ఎంతో అందంగా వర్ణించేడు.ఇతనికాలంలోనే యువానీ చాంగ్ అనే చైనా దేశస్థుడు ఈ ప్రాంతాన్ని సందర్శించేడు. రెండవ విష్ణు వర్ధనుడు,ముంగి యువరాజు అతని కుమారుడు కొక్కిలి విక్రమాదిత్య భట్టారకుడు 709 వరకూ ఈ ప్రాంతాన్నేలిన తర్వాతరాజులు..వీరికి సంబంధించిన శాసనాలు విజయనగరంజిల్లాలో ఉన్న భోగాపురం మండలంలోని ముంజేరు గ్రామం లో దొరికితే మహాకవి గురజాడ అప్పారావు గారు వాటిని పరిశోధకులకి పంపేరు. ఈ శాసనాల్లో వీరి రాజధాని ఎలమంచిలి అని రాసి ఉంది.కొక్కిలి రాజు తనపేరుతో ఒక ఊరును కట్టించి ఉంటాడని అనుకోవడానికి నిదర్శనంగా ఎలమంచిలి కి మైలు దూరంలో కొక్కిరాపల్లిఅన్నగ్రామంఉంటుంది.రెండవవిష్ణు వర్ధనుడి నాణేలు  కూడా1895 లో ఎలమంచిలి కొండమీద దొరికేయి.

మొదటి చాళుక్య భీమ విష్ణు వర్ధనుడి దాన శాసనం ఒకటి ఎలమంచిలి కి 12 మైళ్ళ దూరంలో ఉన్న కశింకోట లో (1909లో)దొరికింది. దీనిలోఈ రాజు రాజ్యంలో 'యలమంచి కళింగం' తోపాటు 'దేవరాష్ట్రం' కూడా (ప్రస్తుతం శ్రుంగవరపుకోట ప్రాంతం) భాగంగాఉన్నట్టు ఈ శాసనం తెలియజే స్తుంది.ఇదే దేవరాష్ట్రం పేరు గురించి అలహాబాదులో ఉన్న సముద్రగుప్తుడి (ఉత్కళ సీమ వాసులనుభయకంపితులనుచేసినరక్తబాహుడు(!)) శాసనంలోకనబడుతుంది.
నర్శీపట్టణంకలెక్టరుఆఫీసులో"కళింగభానుడు"గిడుగురామ్మూర్తిపంతులుగారు కళ్ళారా చూసిన ఎలమంచిలి ప్రశంస ఉన్న శాసనం తర్వాత ఏమైపోయిందన్నది ఎవరికీ తెలీని విషయమైపోయింది. ఏ చెత్త మరుగున పడిపోయిందో ఎవరి ఇంటి పునాదుల్లోనో మరుగు దొడ్డి లో మసిమరకలు పూసుకుని రూపుమాసిపోయిందో ఎవరికీ పట్టలేదు. భవభూతి మహాకవి రచించిన 'మాలతీ మాధవం' కావ్యంలోని భరత వాక్య శ్లోకం   కశింకోట శాసనంలోని ధ్యాన శ్లోకాలలో రాయబడింది.ఇది 'ఎలమంచిలి'  కళింగ రాజ్యంలోఒకరాజధానిగాచాలాకాలంకిందఉండేదన్నసంగతి(త్రికళింగాలలోఒకటైన'మధ్యకళింగ'కి..దీనినే'మెగస్తనీసు'(302B.C.లో)తనయాత్రావివరాలనుతెలిపినపుడుపేర్కొన్న'మోడెగాలింగ'అనికూడాచెప్పవచ్చు.) మనకి మౌనంగానే చెపుతుంది.

అలా చాలాకాలం అంటే క్రీ.శ.10 వ శతాబ్దంవరకూ ఉచ్ఛ స్థాయిలోనే మధ్యకళింగ కి రాజధానిగా వెలుగులీనిన ఎలమంచిలి ప్రాధాన్యత క్రీ.శ 920 నుంచి తగ్గిపోవడం మొదలైందనే చెప్పాలి.దానికి కారణం ఆ కాలంలో ఈ ప్రాంతానికి రాజైన 'అమ్మ రాజ విష్ణు వర్ధనుడు' రాజమహేంద్రవరాన్ని నిర్మించి దాన్ని ఆంధ్ర రాజ్యానికి రాజధానిగా చేయటమే ప్రధానకారణం అనటంలో ఎలాంటి సందేహం అవసరంలేదు. అంతకు ముందు కొద్ది కాలంపాటు తూర్పు చాళుక్యుల ఏలుబడిలో కూడా ఎలమంచిలి  ఉన్న సంగతి ఏడవ విజయాదిత్యుడి పేరుతో  ఎలమంచిలి లో దొరికిన,క్రీ.శ.1063 ,ఇంకా 1075 మధ్య కాలంనాటి  శాసనాలు చెపుతాయి.అమ్మ రాజ విష్ణు వర్ధనుడు' 'రాజమహేంద్రు'డన్న బిరుదు మొదటగా ధరించేడన్న సంగతి కూడా,సాక్ష్యాలు గా ఉన్న శాసనాలు చాటి చెపుతాయి. ఆ రాజు అతని వంశస్థులు క్రీ.శ.1118 వరకు ఈ ప్రాంతాన్ని ఏలేరు.ఆ తర్వాత రాజ్యంలోకి వచ్చిన విక్రమచోడుడు తను చోడ సామ్రాజ్య పరిపాలనకి ఆ ప్రాంతానికి వెళ్ళిపోతూ తన ప్రతినిధిగా ఈ ప్రాంతాన్ని ఏలడానికి కులోత్తుంగ రాజేంద్ర చోడుడిని నియమించేడు.ఇతడి మంత్రి పేరు కొమ్మన. వీరిద్దరి పాలనా సమయంలో ఈ ప్రాంతం ఎంతో సుభిక్షంగా వర్ధిల్లింది.ఆ విషయాన్ని మంచన కవి తన కేయూరబాహు చరిత్రలో  చాలా అందంగా చెప్పేడు.



గీ! మంటి కడవ నులక మంచంబు 
    పూరిల్లు నూలిచీర రత్నకీలి
    తంబు గాని పైడితొడవు గలుగుటె
    రుంగరు ....పురము లోని జనములెల్ల.


.....గళింగ రాష్ట్రంబులో ని ఎలమంచిలాదిగా నెలమి ముప్పది రెండు విష్ణు ప్రతిష్టలు వెలయజేసి..


కొమ్మనమంత్రి,ఎలమంచిలిలోనిర్మించినతటాకం...నేటికీ'కొమ్మాయగుండమ'న్నపేరుతోనేఉంది.నేటికి900ఏళ్ళకిందటిదనిచెప్పే,ఒకప్రాచీనమంటపంఆనవాళ్ళుకూడాకనబడతాయి.ఇంకాఆకొమ్మనమంత్రిప్రతిష్టించినవైష్ణవాలయం,శిధిలరూపంలోనే,ఐనారెండువందలఏళ్ళకిందట'కోడుగంటిగోపాలరావు'అనే,ఆయనదానినిఉధ్ధరించటంవల్ల,నిలబడేఉంది.నాడుమంచనకవివర్ణించినమహావైభవమంతాఎలమంచిలిలోనేడునాశనమైపోయింది.దగ్ధపటలమైపోయింది.





ఎలమంచిలికిఅయిదుమైళ్ళదూరంలోపంచదార్లక్షేత్రముంది.అక్కడధారలింగస్వామిప్రతిష్టితమైఉన్నాడు.అక్కడకూడాశాసనాలుచాలానేఉన్నాయి.సంవత్సరాల తరబడి పక్కనే జరుగుతున్న ఇనుపఖనిజం తవ్వకాలు ఈ దేవాలయం ముందుకాలం ఉనికిని ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. 


సున్నపు పూతలతో శూన్యమైపోతున్న శాసనాలు 




కళింగరాజ్యపుగతకాలపుఅద్భుతమైనచరిత్రనుచెప్పగలిగేఅనేకానేకశాసనాలుగుడికివేస్తున్నవెల్లమాటునా,పగుళ్ళకుపూసిపారేస్తున్నసిమెంటుపూతలవెనుకామాసిపోయి,మగ్గిపోయిరూపురేఖలుమాసిపోయినవిఎప్పుడోపోయేయి.


 నేలలోకూరుకుపోయిన చారిత్రక శిల్పాలతో చేరిపోతున్న శిల్పం


మిగిలినవి కూడా అంతరించిపోయే కాలం ఇప్పుడు సాగుతోంది.ఈదేవాలయం సింహాచల క్షేత్రం అంత పురాతనమైనది అని చెప్పవచ్చు. 'కావ్యాలంకార చూడామణి' విన్నకోట పెద్దన కాలనిర్ణయానికి ఇక్కడున్న చాళుక్య విభుని శాసనం  ఆధారమైంది.



"కళింగదేశవిజిగీషామనిషందండెత్తి"...వస్తున్నక్రిష్ణదేవరాయలు(ఇది'ఆముక్తమాల్యద'లోఆయనరాసుకున్నమాటే)సర్వసిధ్ధిసమీపంలోఒకచోటకొంతకాలంమకాంవేసేడు.అక్కడేగొప్పదనాన్నిచూసేడోగానీ,ఆయనఅక్కడ,ఒకపట్టణాన్నినిర్మించి,దానికి'శ్రీక్రిష్ణదేవరాయవరం'నిపేరుపెట్టేడు.అతనునల్లరాతిబండమీదరాయించినఆపేరున్నశాసనంఆఊరిబయటసంతదగ్గరచాలాకాలంపడిఉండేది.దాన్నిఅక్కడిజనం'రాచబండ'అనిపిలిచేవారు.కాలక్రమంలోదానిపేరులోమిగిలినవన్నీ పోయి రాయవరం మాత్రమే నేటికి మిగిలింది.ఇది ఎలమంచిలి కి 6 మైళ్ళదూరంలో ఉంది.





విజయనగరసామ్రాజ్యం తళ్ళికోట యుధ్ధంలో అంతమైపోయేక ఎలమంచిలి హైదరాబాదు ముస్లిం నవాబుల చేతుల్లో పడింది. వాళ్ళకి లోబడిన పూసపాటి రాజులు వారి దగ్గరనుంచి ఎలమంచిలిని పొంది తమ పాలన సాగించాలని భావించేరు. కానీ ఎలమంచిలి కోట వాళ్ళకి అంతతేలిగ్గా లోబడలేదు.కనుక దానిని ధ్వంసం చేసి మరీ ఆ రాజులుఎలమంచిలిని తమ పాలనలోకి తెచ్చుకున్నారు.ఆ విషయాన్ని సగర్వంగా పూసపాటి వారు తమ బిరుదుల్లో చేర్చుకున్నారు. 


బిరుదు1."నెల్లూరు,యెలమంచిలి,కంచి,దేవగిరిచూరకారులు".

(ఈనాలుగుపట్టణాలునాలుగురాజధానులుగాఉండేవి.నెల్లూరుమనుమసిధ్ధిది.ఎలమంచిలి మధ్యకళింగాధిపుడిది.కంచి చోళ రాజుది.దేవగిరి యాదవ రాజులది.)

బిరుదు2."కంచీ,చెంజీ,లమంచిలి,నెల్లూరు,ద్వారకాపురి,నిర్ధూమధాములు.

       





ఇంతకాలం తర్వాత అయినా సరే అలనాటి మధ్యమ కళింగ సొబగులను మరొక్కసారి తీర్చిదిద్దాలనుకునే వారు ఎవరైనా సరే నేటి కళింగులలో అందుకు నడుంకడితే ఎన్నైనా చారిత్రక ఆధారాలని అందించేదుకు ఎలమంచిలి ఎర్రమట్టి అంతా అందుకు సిధ్ధంగానే ఉంది.

మొట్టమొదటి తెలుగు యాత్రా చరిత్రకారుడు కళింగ బంధువు అయిన శ్రీ యేనుగుల వీరాస్వామయ్యగారు పైప్రాంత విశేషాలు ..













 (గతించిపోయినా గుర్తు తెచ్చుకోవలసిన విశాఖగతచరిత్ర తదుపరిపోష్టులో..)
-------------------------------------------------------------------------------------------------------------
*ఎలమంచిలిని ఒకప్పుడు 'ఎల్ల-మజిలీ' అని పిలిచేవారన్న సంగతి కూడావాడుకలో ఉంది.కళింగకీ ఆంధ్రకీ సరిహద్దు కనుక అలా పిలిచే వారని అంటారు.అందుకే అక్కడ రెండు రాష్ట్రాల మధ్య పన్నులు వసూలు చేసే కేంద్ర ఉండేదని కూడా అంటారు. కానీ అది సరైనది కాదని  అభిప్రాయం .ఎందుకంటే త్రికళింగాలు  గా కొన్ని శతాబ్దాలపాటు విడిఫొయిన కళింగ రాజ్యంలో మధ్య కళింగ రాజధానిగా యెలమంచిలి ఉండేదని గతకాలపు చరిత్ర పరిశోధకుల నిశ్చితాభిప్రాయం. 

*కొత్తూరుదగ్గరఉండే'ధనదిబ్బలు'పురాతనబౌధ్ధమతఅవశేషాలనికలిగిఉన్నాయని,ధారపాలెం,పంచధార్ల,ఎలమంచిలి దగ్గర ఉన్నతూర్పుకనుమల్లో ప్రాచీన చారిత్రక ఆధారాలు లభించేయి అనీ పరిశోధనలు సాగుతున్నాయనీ అంటారు..కానీ అవేమిటి చెప్పేయన్నది మాత్రం చెప్పేవాళ్ళెవ్వరూ లేకపోవడం కళింగుల దౌర్భాగ్యం అనే చెప్పాలి.

*1963-1975 మధ్య పెట్రోలు నిల్వలకోసం ONGC  జరిపిన తవ్వకాల్లో కళింగరాజ్యంలోని  అడవి పాలెంతో పాటు ఎలమంచిలిని కూడా మంచి నిల్వలున్న ప్రాంతంగానే గుర్తించింది.ఇంక మొదలు కావటం లోనే ఆలస్యం జరుగుతోంది.మొదలైతే మెగస్తనీసు చెప్పిన మోడె గలింగ రాజధాని మరి కొద్దిరోజుల్లోనే మోదీ గేస్ రాజధాని అయితీరుతుంది.వద్దనే వారెవరున్నారు కనుక..?

*Reach foundation REPORT ON CONSERVATION OF SRI DHARMALINGESWARA TEMPLE, DHARUPALAM, PANCHADHARA, VISAKHAPATNAM DISR   (Date of visit: 18th February 2011.) www.conserveheritage.org