కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

15, నవంబర్ 2015, ఆదివారం

"నా కళింగ సీమ ఖచిత నవరత్న లేమ"

 

 నా కళింగ సీమ ఖచిత నవరత్న లేమ
బలరాముడి లాంగూల్య కదలాడిన సీమ.
ఆమెసముద్ర ముద్రాంకిత దుకూలధారిణి.
ఆ..
నాకళింగ సీమ నేడు దివారాత్ర అశ్రు నయన..
దిగులు తెరలు అలముకున్న దీన వదన .      
.
                                                                   
                                                                                               
 ముందుగా'కళింగకేక'బ్లాగువీక్షకులకుస్వాగతాంజలి..కొంతకాలంగా,పోష్టులను,ప్రచురించనందుకు నన్ను మన్నించండి..మీతో పంచుకొనే విషయాలు లేక కాదు...ఈ కేక వినిపించలేక కూడా కాదు. నా స్వరం వున్నంతవరకూ ఈ కేక వినిపిస్తూనే వుంటాను...నాతర్వాత ఎవరైనా ఈ కేక ను కొనసాగిస్తారనీ కళింగ జాతికి జవసత్వాలు కలిగిస్తారనీ కళింగ సీమని తేజరిల్లేలా చేసి తీరుతారనీ ఒక గొప్ప నమ్మకం నాలో ఇంకా నిలబడే  వుంది.


"ఇంటికో పుట్ట..పుట్టకో చెంబుడు పాలు.." 
అనిఈరోజుఒక'అందరన్న'పథకం..మనముందుఉండాల్సింది.మరిలేకపోవడానికి,ఏ'ఆల్జీరియాఅత్యవసరపర్యటన'కుసంబంధించినపనో,లేకపోతే'అలాస్కా'లోనో,మరెక్కడోభారీగామంచుతయారుచెయ్యడంఎలాగ..దాన్నినిలవవుంచడంఎలాగ..అన్నసంగతిరహస్యంగా,ఈదేశంలో(ప్రధానమంత్రికేకాదుమరేరాష్ట్రముఖ్యమంత్రులకీ,)ఎవరికీ,తెలీకుండాతానేతెలుసుకుని,అలాస్కావాళ్ళచేత,ఇక్కడఅందుకు,అర్జెంటుగా.ఫేక్టరీలుపెట్టించెయ్యాలనో,ముఖ్యంగారెండువేలఏభయ్యారునాటికో,లేకపోతే,మూడువేలపదహారునాటికో,'నవ్యాంధ్రను'నవ్యఅలాస్కా'గామార్చితీరుతాననిదేశమంతా,గర్వంగాచాటిచెప్పాలన్నఅఖండాలోచనతోనో,తనఆంతరంగికకార్యదర్శి,సీతలాంటిప్రభాకర్నీ,ఎస్కిమోకంట్రాక్టర్లచేత,వొప్పించడానికిచౌకీదార్లనీ,తాబేదార్లనీ,అక్కడివాళ్ళుబెదరడానికిఅవసరమైనపొడవునాయుణ్ణీ,తీసుకువెళ్ళేమంత్రాంగం,రచించడంలోనో,అందుకోసంమరోలక్షఎకరాలను,సేకరించేందుకుదారుణ'ధరణీబ్రహ్మనారాయణ'తోఆంతరంగికచర్చలుజరపటానికి,ఎక్కువసమయంఅవసరమైనందువల్లనో,ఈపథకంఈసంవత్సరంవెలుగులోకిరాలేదుకానీ,వచ్చేసంవత్సరమో,లేదాఎన్నికలసంవత్సరంలోనో,ఇదిబాబుచేతిలోనో,చినబాబుచేతిలోనోతప్పకుడావికసించితీరుతుంది.ఆనాడుగుజరాతునుండి,ప్రత్యేకవిమానంలో3డిపుట్టా,అమూల్యమైనపాలూవస్తాయో..రావో..అన్నదిమాత్రంచెప్పడంకష్టం.

అప్పుడుఈపథకానికి'వెంకాయ్'ఏవ్యాఖ్యానంచేయబోతారన్నదిఊహించడంకూడాకష్టమే..!

మనఅమరావతిచరిత్ర,మనఆచారాలుగురించి,ప్రపంచమంతానివ్వెరపోయేలామహాద్భుతంగాఈవెంట్లురచించి,అమలుపరచగలిగేద్రష్ట..ఈరాష్ట్రంలోనేకాదు.ఈదేశంలోనే,తనంతసమర్ధుడుమరొకడులేడని,అందరికీతెలిసితీరాలని,ప్రతీపథకాన్నీ,కసిగాఅమలుచేసి,మరీచూపుతున్నపథకబ్రహ్మ."కళింగసీమ"కోసంఅవసరమైతే(అవసరంఎవరికో,ఎందుకో,ఎవరూ..ఎప్పుడూచెప్పరు...చెప్పలేరుకదా..!)  తన ప్రాణాలనైనా ఇచ్చెయ్యడానికి ఎప్పుడూ సిధ్ధమే కదా..! ఆ ఆశతోనే.. 

ఇంక నం  పోష్టు లోకి అడుగు పెడదాం....


కళింగ ప్రజలనుభయభ్రాంతులను చేసేలా దోచుకున్న తురక దండు.

 


గోగులపాటి కూర్మకవి రచించిన " వైరి హర రంహ సింహాద్రి నారసింహ" శతకం లోని ఈ కిందిపద్యం విశాఖ మండల కళింగుల పై తురకల, పిండారీల దాడిని మనకి చెపుతుంది.
సీ. చుట్టబెట్టిరి మహా|రట్టజంబులతోడ
                నిఖిల రాజ్యము పఠా|నీల ఫౌజు
మట్టి మల్లాడిరి |మదసామజంబుల
        పురజన పదములు| తురకబలము 
కొట్టి కొల్లలువట్టె|గురు విప్ర మానినీ
       ఘనగోగణంబుల|ఖానసమితి
పట్టి పల్లార్చిరి | బహుదుర్గ వర్గముల్
         సరభ సౌధ్ధత్య పా|శ్చాత్య చయము
గీ.మించి భూస్థలి నిటులాక్ర|మించి రాగ
నలుకరాదేమి?నగరివా|రలను దోచ
పొంచియుంటివి యవనుల ద్రుంచుమికను
వైరి హర రంహ సింహాద్రి నారసింహ.

సింహాచలనాధుడి,పేరుయజ్నవరాహస్వామి.అయితే,ఆదేవాలయాన్నికట్టించినదినరసింహగజపతికనుక.అప్పటినుంచిస్వామిపేరుయజ్నవరాహనరసింహ స్వామిఅయ్యింది.సూక్ష్మంగాపలకడానికి'నరసింహ'నామం మాత్రం మిగిలింది.

ఈపోష్టులో,ముందుపోష్టులోచెప్పినట్టుగా,విశాఖమండలచరిత్రను,నేనుసేకరించిన,నాదగ్గరున్నవివరాలమేరకుతెలియచేస్తాను.

1907 వ సంవత్సరం నాటి మద్రాసు ప్రెశిడెన్సీ గెజిట్ లో పెర్కొన్న విష యాలు ఒకసారి చూద్దాం.

1936 దాకా ఉన్నవిశాఖపట్టణ నైసర్గిక రూపం :

వైజాగపటం,భారతదేశంలో(బ్రిటిషుదేశపాలనలోవున్నదేశం)ఉన్న,అన్నిజిల్లాలకన్నఅతిపెద్దజిల్లా.ఆగెజిట్ఇంకాఏంచెపుతుందంటే,ఈజిల్లా17222చదరపుమైళ్ళవిస్తీర్ణంతోవుంది.1901నాటికిఇక్కడిజనాభా(కళింగులసంఖ్య)2,933,650.దీనికితూర్పువైపు,బంగాళాఖాతం,గంజాంజిల్లాసరిహద్దులు.ఉత్తరంవైపుబెంగాలుప్రెశిడెన్సీకిచెందిన,కలాహండిజిల్లా,పడమటివైపుబస్తరురాష్ట్రం.దక్షిణంవైపు,గోదావరిజిల్లా(అప్పటికిఆజిల్లారెండుజిల్లాలుగావిడిపోలేదు.)వైజాగపటంజిల్లాలోవిశాలంగావున్నమైదానప్రాంతంసముద్రానికిఅభిముఖంగావుంటే,ఉత్తరపడమరదిశలుగాఎత్తుగావ్యాపించినపర్వతశ్రేణులభాగాన్నికలిగివుంది.ఆప్రాంతాల్లోనివశించేకొండజాతిప్రజలకుమైదానప్రాంతాల్లోజీవించేవారికివర్తించే,ప్రభుత్వచట్టాలేవీవర్తించవని1839లోబ్రిటిష్ఇండియాప్రభుత్వంతీర్మానంచేసింది.అంటేఆఏజెన్సీప్రాంతాలుమైదానప్రాంతాల్లోని,ఏన్యాయస్థానపరిధిలోకీరావు.కేవలం,ఆజిల్లాకలెక్టరుమాత్రమేఅక్కడన్యాయాధికారిఅవుతాడు.

ఈనాడుమనరాష్ట్రముఖ్యమంత్రి,ఆభూభాగంలోనిబాక్సైటుఖనిజాన్నితవ్వేందుకు,అనుమతులిస్తున్నాడంటేఆంగ్లేయులుమననిపాలించినకాలమే,చాలాగొప్పకాలమనిగిరిజనులుభావించటలో,అసంబధ్ధతఎక్కడుంటుందో,ఈనాటిరాజకీయరాక్షసులు,లేదాఅన్నీబాగాఅమరివున్న,బాగానేతిన్న,మరేపనులూ..తామంటూచెయ్యటానికి,మిగుల్చుకోని....మేతావులుమాత్రమే చెప్పాలి .

వైజాగపటంజిల్లామద్రాసుప్రెశిడెన్సీలోవుండేటప్పుడు,5డివిజన్లుగా23తాలూకాలుగా,పరిపాలనాసౌలభ్యంకోసంవిభజించబడింది.అవి1.వైజాగపటమ్,2.విజయనగరం,3.నర్శీపటం,4.పార్వతీపురం,5.కోరాపుట్ డివిజన్లు.

ఇంక 23 తాలూకాలపేర్లు 1వ డివిజను నుండి చూస్తే,
1.వైజాగపటం డివిజనులో
       1వైజాగపటం,2శ్రుంగవరపుకోట,
2.విజయనగరం డివిజనులో
       1విజయనగరం2భీమిలి,3.చీపురుపల్లి,4.గజపతినగరం 5.పాలకొండ
3.నర్శీపటం డివిజను లో 
       1.గొలుగొండ 2.అనకాపల్లి3.సర్వసిధ్ధి 4.వీరవిల్లి 
4.పార్వతీపురం డివిజనులో
      1పార్వతీపురం2బిసంకటక్3బొబ్బిలి4గుణుపూర్5రాయగడ 6సాలూరు 
5.కోరాపుట్ డివిజనులో
      1కోరాపుట్ 2జయపూర్ 3పాడ్వా 4పొట్టంగి 5మల్కనగిరి 6నౌరంగపూర్ .

           మిగిలినఅన్నితాలూకాలకీ,అవేపేర్లతోఉన్నపట్టణాలేప్రధాన కార్యస్థానాలుగాఉన్నాకేవలంగొలుగొండ,వీరవిల్లి,సర్వసిధ్ధితాలూకాలకిమాత్రం,నర్శీపటం,యెలమంచిలి,చోడవరంప్రధానకార్యస్థానాలయ్యేయి.ఈజిల్లాలోప్రధానమున్సిపాలిటీనగరాలు1.వైజాగపటం(ఐరోపియన్లుమాత్రమేనివశించే,నగరంఅంచునవుండేవాల్టేరుతో సహా)2.విజయనగరం 3.అనకాపల్లి 4.భీమునిపటం.

చరిత్ర:
విశాఖపట్టణచరిత్ర,తెలియాలంటే'కళింగరాజ్యచరిత్ర'తెలియాల్సిందే..మనఘనతవహించిన,చరిత్రపరిశోధకులుమరోసారినడుంబిగిస్తేఎవరికీతెలియనిఎన్నోఆశ్చర్యకరమైనవిషయాలునిస్సందేహంగాబయటపడతాయి.                                      
    వెయ్యేళ్ళకిందటనుంచీఈనగరంవుండేదనిచెప్పటానికి,ఖచ్చితమైన ఆధారాలైతేదొరికేయి.అప్పట్లోవిశాఖపట్టణానికి,కులోత్తుంగచోడనగరమనేపేరుకూడావున్నట్టుకొన్నిశాసనాలుచెపుతున్నాయి.1907లోవిశాఖపట్టణానికి,దక్షిణంగావున్నదుర్గకొండమీద5శాసనాలుబయల్పడ్డాయి.వాటిలో3తెలుగుభాషలో2తమిళభాషలోవున్నాయి.అవి1090,1180,1198,1250సంవత్సరముల కాలంనాటివి. 

మొదటిదానిలో"శ్రీమతువిశాఖపట్టణమైనకులోత్తుంగచోడపట్టణమున"అనివుంది.రెండవదానిలోమూడవదానిలోనాలుగైదుశాసనాల్లోకూడాఅలాగేవుంది.వీటినిబట్టిచూస్తే,క్రీ.శ.1090సంవత్సరానికిముందే,కులోత్తుంగచోడుడన్నరాజు ఈపట్టణాన్నిజయించిదానికితనపేరుపెట్టివుండొచ్చు.క్రీ.శ.1098/99సంవత్సరాలమధ్యకాలంలోఆరాజుపేరునేరాసిఉన్నశాసనంఒకటిసింహాచలంలోకనిపిస్తోంది.మొత్తంమీద1074/1118సంవత్సరములమధ్యచోళరాజ్యాన్నిపాలించినతనమాతామహుడయిన,కులోత్తుంగునిపేరు,చోడగంగులేదాఅనంతవర్మఇంకాచెప్పాలంటే,కళింగగంగు,ఆతర్వాతఈపట్టణానికిపెట్టివుండవచ్చు.చరిత్రపరిశోధకులకు అది ఆధారాలు చెపుతున్న అంశమే అవుతుంది .
       
ఇంకవైజాగపటంచరిత్రకి,మద్రాసుప్రెశిడెన్సీగెజిట్లోకి,వస్తేదానిఅసలుపేరు'వైశాఖపట్టణం'.అదికార్తికేయుడులేదా'వైశాఖ'అనేదేవుడుపేరుమీదనిర్మించబడినపట్టణం.కొన్నిశతాబ్దాలకిందట,ఒక'ఆంధ్రరాజు'తనకాశీయాత్రసమయంలోఇక్కడబసచేసి,ఆప్రాంతసౌందర్యానికిముచ్చటడిఅక్కడతనకులదైవమైన,వైశాఖదేవుడికిప్రస్తుతంఉన్న'లాసన్సుబే'కాలనీకిదక్షిణంగాఒకగుడికట్టించేడు.తర్వాతకాలక్రమంలో,సముద్రంముందుకుచొచ్చుకునివచ్చి,ఆదేవాలయాన్నినలోవిలీనంచేసుకుంది.ఆదేవుడిపేరుతోనే,అక్కడున్నపట్టణాన్ని'వైశాఖపట్టణం'అనిపిలవడంప్రారంభమైంది(ఇప్పటికీపుణ్యదినాల్లోసముద్రస్నానాలుచెయ్యాలనుకునేశ్రోత్రియులు'తీర్థపురాళ్ళు'అనిపిలుచుకునేఆప్రాంతానికివెళ్ళి,తీర్థస్నానాలుచేస్తారు.బ్రిటిషువాళ్ళచేతుల్లోకిఈజిల్లావెళ్ళిపోయేక(18వశతాబ్దంమధ్యకాలంలో)మొదటిగా,ఆపేరునుతగ్గించి'వైజాగ్'అని,రాతల్లో'వైజాక్'అని,మాటల్లోవుపయోగించేవారు.ముస్లింరాజులచేతుల్లోవున్నప్పటినుంచీ,వైజాగపటంఉత్తరసర్కారుజిల్లాలలోఒకదానిగాగుర్తింపుతెచ్చుకుంది.అవిమసులీపటం( మచిలీపట్నం) ముఖ్యపట్టణంగాఉన్నగుంటూరు,కొండపల్లి,వెల్లూరు,రాజమండ్రి,చికాకోల్ సర్కారులు.వైజా గపటం, గంజాంజిల్లాలు రెండు చికాకోల్ సర్కారు కి చెందిన జిల్లాలు . 

 గెజిట్లో,పేర్కొన్న4వడివిజనులో,రెండుతాలూకాలనీ,5వడివిజను మొత్తాన్నీఒడిషారాష్ట్రంలోకలిపేందుకురాజులు,రాజకీయనాయకులుచేసినకుట్రకు,కళింగులు,తనకళింగరాజ్యంబలవ్వటాన్ని,జీర్ణించుకోలేక,పిడుగులాంటిగిడుగు,పర్లాఖిమిడివదిలివెళ్ళిపోయేడు.అప్పటికే'మహాకవిగురజాడ'ఈలోకాన్ని వీడివెళ్ళిపోయేడు.మరింకకళింగరాజ్యానికిదిక్కులూ,దివాణాలూఏవీమిగల్లేదు.కళింగమాతకూడా,అందరూకలిసితానుబతికుండగానే,తనదినకర్మలుజరిపేస్తే,ఆఅన్యాయాన్నిఅడ్డుకునే వారే లేని దయ్యింది.

ఈమాటలుశ్రీయుతశ్రీపాదసుబ్తహ్మణ్యశాస్త్రిగారు,ఆసందర్భంగా,తమప్రబుధ్ధాంద్ర 1937 ఏప్రిలు నెల సంచిక లో పేజీ 52 లో పేర్కొన్నవి.

"అన్నవాడుఅన్నప్రకారంరావుసాహేబుశ్రీగిడుగురామ్మూర్తిపంతులుగారు'పర్లాఖిమిడి'విడిచిపెట్టేరు.ఆంధ్రభాషలోజీవంయెక్కడవుందోకనిపెట్టినవారుపంతులుగారు.కనుకనేవారుజీవంగలఆంధ్రుడుచెయ్యవలసినపనిచేసేరు.వారుమాఆహ్వానంఅంగీకరించిమారాజమహేంద్రంప్రవేశించేరు..హ్రుదయపీఠంసుసజ్జితంచేసి,స్వాగతంచెప్పుకుంటున్నాము.కానిమరిచిపోవద్దు.పన్నెండువేలచదరపుమైళ్ళతెలుగుగడ్డను,ఓఢ్రులువిలాసంగావిరుచుకుపోయేరు.మూడులక్షల*ఆంధ్రులుస్వదేశంలోనేవిదేశీయులైపోయేరు.స్వగ్రుహంలోనేఆగంతకులైపోయేరు.ఆమూడులక్షలఆంధ్రుల,ద్రుఢమైనఅసమ్మతినీ,తీవ్రమైనప్రాతికూల్యాన్నీకేంద్రీకరించిఏకముఖంచేసి,రోషాగ్నిగామార్చిపంతులుగారుదానినిఆంధ్రులమధ్యఉంచేరు.పంతులుగారిరాకలోవున్నఅంతరార్ధంఇదీ..భావదాస్యంలోమగ్గిపోతూఉన్నఆంధ్రులుదీనినిఎంతవరకూఅవగాహనచేసుకోగలుగుతారోఇప్పుడేమిచేస్తారోచూడవలసి ఉన్నది."

(విశాఖ పట్టణం జిల్లాకి చెందిన "గాలికొండ" విషయం తర్వాత పోష్టులో..)

---------------------------------------------------------------------------------------------------------------------------

*అక్కడవుండవలసినపదం'కళింగులు'అని మనమంతా ఇప్పుడు గుర్తించాలి.